కచదేవయాని - పార్ట్ 64
- T. V. L. Gayathri

- 17 hours ago
- 7 min read

Kachadevayani - Part 64 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 64 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 03/08/2026
కచ దేవయాని – 64 భాగంలో కథ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరుగుతుంది. శత్రువుగా బంధించబడిన కచుడిని యువరాజు యయాతి స్వయంగా విడిపించడంతో దేవాసుర సంగ్రామానికి ముందు జరిగిన అరుదైన మైత్రి క్షణం ఆవిష్కృతమవుతుంది. ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన కచుడు, యయాతి ఇప్పుడు యుద్ధరంగంలో ప్రత్యర్థులుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ రాబోయే దేవాసుర యుద్ధాన్ని ఆపేందుకు కచుడు చేసిన చివరి సంధి ప్రయత్నం ఫలిస్తుందా? దేవయాని, శర్మిష్ఠ, శుక్రాచార్యుడు తీసుకున్న నిర్ణయాలు ఈ మహాసంగ్రామాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవాలంటే కచ దేవయాని భాగం 64ను తప్పకుండా చదవండి.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని. తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. వృషపర్వుడు, నహుషుడు, యయాతి సమావేశమవుతారు. శుక్రాచార్యుడు కూతురితో కలిసి ఆరావళీ పర్వత ప్రాంతంలోని ఆశ్రమానికి వెళ్తాడు. కచుడు దానవులకు బందీ అవుతాడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"ఆగు సేనాపతీ! అతడిని వదిలెయ్యండి!" ఉరుములాగా వినిపించింది యయాతి కంఠం.
తిరిగి చూశారు సైనికులు.
గుర్రం మీద యయాతి.
"యువరాజా!ఇతడు మనకు శత్రువు!ఇతడు కనిపిస్తే తక్షణం వధించాలని మహారాజు ఆజ్ఞ జారీ చేశారు."చెప్పాడు దీర్ఘదర్శి.
"మహారాజుతో నేను మాట్లాడతాను! ముందు అతడిని వదిలెయ్యండి!" అంటూ గుర్రాన్ని దిగి తన కత్తితో కచుడిని బంధించి ఉన్న ఇనుప గొలుసులను ఖండించాడు యయాతి.
"ఏమిటిది కచా! ఇలా వస్తే ప్రమాదం కదా!" అని అడిగాడు యయాతి.
"ప్రమాదం దానవ రాజ్యానికి వస్తోంది యయాతి! నిన్ను హెచ్చరిద్దామని వచ్చాను.... దేవేంద్రుడు యుద్దానికి సిద్ధపడుతున్నాడు... దేవసైన్యం నా ఆధ్వర్యంలో కదులుతుంది. మీతో యుద్దానికి నేనే వస్తున్నాను!"
నివ్వెరపోయాడు యయాతి.
"మా వైపు మృతసంజీవని ఉంది! మీ వైపు ఏముంది? ఆలోచించు!.,.. దానవరాజుతో సంప్రదించి సంధి ప్రయత్నాలు చెయ్యి! అది చెప్పటానికే వచ్చాను! లేదంటే గురువుగారిని పిల్చుకొని రండి! అసలాయన దానవులను వదలి ఎందుకు వెళ్లినట్లు?"
కచుడి మాటలు వింటున్న దీర్ఘదర్శికి విషయం అర్ధం అయింది.
కచుడు యయాతి పాత మిత్రులు!
"పద! ముందు భవనానికి వెళ్లి మాట్లాడుకొందాం!" అని కచుడి చేతిని పట్టుకొన్నాడు యయాతి.
"సమయం లేదు మిత్రమా! శరావతికి చెబుదామని వచ్చాను! నువ్వు నాతో పాటు వస్తావా!మాట్లాడుకుంటూ వెళదాము! మళ్ళీ నిన్ను ఇక్కడ దించి నేను అమరావతికి వెళ్తాను!"
"పద!" అని దీర్ఘదర్శి వైపు తిరిగి "సేనాపతీ! నేను కచుడి వెంట వెళ్తున్నట్లు నాన్నగారికి చెప్పండి!" అని కచుడితో పాటు విమానం దగ్గరికి వెళ్ళాడు యయాతి. అతడి వెంట పింగళ శక్తిధరులు కూడా వెళ్లారు.
కాసేపటికి విమానం ఆకాశంలో వెలుగులు చిమ్ముతూ వెళ్లిపోయింది.
విషయాన్ని తెలుసుకున్న వృషపర్వుడు మంత్రి సేనాపతులతో కలిసి నహుషచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. అందరూ కలిసి భవిష్యత్ప్రణాళిక గురించి మాట్లాడుకొంటున్నారు.
విమానంలో కచుడి ప్రక్కన కూర్చున్నాడు యయాతి.
"ఇప్పుడు చెప్పు!గురువుగారు ఎందుకు వెళ్లారు?" అడిగాడు కచుడు.
"అది చాలా పెద్ద కథ!" అంటూ జరిగిన కథను చెప్పుకొచ్చాడు యయాతి.
"ఏం చేద్దాం! కూతురి కోసం ప్రాణాలిస్తాడు పెద్దాయన!" అని నిట్టూర్చాడు కచుడు.
"ఆయన కూతురి కోసం ఆయన ప్రాణాలు తీసుకుంటే ఎవరికీ నష్టం లేదు! వచ్చి వచ్చి సమస్య నా మెడకు చుట్టుకొందే! అదీ నా బాధ!"
సానుభూతిగా మిత్రుడి వంక చూశాడు కచుడు.
"అలా చూడకు! అసలు దీనికంతటికీ కారణం నువ్వు! నిన్ను ద్వేషిస్తున్న దేవయానిని గురువుగారు శర్మిష్ఠ దగ్గరికి పంపించటంతో మొదలైంది... నిజం చెప్పు! నువ్వు దేవయానిని తిరస్కరించటానికి ఆమె మనస్తత్వం కారణమా? లేక ఇంకేదైనా కారణముందా?"
కచుడిని సూటిగా అడిగాడు యయాతి.
"నిజమే చెప్పాలంటే... నేను ఈ భూమి మీదకు మృతసంజీవని విద్యను సాధించటానికంటే ముందు శరావతి కోసం వచ్చాను!"
"అంటే?"
"ఇంతకు ముందు జరిగిన దేవదానవ యుద్ధంలో దేవతల వైపు భీకరంగా పోరాడిన వాడు శరావతి తండ్రి అగ్నిదత్తుడు. ఆయన ఆ యుద్ధంలో నన్ను జయంతుడిని కూడా కాపాడాడు. యుద్ధంలో మా దేవసైన్యం ఓడిపోయింది. దెబ్బతిన్న దేవసైన్యానికి అశ్వనీ దేవతలు వైద్యం చేస్తున్నారు. భూమి మీద గాయపడిన మునులకు అగ్నిదత్తుడు తన ఆశ్రమంలో చికిత్స చేస్తున్నాడు. మూలికలు తెచ్చుకోవటానికి అడవికి వెళ్లిన అగ్నిదత్తుడిని అతి కిరాతకంగా చంపేశారు దానవులు.
అప్పుడు నాన్నగారితోపాటు నేను కూడా వచ్చాను. నాన్నగారికి అగ్నిదత్తుడు మంచి మిత్రుడు. కొంత కాలం గడిచాక దేవేంద్రుడు మృతసంజీవని విద్య కోసం నన్ను గురువుగారి దగ్గరికి పంపించటం జరిగింది. కాస్త సమయం చిక్కితే నేను శరావతిని చూడటానికి వచ్చేవాడిని!.... దేవయాని గురించి నా మనసులో వేరే ఆలోచన లేనే లేదు... నన్ను నమ్మతావా యయాతీ!"
"నమ్ముతాను! తర్వాత దేవయాని నీ గురించి ఆశలు పెట్టుకున్నట్లుంది..... నువ్వు తనని తిరస్కరించటంతో ఆమె మనసు గాయపడి ఉంటుంది.శర్మిష్ఠకు నేను సన్నిహితంగా రావటాన్ని ఆమె భరించలేక పోతోంది."
మాట్లాడలేదు కచుడు.
"రాబోయే యుద్దాన్ని ఆపటానికి దానవ రాజు దగ్గర ఒకటే మార్గం ఉంది! దేవతలతో సంధి చేసుకొని దానవులను తీసుకొని పాతాళానికి వెళ్ళటం! అంత కంటే వేరే దారి లేదు." అన్నాడు యయాతి.
"ఒక వేళ నువ్వు దేవయాని విషయంలో మనసు సర్దుకొని గురువుగారిని పిల్చుకొని వస్తే!.... దేవేంద్రుడు యుద్దాన్ని విరమించు కొంటాడు." కచుడి మాట విని చిన్నగా నవ్వాడు యయాతి.
"సరే! ఈ యుద్దానికి కారణం నేను దేవయానిని తిరస్కరించటం అని కదా నీ అభిప్రాయం!ఇంతకు ముందు జరిగిన యుద్దాలకు సరైన కారణాలు ఏవైనా ఉన్నాయా?"
ఈ ప్రశ్నకు జవాబు లేదు.
"నువ్వు కూడా ఆలోచించు కచా! కేవలం నా కారణంగా యుద్ధం వస్తుందా?"
"పూర్తిగా నువ్వే కారణం కాదు యయాతీ!.... పగలు ప్రతీకారాలతో పెద్ద పెద్ద వాళ్ళే సహనం లేకుండా ప్రవర్తిస్తుంటే ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. దేవేంద్రుడేమన్నా తక్కువ వాడా? ఆయన కూడా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటే ఏం చేస్తాము?"
"ఈ రెండు జాతుల మధ్య శత్రుత్వం దినదినానికి ఎక్కువవుతూ ఉంటున్నదే తప్ప ఎవ్వరూ శాంతి కోసం ప్రయత్నాలు చేయటం లేదు. ఎవరికి వాళ్ళు అవతలి వాళ్ళను గెలవటానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు." అంటూ
నిరాశగా వెనక్కు వాలాడు యయాతి.
"యుద్దాన్ని ఆపటానికి ఇంకేదైనా మార్గం ఉందేమో ఆలోచిద్దాము!"
అంటూ కచుడు విమానాన్ని కిందకు దింపసాగాడు.
అరుణకేశి మహర్షి ఆశ్రమంలో కూర్చున్నారందరు.
"నా సలహా వింటావా యయాతీ!" అడిగాడు మహర్షి.
"దేవయానిని భార్యగా నేను ఊహించుకోలేను మహర్షీ! ఇంకేదైనా చెప్పండి వింటాను!శర్మిష్ఠను జీవితాంతం దాసీగానే ఉంచుకోవాలని దేవయానికి పట్టుదల. అదొక్కటే ఆమె కోరిక! శర్మిష్ఠ మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకున్న కూతురి కోసం గురువుగారు ప్రపంచాన్ని వదిలేస్తున్నారు. కూర్చుని ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాల్సిన పెద్దమనిషి అధర్మపరుడైనాడు. ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడితే దాన్ని వివాహం అంటూ ధర్మవిరుద్ధంగా మాట్లాడితే నేనేం చెయ్యను? నేను ఒప్పుకోలేదు!" యయాతి కంఠంలో ఆగ్రహమే కాదు ఆవేదన కూడా ధ్వనించింది.
మౌనంగా ఉన్నాడు అరుణకేశి మహర్షి.
"పెద్దనాన్న గారు! నేను చెప్పేది వినండి! యయాతి నాకు మిత్రుడు. యుద్ధంలో అతడిని అతడి పరివారాన్ని రక్షించడానికి మీరు దానవుల వైపు ఉంటారా?"
అభ్యర్థించాడు కచుడు.
"నా సొంత బావగారిని పొట్టన బెట్టుకున్నారు. వాళ్లకు నేను ఉపకారం చెయ్యాలా?"
"వద్దు వద్దు మహర్షీ! మీరు మా వైపు రావద్దు! దేవతల వైపు ఉండండి! మాకు యుద్ధాలు కొత్త కాదు!" అని కచుడిని చూస్తూ
"కచా! నువ్వు నన్ను, నా పరివారాన్ని అవమానిస్తున్నావు!" అన్నాడు యయాతి కోపంగా.
"కోప్పడకు మిత్రమా! రక్షించటం అంటే మీ వైపు గాయపడిన వాళ్ళను మృతసంజీవని విద్య ద్వారా బ్రతికించటం అని ! నేను నీ బలపరాక్రమాలను కించపరచటం లేదు!నువ్వు మానవులతో యుద్ధం చేసి గెలిచిన వాడివి... దేవతలతో యుద్ధం అంటే అంత తేలిక కాదు! ఒకసారి జయంతుడు బరిలోకి దిగితే అతడిని ఎదుర్కోవటం చాలా కష్టం! అతడికి తోడు హూహు ఉన్నాడు..."
"అవును యయాతీ! అవతలి వాళ్ళ బలాబలాలను కూడా సరిగ్గా అంచనా వెయ్యాలి. ఇక్కడ వీరత్వం కంటే తెలివితేటలు ముఖ్యం!" కచుడిని సమర్థించాడు అరుణకేశి మహర్షి.
చాలా సేపు యుద్ధం గురించి చర్చించుకుంటూ కూర్చున్నారు వాళ్ళు.
కచుడి అభ్యర్థన మేరకు దానవులలో ముఖ్యమైన వాళ్ళను మృతసంజీవని విద్య ద్వారా బ్రతికిస్తానని అరుణకేశి మహర్షి మాటిచ్చాడు.
శరావతిని ఏకాంతంలో కలుసుకొన్నాడు కచుడు.
"మళ్ళీ యుద్ధం వస్తోంది! ఈ సారి ఎంతమంది సామాన్యులు బలి అవుతారో?" శరావతి కళ్ళల్లో నీళ్లు.
ఆమె తన తండ్రిని గుర్తుతెచ్చుకుంటున్నదని తెలుసు కచుడికి.
"ఈ సారి యుద్ధంలో పెద్ద ఎత్తున మానవులు కూడా పాల్గొంటున్నారు శరావతీ! ఏది ఏమైనా మరణించిన వారిని బ్రతికించటమే కాదు క్షతగాత్రులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి! ఆ బాధ్యతను పూర్తిగా మీ మీద పెడుతున్నాను. ఈ యుద్ధం యయాతికి సంబంధించింది. ఈ యుద్ధంలో దానవులు గెలిస్తే శర్మిష్ఠతో యయాతి వివాహం జరుగుతుంది."
"లేకపోతే!"
"నీ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు శరావతీ! ముందు ముందు ఏం జరుగుతుందో మన ఊహకు మాత్రం అందదు! గెలుపోటములు ఎవరివైనా యుద్ధం అన్నది విషాదాన్ని మిగుల్చుతుంది."క చుడి ముఖంలో నిర్వేదం. ఏటో చూస్తున్నాడతడు.
ఆ రాత్రికి యయాతి వాళ్ళను దానవరాజ్యంలో దింపి కచుడు అమరావతికి వెళ్లటానికి విమానాన్ని కదిలించాడు.
"ఇక రణరంగంలో కలుసుకుందాము మిత్రమా!" అని కచుడికి వీడ్కోలు పలికాడు యయాతి.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 65 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |






Comments