ఆ ఒక్క దోమ!

Aa Okka Doma - Telugu Inspirational Article | Kotha Viritha
ఆ ఒక్క దోమ! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 29/10/2026
ప్రతి వ్యవస్థలోనూ నిబంధనల నుంచి తప్పించుకునే దారి వెతికే ఒక్కరైనా ఉంటారు!
ఇదంతా చూస్తుంటే మన చెవి దగ్గర రాత్రంతా కచేరీ చేసే ఆ ఒక్క దోమ గుర్తుకు రాకమానదు!
నవ్విస్తూనే సమాజంలోని ఒక ఆసక్తికరమైన ధోరణిని ఎత్తిచూపే కొత్త విరిత గారి వ్యంగ్య రచన “ఆ ఒక్క దోమ!”
ఎగ్జామ్‌లో కాపీలు కొడుతున్నారని,
చెకింగ్ పెంచుతారు, ప్రీ-చెకింగ్ పెంచుతారు,
అయినా ఆ ఒక్క స్టూడెంట్ మాత్రం,
“కాపీ కొట్టడానికి కొత్త టెక్నిక్ ఏదైనా ఉందా?” అని వెతుకుతాడు!
సిగ్నల్స్ జంప్ చేస్తున్నారని,
రూల్స్ పెడతారు,
ఫైన్లు పెంచుతారు,
అయినా ఆ ఒక్క వాహనదారుడు మాత్రం,
“ఈ రూల్ నుంచి తప్పించుకునే దారి ఏదైనా ఉందా?” అని వెతుకుతాడు!
దొంగతనాలు జరుగుతున్నాయని,
లాకులు పెడతారు, కెమెరాలు పెడతారు,
అయినా ఆ ఒక్క దొంగ మాత్రం,
“ఈ లాక్‌కి లొసుగు ఏదైనా ఉందా?” అని వెతుకుతాడు!
ఆఫీసులో ప్రాసెస్ తప్పులు జరుగుతున్నాయని,
ట్రైనింగ్ లు పెడతారు,
అప్రూవల్స్ పెంచుతారు,
అయినా ఆ ఒక్క ఉద్యోగి మాత్రం,
“ఈ ప్రాసెస్‌లో షార్ట్‌కట్ ఏదైనా ఉందా?” అని వెతుకుతాడు!
దోమలు చావాలని,
పవర్‌ఫుల్ లిక్విడ్ పెడతారు,
గదంతా వాసనతో నింపుతారు,
పది దోమల్లో తొమ్మిది అక్కడికక్కడే పడిపోతాయి,
కానీ ఆ ఒక్క దోమ మాత్రం,
“నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు బాబూ!” అంటూ మన చెవుల దగ్గర కచేరీ అప్డేటెడ్ వెర్షన్ లో పెడుతుంది.
రూల్స్ ఎంత కఠినంగా ఉంటే,ఎస్కేప్ రూట్లు అంత కొత్తగా పుడతాయి.
ప్రతి అప్డేట్ సిస్టమ్‌కీ,
“నేను మాత్రం దొరకను!” అనుకునే ఆ "ఒక్క" దోమ ప్రతి రంగంలో ఎప్పుడూ ఉంటుంది!
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Comments