top of page
Original.png

పీకులాట – పిల్లల్లారా! | తోకల రాజేశం తెలుగు కవితలు


తోకల రాజేశం పీకులాట మరియు పిల్లల్లారా తెలుగు కవితల భావాలను ప్రతిబింబించే చిత్రం

Peekulata - Pillallara - Telugu Emotional Poetry | Thokala Rajesham

పీకులాట – పిల్లల్లారా! | తోకల రాజేశం తెలుగు కవితలు

Published in manatelugukathalu.com on 07/09/2026


మనిషి మనసులో జరిగే సంఘర్షణకు తుదీ మొదలూ ఎక్కడో చెప్పడం కష్టం. అదే సమయంలో తెలియని ప్రపంచాన్ని ప్రశ్నలతో అన్వేషించడమే జ్ఞానానికి ఆరంభం. ఈ రెండు భిన్నమైన జీవన కోణాలను కవి తోకల రాజేశం తన కవిత్వంలో ఆసక్తికరంగా ఆవిష్కరించారు.

‘పీకులాట’ కవితలో మనసును వెంటాడే చింతలు, మనుషుల మధ్య ఎదురయ్యే కిరికిరి, జీవితాంతం కొనసాగే అంతర్మథనాన్ని తెలంగాణ మాండలికంలోని సహజమైన పదాలు, బలమైన ఉపమానాలతో చిత్రించారు. ‘పిల్లల్లారా!’ బాలగేయంలో మబ్బుల్లోని నీటి జాడ నుంచి విత్తులో దాగిన చెట్టు వరకు ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ ప్రశ్నిస్తూ తెలుసుకోవాలని, గురువులను అడిగి జ్ఞానాన్ని సంపాదించాలని చిన్నారులకు సందేశమిచ్చారు. ఒకటి జీవితపు సంక్లిష్టతను ఆవిష్కరిస్తే, మరొకటి జిజ్ఞాసతో ఆ జీవితాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపుతుంది.


పీకులాట


బొత్తిగ మనసుల మనసుండది

గుల్ల చెరువుల నీళ్లిగ్గినప్పుడు

బురుదల కొట్టుకునే మొట్టపిల్ల లెక్క

గుండెకాయ గిలగిల కొట్టుకుంటది


పాతాళ గరిగెతోని ఎంతగనం తోడినా

తప్పిపోయింది గింతసుతం తలుగది

నీటి స్పర్శ సోకని పొలం గొంతులోని దుఃఖం

లోపటెక్కడో పాయలు తెగి పారుతుంటది


పెయ్యి మీది నుంచి బరువుగా ఒరుసుకుంట

ఎడారి పాము పాకుతునట్టు

గుండెనుయ్యిలోని తడినెవడో

గొట్టం పెట్టి పీల్చినట్టు

లోపటా బయటా సూదిపోట్ల సలపరింత


సిన్నప్పడు సమ్మక్క జాతర్ల

చేతిలోనుంచి జారిపోయిన రూపాయి బిళ్ళలా

తెలియనిదేదో  రప్పన జారిపోతది


మనాది ఎక్కడ పుడుతదో గానీ

పందిరిమీది బీరతీగె తీరి

మనసంతా అల్లుకపోతది

చింతచెట్టు మీది నుంచి దిగని కోతిలా

చింత వింతవింతల విన్యాసాలతో

మనోఫలకాన్ని పొక్కిలి పొక్కిలి చేస్తది


నది పుట్టువడిని

గిది అని గీతగీచి చూపలేనట్టు

ఈ పీకులాటకు

తుదీ మొదలు సక్కగ ఎరుక గాదు


మనుషుల మధ్య బతుకుడు ఎట్లనైనా తప్పది

మనుషులతోని కిరికిరి గూడ తప్పది

గందుకే

బతుకు పొడుగూతా

ఈ పాకులాట పీకులాట సుతం తప్పది


పిల్లల్లారా! ( బాల గేయం)



పిల్లల్లారా!పిల్లల్లారా!!

మల్లెచెట్టు పూరెమ్మల్లారా!

తెలియని వెన్నో ఉన్నాయి

ప్రశ్నలొ అవి దాగున్నాయి


మబ్బుల కడుపున నిదురించే

నీటి జాడనే అడగండి

చెట్టు కొమ్మలో పుష్పించే

కాయ నీడనే తెలియండి


కొండల గుండెలొ ఏముందో

స్టెతస్కోపుతో వినరండి

బండరాయిలో దాగున్న

శిల్పములేవో చూడండి


విత్తు లోపల ఒదిగిపోయిన

చెట్టు పుట్టుకను వెతకండి

మట్టి లోపలి మర్మమేమిటో

గట్టి ప్రయత్నము చేయండి 


పాఠశాలలో గురువులను

తెలియనివన్నీ అడగండి

ప్రశ్న లోపలే జ్ఞానమున్నది

జీవితమంతా నమ్మండి

                    


 *** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




రామశేఖర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: నా పేరు రామశేఖర్.

నాకు చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యం, కథలు రాయడం అంటే ఎంతో ఇష్టం. సమాజంలోని వివిధ అంశాలపై స్పందిస్తూ రాయడం

నా అలవాటు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page