కచదేవయాని - పార్ట్ 62
- T. V. L. Gayathri
- 1 day ago
- 6 min read
#కచదేవయాని #KachaDevayani #Sharmishtha #Devayani #TeluguSerial #TeluguStory #IndianMythology #MahabharataStories #TeluguKathalu #ManaTeluguKathalu

Kachadevayani - Part 62 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 62 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 19/07/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని. తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. వృషపర్వుడు, నహుషుడు, యయాతి సమావేశమవుతారు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"ప్రేమ గెలుస్తుందా?... గురువు కోపం గెలుస్తుందా?... ఆ సభలో మొదలైన తుఫాను ఇదే!"
టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 62వ భాగం చదవండి.
వృషపర్వుడి వెంట వెళ్లి అందరూ వేరే భవనంలోకి కూర్చున్నారు.
"చక్రవర్తీ! పెద్దాయన ఏకపక్షంగా మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దు. ఆయన గురువు. మేము శిష్యులం. మా జాతి రక్షణకై ఆయన అహర్నిశలు పాటుబడుతుంటారు. ఆయన తపస్సు చేసి, మహాదేవుడిని మెప్పించి ఎన్నో సిద్ధులు పొందారు. వాటిల్లో మృతసంజీవని విద్య ఒకటి.
మేమంటే ఆయనకు పుత్రవాత్సల్యం. ఈ రాజ్యం, ఈ అధికారం ఆయన వల్ల మాత్రమే మాకు లభించాయి. పూర్వం బ్రహ్మదేవుడు భూమికి పైన ఉన్న లోకాలను దేవజాతి వాళ్లకు, క్రింద ఉన్న లోకాలను దానవజాతి వాళ్లకు పంచి ఇచ్చాడు. మధ్యలో ఉన్న భూమి మాత్రం మానవులకు వచ్చింది.
అయితే దేవతలు పరమేష్టిని మెప్పించి భూమిపై అధికారాన్ని సంపాదించి, వారి ప్రతినిధులుగా మానవులను రాజులుగా నియమించారు. అయితే మా జాతి వాళ్ళు కూడా భూమి మీద అధికారానికై పోరాడుతూ కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలా ఏర్పడినవే మా రాజ్యాలు.
దేవతలకు ఈ విషయం నచ్చదు. అందుకే మా రెండు జాతుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. గురువుగారి అండతోనే మేము ఈ భూమి మీద బ్రతుకగలుగుతున్నాము." అని ఆగాడు వృషపర్వుడు.
"మీ పట్ల గురువుగారికి ఉన్న నిబద్ధతను శంకించటం లేదు మహారాజా! మేము కూడా ఆయనను గౌరవిస్తాము. ఇక్కడ విషయం వివాహానికి సంబంధించినది. సరే! గురువుగారి మీద గౌరవంతో నేను దేవయానిని కోడలిగా అంగీకరిస్తాను. కానీ ఆమెను చేసుకొని కాపురం చేయవలసిన మా యువరాజుకు ఇష్టం ఉండాలి కదా!
రాజవంశాల్లోని స్త్రీలకు స్వయంవరం అనే సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు ఇష్టమైన వరునితోనే తల్లిదండ్రులు వివాహాన్ని జరిపిస్తున్నారు కదా! వారి స్వాతంత్ర్యాన్ని ఎక్కడా ఎవ్వరూ హరించటం లేదు. మరి పురుషుడికి వివాహం విషయంలో ఇష్టాఇష్టాలు ఉండవా? నా కుమారుడికున్న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని గురువుగారి మీద గౌరవంతో నేనే హరించివేయటం ఎంతవరకు సమంజసం?
మీకు తెలియని విషయం చెప్పనా? నా కుమారుడు మీ కుమార్తెను చూడటం ఇది మొదటిసారి కాదు! మనకు తెలియకుండా ఇంతకు ముందు నుంచి వాళ్ళు కలుసుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు....." ఆగాడు నహుషుడు.
ఉలిక్కిపడ్డాడు యయాతి.
'అమ్మా!' అనుకొన్నాడు పింగళుడు.
నివ్వెరపోయాడు వృషపర్వుడు.
"అమ్మాయిని ఏమీ అడగకండి! వీళ్ళు చిన్నపిల్లలు. ఆ వయసులో మనం కూడా అలాగే ఆలోచించిన వాళ్ళమే!" నహుషుడి ముఖంలో సన్నటి నవ్వు తళతళలాడింది.
"ఈ వివాహం కేవలం మన ఇరువురి కుటుంబాలకు మాత్రమే సంబంధించినది కాదు! పిల్లల కలలకు, కోరికలకు సంబంధించినది. గురువుగారితో మెల్లగా విషయాన్ని చెబుదాము! ఆయన కూతురికి మంచి సంబంధాన్ని తెచ్చి వివాహం చేద్దాము!.... ఒకవేళ ఆయన కోపం ఇంకా తగ్గకపోతే.... ఆయన పాదాల ముందు మోకరిల్లి ఆయనకు నేను కూడా దాస్యం చేస్తాను!..."
నహుషుడు చెప్పిన ఆఖరు మాట విని చివ్వుమని లేచాడు యయాతి.
"దాస్యం చేయటానికి మనం ఆయనకు హాని చేశామా? అపరాధులమా? నాకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోవటానికి ఇంత చర్చ అనవసరం!" అన్నాడు కోపంగా.
వృషపర్వుడు లేచి వచ్చి యయాతి చేతిని పట్టుకొన్నాడు.
"ఆవేశం ఎల్లవేళలా పనికిరాదు కుమారా! మీతో నా కుమార్తె వివాహానికి నేను ఒప్పుకోకపోతే!... మీరు దేవయానిని స్వీకరిస్తారా?"
తలను కొట్టుకొన్నాడు దీర్ఘదర్శి.
"ఇదేమిటి మహారాజా! ఏం మాట్లాడుతున్నారు?"
దీర్ఘదర్శి వైపు తిరిగాడు వృషపర్వుడు.
"నీకయినా అర్థం అవుతుందనుకొన్నాను... దీర్ఘా! గురువుగారి అండ లేకపోతే ఏమి జరుగుతుందో తెలుసా?... మన దానవజాతి ఉనికికే ప్రమాదం! నా కూతురి జీవితం కోసం నేను జాతిని బలిపెట్టలేను!
నెమ్మదిగా ఆలోచించండి యువరాజా! మా జాతి క్షేమం కోసం మీరు గురుపుత్రికను వివాహం చేసుకోండి! అంతగా అయితే కొంతకాలం అయ్యాక దేవయాని కాస్త మెత్తబడ్డాక మా అమ్మాయిని రెండవ భార్యగా చేసుకుందురు గానీ!
ఎంతో మంది రాజులు తమ రాజ్య విస్తరణ కోసం రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు... బహుభార్యాత్వం లోకంలో ఉన్నదే కదా! అలాగే ఇక్కడ కూడా!.. కావాలంటే మా అమ్మాయితో మాట్లాడండి! తను కూడా ఖచ్చితంగా నాలాగే ఆలోచిస్తుంది. వ్యక్తి ప్రయోజనం కంటే జాతి ప్రయోజనం ముఖ్యం అని ఆమెకు కూడా తెలుసు." అని కూర్చున్నాడు వృషపర్వుడు.
దుర్జయుడికి కళ్ళనీళ్లు తిరిగాయి.
వచ్చి మహారాజు పక్కన నిలబడ్డాడు.
అంతటా నిశ్శబ్దం. ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు.
ఇంతలో ఆ భవనం లోకి పరుగెత్తుకొంటూ భద్రిణి వచ్చింది.
ఆమె చాలా కంగారుగా ఉంది. పరుగెత్తుకొని వచ్చిందేమో రొప్పుతోంది.
"మహారాజా! మహారాజా!"
"ఏమైంది?" అని లేచాడు వృషపర్వుడు.
"గురువుగారు.... గురువుగారు..." ఆమె నోట్లోంచి మాట రావటం లేదు.
"చెప్పు సరిగ్గా!" గద్దించాడు దీర్ఘదర్శి.
"గురువుగారు అమ్మాయిగారిని తీసికొని ఆకాశ మార్గంలో వెళ్లిపోయారు. ఆరావళీ పర్వత ప్రాంతంలో ఉన్న ఆశ్రమానికి వెళ్తున్నారట! తమని కలుసుకోవటానికి ఎవ్వరినీ రావొద్దన్నారు." అంటూ చెప్పింది భద్రిణి.
ఒక్కసారిగా ఆసనంలో కూలబడ్డాడు వృషపర్వుడు.
ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక - 63 వ భాగం త్వరలో మీ ముందుకు రానుంది.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 63 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |


