top of page
Original.png

కుటుంబ కథల పోటీ – 2026–27

9 hours ago
2 min read
కుటుంబ కథల పోటీ – 2026–27

ప్రతి నెలా మూడు ఉత్తమ కుటుంబ కథలకు బహుమతులు!

కుటుంబ కథల పోటీ – 2026–27

ప్రతి నెలా మూడు ఉత్తమ కుటుంబ కథలకు బహుమతులు!

Published in manatelugukathalu.com on 29/10/2026

నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్

సౌజన్యం: శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు


తమ పాత్రికేయ మిత్రులు కీర్తిశేషులు శ్రీ కావూరి వెంకట సుబ్బారావు గారి స్మారకార్థం ఈ పోటీలకు శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు బహుమతులను అందజేస్తున్నారు.


కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు, మానవీయ విలువలు, జీవితంలోని సుఖదుఃఖాలను ప్రతిబింబించే చక్కటి కుటుంబ కథలను ప్రోత్సహించేందుకు మనతెలుగుకథలు.కామ్ ప్రత్యేకంగా ‘కుటుంబ కథల పోటీ’ నిర్వహిస్తోంది.


ఈ పోటీలో ప్రతి నెలా ఎంపిక చేసిన మూడు ఉత్తమ కుటుంబ కథలకు నగదు బహుమతులు అందజేయబడతాయి.


కుటుంబ కథల పోటీ – 2026–27 🏆 నెలవారీ బహుమతులు


🥇 ప్రథమ బహుమతి

🥈 ద్వితీయ బహుమతి

🥉 తృతీయ బహుమతి


📅 పోటీ కాలవ్యవధి

నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు (ఐదు నెలలు).

ఈ ఐదు నెలల కాలంలో మొత్తం 15 బహుమతులు అందజేయబడతాయి.


📩 కథలు పంపే విధానం

పోటీలో పాల్గొనదలచిన రచయితలు తమ కథలను తెలుగులో టైప్ చేసి, వర్డ్ డాక్యుమెంట్ (.doc/.docx) లేదా టెక్స్ట్ డాక్యుమెంట్ (.txt) రూపంలో పంపించాలి.


కథలను ఈ క్రింది మార్గాల్లో పంపవచ్చు:

1. ఇమెయిల్ ద్వారా:📧 story@manatelugukathalu.com

ఇది మా రచయితల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక ఇమెయిల్ చిరునామా.

గమనిక: మా ఇమెయిల్ చిరునామా manatelugukathalu.com తో ముగుస్తుంది. దీని చివర అదనంగా gmail.com, yahoo.com వంటివి చేర్చవద్దు.


2. వెబ్‌సైట్ ద్వారా:మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న రచనల అప్‌లోడ్ లింక్ ద్వారా కూడా కథలను పంపవచ్చు.🌐 www.manatelugukathalu.com


ముఖ్య గమనిక: పీడీఎఫ్ (PDF) రూపంలో గానీ, చేతిరాత ప్రతుల రూపంలో గానీ పంపిన రచనలను స్వీకరించలేము.


3. వాట్సాప్ ద్వారా సంప్రదింపు / రిమైండర్:వాట్సాప్‌లో సమాచారం పంపినవారు లేదా రచన పంపి స్పందన రాకపోతే, ఒక వారం తరువాత మరోసారి రిమైండ్ చేయవచ్చు.📱 మా అధికారిక వాట్సాప్ నంబర్: 6309958851


🌸 ఉగాది 2027 పోటీలకు మరో అవకాశం!


ఈ కుటుంబ కథల పోటీలో బహుమతులు పొందిన కథలను, మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న ‘వారం వారం బహుమతులు’ కార్యక్రమంలో విజేతలైన కథలతో పాటు ఉగాది 2027 కథల పోటీలకు కూడా పరిశీలించడం జరుగుతుంది.


కథ ప్రారంభంలో “కుటుంబ కథల పోటీకి” / “ఉగాది 2027 కథల పోటీకి” అని వ్రాస్తే, ఆ కథను రెండు పోటీలకూ పరిశీలిస్తాము.


తద్వారా ఉత్తమ కథలకు మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది.


📢 ఫలితాల ప్రకటన

నవంబర్‌లో ప్రచురింపబడ్డ కథల పోటీ ఫలితాలు డిసెంబర్ 15 నాటి మా పోస్ట్‌లో ప్రకటించబడతాయి.


తదుపరి నెలల ఫలితాలు కూడా ఇదే విధంగా ప్రత్యేక పోస్టుల ద్వారా తెలియజేయబడతాయి.


❤️ ఎక్కువమంది రచయితలకు అవకాశం!


ఈ పోటీలో ఒక రచయితకు ఒక్కసారి మాత్రమే బహుమతి పొందే అవకాశం ఉంటుంది.

ఒకే రచయితకు పలుమార్లు బహుమతులు ఇవ్వడం కంటే, ప్రతిభావంతులైన ఎక్కువమంది రచయితలకు ప్రోత్సాహం అందించి, వీలైనంత ఎక్కువమందిని విజేతలుగా నిలపాలన్నదే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం.


ప్రత్యేక గమనిక: ఒక రచయితకు ఒక్కసారి మాత్రమే బహుమతి అనే నిబంధన ఈ కుటుంబ కథల పోటీకి మాత్రమే వర్తిస్తుంది. ఉగాది 2027 కథల పోటీలకు ఆ పోటీ ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.


⭐ ఎంపిక విధానం


బహుమతుల ఎంపికలో నాణ్యమైన కథా వస్తువు, రచనా శైలి, భావవ్యక్తీకరణతో పాటు పాఠకుల ఆదరణకు కూడా ప్రాధాన్యత ఉంటుంది.


✍️ రచయితలకు ఆహ్వానం


కుటుంబ బంధాల గొప్పతనాన్ని, అనుబంధాల మాధుర్యాన్ని, కుటుంబ జీవితంలోని సంఘర్షణలను, త్యాగాలను, మారుతున్న విలువలను, తరాల మధ్య ఆలోచనల అంతరాలను ప్రతిబింబించే మంచి కథలతో ఈ పోటీలో పాల్గొనండి.

మీ కలం నుంచి వెలువడే చక్కటి కుటుంబ కథ... ఎందరో పాఠకుల మనసులను తాకవచ్చు!


కథలు రాయండి... పాఠకుల మనసులు గెలుచుకోండి... బహుమతులు అందుకోండి!


తెలుగు కథాసాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు రచయితలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.


మల్లవరపు సీతారాం కుమార్ 


తెలుగు రచయితలకు ప్రోత్సాహం – తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం!

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page