top of page
Original.png

గుండె నిబ్బరం కలిగిన స్త్రీ మూర్తి - పార్ట్ 2

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #గుండెనిబ్బరంకలిగినస్త్రీమూర్తి, #GundeNibbaramKaliginaSthreeMurthy, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Gunde Nibbaram Kaligina Sthree Murthy - Part 2/2 - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 06/02/2026

గుండె నిబ్బరం కలిగిన స్త్రీ మూర్తి - పార్ట్ 2/2 - పెద్దకథ మొదటి భాగం

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

   

జరిగిన కథ:

తల్లిదండ్రుల కోసం పెళ్లిని వాయిదా వేసుకుంటుంది కమలిని.

కుటుంబ బాధ్యతలు తీరాక పెళ్లి చేసుకుంటుంది.

భర్త, అత్తమామల అభిమానాన్ని పొందుతుంది.



ఇక గుండె నిబ్బరం కలిగిన స్త్రీ మూర్తి: పెద్ద కథ చివరి భాగం చదవండి.


ఆరోజు ఆదివారం


కమలిని, ప్రద్యుమ్న ఇద్దరూ బీచ్‌లో చాలాసేపు గడిపి, అక్కడే ఉన్న ఫైబర్ బెంచ్‌ మీద రిలాక్స్‌గా కూర్చున్నారు.


''మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మా అమ్మానాన్నలది పెద్ద వయసు కదా. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అమ్మానాన్నను ఇక్కడికి తీసుకొచ్చేద్దామనుకుంటున్నాను.''


''కమలిని... ఇదే విషయం నీకు పెళ్లికి ముందే ఫోన్ చేసి చెబుదాం అనుకున్నాను.''


''మీరు ఇలాగే అంటారని నాకు తెలుసు. వద్దు లేండి. వాళ్ల సపర్యలలో పడి, ప్రియాతిప్రియంగా చూసుకునే నా భర్త గారికి అన్యాయం చేసినదాన్నవుతాను. ఏదో అన్నాను కానీ, అలా తీసుకురావడం నాకూ ఇష్టం లేదు.''


''మా అమ్మానాన్నను నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావు. అందుకనే నువ్వంటే నాకు వల్లమాలిన అభిమానమోయ్. నేను కూడా నిన్ను ఒక విషయం అడగాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఏం లేదు... మన పెళ్లి అయ్యే ముందు నువ్వు జాబ్ చేసే దానివి కదా. అలా పోగేసిన డబ్బుతో అక్కడ నువ్వు ఒక ఇల్లు కొన్నట్టు నాకు తెలిసింది. ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చేయొచ్చు కదా. ఇక్కడ మనకు బోలెడన్ని ఖర్చులు ఉంటాయి.''


''అదేంటండీ? ఆ ఇల్లు మా అమ్మానాన్నది!''


''అయినా కొన్నది నువ్వే కదా? నీ కష్టం నాకు సంబంధించిందే కదా?''


''ఇలా మాట్లాడుతారనుకోలేదు. ఇంటికి వెళ్లిపోదాం, రండి!''


''నువ్వు రాని క్రితం నేను రెండు ఇళ్లు సంపాదించాను. అయినా వాటి మీద నీకు ఇప్పుడు హక్కు ఉంటుంది. అలాగే నువ్వు సంపాదించింది నేను అడగడంలో తప్పేముంది?''


అంతే! కమలిని తమ కారు ఉన్నచోటికి స్పీడుగా వెళ్లిపోయి కారులో కూర్చుంది.-----ఓ నెల రోజుల పాటు ఆ భార్యాభర్తల మధ్య మాటలు, మానవ సంబంధాలు లేకుండా పోయాయి. మరో కొన్ని నెలలు ముభావంగా, అతి భయంకరంగా గడిపింది తన భర్తతో కమలిని.


''అత్తయ్యగారు, మామయ్యగారు యాత్రకు వెళ్లారు కదా. నేను ఒకసారి పుట్టింటికి వెళ్లి రావాలనుకుంటున్నానండి.''


''అలాగే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేను చెప్పిన పని పూర్తి చేసుకునే రావాలి.''


''అలా జరగదు!''


''అలా కాకపోతే, నీతో నాకు పనిలేదు. ఈ రంగరాజపురం పేరు నువ్వు మరిచిపోవచ్చు. చాలామంది కంటే ఎక్కువ రోజులు కాపురం చేశాం కదా. విడాకులు తీసుకుంటే నువ్వు అప్పుడప్పుడు అంటున్నట్టు ఒక పని అయిపోతుంది. కాగితాలు తయారు చేయించి సిద్ధంగా ఉంచాను. వీటి మీద సంతకం పెట్టి నువ్వు వెళ్లిపోవచ్చు.''


అక్కడే నిలబడి కమలిని ఎక్కి ఎక్కి చాలాసేపు ఏడ్చింది. ధైర్యం తెచ్చుకుని కళ్లు తుడుచుకుని సంతకాలు పెట్టింది. అప్పటికే సర్దుకుని ఉంచిన బ్యాగ్ భుజానికి తగిలించుకుని ఒక్క నిమిషం ఆగకుండా బయటపడి, గబగబా రోడ్డు దాటి వెళ్లి ఆటో ఎక్కేసింది.-----రైల్వే స్టేషన్‌కు వచ్చిన కమలిని, రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో అక్కడున్న సిమెంట్ బెంచ్‌ మీద కూర్చుంది. తన భుజానికి ఉన్న బ్యాగులో ఫోన్ రింగ్ అయింది.


''హలో... విద్యుల్లతా! సడన్‌గా నాకు ఫోన్ చేశావ్ ఏంటి చాన్నాళ్లకి? ఏంటి విషయం? శుభవార్త చెప్తావా?''


''కమలిని... నీతో కలిపి మన నలుగురు ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాను ఇప్పటివరకు. ఈరోజు నేను సెల్ఫీ వీడియో తీసుకొని మీకందరికీ షేర్ చేసి చచ్చిపోదాం అనుకుంటున్నానే,'' గట్టిగా ఏడుస్తూ చెప్పింది అవతల కంఠం, కమలిని క్లాస్‌మేట్ విద్యుల్లత.


''ఏడ్చావ్ కానీ, విషయం ఏంటో చెప్పు!''


''మా ఆయనకు నేను నచ్చలేదట. ఇంకొక పెళ్లి చేసుకుంటాడట. రోజు కొడుతున్నాడు, బెదిరిస్తున్నాడు!''


''ఓస్! ఇంతే కదా? దీనికి చచ్చిపోతావా, పిరికిదానా? అలాగైతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండాలి. ఈ రోజే మా ఆయన కూడా నాకు విడాకులు ఇచ్చాడు. నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను.''


''అవునా! ఎలా తట్టుకుంటున్నావే, బాబు? చావడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదే. అయితే మనిద్దరం కలిసి ఒకేసారి చచ్చిపోదాం!''


''ఛీ, నోరు మూసుకో! మన తల్లిదండ్రుల దగ్గర మనకు దొరికిన స్వేచ్ఛతో, ఈ సామాజిక మాధ్యమాల వ్యవస్థ వలలో పడి మనలో చాలామంది ఫ్రెండ్స్ నీలాగే పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. ఏ వ్యవస్థలో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడును వదిలిపెట్టి మంచిని తీసుకోవాలి. అలా నేను చేయబట్టి, నాలో పిరికితనం అంతాపోయి ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను. నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. నీది చాలా చిన్న సమస్య. మా ఊరు పక్కనే కదా మీ ఊరు. తొందరలో కలుసుకుందాం. కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. అంతవరకు కాస్త నీ నిర్ణయాన్ని 'పోస్ట్ పోన్' చేయవే, పిచ్చిదానా!'' కమలిని తన స్నేహితురాలికి ధైర్యం చెప్పింది.


''సరే, అలాగే చేస్తానే. నీతో మాట్లాడాక నాకు ధైర్యం వచ్చింది,'' అవతల కంఠం విద్యుల్లత. వెంటనే కమలిని సెల్ ఆఫ్ చేసి తన భుజానికి ఉన్న బ్యాగులో పెట్టుకుని, తను ఎక్కవలసిన ట్రైన్ రావడంతో ఎక్కేసి కూర్చుంది.-----''ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అమ్మాయిలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, నాన్న. నేను మన ఇంటికి వచ్చి ఆరు నెలలు అయింది. అమ్మా, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నారు?'' తల్లిదండ్రుల మధ్య కూర్చుని అడిగింది కమలిని.


చాలాసేపు నవ్వుకున్నారు ఇద్దరూ. ''మాకు నిజంగా అబ్బాయి పుట్టి ఉంటే చాలా బాధపడేవాళ్లం, తల్లి. నువ్వు పుట్టావు కనుక మహా ఆనందంగా ఉంది. మేమిద్దరం నువ్వు పాల్గొనే 'గేమ్'ని చూసి ఎంజాయ్ చేస్తున్నామమ్మా. ఏమాత్రం బాధపడడం లేదు. అసలు ఏమీ ఆలోచించడం లేదు!'' నవ్వుతూ కూతుర్ని దీవిస్తూ అన్నారు ఫన్నగభూషణరావు, ఖర్జూరమ్మ.


''గేమ్‌లో పాల్గొని గెలవడానికి నేను ఎంతదాన్ని, నాన్న? కాలచక్రం ఉంటుంది కదా... అదే ఆడిస్తుంది. దానికి జీవిత గమనాలను మార్చడానికి సమయం ఒక క్షణం పట్టవచ్చు, పది సంవత్సరాలు పట్టవచ్చు. ఆ కాలచక్ర మహిమల్ని ఆగి, చూసే ఓర్పు, నేర్పు లేకే, నేటి అమ్మాయిల్లో చాలామంది జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు లేదా పెడదారిలో పడుతున్నారు.


కాలం ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూద్దాం.


సరేనా? అమ్మా... మరి నువ్వేం మాట్లాడవేంటి?''


తల్లి వైపు చూస్తూ నవ్వుతూ అడిగింది కమలిని.


''నువ్వు అన్న కాలచక్రం గురించి నేను నాలుగు ముక్కలు చెబుతానమ్మా,'' అంది ఖర్జూరమ్మ.


''చెప్పు, చెప్పమ్మా!''


''కాలం నీ ఊహకందని మాయాజాలం. దేనికీ తొందర పడకు. ఏం జరిగినా బాధపడకు. ఇలా జరుగుతుందేమిటి అని అసలు కంగారుపడకు. నీకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని, బాధలను ఓర్పుతో భరిస్తే నువ్వు కలలో కూడా ఊహించని ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరగవచ్చు. ఏదో ఒక రోజు ఉదయించే రేపటి సూర్యుడిలా నీ మోముపై చిరునవ్వు విరబూయక మానదు. కాలం చాలా చిత్రమైనది, విచిత్రమైనది,'' గడగడ చెప్పేసింది ఖర్జూరమ్మ.


''అమ్మో, అమ్మో... ఖర్జూరమ్మ గారికి ఈ మధ్య చాలా తెలివితేటలు పెరిగిపోతున్నాయే! ఇంతకీ ఇది ఎక్కడ కాపీ కొట్టి బట్టీ పట్టావమ్మా? ఈ కవిత్వం ఎక్కడో విన్నట్టుంది!''


''మొన్న నీ పాత పుస్తకాలు దులుపుతుంటే, నువ్వు రాసి పెట్టుకున్న ఈ కవిత్వం కాగితం బయటపడింది,'' కాగితం చూపించి నవ్వుతూ అంది ఖర్జూరమ్మ.


''ఈ మధ్య నువ్వు ఇచ్చిన ప్రోత్సాహంతో మీ అమ్మలో చాలా 'జనరల్ నాలెడ్జ్' పెరిగిందమ్మా. ఈ మార్పు నీ వల్లే. అలా పుట్టినింట్లో తల్లిదండ్రుల మన్ననలు పొందిన నువ్వు మెట్టినింట్లో సమస్యల మీద తప్పకుండా విజయం సాధించగలవు!'' ఆనందంగా అన్నాడు కమలిని తండ్రి.-----సమయ గర్భంలో మరికొంత కాలం గడిచింది.


తన అత్తవారి ఊర్లో ఉన్న వాళ్ల ద్వారా, తన భర్త ప్రద్యుమ్న తాగుడుకు అలవాటు పడినట్టు, ఆ మైకంలో కారు నడుపుతూ ఈ మధ్యనే ఒక 'యాక్సిడెంట్' చేసినట్టు, ఆ వ్యక్తి చనిపోయినట్టు, ఆ కేసు గురించి సుమారు 30 లక్షలు ఖర్చుపెట్టినట్టు, ప్రస్తుతం ప్రద్యుమ్న జైలు జీవితం గడుపుతున్నట్టు, తన అత్తమామలకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయినట్టు చాలా విషయాలు తెలుసుకుంది.


ప్రశాంతంగా కూర్చుని బాగా ఆలోచించింది కమలిని. ఆ తర్వాత... ఒక రోజు కమలిని, తను అత్తవారింటి దగ్గర నుండి వచ్చినప్పుడు తెచ్చుకున్న బ్యాగ్ భుజానికి తగిలించుకొని తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం పెట్టింది.


''తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛతో నేటి కాలం అమ్మాయిలు అధోగతి పాలు కావచ్చు... అద్భుత విజయాలు కూడా సాధించవచ్చు... అన్న విషయం నిరూపించిన దేవుడిచ్చిన కూతురువమ్మా నువ్వు. నిన్ను చూసి ఆడవాళ్లు ధైర్యంతో బ్రతకగలిగే శక్తిని పొందడం ఖాయం!'' అంటూ ఆ తల్లిదండ్రులు కమలినిని పైకి లేవదీసి నిండుమనసుతో దీవించారు.


రైల్వే స్టేషన్‌కు వెళ్లి కమలిని టికెట్ తీసుకుని బోగీలో కూర్చుంది. రైలు స్పీడు అందుకొని వేగంగా దూసుకుపోతోంది రంగరాజపురం వైపు.


సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


bottom of page