top of page
Original.png

ఆత్మగౌరవానికి అబార్షన్

4 hours ago
2 min read

స్త్రీ ఆత్మగౌరవం, మాతృత్వం మరియు ఆడశిశు గర్భస్రావానికి వ్యతిరేకంగా నిలిచిన భారతీయ మహిళ

Aatmagouravaniki abortion - Telugu Social Story | Dr. Malathilatha Prathikantam

ఆత్మగౌరవానికి అబార్షన్ - తెలుగు సామాజిక కథ | డా. మాలతీలత ప్రతికంఠం

Published in manatelugukathalu.com on 25/11/2026


స్త్రీ జీవితంలో ఆత్మగౌరవం, స్వేచ్ఛ, మాతృత్వం ఎలా ఒక్కొక్కటిగా హరించబడుతున్నాయో ప్రశ్నించే శక్తివంతమైన సామాజిక రచన ‘ఆత్మగౌరవానికి అబార్షన్’. లింగ వివక్ష, స్త్రీపై హింస, ఆడశిశు గర్భస్రావం వంటి అమానుషాలపై ఇది తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తుంది.


అనాది కాలం నుండి ముట్టు గుడిసెల పేరుతో మూలకు కూర్చోబెట్టారు. అప్పుడే ఆడజన్మ ఆత్మగౌరవానికి జరిగింది ఒక అబార్షన్!


అంటరాని రక్తమంటూ అంటుకోనీకుండా తప్పుకుపోయారు. అప్పుడే ఆమె తనానికి జరిగింది ఇంకో అబార్షన్!


“అబ్బాయికి నువ్వు నచ్చావట,” అంటూ అడగకుండానే పెట్టిన ముహూర్తంలోనే జరిగింది కన్నె కలలకు మరో అబార్షన్!


సిద్ధపడని దేహాన్ని యుద్ధరంగంలా నలిపేసి, యుద్ధ శకలంలా విసిరేసి, తొలిరాత్రిలో గెలిచానన్న మగ మృగాన్ని చూసి మనసుకు జరిగింది మహా అబార్షన్!


అన్నిటినీ తట్టుకుని గాయమైన గేయంలా పడి ఉంటూ, నెలనెల తడిని విసిరేసిన విస్పర్‌లో దాచుకున్న స్త్రీత్వానికి అనుకోని వరంలా ఎదురైన ఓదార్పు నెల తప్పిన ఆ అమ్మతనం.


ఆ కమ్మతనాన్ని ఆస్వాదించే వేళ లింగ నిర్ధారణ పరీక్ష! ఆడబిడ్డ కాబట్టి అమ్మతనం ఫెయిలై అబార్షన్! ఈ అమానుషం ఏ యుగానిది..?


పురుడు పోసుకున్న చిన్ని ప్రాణాన్ని, ఆ ప్రాణాన్ని నిలుపుకున్న గర్భాలయాన్ని తాకే హక్కు ఏ మనిషికి ఉంది? మగడైనా, మగాడైనా, మరో ఆడదైనా... తాకనే తాకొద్దుగా..!


ఈ అండం నాది... నాది. ఈ పిండం నాది... నాది. అండపిండ బ్రహ్మాండాలని ఏకం చేసే గుండె నాది... నాది.


అయినా ఇదేదీ నాది కాదంటూ నా మాతృత్వాన్ని అబార్షన్ పేరుతో ముక్కలు... ముక్కలు... ముక్కలు... ముక్కలు...


ఇప్పుడు నా రక్తం రక్తం మాత్రమే కాదు,

గడ్డకట్టి రాయిగా మారిన ఆడతనం!


మృగ రాక్షసత్వం ఓడిన అమ్మతనం!



***


మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


డా. మాలతీలత ప్రతికంఠం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 







మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



బోగా పురుషోత్తం

పరిచయం: డా. మాలతీలత ప్రతికంఠం

కవితలు పాటలు వ్యాసాలు సమీక్షలు కథలు నవలలు రాస్తూ ఉంటాను.

ఇప్పటివరకు, దాదాపుగా 1500 కవితలు, 100 పాటలు,  3 నవలలు, 30 కథలు

 రాసాను

రెండు కవితా సంకలనాలు, ఒక నవల ముద్రితం అయ్యాయి.

హన్మకొండలో

అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page