కచదేవయాని - పార్ట్ 63
- T. V. L. Gayathri

- Jul 27
- 6 min read
Updated: Aug 3
#కచదేవయాని #KachaDevayani #Sharmishtha #Devayani #TeluguSerial #TeluguStory #IndianMythology #MahabharataStories #TeluguKathalu #ManaTeluguKathalu

Kachadevayani - Part 63 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 63 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 27/07/2026
శుక్రాచార్యుడు దానవులను విడిచిపెట్టాడనే వార్తతో దేవేంద్రుడు ఆనందపడతాడు. ఇదే సరైన సమయమని భావించి దేవసేనను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
మరోవైపు యయాతి–శర్మిష్ఠల నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతుండగా కచుడు నిరాయుధుడిగా దానవరాజ్యంలోకి ప్రవేశిస్తాడు. దానవులు అతడిని వెంటనే బంధిస్తారు. దీర్ఘదర్శి కత్తి దూసి బెదిరిస్తాడు.
కచదేవయాని - పార్ట్ 63 చదవండి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని. తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. వృషపర్వుడు, నహుషుడు, యయాతి సమావేశమవుతారు. శుక్రాచార్యుడు కూతురితో కలిసి ఆరావళీ పర్వత ప్రాంతంలోని ఆశ్రమానికి వెళ్తాడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అమరావతి.
దేవేంద్రుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
గంధర్వులు, దేవతలు, కొంతమంది మునులు సమావేశానికి వచ్చారు.
దేవేంద్రుడు అందరినీ చూశాడు. సంతృప్తిగా తలాడించాడు.
"మన గూఢచారుల నుండి ఒక మంచి సమాచారం వచ్చింది. వృషపర్వుడికి, శుక్రాచార్యుడికి పెద్ద గొడవ జరిగిందట!దానవులను వదలి కూతురుతో సహా ఆ మంత్రవేత్త ఆరావళీ పర్వతప్రాంతానికి వెళ్లి పోయాడట!"అని చెప్పి నవ్వుతూ అందరినీ చూశాడు దేవేంద్రుడు.
దేవ, గంధర్వ జాతి వాళ్ళు సంతోషంగా జయజయ ధ్వానాలు చేశారు. మునులు మాత్రం ఆలోచనలో పడ్డారు.
"ఇదే మంచి సమయం!గురువు లేకపోతే దానవరాజు అశక్తుడవుతాడు.వెంటనే యుద్దానికి వెళదాం!"
మళ్ళీ జయజయ ధ్వానాలు హోరుమన్నాయి.
బృహస్పతికి దేవేంద్రుడి ప్రతిపాదన నచ్చలేదు.
"దేవేంద్రా!తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. అన్ని లోకాలు శాంతిగా, సుభిక్షంగా ఉండటమే మనం కోరుకోవాలి! యుద్ధం వలన నష్టం తప్ప మరొక ప్రయోజనం ఉండదు!ఆలోచించు!"అన్నాడు నెమ్మదిగా.
దేవేంద్రుడు సింహాసనాన్ని దిగి వచ్చాడు.
గురువుగారికి దగ్గరగా కూర్చున్నాడు.
"గురుదేవా !ఇంతకు ముందు దానవులు మన మీద ఎన్నోసార్లు యుద్దానికి వచ్చారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి వలన మనం వాళ్ళని గెలవలేకపోయాము. ఇప్పుడు మన దగ్గర మృతసంజీవని విద్య కూడా ఉంది. వాళ్ళను మాత్రం రక్షించే నాథుడు లేడు.ఇది మనకు లభించిన మంచి అవకాశం!మన శక్తి ఏమిటో దానవరాజుకు తెలియాలి!కాదనకండి!"అన్నాడు అనునయంగా.
"సరే!నువ్వు చెప్పిందే బాగుందనుకున్నా ప్రస్తుతం జయంతుడు,గంధర్వ సేనాపతి హూహు ఇక్కడ లేరు. ఇద్దరూ జన లోకానికి వెళ్లారు. దేవసేనకు నాయకత్వం వహించాలంటే ఎవరున్నారు? సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచించు!"అన్నాడు బృహస్పతి.
ఎలాగయినా యుద్దాన్ని నివారించటానికి ప్రయత్నిస్తున్నాడు దేవగురువు.
"వృషపర్వుడిని గెలవటానికి మన కచుడు చాలు గురుదేవా!తోడుగా అష్ట వసువులు వెళ్తారు. ప్రక్కన గంధర్వ చక్రవర్తి విశ్వావసు ఉండనే ఉన్నాడు.మన దేవసైన్యాన్ని తక్కువగా అంచనా వేయకండి!"
తలను పనికించాడు బృహస్పతి.
"దేవేంద్రా!అన్ని విషయాలు తెలుసుకొని యుద్దానికి వెళ్ళటం మంచిది!ప్రస్తుతం దానవరాజు దగ్గరకి నహుష చక్రవర్తి పరివారంతో సహా విడిది చేసి ఉన్నాడు. ఆయన పెద్ద కొడుకు యయాతి వీరత్వాన్ని మొన్న మనం చూశాము. ఒకవేళ దానవులకు తోడుగా నహుషుడు నిలబడితే యుద్ధాన్ని గెలవగలమా? ఆలోచించాలి!"అని చెప్పాడు త్వష్ట. త్వష్ట ద్వాదశాదిత్యులలో ఒకడు.
లేచి నిల్చున్నాడు దేవేంద్రుడు.
"నహుషుడు ఈ మధ్య కాలంలో యుద్దాలు చేశాడా? ఎప్పుడూ యజ్ఞయాగాదులలో మునిగి ఉంటాడు. ఇక ఆయన కుమారులు!చిన్న చిన్న వాళ్ళను ఎదుర్కోలేమా? అవసరం అయితే జయంతుడిని, హూహును పిలిపిస్తాను!మరొక విషయం!మన దగ్గర విమానాలు, దివ్యాస్త్రాలు ఉన్నాయి...."దేవేంద్రుడి మాట పూర్తి కాకుండానే దిగ్గన లేచాడు బృహస్పతి.
"దానవుల దగ్గర విమానాలు, దివ్యాస్త్రాలు లేవు!శత్రువు బలహీనమైనప్పుడు మన కున్న దివ్యాస్త్రాలను ఉపయోగించరాదంటుంది ధర్మశాస్త్రం.దానవులను నువ్వు కేవలం బలపరాక్రమాలతో ఎదుర్కోవటం బాగుంటుంది!వాళ్లకు తెలియని మంత్రాస్త్రాలను ప్రయోగించటం నీకు శోభస్కరం కాదు!"గట్టిగా చెప్పాడు బృహస్పతి.
"ఈ నీతి వాళ్ళకుందా? ఎప్పుడైనా దానవులు ధర్మయుద్ధం చేశారా? ఎప్పుడూ కుటిల నీతితో మన వాళ్ళను చంపటమే! తపస్సులను చేసుకొనే ముని సంఘాల వాళ్ళనయినా వదిలి పెట్టరు కదా! మొన్నటికి మొన్న శరావతి తండ్రిని ఆయన శిష్యులను కిరాతకంగా చంపలేదా? పైగా శరావతి మీకు కాబోయే కోడలు కూడా!"అంత కంటే తీవ్రంగా చెప్పాడు దేవేంద్రుడు.
"అవును! అవును!"అన్నారు మునులు కూడా.
"వాళ్ళు ఎన్ని సార్లు మన మీద దండెత్తి రాలేదు చెప్పండి గురుదేవా!వృషపర్వుడు ఇప్పటికి దొరికాడు! ఇక నహుషుడు అతడి పక్కన నిలబడ్డా మన సైన్యాన్ని గెలుస్తాడని నమ్మకం లేదు! నేను అన్నీ ఆలోచించే చెబుతున్నాను! ఇప్పుడు దానవరాజ్యాన్ని ఆక్రమించి, దానవులను పాతాళానికి పంపిద్దాము! కాదనకండి గురుదేవా!"
దేవేంద్రుడు ఒకసారి నిర్ణయించుకుంటే వెనక్కు తిరిగి చూడడన్న విషయం బృహస్పతికి తెలుసు. అయినా యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాడాయన.
"జయాపజయాలు దైవాధీనాలు.నువ్వు అనుకున్నట్లు జరగకపోతే!యుద్ధంలో దానవులు గెలిస్తే!..... రెండోవైపు కూడా ఆలోచించు దేవేంద్రా!"
గురువు మాటలకు పెద్దగా నవ్వాడు దేవేంద్రుడు.
"వృషపర్వుడి వెనుక శుక్రాచార్యుడు ఉంటే నేను యుద్ధం గురించి ఆలోచించే వాడినే కాదు! వాళ్ళను ఇప్పుడు గెలవటం సులభం గురుదేవా! మీరు భయపడకండి!పోయినసారిలాగా వాళ్ళ చేతిలో దెబ్బలు తిని వస్తామని అనుకోకండి!మీరు చూస్తూ ఉండండి! ఈసారి విజయలక్ష్మిని తీసికొని వస్తాము! ఆశీర్వదించండి!" అంటూ గురువు పాదాలకు నమస్కారం చేశాడు దేవేంద్రుడు.
"అవును గురుదేవా! మనకు శకునాలు బాగున్నాయి!... యుద్దానికి వెళ్ళాల్సిందే! మీరు పిరికిమందు పోయకండి!వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు!" అన్నాడు గంధర్వ చక్రవర్తి విశ్వావసు.
అందరూ మళ్ళీ జయజయ ధ్వానాలు చేశారు.
చేసేదేమీ లేక దేవేంద్రుడి తల మీద చెయ్యి వేసి "విజయోస్తు!" అన్నాడు బృహస్పతి.
సమావేశం పూర్తయింది.
దేవసైన్యం దానవుల మీద యుద్దానికి సిద్ధమవుతోంది.
***********
ఆ సాయంత్రం తోటలో శర్మిష్ఠతో ముచ్చట్లు చెబుతూ కూర్చున్నాడు యయాతి. రెండు రోజుల్లో వాళ్లకు నిశ్చితార్థం జరగబోతున్నది.
దానవులు ఉత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటూ సంబరంగా ఉన్నారు.
ఇంతలో ఆకాశంలో ఒక వెలుగు కనిపించింది.
చూశాడు యయాతి.
క్రమంగా వెలుగు భూమికి దగ్గరవుతున్నది.
వెంటనే గుర్తు పట్టాడు యయాతి.
అది కచుడి విమానం!
"నువ్వు మందిరానికి వెళ్ళు శామూ!" అంటూ
పరుగు లాంటి నడకతో తోటలో నుండి వెళ్లిపోయాడతడు.
అప్పటికే విమానం నగర శివార్లలో ఆగింది.
నగర రక్షకదళం విమానాన్ని చుట్టు ముట్టింది.
విమానాన్ని దిగాడు కచుడు.అతడి దగ్గర ఆయుధాలు లేవు. కనీసం కవచాన్నయినా తొడుక్కొని రాలేదు.
నిరాయుధుడిగా ఉన్న అతడిని బంధించారు దానవులు.
ప్రతిఘటించలేదు కచుడు.మాట్లాడకుండా దానవులకు లొంగిపోయాడు.
సేనాధిపతి దీర్ఘదర్శి వచ్చాడక్కడికి.
అప్పటికే వృషపర్వుడికి వార్తను చెప్పటానికి వెళ్లారు భటులు.
కచుడిని చూసి వికటాట్టహాసం చేశాడు దీర్ఘదర్శి.
"కచా! ఒంటరిగా మా సీమలోకి వచ్చావు! ఇంక తప్పించుకోలేవు! ఆఖరిసారి నీ వాళ్ళను తల్చుకో! నీ తల నరికి మా మహారాజుకు బహుమానంగా పంపిస్తాను!" అంటూ కత్తి దూశాడు.
దానవులు సంతోషంగా ఎగురుతున్నారు.
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |







Comments