top of page
Original.png

జోక్స్ పోటీ – 2026–27

2 hours ago
2 min read


మనతెలుగుకథలు.కామ్ జోక్స్ పోటీ 2026–27 – నవ్వుతున్న వ్యక్తుల కార్టూన్ చిత్రాలు, నెలవారీ హాస్య పోటీ మరియు బహుమతుల ప్రకటన.
జోక్స్ పోటీ 2026–27 – నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు. ప్రతి నెలా ఒక విజేతకు బహుమతి, చివర్లో ప్రత్యేక బహుమతి.

జోక్స్ పోటీ – 2026–27 - నవ్వించండి... నవ్వులు పంచండి... బహుమతులు గెలుచుకోండి!

నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్


నవ్వు నాలుగు విధాల చేటు కాదు... ఆరోగ్యానికి ఎంతో మేలు!

హాస్యం జీవితానికి ఆనందాన్ని అందిస్తుంది. చక్కటి జోక్ మనసుకు హాయినిస్తుంది. అలాంటి హాస్యాన్ని ప్రోత్సహించేందుకు, పాఠకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మనతెలుగుకథలు.కామ్ ప్రత్యేకంగా ‘జోక్స్ పోటీ’ నిర్వహిస్తోంది.


చక్కటి హాస్యంతో పాఠకులను నవ్వించగల రచయితలందరికీ ఇదే మా ఆహ్వానం!


జోక్స్ పోటీ – 2026–27


😂 పోటీలో పాల్గొనే విధానం

  • ప్రతి రచయిత 10 జోక్స్‌ను ఒక సెట్‌గా పంపాలి.

  • ఒక రచయిత ఎన్ని సెట్లయినా పంపవచ్చు.

  • ప్రతి సెట్‌లో తప్పనిసరిగా పది జోక్స్ ఉండాలి.

  • పోటీ కాలవ్యవధిలో ఎక్కువ సెట్లు పంపిన రచయితలకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే సెట్ల సంఖ్యతో పాటు జోక్స్ నాణ్యత, హాస్యం, కొత్తదనం, పాఠకుల ఆదరణను కూడా పరిగణనలోకి తీసుకుంటాము.

  • ఏ మతాన్నీ ఏ వర్గాన్నీ కించపరిచేలా జోక్స్ పంపవద్దు. 

  • జోక్స్ తో పాటు చిత్రాలు పంపవద్దు. కేవలం టెక్స్ట్ మాత్రమే ఉండాలి. ఎమోజీస్ వాడవచ్చు.


🏆 నెలవారీ బహుమతులు


ప్రతి నెలా అందిన జోక్స్ సెట్లను పరిశీలించి, ఒక ఉత్తమ విజేతను ఎంపిక చేసి ₹250/- నగదు బహుమతిగా అందజేస్తాము.

ప్రతి నెలా ఒక విజేత చొప్పున ఐదు నెలల్లో ఐదుగురు నెలవారీ విజేతలను ఎంపిక చేస్తాము.


🌟 పోటీ ముగింపులో ప్రత్యేక బహుమతి!

ఐదు నెలల పోటీ ముగిసిన తరువాత, నెలవారీ బహుమతులు పొందిన ఐదుగురు విజేతలలో ఒకరిని తుది విజేతగా ఎంపిక చేసి ₹1,000/- ప్రత్యేక బహుమతి అందజేస్తాము.


ఈ ఎంపికలో పోటీ కాలవ్యవధిలో ఆయా రచయితలు పంపిన జోక్స్ సెట్ల సంఖ్య, హాస్య నాణ్యత, కొత్తదనం, పాఠకుల ఆదరణను పరిగణనలోకి తీసుకుంటాము.

ఐదు నెలల్లో ఐదు నెలవారీ బహుమతులు, పోటీ ముగింపులో ఒక ప్రత్యేక బహుమతి!

మొత్తం బహుమతులు: ₹2,250/-


📅 పోటీ కాలవ్యవధి


నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు (ఐదు నెలలు).

నవంబర్‌లో ప్రచురింపబడ్డ కథల పోటీ ఫలితాలు డిసెంబర్ 15 నాటి మా పోస్ట్‌లో ప్రకటించబడతాయి.

తదుపరి నెలల ఫలితాలు కూడా ఇదే విధంగా ప్రత్యేక పోస్టుల ద్వారా తెలియజేయబడతాయి.


📖 జోక్స్ ప్రచురణ విధానం


పోటీకి అందిన జోక్స్ అన్నింటినీ మా వెబ్‌సైట్‌లో ఒకే ప్రత్యేక పోస్ట్‌లో వరుసగా ప్రచురిస్తాము.

ప్రతి సెట్‌కు ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ (క్రమసంఖ్య) కేటాయించబడుతుంది.

రచయిత పంపిన జోక్స్ సెట్ ప్రచురితమైన తరువాత, దానికి కేటాయించిన క్రమసంఖ్యను సంబంధిత రచయితకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాము.

దీని ద్వారా రచయితలు తమ జోక్స్‌ను వెబ్‌సైట్‌లో సులభంగా గుర్తించవచ్చు.


⭐ బహుమతుల ఎంపిక విధానం – ముఖ్యమైన నిబంధనలు


  1. జోక్స్ నాణ్యత: పాఠకులను నవ్వించే సహజమైన హాస్యం, చమత్కారం, కొత్తదనం ప్రధానంగా పరిగణించబడతాయి.

  2. సెట్ల సంఖ్య: పోటీ కాలంలో రచయిత పంపిన సెట్ల సంఖ్యకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అయితే కేవలం ఎక్కువ సెట్లు పంపినంత మాత్రాన బహుమతి లభిస్తుందని భావించరాదు.

  3. పాఠకుల ఆదరణ: ప్రచురితమైన జోక్స్‌కు పాఠకుల నుంచి లభించే ఆదరణను కూడా ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటాము.

     4. ప్రత్యేక బహుమతి: నెలవారీ విజేతలైన ఐదుగురిలో ఒకరికి పోటీ ముగింపులో ₹1,000 ప్రత్యేక బహుమతి అందజేయబడుతుంది. నెలవారీ బహుమతి పొందిన రచయితలు మాత్రమే ప్రత్యేక బహుమతికి అర్హులు.


✍️ రచయితలకు ఆహ్వానం


చక్కటి హాస్యం, చమత్కారం, సందర్భోచితమైన సంభాషణలతో పాఠకులను నవ్వించే జోక్స్‌ను పంపండి.

మీ జోక్స్ ఎంతమందిని నవ్విస్తాయో చూడండి... మీ హాస్య ప్రతిభకు గుర్తింపు పొందండి... బహుమతులు గెలుచుకోండి!

నవ్వించండి... నవ్వులు పంచండి... నవ్వుల పోటీలో విజేతలుగా నిలవండి!

– మనతెలుగుకథలు.కామ్

తెలుగు రచయితలకు ప్రోత్సాహం – పాఠకులకు ఆనందం!



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page