గురువు
గురువు, గురువు కవిత, నంద్యాల విజయ లక్ష్మి, గురు పౌర్ణిమ, తెలుగు కవిత, ఉపాధ్యాయులు, గురువు మహిమ, ప్రేరణాత్మక కవిత

Guruvu - Telugu Poem| Nandyala Vijaya Lakshmi
గురువు - తెలుగు కవిత | నంద్యాల విజయలక్ష్మి
Published in manatelugukathalu.com on 29/07/2026
మన జీవితానికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. కేవలం పాఠాలు చెప్పేవారే కాదు, మంచి మార్గాన్ని చూపిస్తూ, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ, జీవితానికి వెలుగునిచ్చే ప్రతి వ్యక్తి గురువే. శ్రీమతి నంద్యాల విజయ లక్ష్మి రచించిన "గురువు" కవిత గురువు యొక్క ఔన్నత్యాన్ని, ప్రేమను, క్రమశిక్షణను, దేశభక్తిని, జ్ఞానదీపికగా ఆయన పాత్రను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది.
తెల్లకాగితములాంటి శిష్యుల హృదయాలలో
ఒక మార్గదర్సిగా
ఒక తండ్రిగా
ఒక తల్లిగా
ఒక స్నేహితునిగా
సన్మార్గము నిర్దేశిస్తూ
దండిస్తూ బెదిరిస్తూ
ప్రేమిస్తూ లాలిస్తూ
చిరకాలము నిలిచిపోయే ఏ వ్యక్తైనా గురువే.
మంచిని
భోధిస్తూ
చెడును ఖండిస్తూ
ఉన్నతిని కాంక్షిస్తూ
శ్రేయోభిలాషిగా సంచరించే ఏ వ్యక్తైనా గురువే.
దోషాలను సవరిస్తూ
దేశభక్తిని పెంపొందజేస్తూ
సమతా దృష్టితో
మంచి నడవడిని
నేర్పిస్తూ
మనలో ఒకడై మనలను శాసిస్తూ
జ్ఞానజ్యోతిని చూపిస్తూ మనజీవితాలలో వెలుగును చూపించే ఏ వ్యక్తైనా గురువు.
నా గురువులకు ప్రణామములు
========================================

Nenu Entha Pichhidanini - Telugu Poem| Nandyala Vijaya Lakshmi
నేను ఎంత పిచ్చిదానిని - తెలుగు కవిత | నంద్యాల విజయలక్ష్మి
Published in manatelugukathalu.com on 23/05/2026
జీవితం, మరణం, అహంకారం, మరియు మానవ భ్రమలపై ఆత్మపరిశీలన చేయించే లోతైన తాత్విక తెలుగు కవిత — “నేను ఎంత పిచ్చిదానిని”.
దేవుడా
నేనెంత పిచ్చిదాన్ని
జనన మరణాలను రాసేది నువ్వు అని తెలిసీ, నేను అది చేస్తే బాగుండేది ఇది చేస్తే బాగుండేది అనుకుంటూ మరణాన్ని వాయిదా వేసే ప్రయత్నము లో ఓడిపోయి
అంతా నీ చేతిలో ఉందని తెలుసుకుని రాని నవ్వును పెదాలమీదకు తెచ్చుకుంటున్నా
నేనెంత వెర్రిదానిని .
ఇంద్రియాలను గెలిచాననుకుంటూ కూడా, అవకాశాలను అందిపుచ్చుకుంటూ పైకి ఎదిగి అంతా నా గొప్పే అనే భ్రాంతిలో బ్రతుకుతున్నా
నేను ఎంత వెర్రిదాన్ని.
క్షణాలలో ముంచుకొచ్చే మృత్యువును గ్రహించలేక ప్రతిక్షణము శాశ్వతమనే భ్రమలో, బంధాలవలలో చిక్కుకుని విర్రవీగుతున్నా.
పగలు ప్రతీకారాలతో మానవత్వాన్ని పక్కకు నెట్టేసి చట్టానికి దొరకకుండా తప్పించుకోవాలని చూస్తున్నా
నేను ఎంత పిచ్చిదాన్ని.
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .





Comments