బాలల కవితలు – ఆరోగ్యం, మంచి అలవాట్లు, చదువు | రాళ్లబండి సంగం నాయుడు

Balala Kavithalu - Arogyam, Manchi Alavatlu, Chaduvu | Telugu Inspirational Poems | Rallabandi Sangam Naidu
బాలల కవితలు – ఆరోగ్యం, మంచి అలవాట్లు, చదువు | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 29/10/2026
బాలల కవితలు – ఆరోగ్యం, మంచి అలవాట్లు, చదువు
రచన: రాళ్లబండి సంగం నాయుడు
పిల్లల భవిష్యత్తుకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, విద్య ఎంతో అవసరం. చిన్ననాటి నుంచే ఈ విలువలను అలవర్చుకుంటే వారు మంచి వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా ఎదుగుతారు.
ప్రముఖ రచయిత రాళ్లబండి సంగం నాయుడు రచించిన ఈ పది సందేశాత్మక బాలల కవితలు పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని, జీవితానికి అవసరమైన మంచి విలువలను అందిస్తాయి.
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం, మంచి అలవాట్లు పెంపొందించుకోవడం, పుస్తకాలను ప్రేమించడం, వ్యాయామం చేయడం, మొక్కలను పెంచడం, ప్రకృతి నుంచి నేర్చుకోవడం, నీటి ప్రాముఖ్యతను తెలుసుకోవడం, చదువు విలువను గుర్తించడం వంటి అంశాలను ఈ కవితల్లో సరళమైన పదాలతో వివరించారు.
బాలబాలికలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తప్పక చదవదగిన పది తెలుగు కవితలు ఇవి.
బాలల కవితలు – ఆరోగ్యం, మంచి అలవాట్లు, చదువు
1.
జంకు ఫుడ్డు వద్దు
2.
చెడుకు చెడుగుడు
3.
చెడుకు దూరం
4.
మంచి అలవాట్లు
5.
పుస్తక పఠనం
6.
వ్యాయామం చేద్దాం
7.
మొక్కలను పెంచుదాం
8.
నేర్చుకో బుజ్జాయి
9.
నీళ్లు తాగుదాము
10.
చదువు
జంకు ఫుడ్డు వద్దు
జంకు ఫుడ్డు వద్దు
ఇంటి ఫుడ్డు ముద్దు
కురు కురులు వద్దు
ఇంట్లో వండే కూరలే ముద్దు
ఐస్ క్రీములు వద్దు
నోట్లో పళ్ళు కోల్పోవద్దు
అరిసలు తినండి
అమృతం పొందండి
తాజా పండ్లు తినండి
రాజాలా ఉండండి
జంతికలు తినండి
జాతి రత్నాలు కండి
చెగోడీలు తినండి
చేతన కలిగి ఉండండి
చైతన్యం కలిగి ఉండండి
చెలిమి కలిగి ఉండండి
కజ్జికాయలు తినండి
కండలు కలిగి ఉండండి
కలిమి కలిగి ఉండండి
సున్ని ఉండలు తినండి
సున్నితత్వం కలిగి ఉండండి
జిలాబీలు తినండి
గులాబీలా ఉండండి
పప్పుండలు తినండి
ఇనుముని పిండి చేయండి
నువ్వండలు తినండి
నవ్వు కలిగి ఉండండి
కొబ్బరి ఉండలు తినండి
కోటి ఆశలతో ఉండండి
బెల్లం పదార్దాలు తినండి
బేలగా ఉండడం మానండి
పొంగడాలు తినండి
పాలులా పొంగండి
పాల పదార్దాలు తినండి
పోటీల్లో రాటు దేలండి
మిఠాయిలు తినండి
మిల మిలమెరవండి
బూరెలు తినండి
మారం మానండి
గారెలు తినండి
గారంకు దూరం కాకండి
అట్లు తినండి
తిట్లుకు దగ్గర కాకండి
కోట్లు పొందండి
పాయసం తినండి
ఆయాసం తగ్గించుకోండి
జంకు బంకు వద్దు
జబ్బు జ్వరం వద్దు
ఇల్లు అమ్మ ముద్దు
చెడుకు చెడుగుడు
చెడుకు చెడుగుడు
మంచికై నిలబడు
క్రమశిక్షణకు కలబడు
విద్యార్థి ఓ విద్యార్థి
క్రమశిక్షణ ఉక్కుతో
చేసిన కోటు
క్రమశిక్షణకు
సూర్యుడుతో పోటీపడు
నవగ్రహాలతో నడు
చేతి గోళ్లు కత్తిరించు
జుత్తు సరిగా కత్తిరించు
జుత్తు సరిగా దువ్వుకో
మంచి దుస్తులు ధరించు
మంచి భాష మాట్లాడు
మంచి పలుకులు పలుకు
అశ్లీలపు పలుకులు పలకకు
ఆడవాళ్ళను గౌరవించు
సమాజ కట్టుబాట్లు కాపాడు
పెద్దలను, ముందు తరాలను
అనుసరించు
చట్టాలు తెలుసుకో
చట్టాలు ఆచరించు
తల్లి తండ్రులను
తొడబుట్టిన వారిని ప్రేమించు
విద్యార్థి దశలో చదువుపై
దృష్టి పెట్టు
అనవసర ప్రేమల జోలికి పోకు
ఆటోలు, బైక్ ల జోలికి పోకు
మత్తు పదార్దాలకు
డ్రగ్స్, గంజాయి కి
నీలి చిత్రాలకి
చెత్త సినిమాలకు
ఆల్కహాల్ కు
దూరంగా వుండు
ఇంటర్నెట్ కు
డబ్బుకు
ప్రపంచంలో మంచికి
నువ్వు యజమానివి
తప్ప చెడుకు
బానిసవు కాదని తెలుసుకో
ఆత్మహత్యలు నివారించు
ప్రపంచం నీ గుప్పిట్లో
ఉందని గమనించు
నీ సుమనసు తలుపులు తెరువు
నీ ఊపిరి పై
నీ ఆలోచనలపై హక్కు
కేవలం నీదని తెలుసుకో
ప్రపంచంలోని మంచిని చూడు
సరైన attitude కలిగి ఉండు
చెడును చెడుగుడు ఆడు
పోలీస్ వారికీ సహకరించు
మంచితో దోస్తీ కట్టు
నిండు నూరేళ్లు బతుకు
నిండైన ఆరోగ్యం కలిగి ఉండు
తల్లి తండ్రులకు ఆనందం ఇవ్వు
తొడబుట్టిన వారికీ సంతోషం కలిగించు
సమాజానికి వెలుగులు పంచు
ప్రతి రోజు మంచి దినచర్యతో
పండుగ చేసుకో
చెడుకు దూరం
చెడుకు దూరం
మంచితో నేస్తం
పిల్లలారా పిల్లలారా
వేకువ జామున నిద్ర లేద్దాం
దేవునికి మొక్కుదాం
అరచేతులు చూసుకుందాం
పుస్తకం చదువుదాం
అమ్మ నాన్నలకు
నమస్కరిద్దాం
అవనికి పాదాలతో
ముద్దు పెడదాం
అలుపన్నది మరిచిపోదాం
వ్యాయామం చేద్దాం
కొంత సమయం నడుద్దాం
కడుపునిండా మంచినీళ్లు
తాగుదాం
కాలకుత్యాలుతీర్చుకుందాం
చన్నీళ్లతో
తలకు స్నానం చేద్దాం
ఉతికిన బట్టలు కట్టుకుందాం
తల దువ్వుకుందాం
సద్దన్నం తిందాం
గుడికి వెళ్దాం
బడికి వడివడిగా వెళ్దాం
చక్కగా చదువుకుందాం
గురువుకు దండం పెడదాం
సాయంకాలం
బడినుండి ఇంటికి
చేరుదాం
హోంవర్క్ శ్రద్దగా
చేసుకుందాం
కొంత సేపు ఆటలు
ఆడుదాం
అమ్మకు ఇంటి పనిలో
సాయం చేద్దాం
బడి ముచ్చట్లు
అమ్మతో పంచుకుందాం
వేడి వేడి అన్నం తిందాం
తాత చెప్పిన కతలు
విందాం
పెందలకాడ నిద్రపోదాం
ఇలా.......
చక్కని చదువు
చక్కని ఆరోగ్యం
చక్కని దినచర్య
కలిగివుందాం
అందరితో కలిసి ఉందాం
మంచి అలవాట్లు
మంచి అలవాట్లు
మంచి తనానికి మెట్లు
అభివృద్ధికి బాటలు
దేశానికీ మేలు
చదువ సంధ్యలకు పుట్టిల్లు
వ్యక్తిత్వ పెట్టని కోటలు
నవ సమాజ రహదార్లు
యువ సమాజ ప్రతీకలు
మణులు మాణిక్యాలు
కెంపులు ఇంపులు
మంచితనమే
మనిషితనం
మానవత్వం
మంచిని పెంచుదాం
చెడును తుంచుదాం
మంచి అలవాట్లు పెంచుకుందాం
మరణాన్ని దూరం చేసుకుందాం
మంచి సమాజం నిర్మిద్దాం
మంచి కొంచమైనా పెంచు
నేడు అదే అవసరమని భావించు
భుజం భుజం
నిజం నిజం తెలుపు
ప్రపంచపటం నుండి
చెడును తొలగించు
మంచి వారితో స్నేహం
జీవిత మాధుర్యానికి చిహ్నం
రండి ఓ బాల బాలికులారా
పుస్తకపఠనం
పుస్తక పఠనం
మస్తీస్క మధనం
ఆరు రుచుల పసందైన
విందుభోజనం
ప్రపంచ గవాక్షం
శివుని మూడో
నేత్రం పసిపాప తనం
నాన్న పెద్దరికం
అమ్మ ప్రసవ వేదనం
అమ్మతనం
గుమ్మతనం
ముద్దుగుమ్మతనం
మరో ప్రపంచం
మేధో ప్రపంచం
అమృతతనం
అమృతత్వం
అమరత్వం
ఆలోచనల పర్వం
ఇహ పర సర్వం
అద్భుత మానవ ఆవిష్కరం
ఉన్నత వ్యక్తిత్వం
ఆశయాలసాధనం
విజయపరంపరం
ఆత్మ విశ్వాసం
మానసిక ప్రశాంతం
శక్తి దాయకం యుక్తి దాయకం
అక్షర అనురాగం
మేధో మమకారం
జీవిత ధ్రువనక్షత్రం
గమనం గమ్యం
శతకోటి సమష్యల
అనంత కోటి పరిష్కారం
పిల్లలారా పిల్లలారా
రా రండి పుస్తకప్రేమికులవుదాం
జగతిన మన సమస్యలు
మటు మయం చేద్దాం
మంచి జగతికి బాటలు వేద్దాం
మంచిని పెంచుదాం
మమతను పంచుదాం
పిన్నలు పెద్దలకు
ఆదర్శమవుదాం
వ్యాయామం చేద్దాం
వ్యాయామం చేద్దాం
ఆరోగ్యాంగా ఉందాం
ఆయుస్సు పెంచుకుందాం
ఆనారోగ్యాన్ని మనదరికి
చేరనీకుండా ఉందాం
వ్యాయామం ఇచ్చు
శరీర సౌష్టవం
ఆసనాలు వేద్దాం
ఆరోగ్య శాసనం అవుదాం
యోగా చేద్దాం
మంచి యోగాన్ని పొందుదాం
వ్యాయామం అందం
ఆనందం
అమృత యోగం
అమర్చని అలంకారం
వ్యక్తిత్వం శక్తిత్వం
నిండుదనం కమ్మదనం
సుఖాలకు అమ్మదనం
"ఆరోగ్యకర శరీరమే
ఆరోగ్యకర మెదడు"
అని వివేకం చాటుదాం
వ్యాయామం జీవిత
ఆరోగ్య రాజ్యాంగం
రండి బాల బాలికులారా
చిన్న తనం నుండే
ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
వికాసం పొందుదాం
వ్యాయామం బతుకు
అనాయాస ప్రయాణం
మొక్కలను పెంచుదాం
మొక్కలను పెంచుదాం
కాలుష్యాన్ని తుంచుదాం
పర్యావర్ణాన్ని కాపాడుదాం
వాతావరణంలో
బొగ్గుపులుసు వాయువును
తగ్గిద్దాం
ఆమ్లజనని పెంచుదాం
పర్యావరణంలో
అతి వేడిని తగ్గిద్దాం
చల్లదనాన్ని పెంచుదాం
పచ్చదానాన్ని పెంచుదాం
మితిమీరిన ఎండను తగ్గిద్దాం
చల్లని గాలిని పెంచుదాం
వర్షపాతం పెంచుదాం
భూభాగంలో ఎడారి భాగాన్ని
తగ్గిద్దాం
భూభాగం సష్యశ్యామలం
చేద్దాం
పంటలను పెంచుదాం
కరవును నివారిద్దాం
మానవ, జంతు, పశు పక్షాదులకు
హాయినిద్దాం
"అడవుల పెంపు
అవనికి ఇంపు" అని చాటుదాం
మొక్కలను నాటండి
భూగోళాన్ని నందనవనం
చేయండి
నేర్చుకో బుజ్జాయి
నేర్చుకో బుజ్జాయి
జీవితం గెల్చుకో పాపాయి
క్రమ శిక్షణ, శ్రమ చీమను చూసి నేర్చుకో
విశ్వాసంగా ఉండడం
కుక్కను చూసి నేర్చుకో
భూకంపాలను పసిగట్టడం
జంతువులను చూసి నేర్చుకో
ప్రకృతి సంపదను అవసరం మేరకు వాడుక
ఇతర జీవరాశిని చూసి నేర్చొకో
ఎగరడం పక్షిని చూసి నేర్చుకో
ఈదడం చేపను చూసి నేర్చుకో
పరోపకారం చెట్టును చూసి నేర్చుకో
రాజసం మృగరాజు ను చూసి నేర్చుకో
సంగీత జ్ఞానం కోయిలను చూసి నేర్చుకో
కలిసికట్టుగా జీవించడం కాకిని చూసి నేర్చుకో
పంచుకుని భుజించడం కాకిని చూసి నేర్చుకో
ఏమీ దాచుకోకుండా దానం చేయడం
మేఘాన్ని చూసి నేర్చుకో
సంపూర్ణ శక్తిని కలిగి ఉండడం సూర్యుణ్ణి చూసి నేర్చుకో
ప్రపంచానికి వెలుగునివ్వడం ఆదిత్యుని చూసి నేర్చుకో
చల్లని వెన్నెల ఇవ్వడం చందమామని చూసి నేర్చుకో
విశ్వానికి ఆహారం ఇవ్వడం మొక్కను చూసి నేర్చుకో
చిగురించడం వసంతాన్ని చూసి నేర్చుకో
అపకారికి ఉపకారం చేయడం చెట్టును చూసి నేర్చుకో
ఓర్పు సహనం భూమాతను చూసి నేర్చుకో
పవిత్రంగా ఉండడం అగ్నిని చూసి నేర్చుకో
ఎంత సంపద ఉన్న గర్వం లేకపోవడం
సముద్రాన్ని చూసి నేర్చుకో
జగత్తును సేద తీర్చడం గాలిని చూసి నేర్చుకో
ప్రకృతిని చూసి సమయపాలన నేర్చుకో
ఋతువులను చూసి ప్రకృతి మార్పులు నేర్చుకో
నేర్చుకో బుజ్జాయి
నేర్చుకున్న మంచి విషయాలు
ఆచరించు పాపాయి
బతుకు బంగారం చేసుకో బుజ్జాయి
నీళ్లు తాగుదాము
నీళ్లు తాగుదాము
ఆరోగ్యాంగా ఉందాం
శరీర రక్తప్రసరణను
సరి చేసుకుందాం
ఏ విషయానికి
నీళ్లు నమలడం
మానేద్దాం
నీళ్లు తాగుదాం
ప్రతి సమస్య పరిష్కారం
మంచి నీళ్ల ప్రాయం
చేసేద్దాం
నీళ్లు తాగుదాం
నీరసాన్ని తగ్గించుకుందాం
నీళ్లు తాగుదాం
అందాన్ని పెంచుకుందాం
చదువును పెంచుకుందాం
ఆయుష్షును పెంచుకుందాం
నీళ్లు తాగుదాం
అనారోగ్య సమస్యల నుండి
బయటపడదాం
ఆరోగ్య భారతాన్ని నిర్మించిదాం
నీళ్లు తాగుదాం
ఆరోగ్యానికి పునాదులు
వేసుకుందాం
బడి ఈడు పిల్లలకు
నీళ్లు ఎక్కువ తాగడం
నేర్పిద్దాం
చదువు
చదువు
జీవిత ఆదరువు
జీవితాన్ని చదువు
బతుకు కల్పతరువు
బతుకు కల్పతెరువు
జ్ఞాన కొలువు
విజ్ఞాన నెలవు
బతుకు పందెం గెలువు
చీకటికి చరుపు
మంచికి మెరుపు
వెలుగుల వేకువు
చదువు
మధ్యతరగతి సంజీవిని
పలు సుగుణాల గని
భవిష్యత్తు కని
ముందుకు నడవని
అవకాశాలఅవని
చెడును కాదని
మంచిని పెంచని
బతుకు విలువని
లోకమంతా.......
ఎలుగెత్తి చాటని
ఆశల ఆకాశమని
చదువుంటే మనీ మనీ
***

-రాళ్లబండి సంగం నాయుడు





Comments