top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 52


యయాతి శర్మిష్ఠను ఆదరిస్తున్న భావోద్వేగ దృశ్యం
యయాతి శర్మిష్ఠను ఆదరిస్తున్న భావోద్వేగ దృశ్యం

Kachadevayani - Part 52 - Telugu Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 52 తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 01/05/2026


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

“ఈ ఒక్క నిజం బయటపడితే… అన్నీ మారిపోతాయి!” 

ఆసక్తిని రేకెత్తించే టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని యాభై రెండవ భాగం చదవండి


యయాతి దేవాలయం సమీపానికి వచ్చాడు. అతడి రథాన్ని చూడగానే శర్మిష్ఠ పరుగు పరుగున వచ్చింది. అతడు రథంలో నుంచి దిగీ దిగంగానే శర్మిష్ఠ అతడి చేయి పట్టుకొంది. అసంకల్పితంగా ఆమెను దగ్గరికి తీసికొని హృదయానికి హత్తుకొన్నాడతడు.

ఉదయం నుండి జరిగిన గొడవతో కకావికలమైన శర్మిష్ఠ మనసు అతడి పరిష్వంగంలో కాస్త సేద తీరింది.


ఆమె ముఖాన్ని చేత్తో పైకెత్తి, "దిగులు పడకు శామూ! అంతా బాగానే ఉంటుంది!" అన్నాడు మృదువుగా.


శర్మిష్ఠ కళ్ల నిండా నీళ్లు.

తన చేత్తో ఆమె కన్నీరు తుడిచాడతడు.

కొంచెం ధైర్యం వచ్చిందామెకు.

మంటపంలోనికి వచ్చారిద్దరు.


అక్కడ మదనికను, కేతకిని పడుకోబెట్టి ఉపచారాలు చేస్తున్నారు చెలులు. ప్రక్కనే పూజారులు  స్వస్తి మంత్రాలను చదువుతున్నారు.


"అసలేం జరిగిందో చెప్పు శామూ!"

అన్నాడు యయాతి.


అతడిని ఇంకో మంటపం దగ్గరికి తీసికొని వెళ్ళింది శర్మిష్ఠ.

జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పిందామె.


"నేను దేవయానిని బావిలో నుంచి బయటకు తీశాను. ఇప్పుడామె పింగళుడి రక్షణలో ఉంది. త్వరలో గురువుగారు వస్తారు. ఆమె ఆశ్రమానికి వెళ్తుంది. కానీ! ఈ గొడవ వలన...." ఆగాడు యయాతి.


"ఏం చేయను? అక్క మిమ్మల్ని చంపటానికి వస్తుంటే నాకు కంగారు పుట్టింది. ఆమె దగ్గర మంత్రాల మణి ఉంది. దాని వలన శత్రువులు చలనం లేకుండా పడిపోతారు. ఆమెకు నా మీద ద్వేషం ఉందని తెలుసుకోలేక పోయాను. నా పుట్టిన రోజుకు మీరు రావటం దగ్గర్నుంచి, చారుమతితో సందేశం పంపించటం దాకా అన్నీ తెలుసు. ఈ రోజు మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపాలని చూసింది."


ఆలోచిస్తున్నాడు యయాతి.


"ఇంతకు ముందు దేవయాని నన్ను చూడలేదు శామూ! ఆమె కళ్ళల్లో నా పట్ల ద్వేషం కానీ, క్రోధం కానీ కనిపించలేదు. ఆమె వైఖరి మాత్రం ఒక అపరిచితుడిని చూసినట్లుగా ఉంది. ఏదో పొరబాటు..... అర్థం కావటం లేదు."


"ఈ గొడవ గురించి నాన్నగారికి తెలుస్తుంది. అప్పుడు మన గురించి పెద్ద వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎలాగా?" 


"మన గురించి వదిలెయ్! నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు శామూ! అసలు గురుకులంలో ఉండాల్సిన దేవయాని మీ దగ్గరకు వచ్చి ఎందుకు ఉంటోంది? గురువుగారు నాగలోకానికి వెళ్తూ మీ దగ్గర దించి వెళ్ళారా లేక ఇంకేదైనా కారణమా?"


"అసలు ఇదంతా కచుడి వలన వచ్చింది..." అంటూ కచుడు మృతసంజీవని కోసం వచ్చిన వృత్తాంతాన్ని వివరంగా చెప్పింది శర్మిష్ఠ.


"ఆగాగు!... మీ అక్కయ్యను కచుడు వివాహం చేసుకోవటానికి తిరస్కరించాడు.. అంతేనా?"


"అవును! అప్పట్నించి అక్క ఉదాసీనంగా ఉండటంతో గురువుగారు మా దగ్గర ఉంచారు. నిన్నటి దాకా అక్క ప్రవర్తన బాగానే ఉంది... కానీ ఈ రోజు ఇలా మిమ్మల్ని చంపాలనుకొని.... ఇదంతా నా దురదృష్టం!..." శర్మిష్ఠ కంఠంలో దిగులు ధ్వనించింది.


యయాతి ఆలోచిస్తున్నాడు. పొరబాటు ఎక్కడ. జరిగింది. బహుశా శర్మిష్ఠ పుట్టిన రోజు నాడు గదిలో పరదా వెనుక ఉంది కచుడని దేవయాని భ్రమపడుతోందా? సరిగ్గా లెక్క వేయాలి..


"శామూ! మీ అక్కయ్య పుట్టిన రోజు నాడు వచ్చింది కచుడని భ్రమపడుతోందని నా అనుమానం. ఎందుకంటే ఆ రోజు నేను పెట్టుకున్న తలపాగా కచుడిది... చారుమతితో నేను పంపిన రాయబారం.... చారుమతిని కచుడితో చూసి ఉండవచ్చు!.... అలా అనుకుంటే ఆమె కచుడిని చంపాలనుకొంది.. కచ్చితంగా నన్ను కాదు!"


శర్మిష్ఠ ముఖంలోకి కళ వచ్చింది.

"అలా అయితే సమస్య లేదు. మీ గురించి అక్కతో వెళ్లి చెప్దామా!"


"ఇప్పుడు వద్దు! మన వివాహం విషయం ఎలాగూ తెలుస్తుంది. అప్పుడు ఆమెతో చెబుదువుగానీ!"


"ఇప్పుడు?.. ఇంత జరిగాక ఇంట్లో ఏమి చెప్పను?"


మహారాజుతో మాత్రం చీర మార్చి కట్టుకొన్న విషయంలో గొడవ మొదలయిందని చెప్పు! కొంత కాలానికి అంతా సర్దుకుంటుంది. త్వరలోనే మన వివాహం జరిగిపోతుంది. అప్పుడు ఈ చిన్న గొడవ తీరిపోతుంది. ఈ విషయాలను మనసులో పెట్టుకొని బాధపడకు! మనిద్దరం సంతోషంగా ఉండటం ముఖ్యం! అంతే! నువ్వు ఒక పని చేయాలి. 'ఏమీ మనసులో పెట్టుకోవద్దని, జరిగిన గొడవ గురించి మరచిపొమ్మని, నగరుకు వెళ్దామని' చెప్పమని నీ చెలుల్లో నమ్మకమైన వాళ్ళను దేవయాని దగ్గరికి పంపించు! ఈ లోపల గురువుగారికి నీ మీద కోపం రాకుండా ఉండటానికన్నమాట!"


"అక్క  రాకపోతేనో!"


"వదిలెయ్! నీ వైపు నుంచి పొరబాటు లేకుండా ఒకసారి పిలిస్తే ఏమవుతుంది? రాకపోతే పోయింది! పెద్దగా మనసుకు పట్టించుకోకు! రేపో మాపో మన వివాహం గురించిన ప్రకటన వస్తుంది కదా! ఆవిడకే అంతా తెలుస్తుంది!"


అంగీకారంగా తలనూపింది శర్మిష్ఠ.


కాసేపు అతడు తన విమాన విన్యాసం గురించి చెప్పాడు. అక్కడ పొందిన సత్కారాల గురించి చెప్పాడు. శర్మిష్ఠ మనసు ఆనందంతో నిండి పోయింది.ఆమె నవ్వుతూ అతడిని ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉంటే అతడు కూడా నవ్వుతూ అన్ని విషయాలు వివరిస్తున్నాడు.


ఇంతలో కణిక వీళ్ళ దగ్గరికి వచ్చి మదనికకు స్పృహ వచ్చిందని చెప్పటంతో, లేచి మదనిక దగ్గరికి వచ్చారిద్దరు.

మదనికను పలకరించి, యయాతి మహాదేవునికి పూజలు చేసి, ఇక తమ వాళ్ళ దగ్గరికి వెళ్తానన్నాడు.

"అప్పుడే వెళ్లాలా!" అన్నట్లుగా మొహం పెట్టింది శర్మిష్ఠ.


నవ్వాడు యయాతి.

ఈ లోపల అతడికి ఫలహారం తెచ్చి పెట్టింది నారాచి.


శర్మిష్ఠతో పాటు కూర్చుని ఫలహారం చేసి బయలు దేరాడు యయాతి.

చెలులతో కలిసి అతడికి వీడ్కోలు పలికింది శర్మిష్ఠ.

ఆమె మనసిప్పుడు తేలికగా ఉంది.


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 53 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page