top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 59

Updated: Jul 2

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'కచదేవయాని - పార్ట్ 59' లో కాలువ గట్టు వద్ద దాసీ వేషంలో ఉన్న శర్మిష్ఠను ఓదారుస్తున్న యయాతి, వారిని దూరం నుంచి చూసి దిగ్భ్రాంతికి గురైన దేవయాని
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'కచదేవయాని - పార్ట్ 59' లో కాలువ గట్టు వద్ద దాసీ వేషంలో ఉన్న శర్మిష్ఠను ఓదారుస్తున్న యయాతి, వారిని దూరం నుంచి చూసి దిగ్భ్రాంతికి గురైన దేవయాని

Kachadevayani - Part 59 - Telugu Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 59 తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 24/06/2026

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. దేవయాని కోరిక ప్రకారం శర్మిష్ఠ  దేవయానికి  దాసిగా వెళ్తుంది.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


"రాజకుమార్తె నుంచి దాసీగా.. శర్మిష్ఠ జీవితంలో మొదలైన కొత్త అధ్యాయం! " 

దాసీ వేషంలో ఉన్న శర్మిష్ఠను చూసి యయాతి హృదయం కరిగిపోయింది... కానీ అదే దృశ్యం దేవయాని జీవితాన్ని మరో మలుపు తిప్పబోతోంది! 

టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 59వ భాగం చదవండి


పది రోజులు గడిచాయి. ఆ రోజు మధ్యాహ్నానికి నహుష చక్రవర్తి పరివారంతో సహా దానవ రాజ్యానికి వచ్చాడు. అటుగా వెళ్తున్న పింగళుడికి ఎదురు పడింది మదనిక. ఆమె ముఖంలో అంతులేని దిగులు కనిపిస్తోంది. 


"ఏమైంది? ఎవరికైనా బాగాలేదా?"యదాలాపంగా మదనిక నడిగాడతడు. 


"రాజకుమారి ఇక్కడ లేదు "అంటూ జరిగినదంతా అతడితో చెప్పిందామె. 


"ఎంత అన్యాయం! రాజకుమారికి ఎంత కష్టం వచ్చింది! "అని సంధించిన బాణంలాగా యయాతి దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. 


"పద! ఆశ్రమానికి వెళ్దాం! "అప్పటికప్పుడే ఆశ్రమానికి బయలుదేరాదు యయాతి. 


"నేనిక్కడే ఉండనా? చక్రవర్తిగారు నీ గురించి అడిగితే ఏదైనా కారణాన్ని కల్పించి చెబుదామా? లేక.... "


"ఏదో కారణమెందుకు? కాబోయే కోడలు దాసీగా ఉందంటే నాన్నగారు మాత్రం సహిస్తారా? విషయాన్ని చెప్పే వెళదాం! "అంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి శర్మిష్ఠకు కల్గిన దుస్థితి గురించి చెప్పాడు యయాతి. 


వినంగానే "అయ్యో! అయ్యో! "అని బాధ పడింది విరజాదేవి. 


"ఇదెక్కడి దుర్మార్గం? అంత పెద్ద మంత్రవేత్త అయ్యుండి కూతురి చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతున్నాడా శుక్రాచార్యుడు? నేనిప్పుడే వృషపర్వ మహారాజుతో మాట్లాడతాను! నువ్వు తక్షణం వెళ్లి రాజకుమారి ఎలా ఉందో చూసిరా! చూడు! తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు! నేను, మహారాజు ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచించి అమ్మాయిని అక్కడినుండి తీసుకొని వచ్చే ఏర్పాట్లు చేస్తాము! "అంటూ యయాతిని, పింగళుడిని ఆశ్రమానికి పంపించి వేశాడు నహుషుడు. 


వేగంగా పరిగెత్తే గుర్రాలనెక్కి వీళ్ళు ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమ ద్వారం దగ్గరే కనిపించాడు దుర్జయుడు. 


"రాకుమారి ఎక్కడుంది? నేను ఎలాగైనా చూడాలి! "గుర్రం మీద నుంచే అడిగాడు యయాతి. 


"కాలువ గట్టు దగ్గర ఉంది యువరాజా! ఆ దుర్మార్గురాలు మా రాజకుమారిని నీళ్లు తెచ్చి తొట్లలో నింపమని ఆజ్ఞాపించింది. రండి నేను చూపిస్తాను! "అంటూ దారి తీశాడు దుర్జయుడు. 


కుండతో నీళ్లు తెస్తున్న శర్మిష్ఠ యయాతిని చూడంగానే సంభ్రమంగా కుండను కింద. పెట్టి పరుగెత్తుకొని వచ్చింది. 


"శామూ! "అంటూ ఒక్క ఉదుటున గుర్రాన్ని దిగి శర్మిష్ఠను పట్టుకొన్నాడతడు. 


సామాన్యమైన దుస్తుల్లో ఎటువంటి అలంకరణ లేకుండా ఉన్న శర్మిష్ఠను చూచి 

"కష్టపడుతున్నావా శామూ! "అని ఆమె చేతుల్ని మృదువుగా నిమిరాడు. 


"లేదు! లేదు! బాగానే ఉన్నాను! "బింకంగా ఉందామె గొంతు. కాలువ దగ్గరికి వెళ్లి కూర్చున్నా రిద్దరు. 

ఎఱ్ఱగా కందిపోయి ఉన్న ఆమె చేతుల్ని ముద్దు పెట్టుకున్నాడతడు. 

ఓదార్పుగా ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె ముంగురులను మృదువుగా సవరిస్తున్నాడు. 

అతడి స్పర్శతో పదిరోజులుగా పడుతున్న కష్టమంతా కరిగిపోతునట్లనిపించిందామెకు. 

వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదలి దుర్జయుడు, పింగళుడు దూరంగా వెళ్లిపోయారు. 


గదిలో కూర్చుని ఉన్న దేవయాని యదాలాపంగా కిటికీ దగ్గరికి వచ్చింది. 

అటూ ఇటూ తిరుగుతున్న తెల్లటి గుర్రం కనిపించిందామెకు. 

ఎంత ఆశ్చర్యం! 

ఆశ్రమంలోనే కాదు మొత్తం దానవరాజ్యంలోనే అలాంటి తెల్లటి గుర్రాలు లేనే లేవు. ఎవరొచ్చి ఉంటారు?

 తండ్రి గురుకులానికి వెళ్లారు. 

కొత్తవాళ్లెవరు? 


దాసీలు ఎవ్వరూ కనిపించలేదు. మెల్లగా గుర్రం దగ్గరికి వచ్చిందామె. గుర్రం కాలువ దగ్గరికి వెళుతోంది. కాలువకు దగ్గరగా వచ్చింది. 


అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూడంగానే ఒక్కసారి విద్యుద్ఘాతం తగిలినట్లుగా ఆగిపోయింది. 

కాలువ ఒడ్డున అతి సన్నిహితంగా కూర్చుని ఉన్నారు యయాతి శర్మిష్ఠలు. ఆమెను పొదివి పట్టుకొని అతడేదో చెబుతున్నాడు. 


దేవయానికి మెదడంతా మొద్దుబారినట్లుగా ఉంది. అంతా గజిబిజి. ఇంత కాలం తానేమి ఊహించుకొంది? ఇప్పుడు చూస్తున్నదేమిటి? అతడు యయాతి! ..... కచుడు కాదు! .... పొరబాటు పడుతున్నదేమో ననుకొని ఆలాగే వాళ్ళిద్దరిని చూస్తూ నిలుచుంది. సత్యం ఏమిటో అర్థమైంది. తన ఊహ అబద్దం. 


ఇంతలో గుర్రం సకిలింపు వినిపించింది. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిందామె. 

మెల్లగా నడచి ఆశ్రమం లోపలికి వచ్చి నిస్సత్తువగా మంచం మీద కూలబడింది. ఎంతసేపు అలా ఉందో తెలియదు. మనసులో ఒకటే హోరు. 


శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని. నిజం తెలిసినా కూడా దేవయానికి సంతోషంగా లేదు. ఆమె గుండెల్లో ఒక సన్నటి మంట.... భరించలేని బాధ... హృదయం అగ్నిగుండంలా మారిపోయింది. 

'యయాతి సామాన్యుడు కాడు. భూలోకాన్నేలే నహుష చక్రవర్తి కుమారుడు. కాబోయే చక్రవర్తి. విమాన విన్యాసాల్లో దేవతలతో పోటీ పడిన వీరుడు. 


తనను కాపాడిన వాడు! తనెంత తెలివితక్కువది! ... ఆ రోజు యయాతి వచ్చింది శర్మిష్ఠ కోసం. అతడి తల్లి నెలల తరబడి శర్మిష్ఠ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు ఒకరి కొకరు బంధువులు. తన కళ్ల ముందే జరుగుతున్న విషయాల గురించి తను ఏనాడు పట్టించుకోలేదు... ఆనాడు శర్మిష్ఠ పుట్టిన రోజు నాడు వచ్చినవాడు యయాతి. పరదా చాటున దాక్కున్నవాడు యయాతి.. మరి ఆ చిలుక రాయబారం? 


ఏమిటో సగం తెలుస్తోంది.... సగం తెలియటం లేదు.. అన్నింటినీ సమన్వయం చేసుకొని ఆలోచించలేక పోతోంది? ఏది ఏమైనా శర్మిష్ఠ చక్కగా అందగాడిని, వీరుడిని పెళ్లి చేసుకొని హాయిగా భోగాలననుభవిస్తుంది. ఆ రాక్షసిపిల్లను రేపో మాపో మహారాజు వచ్చి తీసికొని వెళ్లిపోతాడు... తను మాత్రం పెళ్ళీ పెటాకులు లేకుండా... తన తండ్రికి మంచి వరుడిని చూచి తనకు పెళ్ళి చేసి పంపిద్దామనే ఆలోచనే రాదు! .. ఎంతసేపు శిష్యులకు మంత్రాలు తంత్రాలు నేర్పించటం... అదీ కాదంటే ఏ నాగలోకానికో, పాతాళలోకానికో వెళ్లి నెలల తరబడి గడిపి రావటం! .. 


తనకంటే మూడేళ్లు చిన్నది.. వయసుకు తగ్గట్లు పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటుంది. తను మాత్రం మోడు లాగా జీవించాల్సిందే! ... దాన్ని దాసీలాగా తెచ్చుకొని ఏం సాధించినట్లు? '

దేవయాని కళ్ళల్లోంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. 


'అలా జరగకూడదు! ... ఆ పిడత మొహానికి యయాతి లాంటి అందగాడితో వివాహం జరగకూడదు! ఏం చెయ్యాలి? ఏదైనా చెయ్యాలి! ... ఏదైనా చెయ్యాలి! ' 


దేవయాని పగ బట్టిన త్రాచులాగా మంచం మీద అటూ ఇటూ పొర్లుతోంది. 


ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక - 60 వ భాగం త్వరలో మీ ముందుకు రానుంది. 

===============================================


===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T.V.L. గాయత్రి
T.V.L. గాయత్రి

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page