కచదేవయాని - పార్ట్ 50
- T. V. L. Gayathri

- 5 hours ago
- 5 min read

Kachadevayani - Part 50 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 13/04/2026
కచదేవయాని - పార్ట్ 50 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. దేవయాని, కత్తి తీసుకొని ఊడల మర్రి వైపు పరుగెడుతుంది.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని ధారావాహిక యాభయ్యవ భాగం చదవండి.
ప్రతీకారం… శక్తి… ధైర్యం…ఈ మూడు కలిసినప్పుడు ఏమవుతుంది?
“కచ దేవయాని – 50” భాగంలో దేవయాని తన శక్తిని ప్రదర్శిస్తే, శర్మిష్ఠ తన ధైర్యంతో ప్రతిస్పందిస్తుంది. ఈ ఘట్టం చివరికి ఒక షాకింగ్ మలుపుతో ముగుస్తుంది.
“మణి శక్తి కూడా కాపాడలేకపోయింది!”
ఎవరిని? ఎందుకు కాపాడలేక పోయింది ? వివరాలు టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని యాభయ్యవ భాగంలో చదవండి..
దేవయాని పరుగెత్తుతోంది. ఆమె ఒంటిమీద చిన్న అంగవస్త్రం మాత్రమే ఉంది. అర్థనగ్నంగా ఉన్న ఆమె దేహం నుండి జారుతున్న నీటి చుక్కలపై సూర్యరశ్మి పడటంతో తళతళా మెరుస్తున్నాయి. ఆమె నిడుపాటి కురులు బరువుగా పిరుదుల మీద కదులుతున్నాయి. దూరంగా మఱ్ఱి చెట్టు కనిపిస్తోంది. ఆమెకు దగ్గరగా వచ్చింది మదనిక.
ఒక్కసారి ఆగి వెనక్కు చూసింది దేవయాని.
మదనిక కూడా దేవయానిని చూసింది. వెనుక శర్మిష్ఠ కూడా వస్తోంది.
"ఈ దారి నుండే వస్తాడు కదా! అతడికి ఆఖరు రోజిది!" అంది దేవయాని.
"హు! అతడు వీరాధి వీరుడు!... నువ్వేం చెయ్యగలవు దేవయానీ! మూర్ఖత్వంతో మిడిసి పడుతున్నావు!" ఈసడింపుగా జవాబిచ్చింది శర్మిష్ఠ.
"చూస్తావా!" అంటూ మెడలోంచి మణిని తీసుకొని మదనిక వైపు పెట్టింది.
అంతే!
మణి నుండి ఎర్రటి వెలుగు వచ్చి మదనికను తాకిందో లేదో, మదనిక ఉన్నది ఉన్నట్లుగా కుప్పకూలి పోయింది.
శర్మిష్ఠ భయంతో
"మదనికా!... మదనికా!..." అంటూ మదనికను కుదుపుతోంది.
మదనికలో చలనం లేదు.
మణికున్న శక్తిని చూస్తున్న దేవయానికి సంతోషం వేసింది.
ఇంతలో రథంలో కణిక, నారాచితో పాటు ఇంకో ఇద్దరు యోధురాళ్లు వచ్చారు. వాళ్ళు బల్లేలు పట్టుకొని ఎగిరి కిందకు దూకారు.
అప్రమత్తం అయింది దేవయాని.
"అడుగు ముందుకు వేశారో, మీకు కూడా మదనికకు పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త!" అంటూ ఇంకొంచెం దూరం వెళ్ళింది.
"నారాచీ! చూడు!... మదనిక!..." అంటూ ఇంకా మదనికను పట్టుకొని ఊపుతోంది శర్మిష్ఠ.
మదనిక నాడి పట్టుకొని చూసింది నారాచి.
"నాడి పని చేస్తుంది, రాజకుమారీ! భయం లేదు! ఇది మూర్ఛ మాత్రమే! ముందు శత్రువు ప్రకోపించకుండా చూడాలి!" అంటూ ప్రక్కనున్న యోధురాలితో
"కేతకీ! నువ్వు వెళ్లి దేవయానిని పట్టుకొని రా!" అని ఆజ్ఞాపించి మదనికను ఎత్తుకొని రథంలో కూర్చోబెట్టింది.
నారాచి.
కేతకి సంధించిన బాణంలాగా దేవయాని వైపుకు దూసుకొని వెళ్ళింది.
ప్రమాదాన్ని ఊహించిన దేవయాని మణిని కేతకి వైపుకు చూపించింది. అంతే, కేతకి దబ్బుమని కిందపడింది.
నవ్వు వచ్చింది దేవయానికి.
"శర్మిష్ఠా! నువ్వు ఎంత మంది యోధురాళ్ళను పంపించినా, వాళ్లకు కూడా ఇదే గతి పడుతుంది! నువ్వూ, నీ వాళ్ళు నన్ను గెలవలేరు!" అంటూ మఱ్ఱి చెట్టు దగ్గరికి వెళ్ళసాగింది దేవయాని.
ఆలస్యం చెయ్యలేదు శర్మిష్ఠ. మణి వెలుగు తనపైన పడకుండా చీరతో ముఖాన్ని కప్పుకొని అతి వేగంగా దేవయాని దగ్గరకు వస్తూ ఉంది
ఇంత వేగంగా శర్మిష్ఠ వస్తుందని ఊహించలేదు దేవయాని.
వెంటనే తన అంగవస్త్రంలో ఉన్న చురకత్తిని పట్టుకొని, దగ్గరగా వచ్చిన శర్మిష్ఠ మెడ పట్టుకొని, ఆమె కంఠం మీద పెట్టి, "నారాచీ! అడుగు ముందుకు వేశావో, నీ రాజకుమారి దక్కదు... వెనక్కు వెళ్ళు!" అంటూ శర్మిష్ఠను పట్టుకొని రహదారి నుండి కొంచెం వెనక్కు వెళ్లి, అక్కడ ఉన్న గట్టు మీదకు ఎక్కింది దేవయాని.
అక్కడ ఒక పాడు బడిన పెద్ద బావి ఉంది. అందులో నీళ్లు లేవు. లోపల పెద్ద అడవి తీగలు నిండా పెరిగి ఉన్నాయి. పోయిన సంవత్సరం కురిసిన వానలకు అక్కడంతా మట్టి మేట వేయటం వలన, అక్కడ బావి ఒకటి ఉన్నట్లు క్రొత్త వాళ్లకు తెలియదు. ఆ ప్రాంతమంతా నారాచికి కొట్టిన పిండి. దేవయాని శర్మిష్ఠను పట్టుకుని బావి గట్టు మీదకు ఎక్కిందని నారాచి గ్రహించింది.
ఏ మాత్రం తొందర పడినా, ఇద్దరూ బావిలో పడటం ఖాయం!
నారాచి శర్మిష్ఠ వైపు చూసింది.
నారాచి కనులలో భావం అర్ధం అయింది శర్మిష్ఠకు.
నారాచి కనులలోని భావం అర్థం అయింది శర్మిష్ఠకు.
శక్తినంతా మోచేతిలోకి తెచ్చుకొని, దేవయాని డొక్కలో బలంగా ఒక్క పోటు పొడిచింది శర్మిష్ఠ.
"అమ్మా!" అంటూ శర్మిష్ఠను వదిలేసింది దేవయాని. ఆమె చేతిలోని కత్తి జారి కిందపడి పోయింది. నారాచి ఇంక ఆలస్యం చెయ్యలేదు.
వెంటనే శర్మిష్ఠను గట్టుమీద నుండి కిందకు ఒక్క లాగు లాగి, ఆ పైన దేవయాని మీద లంఘించి, ఆమె మెడలో మణిని కట్టిన వస్త్రాన్ని కత్తితో తెంపివేసి, దేవయానిని బావిలోకి ఒక్క తోపు తోసింది.
"అమ్మా!" అంటూ బావిలోకి పడిపోయింది దేవయాని.
తన చేతిలోని మణిని విసిరి నేల మీదకు విసిరి కొట్టింది నారాచి. భూమిని తాకగానే ఎర్రటి మణి కాస్తా నల్లగా బొగ్గులాగా అయింది.
"పద, రాజకుమారీ! ఆ దుష్టురాలు బయటికి రావటం కల్ల. పోదాం పద!" అంటూ శర్మిష్ఠను తీసుకొని నారాచి కేతకి దగ్గరికి వచ్చింది. కణిక, నారాచి కలిసి కేతకిని రథం మీదకు ఎక్కించారు.
ఆకాశం వైపు చూసింది నారాచి.
ఆకాశం నిర్మలంగా ఉంది.
సూర్యుడు వెలుగుతూ కనిపిస్తున్నాడు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 51 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |






Comments