top of page
Original.png

తోలు బొమ్మలు - పార్ట్ 8


తోలు బొమ్మలు పార్ట్ 8 – కాశీ విశ్వనాథ ఆలయం, పంచారామాలు, జ్యోతిర్లింగాల విశేషాలను చంద్రశేఖర్, కావ్యలకు చదివి వినిపిస్తున్న సుశీల.
తోలు బొమ్మలు పార్ట్ 8 – ఒక పాత పుస్తకం ద్వారా కాశీ విశ్వనాథుని నుంచి అష్టాదశ శక్తిపీఠాల వరకు ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుంటున్న అక్కాతమ్ముళ్లు.

Tholu Bommalu - Part 8 - Telugu Serial | Ch. C. S. Sarma 

తోలు బొమ్మలు - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 29/10/2026


తోలు బొమ్మలు పార్ట్ 8లో చంద్రశేఖర్, కావ్యల బాల్య జ్ఞాపకాల ద్వారా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల విశేషాలు పరిచయమవుతాయి. తాత వీరరాఘవయ్య తల్లి వెంకటలక్ష్మి రచించిన పుస్తకాన్ని ఈసారి అత్తయ్య సుశీల చదివి వినిపిస్తుంది. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర, పంచారామ క్షేత్రాల పురాణ నేపథ్యం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ప్రసిద్ధ శివాలయాల ప్రత్యేకతలను తెలుసుకుంటూ అక్కాతమ్ముళ్లు ఆసక్తిగా వింటారు. తరతరాలుగా అందుతున్న ఆధ్యాత్మిక జ్ఞానం, కుటుంబ విలువలు, పెద్దల పట్ల గౌరవం ఈ భాగంలో ప్రధానంగా కనిపిస్తాయి.

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి. తాత వీరరాఘవయ్య చెప్పిన పరోపకారం, ఆదర్శ జీవనం గురించిన మాటలు చిన్న చంద్రశేఖర్ మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అదే సమయంలో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రదర్శన మధ్యలో ధనుంజయరావు ప్రవర్తనను గమనించిన చంద్రశేఖర్ మనసులో కొత్త సందేహం మొదలవుతుంది. తోలు బొమ్మలు పార్ట్ 7లో వర్షం కారణంగా మధ్యలో ఆగిపోయిన తోలుబొమ్మలాట కథను తెలుసుకోవాలనే చిన్న చంద్రశేఖర్ ఆసక్తి, అతన్ని మరో అపూర్వమైన రామాయణ అనుభవంలోకి తీసుకెళ్తుంది.


 

తోలు బొమ్మలు పార్ట్ 8 | కాశీ, పంచారామాలు, జ్యోతిర్లింగాలు


అక్కా, నేనూ అందరితో కలిసి భోంచేశాము. అక్కా, నేనూ మా వెనకాలే అత్తయ్య సుశీల గదిలోకి వచ్చాము. అక్క పుస్తకాన్ని చేతికి తీసుకుంది. అత్తయ్య ‘నేను చదువుతాను, మీరు వినండి’ అంది. అక్క చేతిలోని పుస్తకాన్ని తాను తీసుకొని అత్తయ్య చదవడం ప్రారంభించింది.


కాశీ విశ్వేశ్వరుల ఆలయ చరిత్ర :

1. కాశీ విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.

2. కాశీలోని 88 ఘాట్లలో అత్యంత ప్రసిద్ధి చెందినది మణికర్ణికా ఘాట్.

3. క్రీ.శ. 508 గుప్త చక్రవర్తి వైన్యగుప్తుడిచే ఆలయ నిర్మాణం జరిగినది.

4. క్రీ.శ. 635 చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన జరిగినది.

5. క్రీ.శ. 1194 ఆలయాన్ని ధ్వంసం చేసినది మహమ్మద్ ఘోరీ సైన్యం.

6. క్రీ.శ. 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించినది గుజరాత్ వర్తకులు.

7. క్రీ.శ. 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడినాడు ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోధీ.

8. క్రీ.శ. 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించినది రాజా తోడర్‌మల్.

9. క్రీ.శ. 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుచే ఆలయ విధ్వంసం.

10. క్రీ.శ. 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలో విసిరివేశాడు అర్చకుడు (పూజారి).

11. శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు. ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి ఉంది.

12. క్రీ.శ. 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదును నిర్మాణం చేశాడు ఔరంగజేబు.

13. క్రీ.శ. 1740 లో మసీదు విధ్వంసానికి మల్హార్ రావు హోల్కర్ విఫలయత్నం (ఫలించలేదు).

14. క్రీ.శ. 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథునికి పూర్వవైభవం.

15. క్రీ.శ. 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు పక్కనే నిర్మించారు.

16. క్రీ.శ. 1835 లో స్వర్ణతాపడం చేయించారు మహారాజా రంజిత్ సింగ్.

17. కాలక్రమంలో గృహనిర్మాణాలతో ఆక్రమణకు గురైనది ఆలయ ప్రాకారం.

18. ప్రతిరోజూ జ్యోతిర్లింగ దర్శనానికి తరలివచ్చే వేలాది భక్తులు చిన్న చిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు.


పంచారామాలు ఉన్న ప్రాంతాలు – పురాణ వివరణలు

క్షేత్రము ఈశ్వరుని పేరు ఊరి పేరు జిల్లా


ద్రాక్షారామము భీమేశ్వరుడు దాక్షారామము తూర్పుగోదావరి జిల్లా

కుమారరామము భీమేశ్వరుడు సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా

క్షీరారామము రామలింగేశ్వరుడు పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా

భీమారామము సోమేశ్వరుడు భీమవరం పశ్చిమగోదావరి జిల్లా

అమరారామము అమరేశ్వరుడు అమరావతి గుంటూరు జిల్లా


తారకాసురుడు మహారాక్షసుడు, పరమశివ భక్తుడు. తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని పొందినవాడు. పసిబాలుని చేత తప్ప అన్యులెవరి చేతిలోనూ చావు రాకుండా వరమును శివభగవానుని నుండి పొందినాడు. దేవతల కోరికపై పరమశివుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తారకాసురుని వధించమని ఆజ్ఞాపించెను. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరులు తారకాసురుని వధించిరి. కానీ అతనిలో ఉన్న శ్రీ శివ ఆత్మలింగ ప్రభావమున ముక్కలయిన శరీరము ఒకటై... పూర్వ రూపంతో సుబ్రహ్మణ్యేశ్వరులవారి ముందు యుద్ధానికి సంసిద్ధుడయ్యేవాడు.


దానికి కారణము అతనిలో ఉన్న శ్రీ శివ ఆత్మలింగము. ఆ స్థితిని గ్రహించిన శ్రీ మహావిష్ణుమూర్తి కార్తికేయులవారికి తారకాసురుడు ఆరాధించే శివలింగమును ఐదు ముక్కలుగా ఖండించి దూరముగా తోచిన రీతిని పారవేయమని చెప్పిరి.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రీతిగానే చేసిరి. పై ఐదు క్షేత్రములందు వెలసియున్నది ఒకే శివలింగం యొక్క శకలములు (ముక్కలు).


ఆ ఆత్మలింగాన్ని తారకాసురుడు ఆరాధించి చావును జయించినాడు. అతని పాపములు పండి బాలుడైన శ్రీ కుమారస్వామివారి చేతిలో ఆ రీతిగా గతించినాడు.

ఈ కలియుగమునందునూ... మానవ సముదాయములో దేవగుణసంపన్నులు... దానవగుణ సంజాతులు ఉన్నారు... అనాదిగా ధర్మానికి, అధర్మానికి వైరం, యుద్ధం.

నేడూ స్వతంత్రులైన మన భారత సంతతిలో పై వర్గభేదం ఉన్నది. యుగకాలం ముందుకు సాగేకొద్దీ... స్వార్థపు ఆశలు, అరాచకాలను అభిమానించి మానవత్వాన్ని మరచి... దానవ చర్యలను విచక్షణా రహితంగా కొందరు కొనసాగిస్తున్నారు.


ప్రతి ఒక్కరికీ కావలసింది... డబ్బు, పదవి, హోదా, కార్లు, బంగళాలు. సమాధులపై పునాదులను నిర్మించి ఆవాస హర్మ్యాలను నిర్మిస్తున్నారు. మగువ, మధువుల మైకంలో తప్పులు... తిప్పలు తిప్పలుగా చేస్తున్నారు.


పెద్దలయందు గౌరవం... వారి మాటలయందు అభిమానం... ఆ మాటలు మన మంచికే అని నమ్మి పాటించే మంచి లక్షణాన్ని స్వార్థం, అహం, ద్వేషం... ఆ మూడూ కలిసి అంతం చేస్తున్నాయి. కొందరు మానవులు దానవులుగా మారుతున్నారు.


ద్వాదశ జ్యోతిర్లింగాలు : ఉన్న ప్రదేశాలు


జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ మన పవిత్ర భారతావనిలో పన్నెండు చోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

భారతదేశంలోని నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి.


సముద్రపు ఒడ్డున రెండు

1. బంగాళాఖాత తీరాన రామేశ్వరలింగం.

2. అరేబియా సముద్ర తీరాన సోమనాథ లింగం.


పర్వత శిఖరాలలో నాలుగు

3. శ్రీశైల మల్లికార్జునుడు

4. హిమాలయాల్లో కేదారేశ్వరుడు

5. సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు

6. మేరు పర్వతాలపై వైద్యనాథ (లింగం) ఈశ్వరుడు.


మైదాన ప్రదేశాలలో మూడు

7. ద్వారకా వనంలో నాగేశ్వరలింగం

8. ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వరలింగం.

9. ఉజ్జయిని నగరంలో మహాకాలేశ్వర లింగం.


నదుల ఒడ్డున మూడు

10. నర్మదా నది తీరాన ఓంకారేశ్వరుడు.

11. గోదావరి నది తీరాన త్రయంబకేశ్వరుడు

12. గంగా నది తీరాన విశ్వేశ్వరుడు.


అష్టాదశ శక్తి పీఠములు

రాష్ట్రము స్థలము దేవత పేరు

1. అస్సాం హరి క్షేత్రము కామరూపదేవి

2. ఆంధ్రప్రదేశ్ ఆలంపురం జోగులాంబాదేవి

3. ఆంధ్రప్రదేశ్ దాక్షారామం మాణిక్యాంబ దేవి

4. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం పురూహుతికాదేవి

5. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం భ్రమరాంబికాదేవి

6. ఉత్తరప్రదేశ్ ప్రయాగ మాధవేశ్వరీదేవి

7. ఉత్తరప్రదేశ్ వారణాసి విశాలాక్షి

8. ఒరిస్సా వైతరణి గిరిజాదేవి

9. కర్ణాటక మైసూరు చాముండేశ్వరీదేవి

10. బెంగాల్ గంగాసాగర్ (ద్వారక) శృంఖలాదేవి

11. జమ్ము కాశ్మీర్ లాల్ చౌక్ (కాశ్మీర్) సరస్వతీదేవి

12. తమిళనాడు కంచి కంచికామాక్షి

13. బీహార్ గయ మాంగళ్యగౌరీదేవి

14. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళిదేవి

15. మహారాష్ట్ర కొల్హాపూరం మహాలక్ష్మిదేవి

16. మహారాష్ట్ర మహూర్ మహంకాళిదేవి

17. సిలోన్ (శ్రీలంక) ట్రీంకోమరి శాంకరిదేవి

18. హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి వైష్ణవిదేవి


అష్టాదశ శక్తిపీఠ శ్లోకం....


లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే..

ఆలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా. కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా...

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠికాయాం పురుహూతికా...

హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ. జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయాయాం మంగళగౌరికా...

వారణాస్యాం విశాలాక్షీ, కాశ్మీరే తు సరస్వతీ. అష్టాదశ శక్తిపీఠాని యోగినామపి దుర్లభమ్...

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశత్రు వినాశనమ్. సర్వరోగ హరం దివ్యమ్,

సర్వసంపత్కరం శుభమ్! సర్వసంపత్కరం శుభమ్! సర్వసంపత్కరం శుభమ్!...


భారతావనిలోని మహోన్నత మహిమాన్విత శివాలయాలు


1. మహానంది శివలింగం అడుగు నుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాల పంటభూమి పండుతుంది. బయట ఉండే కోనేరులో గుండుసూది వేసినా కనబడుతుంది.

ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది.


2. ప్రకాశం జిల్లా పొన్నలూరు : కందుకూరు, కనిగిరి మధ్యన కె. ಅಗ్రహారంలోని కాశీవిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.


3. ద్రాక్షారామం : ఈ శివలింగంపై ఉదయం, సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి.


4. భీమవరం : సోమేశ్వరుడు ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతాడు.


5. కోటప్పకొండ : ఎటు చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఇక్కడ కాకులు అసలు రావు, కనబడవు.


6. గుంటూరు జిల్లా చేజర్ల : ఇక్కడ స్వామివారి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కుళ్ళిన వాసన వస్తుంది.


ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు.


7. భైరవకోన : ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరు రాదు.

8. యాగంటి : ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు.


9. శ్రీశైలం : భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు ‘‘జుం’’ అనే తుమ్మెద శబ్దం వినపడేదట.


10. కర్నూలు జిల్లా : సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6 నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది, 6 నెలలు బయటకు కనిపిస్తుంది.


11. శ్రీకాళహస్తి : ఇచ్చటి శివలింగం వాయురూపం.


12. ఆదిలాబాద్ : జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది.


13. కరీంనగర్ : జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తర ముఖంగానూ, దక్షిణాయణంలో దక్షిణ వైపుకూ తిరుగుతాడు. అది మహా ఆశ్చర్యం.


14. వరంగల్ జిల్లా : వెయ్యి స్తంభాల గుడి. ఇక్కడ సంగీత స్తంభాలు కలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.

15. అలంపూర్ : బాలబ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎటు పోతుందో ఎవరికీ తెలియదు.


16. కర్ణాటకలోని శివగంగ : ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అవుతుంది. ఇక్కడ మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.


17. మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరమూ శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.


18. కంచి (తమిళనాడు) : ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.


19. తమిళనాడు తిరునాగేశ్వరం : ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.


20. అమర్‌నాథ్ : శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.


21. చైనాలో కిన్నెర కైలాసము : ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం ఎర్రగా, రాత్రి నీలంగా మారుతుంది.


భారతదేశంలోని ప్రముఖ శ్రీ మహా విష్ణు ఆలయములు :

1. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం - ఆంధ్రప్రదేశ్


2. శ్రీ రంగనాథస్వామివారి ఆలయం - శ్రీరంగం, తమిళనాడు


3. శ్రీ పద్మనాభస్వామి వారి ఆలయం - కేరళ

4. శ్రీ బద్రీనాథ్ ఆలయం - ఉత్తరాఖండ్

5. శ్రీ పుష్కర్ బ్రహ్మ మందిరం - రాజస్థాన్

6. శ్రీ పూరీ జగన్నాధ ఆలయం - ఒడిశా

7. శ్రీ కల్లహల్లి ఆలయం - కర్ణాటక

8. శ్రీ నైమిశారణ్య ఆలయం - ఉత్తర్ ప్రదేశ్


ప్రతిరోజూ ప్రదోష సమయంలో (అనగా సాయంత్రం సంధ్యా సమయంలో) జపించవలసిన శివనామాలు :


1. ఓం నిధన పతియే నమః

ఓం నిధన పతాంతకాయ నమః

2. ఓం ఊర్ద్వాయ నమః

ఓం ఊర్ధ్వలింగాయ నమః

3. ఓం హిరణ్యాయ నమః

ఓం హిరణ్యలింగాయ నమః

4. ఓం సువర్ణాయ నమః

ఓం సువర్ణ లింగాయ నమః

5. ఓం దివ్యాయ నమః

ఓం దివ్య లింగాయ నమః

6. ఓం భవాయ నమః

ఓం భవలింగాయ నమః

7. ఓం శర్వాయ నమః

ఓం శర్వలింగాయ నమః

8. ఓం శివాయ నమః

ఓం శివలింగాయ నమః

9. ఓం జ్వాలాయ నమః

ఓం జ్వల లింగాయ నమః

10. ఓం ఆత్మాయ నమః

ఓం ఆత్మ లింగాయ నమః

11. ఓం పరయాయ నమః

ఓం పరమలింగాయ నమః


ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

‘‘ప్రతి ఒక్క హైందవుడూ తెలుసుకొనవలసిన ఎనిమిది హైందవ ప్రామాణిక విషయాలను వ్రాశాను. నా సంతతి ఆ విషయాలను చదివి క్రమబద్ధంగా ధర్మ, అర్థ, కామ, మోక్షములను పొందవలయునన్నది నా అభిమతము, ఆశయము!...’’


సుశీల చదవడం ఆపి పుస్తకాన్ని మూసేసింది.


‘‘ఏరా పిల్లలూ!... అన్ని విషయాలను జాగ్రత్తగా విన్నారా?’’ అడిగింది సుశీల అత్తయ్య.


నేనూ, అక్కయ్య కావ్య ఒక్కసారిగా...

‘‘విన్నాము అత్తయ్యా!...’’ అన్నాము.


‘‘కేవలం వినడమే కాదు, గుర్తుంచుకోవాలి. మీ భావి జీవితంలో మీరు వీటిని మననం చేస్తూ సాటివారికి తెలియజేయాలి. హైందవులందరూ మన జాతి ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. సభ్య సమాజంలో ఆదర్శవంతులుగా గుర్తింపు పొందాలి’’ నవ్వుతూ చెప్పింది అత్తయ్య.


‘‘అలాగే అత్తయ్యా!...’’ అన్నాము నేను, అక్కయ్య.

అమ్మ మా గదిలోకి వచ్చింది.


‘‘సుశీలా!...’’


‘‘ఏం వదినా?...’’


‘‘అన్నయ్య నిన్ను పిలుస్తున్నారమ్మా!...’’


‘‘అలాగా!...’’


‘‘అవును...’’


అత్తయ్య సుశీల లేచి అమ్మతో కలసి వెళ్ళిపోయింది.

ఆ సాయంత్రం నాలుగు గంటలకు సాంబయ్య మా ఇంటికి వచ్చాడు. తాతయ్య గారు వరండాలో కూర్చొని గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నారు. సాంబయ్యను చూచి...

‘‘ఏం సాంబయ్యా!... నిన్నటి వానవలన బొమ్మలు చెడిపోలేదు కదా!...’’


‘‘లేదు సామీ!... వాన ప్రారంభం కాగానే బొమ్మల్ని పెట్టెల్లో సర్దేశాము సామీ!...’’


‘‘ఏమిటి విశేషం?...’’


‘‘సామీ, గోవర్ధనయ్యగారు కబురు పంపారండి. వారిని కలిసి మాట్లాడి వస్తున్నానయ్యా. రేపు అదే లంకాదహనం ఆడమన్నారయ్యా. మీరు, మీ వారంతా వచ్చి పూర్తిగా బొమ్మలాటను చూడండయ్యా!...’’

వినయంగా చెప్పాడు సాంబయ్య.


‘‘సరే!... తప్పకుండా వస్తాం!...’’ తాతయ్యగారి జవాబు.

మరుదినం రాత్రి సాంబయ్య బృందం లంకాదహనం తోలుబొమ్మలాటను ప్రదర్శించారు. చాలా బాగుండింది. బొమ్మల కదలిక, వారి మాటలు, పాటలు ఎంతో గొప్పగా ఉండినవి.

============================================================

తోలు బొమ్మలు - పార్ట్ 9 త్వరలో మీ ముందుకు వస్తుంది.

============================================================


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page