కచదేవయాని - పార్ట్ 61
- T. V. L. Gayathri

- 1 day ago
- 7 min read
#కచదేవయాని #KachaDevayani #Sharmishtha #Devayani #TeluguSerial #TeluguStory #IndianMythology #MahabharataStories #TeluguKathalu #ManaTeluguKathalu

Kachadevayani - Part 61 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 61 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 09/07/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని. తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"దేవయానిని యయాతికి ఇచ్చి పెళ్లి చేయాలని శుక్రాచార్యుడు అందరి ముందే ప్రకటించాడు... కానీ యయాతి ఒక్క మాటతో ఆ సభనే కుదిపేశాడు! 'నాకు మీ కూతుర్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు' అని అందరి ఎదుటే చెప్పినప్పుడు... గురువు కోపం ఎలా విరుచుకుపడింది? వృషపర్వుడు ఎందుకు భయంతో వణికిపోయాడు? ఈ సంచలన ఘట్టమే టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 61వలో భాగం చదవండి.
తెల్లవారింది. దాసీలకంటే ముందే లేచి తయారయ్యి ఆశ్రమం లోపలికి వచ్చారు శర్మిష్ఠ, నారాచీలు.
"రాత్రి తండ్రీ కూతుళ్లిద్దరు గొడవపడ్డారు. అమ్మాయిగారు చేతి నరం కోసుకున్నారు." అని గుసగుసగా నారాచికి చెప్పింది ముక్త.
"అందుకనా! అమ్మగారు లేచి ఇంకా ఆజ్ఞలు జారీ చెయ్యటం లేదేమిటా అనుకున్నాను" అంది నారాచి కోపంగా.
వంట ఇంట్లోకి వెళ్లి వంట చేసే పనిలో పడింది శర్మిష్ఠ.
అప్పటికింకా దేవయాని నిద్రలేవలేదు.
ఇంతలో ఆశ్రమం బయట పెద్దగా కోలాహలం వినిపించింది.
రథాలు, గుర్రాలు పరిగెడుతున్న చప్పుడు.
దాసీలందరు చూస్తున్నారు.
బయటకు వెళ్ళింది భద్రిణి.
శుక్రాచార్యునికి ఉదయపు ఉపాహారాన్ని, పానీయాలను పంపించింది శర్మిష్ఠ.
భద్రిణి తిరిగి వచ్చింది.
"పరివారంతో చక్రవర్తిని తీసికొని మహారాజు గారు వస్తున్నారు. వెంట యయాతి రాకుమారుడు కూడా ఉన్నాడు." అని దేవయానిని నిద్ర లేపటానికి వెళ్ళింది భద్రిణి.
మిగిలిన దాసీలందరూ యయాతి గురించి మాట్లాడుకోసాగారు.
అప్పటికే రాత్రి సిద్ధం చేసుకొని ఉంచిన ఉపాహారాలను గబగబా వండింది శర్మిష్ఠ. అవి మహారాజులు తినే ఉదయపు ఉపాహారాలు.
"మీకు ముందే తెలుసన్నమాట! ముందే సిద్ధం చేసి పెట్టారు."
అంది ముక్త.
నవ్వి ఊరుకొంది శర్మిష్ఠ. నిన్న సాయంత్రం యయాతి చెప్పాడని చెప్పలేదు.
రాచపరివారాన్ని సాదరంగా ఆహ్వానించాడు శుక్రాచార్యుడు.
అందరూ పెద్ద సమావేశమందిరంలో కూర్చున్నారు.
ఒకళ్ళనొకళ్ళు కుశలప్రశ్నలు వేసుకుంటున్నారు.
అక్కడికే ఉపాహారాలను తీసికొని వచ్చారు శర్మిష్ఠ, నారాచీలు.
కూతురిని చూడంగానే కళ్ళనీళ్లు తిరిగాయి వృషపర్వునికి. బంతిలాంటి పిల్ల చిక్కి సగమయింది.
అందరికి వంగి నమస్కారాలు చేసింది శర్మిష్ఠ. కోడలిని ఆప్యాయంగా చూస్తూ
"బాగున్నావామ్మా! "అంటూ పలకరించాడు నహుషుడు.
పక్కనే కూర్చుని ఉన్న యయాతి కళ్ళల్లో అంతులేని ప్రేమసాగరాలు ఉప్పొంగుతున్నాయి.
మెల్లగా లోపలికి వచ్చింది శర్మిష్ఠ.
అందరూ మాట్లాడుకొంటూ ఉపాహారాలను భుజించారు.
"గురువుగారు! మీకు శుభవార్త చెబుదామని వచ్చాము! "అన్నాడు వృషపర్వుడు సంతోషంగా.
"ఊ! శుభవార్తే అయితే నా దగ్గర కూడా ఒకటుంది. "అన్నాడు ప్రసన్నంగా శుక్రాచార్యుడు.
"అయితే ముందు మీరే చెప్పండి గురువుగారు! "అన్నాడు వృషపర్వుడు.
మౌనంగా ఉన్నాడు శుక్రాచార్యుడు.
దుర్జయుడు, దీర్ఘదర్శి శుక్రాచార్యునికి దగ్గరగా వచ్చి కూర్చున్నారు. 'గురువుగారు మాట్లాడేది కచ్ఛితంగా దానవజాతికి క్షేమాన్ని కలిగించే విషయం అయ్యుంటుంది. బహుశా దివ్యాస్త్రాల గురించి కాబోలు. దేవతలకు దీటుగా ఆయుధ బలాన్ని సంపాదించుకోవటం మీదే గురువుగారు దృష్టి పెట్టి ఉంటా'రని అనుకున్నారు వాళ్ళు.
"చెప్పండి గురువుగారు! "అన్నాడు వృషపర్వుడు.
"విషయం కళ్యాణం గురించి. భగవంతుడు ఎవరెవరికి ఎలా వ్రాసి పెట్టి ఉంటాడో తెలియదు. ఆ మహాదేవుని లీలలు విచిత్రం.... ఎక్కడెక్కడి వాళ్లనో కలిపి బంధాన్ని సృష్టిస్తాడు. ఇలాంటి విషయాల్లో మనం నిమిత్తమాత్రులం.... "ఆగాడు శుక్రాచార్యుడు.
ఈ ఉపోద్ఘాతం ఎవ్వరికీ అర్ధం కాలేదు. విషయాన్ని కొద్దిగానైనా ఊహించిన వాడు పింగళుడు. అతడి మనసు కీడును శంకించింది. పక్కనే ఉన్న యయాతి భుజాన్ని చేతితో నొక్కాడు.
శుక్రాచార్యుడినే చూస్తున్నారందరు.
మళ్ళీ గొంతు విప్పాడాయన.
"భగవంతుని లీల అని ఎందుకనుకుంటున్నానంటే మా అమ్మాయి ఆపదలో చిక్కుకోవటమేమిటి? రాకుమారుడు వచ్చి రక్షించటమేమిటి? మా అమ్మాయి ఇతడినే భర్తగా భావించటమేమిటి?.... శుభప్రదంగా మీరు ఉదయమే ఇలా రావటమేమిటి? దీన్నే దైవలీల అనుకోవాలి. లేకపోతే మా అమ్మాయి నహుష చక్రవర్తి ఇంటికి కోడలవుతుందని నేనస్సలు ఊహించలేదు.. ఇంతకంటే శుభవార్త ఏముంటుంది?" అని ప్రసన్నంగా అందరి వైపు చూశాడు శుక్రాచార్యుడు.
వృషపర్వుని ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు.
నహుషుడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు.
యయాతి చేతులు ఆసనం మీద బిగుసుకున్నాయి. అతడి బలానికి ఆ ఆసనం విరిగిముక్కలయ్యేట్లుగా ఉంది.
ముందుగా తేరుకున్నాడు నహుషుడు.
"ఇదేమిటి ఆచార్యా? వివాహం అంటే ఇద్దరి కుటుంబాలకు ముఖ్యంగా వధూవరులిద్దరికి సంబంధించిన విషయం. మీరు ఏకపక్షంగా మీ అమ్మాయిని మా కోడలు అని అనుకోవటేమిటి? అస్సలు మాకు అటువంటి ఊహ లేనే లేదు."
శుక్రాచార్యుడి ముఖంలోని ప్రసన్నత ఎగిరిపోయింది.
తీక్షణంగా నహుషుడి వైపు చూశాడు.
"అంటే! మీ కుమారుడికి నా కంటే గొప్పవాళ్ళ సంబంధాన్ని వెదుకుతున్నారా?"
"గొప్ప, పేద భేదాలు లేవు ఆచార్యా! ఇక్కడ వధూవరుల ఇష్టానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నాను" సూటిగా చెప్పాడు నహుషుడు.
కలవరపడ్డాడు వృషపర్వుడు. దీర్ఘదర్శి మహారాజుకు సైగ చేశాడు.
"గురువుగారూ ! మీరే మాకు దైవం. దానవజాతికి మీరే ఏడుగడ. మీరు చెప్పినట్లు కానివ్వండి. శుభప్రదంగా అమ్మాయి వివాహం జరిపిద్దాము! అన్ని విధాలుగా చక్రవర్తికి కోడలుగా కావాల్సిన అర్హతలు మన అమ్మాయి గారికి ఉన్నాయి. అలాగే అమ్మాయికి తగిన వరుడు రాకుమారుడు" అన్నాడు మహారాజు గబగబా.
"మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ నా ఇష్టానికి అస్సలు ప్రాధాన్యత లేదా?" కోపంగా అడిగాడు యయాతి.
"రాకుమారా! మీరు మా అమ్మాయి ప్రాణాలను రక్షించారు. మిమ్మల్ని తప్ప మరొకరిని తను భర్తగా అంగీకరించే పరిస్థితిలో లేదు. ఆడపిల్ల..... ప్రేమించానని చెప్పినప్పుడు పురుషుడు కాదనకూడదు. మీరు ఆమెను ఏ స్థితిలో చూశారో నేను అందరి ముందు చెప్పలేను. మీరు మీ కుడిచేతితో అమ్మాయిని పట్టుకున్నారు. ధర్మబద్ధంగా మీరు మా అమ్మాయికి భర్త."
"ఇది ఏ ధర్మశాస్త్రంలో ఉంది? ఆపద సమయంలో శరీరపు స్థితిగతుల గురించి ఆలోచించకూడదంటుంది శాస్త్రం. మీరు ధర్మశాస్త్రాలన్నింటిని ఔపోసన పట్టిన వాళ్ళు! ఇలా మాట్లాడటం మీకు తగని పని!"
నహుషుడి కంఠం ఖంగుమని మోగింది.
శుక్రాచార్యుడి ముఖం కోపంతో జేవురించింది.
పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించాడు వృషపర్వుడు.
నహుషుడి చేతిని పట్టుకొన్నాడు.
ఇంతలో యయాతి లేచి నిల్చున్నాడు.
రెండడుగులు ముందుకు వేశాడు.
"మీ అమ్మాయి ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. మీ అమ్మాయిని అటువంటి దృష్టితో నేను చూడలేదు. ఆ నాడు ఆ పాడుబడిన బావిలో ఒక జంతువు ఉన్నా అలాగే కాపాడేవాడిని. ఆచార్యా! నాకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి. మీకు, మీ అమ్మాయికి నేను దాసుడిని కాను! ... నేను సర్వస్వతంత్రుడైన భూలోక చక్రవర్తి కుమారుడిని.
మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతోందా?ఎందుకు? నేను చక్రవర్తి కుమారుడిని కాబట్టి! అవునా! నాకు బదులు ఏ పేదవాడో వచ్చి బావిలో నుంచి మీ కూతురిని బయటకు తీశాడనుకోండి! మీరు అతడితో ఇలా మాట్లాడతారా? సంబంధాన్ని కలుపుకుంటారా? లేదు! ... లేదు... ఆమె కూడా అతడిని భర్తగా భావించదు.
నేను ఆ సమయంలో మీ అమ్మాయితో అసందర్భంగా ఒక్క మాటైనా మాట్లాడలేదే! నా ప్రవర్తనతో కానీ, చూపులతో కానీ వేరే ఉద్దేశాన్ని వెల్లడించలేదే! వివాహం అంటే అర్ధం ఏమిటి? ముందు ఇరుకుటుంబాలు నిర్ణయించుకోవాలి. ఆలాగే వధూవరులకు ఒకరంటే ఒకరికి అనురాగం ఉండాలి.. నాకు మీ కూతురిని వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. మా కుటుంబానికి అటువంటి ఆలోచన లేదు. మీ అమ్మాయికి సర్ది చెప్పుకోండి ఆచార్యా! మంచి వరుడిని చూచి వివాహం చెయ్యండి! "నిష్కర్షగా చెప్పాడతడు.
నహుషుడి కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. ప్రేమగా యయాతి వైపు చూశాడు.
శుక్రాచార్యుడికి ఘోరమైన అవమానంగా అనిపించింది.
ఎఱ్ఱబడిన కళ్ళతో వృషపర్వుడిని చూశాడు.
"నాకు అవమానం జరిగితే ఏమవుతుందో తెలుసా వృషపర్వా! "అని గర్జించాడు.
వణికిపోయాడు వృషపర్వుడు.
గబక్కున గురువుగారి పాదాల ముందు కూలబడ్డాడు.
"శాంతించండి గురువుగారు! శాంతించండి! నాకు కొంత సమయాన్నివ్వండి! ఇలాంటి విషయాలను మెల్లగా చర్చించి నిర్ణయం తీసికోవాలి. ఇరువురికి ఆవేశం పనికిరాదు. మీరిరువురు మాకు కావలసిన వాళ్ళు... ఒకరు బంధువులు. మరొకరు దైవసమానులు. మాకు ఇద్దరూ గౌరవించవలసిన వాళ్ళు.
యయాతి కుమారుడు చిన్నపిల్లవాడు. పిల్లలకు ధర్మ శాస్త్రాల గురించి ఏం తెలుస్తుంది?... మనలో మనకు అభిప్రాయ భేదాలు ఎందుకు? నాకు మా అమ్మాయి కంటే దేవయాని పట్ల ఎనలేని ప్రేమ... చిన్నప్పటి నుండి మీరు గుర్తించే ఉంటారు.... గురువుగారు! అంతా సర్దుకుంటుంది. మీరు అనుకున్నట్లే జరుగుతుంది. "
అని లేచి నహుషుడి చేతిని పట్టుకొని,
"నాతో రండి చక్రవర్తీ! మనం సావధానంగా మాట్లాడుకొందాము! "అని మరొక భవనం లోపలికి తీసుకొని వెళ్ళసాగాడు.
మిగిలిన వాళ్ళందరూ ఆయనను అనుసరించారు.
వాళ్ళు వెళ్లిన వైపే చూస్తూ నిలుచున్నాడు శుక్రాచార్యుడు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 62 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |






Comments