top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 56


శుక్రాచార్యుడు కోపంతో వృషపర్వుడిని గద్దిస్తున్న దృశ్యం, నేపథ్యంలో బాధతో నిల్చున్న శర్మిష్ఠ – కచ దేవయాని 56 తెలుగు పురాణ కథ పోస్టర్
శుక్రాచార్యుడు కోపంతో వృషపర్వుడిని గద్దిస్తున్న దృశ్యం, నేపథ్యంలో బాధతో నిల్చున్న శర్మిష్ఠ – కచ దేవయాని 56 తెలుగు పురాణ కథ పోస్టర్

Kachadevayani - Part 56 - Telugu Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 56 తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 03/06/2026

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. దేవయాని కోరిక ప్రకారం వృషపర్వుడిని పిలిపిస్తాడు శుక్రాచార్యుడు.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


“రాజకుమార్తె శర్మిష్ఠ… ఇప్పుడు దేవయానికి దాసిగా మారబోతుందా?”

టి.వి.యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 56వ భాగంలో తెలుసుకోండి.


రథం దిగి పరుగున శుక్రాచార్యుని దగ్గరికి వచ్చాడు వృషపర్వుడు. గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఎప్పటిలాగా దానవరాజును ఆశీర్వదించలేదు. పలకరింపు అసలే లేదు. మౌనంగా నిల్చున్నాడు శుక్రాచార్యుడు. గురువుగారికి కోపం వచ్చిందని అర్థం అయింది వృషపర్వునికి.

"ఆలస్యానికి క్షమించండి గురువుగారూ! చక్రవర్తి వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్లకు మర్యాదలు చేసి వచ్చేసరికి ఆలస్యమయింది. ఉదయం జరిగిన దానికి చింతిస్తున్నాము. అమ్మాయి క్షేమంగా ఉంది కదా! తెల్లవారగానే నగరకు వెళ్దాం!" ప్రాధేయపూర్వకంగా విన్నవించుకొన్నాడుతడు.


"జరిగిన దానికి నువ్వు నిజంగా చింతిస్తున్నావా వృషపర్వా?"

శుక్రాచార్యుడి కంఠంలో ఎన్నడూ వినని కాఠిన్యం.


"మన్నించండి గురువుగారూ! చిన్న పిల్లలు ఏదో ఆటల్లో తగాదా పెట్టుకొని..."


"అయినా సరే! జరిగింది చిన్న విషయం కాదు! సమయానికి రాకుమారుడు యయాతి వచ్చి రక్షించాడు కాబట్టి అమ్మాయి ప్రాణాలతో ఉంది. లేకపోతే!..."


శుక్రాచార్యుడి కంఠం ఖంగుమంది.

నోటమాట రావటం లేదు వృషపర్వుడికి 


ఎలాగో గొంతు పెగుల్చుకొని "క్షమించండి గురువుగారూ!" అని మాత్రం అనగలిగాడు.


"తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు!"


"మీ ఇష్టం గురువుగారూ! మీరు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను!"


"సరే! విను! తెల్లవారే సరికి రాకుమారి శర్మిష్ఠను గురుకులానికి తీసికొనిరా! నా కూతురికి దాసీలాగా సేవలు చేస్తుందా? చెప్పు!"


ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు దానవరాజు.

పదిహేను రోజుల్లో నిశ్చితార్థం. దేవయానికి దాసీగా కూతురిని పంపించాలా? ఇప్పుడెలా?


"ఆలోచిస్తున్నావా రాజా?"


"లేదు గురువుగారూ! నేను, నా పరివారం అందరమూ మీ దాసులమే! అందరం వచ్చి మిమ్మల్ని సేవించుకుంటాము!"


"అందరూ అవసరం లేదు! శర్మిష్ఠను మాత్రం పంపించు! వెంట పరివారం అక్కరలేదు!"

శుక్రాచార్యుడు వృషపర్వుడి ముఖం వైపు చూస్తున్నాడు.


తలవంచుకొన్నాడు వృషపర్వుడు. ఆలోచిస్తున్నాడు.

'ఇప్పుడు కూతురు వివాహ విషయం చెప్పటమా? వద్దా? గురువుగారు ఇంత కోపంగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం. నిశ్చితార్థానికి ఇంకా పదిహేను రోజులుంది. ఈ లోపల ఆయన కోపం తగ్గిపోవచ్చు! పది రోజుల తర్వాత మెల్లగా విషయం చెప్పి, చక్రవర్తి వాళ్ళను కూడా తీసికొని వస్తే గురువుగారు ప్రసన్నులవటానికి అవకాశం ఉంది!...'


"చెప్పు రాజా! దాదాపు సంవత్సరం పాటు నా కూతురిని మీ దగ్గర ఉంచాను. నేనేమీ సందేహించలేదే! అదే నీ కూతురిని నా ఆశ్రమంలో ఉంచటానికి నువ్వు సందేహిస్తున్నావా?" మళ్ళీ ఖంగుమంది శుక్రాచార్యుడి కంఠం.


"లేదు గురువుగారూ! సందేహమేమీ లేదు. రేపు ఉదయం శర్మిష్ఠను ఆశ్రమంలో దించుతాను! చిన్నపిల్ల! సేవ చేయటం అంటే తెలియని పిల్ల! నాదొక చిన్న విన్నపం గురువుగారూ!" దీనంగా వేడుకొన్నాడు వృషపర్వుడు.


"ఏమిటో చెప్పు!" కొంచెం మెత్తబడ్డాడు శుక్రాచార్యుడు.


"శర్మిష్ఠ వెంట ఒక్క పరిచారికను పంపిస్తాను! మిమ్మల్ని, అమ్మాయిని ఎలా సేవించాలో శర్మిష్ఠకు నేర్పిస్తుంది. అనుమతివ్వండి గురువుగారూ!" రెండు చేతులను జోడించి గురువు పాదాల మీద పడ్డాడు వృషపర్వుడు.


"అలాగే! అలాగే! రేపటికల్లా రాకుమారి గురుకులంలో ఉండాలి! వెళ్ళు!" అంటూ వృషపర్వుడిని లేవనెత్తాడు శుక్రాచార్యుడు.


మరలా ఒకసారి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి భారమైన హృదయంతో రాచనగరుకు వచ్చాడు వృషపర్వుడు.


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 57 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page