top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 60

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'కచదేవయాని - పార్ట్ 60' లో యయాతిని కోరుతూ శుక్రాచార్యుడి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న దేవయాని
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'కచదేవయాని - పార్ట్ 60' లో యయాతిని కోరుతూ శుక్రాచార్యుడి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న దేవయాని

Kachadevayani - Part 60 - Telugu Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 60 తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 02/07/2026

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని. తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




కచ దేవయాని - 60వ భాగం చదవండి


ఆ రాత్రి తండ్రి గదిలోకి వెళ్ళింది దేవయాని. ఏదో వ్రాసుకొంటున్నాడాయన. ప్రక్కనే వెళ్లి కూర్చుందామె.

"ఏమిటి బంగారూ!" మృదువుగా కూతురి చెయ్యి పట్టుకున్నాడు శుక్రాచార్యుడు.

"నేను... నాకు..." చెప్పలేకపోతోంది. ఇలాంటి విషయాలు తల్లితో చెప్పుకోవచ్చు. తల్లి లేదు. తప్పదు... కానీ ఎలా చెప్పాలి?


"ఏమిటి తల్లీ! చెప్పు!"


"నేను... నేను... ఒకతన్ని భర్తగా భావిస్తున్నాను."


"ఎవరినమ్మా!" విస్మయంగా అడిగాడాయన.


"నన్ను బావిలోనుంచి తీసి రక్షించాడు... అతడిని." తలవంచుకొంది దేవయాని.


"యయాతి రాకుమారుడినా?"


అవునన్నట్లు తలూపిందామె.


"అతడితో నీకు అంతకు ముందు పరిచయం ఉందా?"


"లేదు... లేదు.. అప్పుడే చూశాను."


" ఆ సంఘటన జరిగిన తర్వాత వచ్చి అతడు నీతో మాట్లాడాడా? "

"లేదు.. తర్వాత అతడిని మళ్ళీ చూడలేదు."


"నీలో నువ్వే అతడి గురించి ఆలోచిస్తున్నావా?"


మౌనంగా ఉంది దేవయాని.


"వృషపర్వుడికి వాళ్ళు బంధువులు. శర్మిష్ఠను యయాతికిచ్చి వివాహం చేయాలని రాజదంపతులు భావిస్తున్నారని కర్ణాకర్ణిగా వార్త వచ్చింది. అతడి గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. నీ కోసం నాగరాజ కుమారుడిని చూశాను. అతడి పేరు చిత్రవర్ణుడు. చాలా తెలివైన వాడు. వీరాధివీరుడు. శాస్త్రాలన్నీ చదివిన వాడు. ఎంతో మృదుస్వభావి. వాళ్లందరికీ నా మాటంటే వేదం. ఒక నెలరోజుల తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. చిత్రవర్ణుడు నీకు తప్పకుండా నచ్చుతాడని నా అభిప్రాయం! ఏమంటావు?" అంటూ అనునయంగా చెప్పాడు శుక్రాచార్యుడు.


తలను పైకెత్తింది దేవయాని. ఆమె కళ్ళ నిండా నీళ్లు.


"ఆ బావిలో పడ్డప్పుడు నేనెలాంటి స్థితిలో ఉన్నానో మీకు చెప్పలేను. అటువంటి సిగ్గుపడే స్థితిలో ఉన్న నన్ను పట్టుకొని పైకి తీశాడతడు. అతడికి తప్ప వేరొకరికి నా దేహాన్ని చూపించలేను. ఆడపిల్లను... మీరు అర్ధం చేసుకోండి!...." గొంతు పూడుకుపోతోందామెకు.

అతడికి తప్ప వేరొకరికి నా దేహాన్ని చూపించలేను. ఆడపిల్లను.... మీరు అర్ధం చేసుకోండి!...."గొంతు పూడుకుపోతోందామెకు.


"స్త్రీలయినా పురుషులయినా ఆపదలో ఉన్నప్పుడయినా, వైద్యుడి దగ్గరయినా వాళ్ళ శరీరపు స్థితిగతుల గురించి ఆలోచించకూడదంటుంది శాస్త్రం. అయినా నువ్వు కోరుకుంటే నహుషచక్రవర్తితో మాట్లాడతాను. యయాతికి కూడా నిన్ను వివాహం చేసుకోవాలని ఉంటే సమస్యే లేదు. అతడికి నిన్ను వివాహం చేసుకోవాలనే అభిప్రాయం లేదనుకో అప్పుడు నువ్వు చిత్రవర్ణుడిని వివాహం చేసుకుంటావు కదా!"


"లేదు!... లేదు... నేను మరొకరి ముఖం చూడను కాక చూడను. యయాతి నా కుడి చేతిని పట్టుకొని బావిలోనుంచి బయటకు లాగాడు.అప్పుడే మా కిద్దరికీ పాణిగ్రహణం జరిగిందని అనుకుంటున్నాను. శాస్త్రప్రకారం అతడే నా భర్త..."


"లేదమ్మా! ఇలాంటి విషయం ఏ శాస్త్రంలోనూ లేదు. ఆపత్సమయంలో ఆడవాళ్ళను రక్షించడానికి కాలు పట్టుకున్నా, చెయ్యి పట్టుకున్నా అది వివాహం క్రిందికి లెక్కరాదు! అతడు భర్త కాడు! నా మాట విను! నేను వాళ్ళతో మాట్లాడతాను కానీ అతడికి ఇష్టం లేకపోతే నేనేమీ చెయ్యలేను." నెమ్మదిగా చెప్పినా విషయాన్ని స్పష్టంగా చెప్పాడు శుక్రాచార్యుడు.


అసహనంగా తలను విదిల్చింది దేవయాని.


"నేను ఏమి కావాలన్నా మీరు తెచ్చి పెడతారనే నమ్మకం నాకు. యయాతినే కోరుకుంటున్నాను. తెచ్చిపెట్టండి! మీకంటే గొప్ప శాస్త్రవేత్త, మంత్రవేత్త ఈ భూలోకంలోనే లేడు. మీరే కొత్త శాస్త్రాన్ని రచించండి! నా కోసం కొత్త ధర్మాన్ని సృష్టించండి! కాలనుగుణంగా ధర్మాలను, శాస్త్రాలను మార్చుకోవచ్చు. తండ్రిగారు! సిగ్గు విడిచి అడుగుతున్నా! యయాతి మాత్రమే నా భర్త! తీసుకొని రండి!"

మొండిగా చెప్పింది.


శుక్రాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. 


'ఇంతకు ముందు కచుడి విషయంలో ఇదే మొండితనం... రెండు సార్లు బ్రతికించుకొంది... ఫలితం! మృతసంజీవని విద్య దేవతల దగ్గరికి వెళ్లిపోయింది. పైకి చెప్పటం లేదు కానీ చాలా మంది దానవుల మనస్సుల్లో ఆనాటి కోపం ఇంకా జ్వలిస్తూనే ఉంది. ఇప్పుడు యయాతి విషయంలో అదే మొండితనం. శాస్త్రబద్ధం కాని విషయాన్ని గురించి నహుషుడితో ఎలా మాట్లాడటం?' ఆలోచిస్తున్నాడాయన.


తండ్రి వైపు చూసింది దేవయాని.


ఆయన తను చెప్పిన విషయానికి సుముఖంగా లేడని అర్ధం అవుతోంది. మెల్లగా లేచి లోపలికి వెళ్లిపోయిందామె.


అరగంట గడిచింది.


పెద్దగా కేకలు పెడుతూ లోపలి నుండి ముక్త పరుగెత్తుకుంటూ వచ్చింది.


"అమ్మాయిగారు... అమ్మాయిగారు... చెయ్యి కోసుకున్నారు గురుదేవా! రక్తం.... స్పృహ లేకుండా అమ్మాయి..." రొప్పుతోంది ముక్త.


ఒక్క ఉదుటున లేచి లోపలికి పరిగెత్తాడు శుక్రాచార్యుడు.


కత్తితో కుడిచేతి నరాన్ని కోసుకొంది దేవయాని.


గబక్కున ఉత్తరీయాన్ని తీసి కూతురి చేతిమీద నొక్కి పెట్టాడు.


"నీళ్లు తీసుకొని రా!"


ముక్త నీళ్లను తీసికొని వచ్చింది. నీళ్లను మంత్రించి దేవయాని ముఖం మీద చల్లాడు.

వేరొక గుడ్డను తెప్పించి చేతికి కట్టుకట్టాడు. ఆమె తలను ఒళ్ళో పెట్టుకొన్నాడు.

కాసేపటికి మెల్లగా కదిలిందామె.

సమయం భారంగా గడుస్తోంది.

నీరసంగా కనులు తెరిచి చూసిందామె.

కొద్దిగా మంచినీళ్లు తాగించాడు.

ఇంకాసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చింది.తండ్రివైపు చూసింది.


"ఈ అఘాయిత్యం ఏమిటి తల్లీ! నువ్వు లేకపోతే నేను బ్రతుకగలనా? చెప్పు!" ఆయన కంఠం వణికింది. కళ్ళనీళ్లను తుడుచుకొన్నాడు.


"యయాతిని చూడకపోతే నేను బ్రతకలేను!... అతడే నా భర్త..." నీరసంగా ఉందామె కంఠం.


"నువ్వనుకొన్నట్లే జరుగుతుంది. యయాతిని నీ దగ్గరికి తీసికొని వస్తాను! ఇలాంటి పిచ్చిపనిని మరొకసారి చెయ్యనని నాకు ప్రమాణం చెయ్యి! సరేనా!" కూతురి తలను నిమిరాడాయన.


"నా భర్త నాకు మాత్రమే సొంతం! అతడు శర్మిష్ఠను రెండో భార్యగా వివాహం చేసుకోకూడదు!" అంత నీరసంలోనూ ఆమె కంఠంలో ఒక రకమైన జీర ధ్వనించింది.


నిదానంగా కూతురివైపు చూశాడాయన.


కూతురి మనస్తత్వం అర్ధం అయింది. యయాతిని భర్త అని నిర్ణయించుకోవటం వెనుక శర్మిష్ఠ మీద పట్టరాని ద్వేషం ఉందని తెలుస్తోంది. అయినా కూతురి కోరికను తీర్చటానికి సిద్ధపడ్డాడు.

కూతురంటే ఉన్న వల్లమాలిన ప్రేమ ఆ మంత్రవేత్తను గుడ్డివాడిని చేసిందా? ధర్మాధర్మాలను విస్మరించేలా చేసిందా?

ఏమో కాలమే నిర్ణయించాలి.


ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక - 61 వ భాగం త్వరలో మీ ముందుకు రానుంది. 


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 61 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T.V.L. గాయత్రి
T.V.L. గాయత్రి

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page