కచదేవయాని - పార్ట్ 67
- T. V. L. Gayathri

- 33 minutes ago
- 7 min read

Kachadevayani - Part 67 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 67 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 04/09/2026
కచ దేవయాని - 67వ భాగంలో దేవ–దానవ యుద్ధం కన్నా తీవ్రమైన యుద్ధం యయాతి మనసులో మొదలవుతుంది. హూహు దెబ్బకు సంయాతి తీవ్రంగా గాయపడగా, మరుసటి రోజు దేవతలు దివ్యాస్త్రాలను ప్రయోగించబోతున్నారన్న వార్త దానవ శిబిరాన్ని కుదిపేస్తుంది. వాటిని ఎదుర్కొనే శక్తి లేక శుక్రాచార్యుడిని తిరిగి తీసుకురావడమే మార్గమని అందరూ భావిస్తారు. కానీ అందుకు యయాతి దేవయానిని భార్యగా స్వీకరించాలి. తన జాతి కోసం శర్మిష్ఠ స్వయంగా త్యాగానికి సిద్ధపడటంతో యయాతి జీవితంలోని అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంటాడు.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని. తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. వృషపర్వుడు, నహుషుడు, యయాతి సమావేశమవుతారు. శుక్రాచార్యుడు కూతురితో కలిసి ఆరావళీ పర్వత ప్రాంతంలోని ఆశ్రమానికి వెళ్తాడు. దానవులకు బంధీ అయిన కచుడ్ని విడిపిస్తాడు యయాతి. దేవదానవ యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. మొదటి రోజు యుద్ధంలో కచుడు–సంయాతి, యయాతి–ప్రభాసుడు, నహుషుడు–విశ్వావసు మధ్య భీకర పోరాటాలు జరుగుతాయి. సంయాతి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోవడంతో దానవ శిబిరంలో ఆందోళన నెలకొంటుంది.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 67
పరివారంతో వైద్య శిబిరానికి వచ్చాడు నహుషుడు. సంయాతి ఇంకా లేచి కూర్చోలేకపోతున్నాడు. దీర్ఘదర్శి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
కుమారుడి తలను ఒళ్ళో పెట్టుకున్నాడు చక్రవర్తి.
కళ్ళు విప్పాడు సంయాతి.
"నాన్నగారూ! .... అన్నయ్య మాట నిలబెట్టలేకపోయాను! "నీరసంగా పలికాడతడు.
వెనుక నుంచి యయాతి వచ్చాడు.
"లేదు తమ్ముడూ! నువ్వు ఎంతో వీరత్వంగా పోరాడావు.హూహు మన కంటే బలవంతుడు."అన్నాడు అనునయంగా.
"అన్నయ్యా! "అంటూ లేవబోతూ సంయాతి రక్తాన్ని కక్కుకున్నాడు.
"నువ్వు బాధపడకుండా విశ్రాంతి తీసుకో తమ్ముడూ! "అని అతడిని సరిగ్గా పడుకోబెట్టి యయాతి అరుణకేశి మహర్షి దగ్గరికి వచ్చి దీర్ఘదర్శి, సంయాతిల ఆరోగ్యం గురించి విచారించాడు.
"ఇద్దరికీ గాయాలు బలంగా తగిలాయి కుమారా! వారం రోజుల్లో లేచి తిరగ గలుగుతారు.ఇప్పుడు వీళ్లకు విశ్రాంతి చాలా అవసరం."అన్నాడు అరుణకేశి మహర్షి.
నహుషుడు సంయాతి దగ్గరే ఉన్నాడు.
అక్కడి నుండి యుద్ధ శిబిరానికి వచ్చాడు యయాతి.
రెండో రోజు చేయాల్సిన యుద్ధ ప్రణాళికను సహచరులకు వివరిస్తుంటే దానవ గూఢచారి పరిగెత్తుకొని వచ్చాడు.
అతడు చాలా ఆందోళనగా ఉన్నాడు.
"ప్రభూ! ... ప్రభూ! .. రేపు దేవతలు మన మీద దివ్యాస్త్రాలను ప్రయోగిస్తారట! "
ఒక్కసారిగా నిశ్శబ్దం!
ఆసనంలో నుంచి లేచాడు యయాతి.
ఇప్పుడేమిటి చేయడం?
వృషపర్వుని ముఖం పాలిపోయింది.
"మనలో ఎవ్వరికీ దివ్యాస్త్రాలను ఎదుర్కోవటం తెలియదు.ఒక్క ఆగ్నేయాస్త్రం చాలు! అందరం భస్మమయి పోతాము! "అన్నాడు వీతిహోత్రుడు.
బృందారకుడు తల పట్టుకొని కూర్చున్నాడు.
వృషపర్వుడు యయాతి దగ్గరికి వచ్చాడు.
"కుమారా! కర్తవ్యం బోధపడటం లేదు... ఇప్పుడు మన దగ్గర దివ్యాస్త్రాలను ఎదుర్కొనే బలం లేదు.ఒక్కటే తరుణోపాయం! గురువుగారిని పిలుచుకొని వద్దాము! ఆయన ఏదైనా చేయగలడు."అన్నాడు.
అందరినీ చూశాడు యయాతి.
తన కోసం నిలబడ్డ మిత్రుల కళ్ళల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఏమి చెయ్యాలి?
ఆచార్యుడిని పిలవట మంటే దేవయానిని స్వీకరించడం అని అర్ధం.
మౌనంగా ఉన్నాడు యయాతి. అతడి గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. ఇక శర్మిష్ఠ జీవితమంతా దేవయాని దగ్గర దాస్యం చేస్తూ బ్రతకాల్సిందే!
ఇంతలో అక్కడికి శర్మిష్ఠ వచ్చింది.ఆమె ముఖంలో కూడా భయం తాండవిస్తోంది.
శర్మిష్ఠను చూడంగానే అక్కడున్న వాళ్లంతా నిశ్శబ్దంగా బయటికి వెళ్లిపోయారు.
శిబిరంలో శర్మిష్ఠా యయాతిలు మాత్రమే మిగిలారు.
"నా మాట వినండి యువరాజా! కోట్ల మంది జీవితాలకు పరీక్ష! వెళ్లి గురువుగారిని పిల్చుకొని రండి! "
"కానీ శామూ! నువ్వు.."
"నాకేమవుతుంది? అక్క దగ్గర దాసీగా ఉండడం నాకు పెద్ద కష్టం కాదు! నా జాతి వాళ్ళు బలయిపోతుంటే ఇంకా నా ఒక్కదాని గురించి ఆలోచించడం స్వార్థం అనిపించుకొంటుంది.పదండి! "
కదలలేదు యయాతి.
ఆలాగే రెండు చేతులతో తలను పట్టుకొని ఆసనంలో కూర్చున్నాడు.
కింద కూర్చుంది శర్మిష్ఠ.
"మన జీవితాలకు ప్రయోజనం ఏముంది? రాజు అంటే ప్రజల క్షేమం కోసం పుట్టిన వాడని అర్ధం. మన గురించి అలోచిస్తూ సమయాన్ని వ్యర్థం చేయకుండా గురువుగారి దగ్గరికి వెళ్ళండి! "అంది.
ఆమె కంఠంలో ధృఢత్వం.
తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు యయాతి.
కళ్ళనీళ్లు తిరిగాయతడికి.
ఆమెను లేపి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
"ఓడిపోయాను శామూ! యుద్ధంలోకాదు... జీవితంలో చిత్తుగా ఓడిపోయాను... నీ దాస్యం గురించి కాదు! జీవితాంతం దేవయానికి నేను దాసుడిగా పడి ఉండాలి.. ఈ నాటి దాకా రాచబిడ్డను. రేపటి నుంచి ఒక దాసుడిలా బ్రతకడానికి మనసు ఒప్పుకోవటం లేదు. నా బదులు ఇంకో మగవాడు నిన్ను ముట్టుకుంటే నీకెలా ఉంటుందో దేవయానితో కాపురం అంటే నాకు కూడా అలాగే ఉంటుంది... "
బేలగా అతడి వైపు చూస్తోంది శర్మిష్ఠ.
సమయం గడుస్తోంది.
చివరకు ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలాగా తలను విదిల్చాడు.
లేచాడు.
"ఇక ముందు నిన్ను ఇలా తాకలేనేమో! "అని
ఆమె తలమీద ముద్దు పెట్టుకున్నాడు.
మెల్లగా కదిలి అక్కడి నుండి భారంగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్లాడు. ఆసనాన్ని పట్టుకొని భోరుమని ఏడవసాగింది శర్మిష్ఠ.
బయట గుంపుగా నిలబడి ఉన్నారు సహచరులు.
అప్పటికే విమానాన్ని సిద్ధం చేశాడు శక్తిధరుడు.
వృషపర్వుడితో మాట్లాడుతున్నాడు నహుషుడు.
అందరూ యయాతిని చూశారు.
అతడి ముఖంలో ఏ భావమూ లేదు.కర్తవ్యనిష్ఠ ఒక్కటే కనిపిస్తోంది.
తండ్రి పాదాలకు నమస్కరించాడు.
"వెళ్ళు కుమారా! ఆచార్యుడిని పిలుచుకొనిరా! నా తరపున క్షమాపణలు చెప్పు! ఇంతకంటే గత్యంతరం లేదు."అని ఆశీర్వదించాడు నహుషుడు.
విమానాన్ని ఎక్కారు వృషపర్వుడు, యయాతిలు.శక్తిధరుడు విమానాన్ని నడుపుతున్నాడు.
విమానం రివ్వుమంటూ ఆరావళీ పర్వతప్రాంతానికి దూసుకొని పోయింది.
ఆరావళీ ఆశ్రమ ప్రాంతం.
విమానాన్ని దిగి ఆశ్రమంలోకి వచ్చారు ముగ్గురు.
ఆశ్రమవాసులు నవ్వుతూ ఎదురొచ్చారు.
"గురువుగారి వ్రతం ఇప్పుడే పూర్తయింది. మీ గురించి చెబుదామనుకుంటుంటే మీరే వచ్చారు! రండి! రండి! "అని వీళ్ళను ఆహ్వానించారు.
లోపలికి వచ్చారు.
అక్కడ ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు శుక్రాచార్యుడు.
వృషపర్వుడు పరుగున వెళ్లి ఆయన పాదాలను పట్టుకొన్నాడు.
అతడిని లేవనెత్తి యయాతి వైపు చూశాడాయన.
వంగి నమస్కారం చేశాడు యయాతి.
"గురువుగారు! దేవతలు దండెత్తి వచ్చారు. నేను మీకు చెబుదామని వచ్చాను. మీరు మౌనవ్రతంలో ఉండటంతో వెనక్కు వెళ్లిపోయాను. రేపటి యుద్ధంలో వాళ్ళు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తారట! వాటిని ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళం! మీరు మాత్రమే రక్షించగలరు. నన్ను, నా జాతిని కాపాడండి!" అని మళ్ళీ ఆచార్యుడి పాదాలను గట్టిగా పట్టుకొన్నాడు వృషపర్వుడు.
మాట్లాడలేదు శుక్రాచార్యుడు.
యయాతినే చూస్తున్నాడాయన.
ముందుకు వచ్చాడు యయాతి.
"నేను ఒప్పుకుంటున్నాను. మీ అమ్మాయిని భార్యగా స్వీకరిస్తాను. ఇంతకు ముందు నేను ఆవేశంతో మాట్లాడిన మాటలకు క్షమాపణ వేడుకుంటున్నాను. మీరు వచ్చి..."అని ఆగాడు యయాతి.
నిశితంగా ఆలాగే చూస్తున్నాడాయన.
"గురువుగారూ! సందేహించకండి! యువరాజు మాట ఇస్తే ఇంక దానికి తిరుగులేదు.చక్రవర్తి కూడా మీకు క్షమాపణలు వేడుకుంటూ తన మాటగా చెప్పమన్నాడు."అన్నాడు వృషపర్వుడు అభ్యర్ధనగా.
గొంతు విప్పాడు శుక్రాచార్యుడు.
"కుమారా! ఇంకొక షరతు ఉంది. నువ్వు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు! కానీ ఒక్క శర్మిష్ఠను మాత్రం వివాహం చేసుకోరాదు! ఆమెను కన్నెత్తి చూడరాదు. రాబోయే కాలంలో పట్టమహిషిగా నా కుమార్తెకు మాత్రమే అధికారం ఉండాలి! సమ్మతమేనా కుమారా?"
ఒక నిమిషం మౌనం.
చేతులు కట్టుకున్నాడు యయాతి.
"ఒప్పుకుంటున్నాను! "అతడి కంఠంలో ఎలాంటి తొట్రుపాటు లేదు.కానీ మనసు మాత్రం ఘనీభవించింది.
ఆసనం మీద నుంచి లేచాడు శుక్రాచార్యుడు.
"పదండి!" అన్నాడు.
ఆశ్రమం బయటికి వచ్చారు ముగ్గురు.
ఈసారి విమానాన్ని నడపడానికి సిద్ధమయ్యాడు యయాతి.
విమానంలో ఎక్కారు మిగిలిన వాళ్ళు.
ఆచార్యుడి ప్రక్కనే కూర్చున్నాడు వృషపర్వుడు. భయం వేసినప్పుడు చిన్నపిల్లవాడు తండ్రి చేతిని ఎలా పట్టుకుంటాడో ఆలాగే ఆయన చేతిని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడతడు.
"దేవతల దివ్యాస్త్రాలను ఎదిరించడం ఎలాగా? నాకేమీ తోచడం లేదు గురువుగారు! " అన్నాడు బెంగగా.
నవ్వుతూ అతడి చేతి మీద తట్టాడు శుక్రాచార్యుడు.
"వృషపర్వా! నేను నీకు దూరమయ్యానని తెలిసిన వెంటనే దేవేంద్రుడు యుద్ధానికి వస్తాడని నాకు తెలుసు! అందుకే ఇంతకాలం కఠోరమైన మౌనవ్రతంలో ఉండి కేవలం వాయుభక్షణ మాత్రమే చేస్తూ మహాదేవుడిని ప్రసన్నం చేసుకున్నాను. స్వామి నాకు 'శివశక్తి 'ని అనుగ్రహించాడు."
"గురువుగారూ! "అంటూ రెండు చేతులు జోడించాడు వృషపర్వుడు.
ఆప్యాయంగా అతడి భుజాన్ని తట్టాడు ఆచార్యుడు.
విమానం యుద్ధ శిబిరాన్ని చేరుకుంది.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 68 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.






Comments