top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 78

7 hours ago
8 min read

కచ దేవయాని 78వ భాగంలో శర్మిష్ఠను పోలిన ఉత్పలను వైద్యశాలలో యయాతికి చూపిస్తూ రహస్య ప్రణాళికను వివరిస్తున్న కచుడు.
శర్మిష్ఠ విముక్తికి మార్గం చూపిన ఉత్పల రూపసామ్యం – కచుడి రహస్య పథకం.

Kachadevayani - Part 78 - Telugu Mythological Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 78 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 20/11/2026


శస్త్రచికిత్స ద్వారా ఉత్పలను శర్మిష్ఠలా మార్చి, ఆమెకు శ్రీముఖుడితో వివాహం జరిపిస్తే, అసలైన శర్మిష్ఠకు దాస్యం నుంచి విముక్తి కల్పించవచ్చని కచుడు సూచించాడు.

కచుడి ఈ సాహసోపేతమైన పథకం విజయవంతమవుతుందా? దేవయానికి నిజం తెలియకుండా యయాతి శర్మిష్ఠను వివాహం చేసుకోగలడా?

టి. వి. యెల్. గాయత్రి గారి ఆసక్తికరమైన పౌరాణిక ధారావాహిక కచ దేవయాని – 78వ భాగం చదవండి.


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.  శర్మిష్ఠ  ప్రేమించింది  యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని.

తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని  సహాయం  కోసం  దేవయానిని వివాహం చేసుకుంటాడు యయాతి. రహస్య మార్గం ద్వారా శర్మిష్ఠను కలుస్తూ ఉంటాడు.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 69 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 70 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 71 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 72 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 73 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 74 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 75 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 76 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 77 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కచదేవయాని - పార్ట్ 78 | మాయా శర్మిష్ఠ కోసం కచుడి ప్రణాళిక


వానలు పడుతున్నాయి.


యయాతి రాచకార్యాలలో నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో ఒక విషాదవార్త తెలిసింది.


రాజధానికి యాభై క్రోసుల దూరంలో ఉన్న వింధ్యగిరి పర్వత గుహలో మహాదేవుని దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వర్షాలకు కొండచరియలు విరిగి పడ్డాయి. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు ఎక్కువ మంది ఉన్నారు.


రాళ్లు పడి గుహకు వెళ్లే దారి దాదాపుగా మూసుకుపోయింది. సైనికులు సహాయచర్యలు చేపట్టారు.


యయాతి హుటాహుటిన తన సహచరులతో విమానంలో సంఘటనా స్థలానికి వెళ్లాడు.


విమానం నుంచి సైనికులు తాళ్ల సహాయంతో గుహ ద్వారం దగ్గరికి దిగి, క్షతగాత్రులను విమానంలో అరుణకేశి మహర్షి వైద్యశాలకు తరలిస్తున్నారు.


ఇంతలో కచుడు, సారంగదేవుడు చెరొక విమానంలో అక్కడికి వచ్చారు.


అందరినీ వేగంగా తరలిస్తున్నారు.


ఆ రోజంతా యయాతి, అతడి మిత్రులు వింధ్యగిరి దగ్గరే ఉన్నారు. రాత్రికి అందరినీ తరలించే కార్యక్రమం పూర్తయింది. అందరూ వైద్యశాలకు చేరుకున్నారు.


ఆ రాత్రి అక్కడే బస చేశాడు యయాతి.


కచుడు, సారంగదేవుడు క్షతగాత్రులకు వైద్యం చేస్తూ ఉన్నారు.


తెల్లవారింది. కచుడు తెల్లవార్లూ మేలుకొని ఉన్నాడు.


"నువ్వు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకో కచా! మధ్యాహ్నానికి మా సామంత రాజ్యాల నుంచి వైద్యులు వస్తారు" అన్నాడు యయాతి.


"మేలుకొని ఉండడం మాకు అలవాటే!" అన్నాడు కచుడు నవ్వుతూ.


మధ్యాహ్నానికి మరికొంతమంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు. మిత్రులకు కాస్త తీరిక దొరికింది.


అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది శరావతి. అందరూ భోజనాలు చేస్తున్నారు.


"ఇప్పుడు చెప్పు! ఎలా ఉన్నావు? రాజకుమారి పరిస్థితి ఏమిటి?" అడిగాడు కచుడు.


"దాసీగానే ఉంది. ఎప్పటికి విముక్తి కలుగుతుందో తెలియడం లేదు. బాధగా ఉంది. రహస్యంగా... ఎంతకాలం? దేవయానిని ఇంకో ఐదు నెలలు మాత్రమే దూరంగా పెట్టగలను. తర్వాత కాపురం చేసి పిల్లల్ని కనడం... నా శర్మిష్ఠ మాత్రం జీవితాంతం దాసీగా బతకాలి. తల్చుకుంటే బాధగా ఉంది" భారంగా చెప్పాడు యయాతి.


"మరీ అంత నిరాశపడకు! ఏదో ఒక మార్గం దొరుకుతుంది" ఓదార్పుగా చెప్పాడు కచుడు.


"విధి మా మీద ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రతాపాన్ని చూపిస్తోంది... మహారాణి హోదాలో గౌరవాన్ని అందుకోవలసిన శర్మిష్ఠ ఈ రోజు దాసీగా దీనమైన స్థితిలో ఉంది. నేను ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత!" అంటూ తల విదిల్చాడు యయాతి.


"అధైర్యపడకు మిత్రమా! చదువుకున్న వాడివి. బేలతనం కూడదు. ఏదైనా ఆలోచిద్దాం! కావాలంటే నా దేవమిత్రుల సహాయం తీసుకుందాం!"


కచుడి మాటలకు చిన్నగా నవ్వాడు యయాతి.


"మీ దేవమిత్రులు దానవరాజు కూతురుకు సహాయం చేస్తారా?"


మాట్లాడలేదు కచుడు.


ఆ సాయంత్రానికి రాజధానికి చేరుకున్నాడు యయాతి.


నాలుగు రోజుల తర్వాత వైద్యశాల నుంచి ఒక దూత రాజధానికి వచ్చి యయాతిని కలుసుకున్నాడు.


"కచదేవులవారు మిమ్మల్ని వెంటనే వైద్యశాలకు రమ్మన్నారు" అని చెప్పాడు.


వెంటనే బయలుదేరి వైద్యశాలకు చేరుకున్నాడు యయాతి.


వైద్యశాల ప్రధాన ద్వారం దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి యయాతిని కౌగలించుకున్నాడు కచుడు.


"ఏమిటి విషయం?" అని విస్మయంగా అడిగాడు యయాతి.


"లోపలికి రా! చూపిస్తాను!" అంటూ యయాతిని వైద్యశాలలోకి తీసుకెళ్లాడు కచుడు.


అక్కడ క్షతగాత్రులందరూ ఉన్నారు.


తర్వాత యయాతిని విడిగా ఉన్న ఒక పర్ణశాలలోకి తీసుకెళ్లాడు.


అక్కడ ఒక అమ్మాయి పడుకొని ఉంది. ఆమె చేతులకు కట్లు కట్టి ఉన్నాయి. పక్కనే ఇద్దరు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు.


యయాతిని చూడగానే వాళ్లు లేచి నిలబడ్డారు.


"నిద్రపోవడానికి మందు ఇచ్చాము. అమ్మాయి లేచిన తర్వాత కాస్త తేలికైన ఆహారం పెట్టండి!" అని వాళ్లతో అన్నాడు కచుడు.


వాళ్లు తలూపారు.


ఇద్దరూ బయటికి వచ్చారు.


"ఆ అమ్మాయిని సరిగ్గా చూశావా?" అని కచుడు మెల్లగా అడిగాడు.


యయాతికి అర్థం కాలేదు.


"ఆ అమ్మాయి శర్మిష్ఠ రాజకుమారిలా ఉంది."


యయాతి మరింత అయోమయానికి గురయ్యాడు.


మళ్లీ గదిలోకి వెళ్లారు. ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు యయాతి.


నిజమే! కొంచెం శర్మిష్ఠలాగే ఉందన్నది వాస్తవం.


"నువ్వేమి ఆలోచిస్తున్నావు?" అని అడిగాడు యయాతి.


"గడ్డం దగ్గర, పైపెదవి దగ్గర శస్త్రచికిత్సలు చేస్తే అచ్చం శర్మిష్ఠలాగా కనిపిస్తుంది."


"పూర్తిగా చెప్పు కచా!"


"ఈ అమ్మాయి పేరు ఉత్పల. తల్లిదండ్రులు ముని సంఘానికి చెందినవారు. ఈమెకు వివాహం నిశ్చయమైంది. వరుడు కూడా ముని కుమారుడే. అతని పేరు శ్రీముఖుడు. శస్త్రచికిత్స ద్వారా ఈమెను శర్మిష్ఠలాగా తయారు చేయగలను.

దేవయానికి తెలిసేలా మాయా శర్మిష్ఠకు శ్రీముఖుడితో వివాహం జరిపించు. అసలైన రాజకుమారిని మాత్రం నువ్వు రహస్యంగా వివాహం చేసుకో!"


"పథకం బాగానే ఉంది. ఎక్కడా అనుమానం రాకుండా చూసుకోవాలి."


"మొత్తం నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది."


"శస్త్రచికిత్స పూర్తయి, ఈ అమ్మాయి కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది?"


"నెల నుంచి నెలన్నర వరకు పడుతుంది. ఈలోగా రాజకుమారిలా నడవడం నేర్పించాలి. సాధ్యమైనంతవరకు ఈమె గొంతు విప్పకుండా చూసుకోవాలి. సమయాన్ని సరిగ్గా లెక్కవేసుకుని కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి."


తల పంకించాడు యయాతి.


ప్రణాళికాబద్ధంగా వ్యవహరించగలిగితే శర్మిష్ఠ తన సొంతమవుతుంది. ఆమెకు దాస్యం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.


రాజధానికి చేరుకున్నాడు యయాతి.


శర్మిష్ఠతో పాటు తన తల్లిదండ్రులకు కూడా విషయాన్ని వివరించాడు.


"ఇది చాలా గోప్యమైన విషయం. ఉత్పల వివాహం పూర్తయిన తర్వాత ఆ ముని సంఘానికి చెందినవాళ్లు ఇక్కడెవరూ ఉండకూడదు. వాళ్లను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలి" అన్నాడు నహుషుడు.


"ఈ రహస్యం పూర్తిగా నమ్మకమైనవారికే తెలియాలి. ముందు దానవరాజును పిలిపిద్దాం!" అన్నాడు యయాతి.


మాయా శర్మిష్ఠ గురించే ముగ్గురూ చర్చించుకుంటున్నారు.


ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక - 79 వ భాగం త్వరలో మీ ముందుకు రానుంది. 


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 79 త్వరలో

===============================================



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y





T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T. V. L. Gayathri

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు టి. వి. యెల్. గాయత్రి. పూర్తి పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి. మా పుట్టిల్లు నెల్లూరు జిల్లాలోని మొగలిచర్ల గ్రామం.నేను గృహిణిని. మా అమ్మగారు ప్రముఖ రచయిత్రి పవని నిర్మల ప్రభావతమ్మ గారు. మా నాన్నగారు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహ స్వామి మరియు మొగలిచర్ల దత్తాత్రేయస్వామి దేవస్థానములకు ధర్మకర్తగా ఉండేవారు.


నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం అలవాటు. అలా చదువుతూ, పద్యాలు కథలు వ్రాద్దామని అనుకున్నాను.

2009 లో పునాకు వచ్చాను.


2019 లో శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ గారి 'అనంతఛందస్సు' అనే పద్యశిక్షణా సమూహములో చేరి పద్యాలు వ్రాయడం నేర్చుకొని వ్రాస్తున్నాను.

అలా 2019 నుండి పద్యాలు, కవితలు వ్రాస్తున్నాను.2023 నుండి కథలు వ్రాయటం మొదలు పెట్టాను.మా గురువుగారు మా చేత క్రొత్త వృత్తాలతో "అనంత ఛందస్సౌరభం "అనే గ్రంథమును వ్రాయించారు.

అందులో నేను కూడా 100 పద్యాలు వ్రాసాను.

నేను వ్రాసిన "పల్లె పిలిచింది "అనే స్వతంత్ర కావ్యము "మన తెలుగు కథలు డాట్ కామ్ "పత్రికలో దారావాహికంగా వచ్చింది.

మా గురువుగారు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వివిధ ప్రక్రియలు నేర్పిస్తూ ఉంటారు. అందులో గర్భ కవిత్వం ఒకటి. దానిలో కూడా కొన్ని పద్యాలను వ్రాయడం జరిగింది.


నేను వ్రాసిన పద్యములను , కవితలను పోటీలకు పంపిస్తూ ఉంటాను. విజేతగా చాలా ప్రశంసా పత్రాలు లభించాయి.


కథలు వ్రాయటానికి నాకు ప్రేరణ మా అమ్మగారు.

నా మొదటి కథ 'పరివర్తన 'గో తెలుగు డాట్ కామ్ అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది.

నేను కవితలు శతకాలు, కావ్యాలే కాకుండా కథలు వ్రాయగలను అన్న విశ్వాసం కలిగింది.

నా మొదటి కథకు పారితోషికం ఏమీ లేదు.

ఇప్పటి వరకు నేను 112కథలు,"క్రొత్త నీరు "అనే నవల వ్రాసాను.' కచ దేవయాని ' సీరియల్ గా "మన తెలుగు కథలు డాట్ కామ్ "అంతర్జాల. పత్రికలో వస్తోంది.నేను వ్రాసిన కథల్లో సగం కథలు వివిధ పోటీల్లో బహుమతులు తెచ్చుకున్నాయి.


మా పిల్లలతో నేను వ్రాయబోయే కథల గురించి చర్చిస్తూ ఉంటాను. ఒక్కోసారి కథాంశాన్ని వాళ్ళు చెప్పినట్లుగా మార్చుతాను.

సాధారణంగా నేనే కథలు వ్రాసి చూసుకొని పత్రికలకు పంపిస్తాను.

నాకు నచ్చిన కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. చిన్నప్పటి నుండి వారి సాహిత్యాన్ని చదువుతూ పెరిగాను.

నేను సమాజానికి మేలు చేసే రచనలను ఇష్టపడతాను.

నేను వ్రాసిన రచనల్లో బాగా పేరు తెచ్చిన కథ 'కప్పు తేనీరు '.ఇంటికి దీపం, నీ అడుగు జాడలో, సర్దుబాటు లాంటివి.

నావి రెండు కథాసంపుటాలు వచ్చాయి.అవి "నవ్య కథా సౌరభం -1"మరియు "నవ్య కథా సౌరభం :2 "అనేవి.

మూడు కావ్యాలు, ఐదు శతకాలు కలిపి '1.శతక విజయం. 2. కవన త్రివేణీ సంగమం 'అనే పుస్తకాలు ప్రింట్ అయ్యాయి.

ఇంకా వందల సంఖ్యలో పద్యాలు వ్రాసాను.


2024లో తానావారి పద్య కావ్యపోటీలో పాల్గొని తొమ్మిదవ స్థానం పొందాను.

2022 లో స్టోరీ మిర్రర్ వారు "ది ఆథర్ ఆఫ్ ద ఇయర్ "అవార్డు ఇచ్చారు.

2024 లో సాయివనంలో సాహిత్యం వ్వాట్సాప్ సమూహం వారు "కవనమణి "బిరుదు ఇచ్చారు.

2026 జనవరిలో శ్రీ గౌతమేశ్వర సాహితీ సంస్థ. మంత్రపురి వారు నిర్వహించిన 100 రోజుల కవితా పండుగలో పాల్గొని విజేతగా నిల్చినందుకు స్వర్ణకంకణమును ఇంటికి పంపించారు. అనారోగ్య కారణాల వలన నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను.

2026 ఏప్రిల్ లో మహారాష్ట్ర ప్రభుత్వము మరియు మహారాష్ట్ర తెలుగు అకాడమీ సంయుక్తంగా పూణే లో ఉగాది సన్మానం చేసారు.

2026 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూణే " ఆంధ్రా సంఘం "వారు సన్మానం చేసారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page