కచదేవయాని - పార్ట్ 76

Kachadevayani - Part 76 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 76 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 04/11/2026
పదిహేను రోజుల ప్రయాణం తర్వాత ప్రతిష్ఠానపురంలో ఘనమైన స్వాగతం లభించింది. అయితే రాజవీధుల్లో జరిగిన ఊరేగింపులో యయాతి తన పక్కన కాకుండా మరో ఏనుగుపై తమ్ముళ్లతో కలిసి రావడం దేవయానిని తీవ్రంగా బాధించింది.
అంతటి రాజవైభవం మధ్య దేవయానికి ఎదురైన ఈ అవమానభావం ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది?
టి. వి. యెల్. గాయత్రి గారి ఆసక్తికరమైన పౌరాణిక ధారావాహిక కచ దేవయాని – 76వ భాగం చదవండి.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని.
తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని సహాయం కోసం దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. విమలా నదిలో పడవపై తప్పించుకుంటున్న ప్రేమికులను వృషపర్వుడి సైనికులు పట్టుకున్నారు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 69 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 70 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 71 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 72 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 73 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది.
పురోహితుడు చెప్పినట్లు చేస్తున్నాడు యయాతి.
వధువు చిటికెన వేలు పట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు పురోహితుడు.
ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు యయాతి.
“ప్రదక్షిణ చేయండి, యువరాజా!” అన్నాడు పురోహితుడు.
కదల్లేదు యయాతి.
అందరూ అతడినే చూస్తూ ఉన్నారు.
తలెత్తి పైకి చూశాడు.
మంటపం పైభాగంలో కన్నెపిల్లలు పూల పళ్లాలు పట్టుకొని వరుసగా నిలబడి ఉన్నారు.
వాళ్ల మధ్య శర్మిష్ఠ ఉంది.
ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి.
భారంగా ఊపిరి పీల్చుకొని దేవయాని చిటికెన వేలు పట్టుకొని నడిచాడు యయాతి.
అందరూ పూలవాన కురిపించారు.
వివాహం పూర్తయింది. ధర్మబద్ధంగా దేవయాని యయాతికి భార్య అయింది.
అప్పుడే ఒక విచిత్రం జరిగింది.
మంటపం ప్రధాన ద్వారం దగ్గర కలకలం చెలరేగింది.
జయంతుడు కనిపించాడు. అతడి వెనకాల హూహు ఉన్నాడు.
వాళ్ల రాకను ఎవ్వరూ ఊహించలేదు.
నహుషుడు లేచి వారికి స్వాగతం పలికాడు.
వృషపర్వుడు చూస్తూ నిలుచున్నాడు. శుక్రాచార్యుడు ముఖం తిప్పుకున్నాడు.
యయాతి దగ్గరికి వచ్చాడు జయంతుడు.
“నా మేనకోడలి వివాహానికి రావడానికి నాకు పిలుపు అక్కరలేదు. యయాతీ! జరిగినదంతా మరచిపో! ఈ నాటి నుంచి నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి” అంటూ కౌగలించుకున్నాడు.
హూహు కూడా నవ్వుతూ వచ్చి యయాతి భుజాన్ని తట్టి పక్కన నిలుచున్నాడు.
అక్కడున్న మునులు హర్షధ్వానాలు చేశారు.
దేవభటులు పెద్ద భోషాణపు పెట్టెలను మోసుకొని వచ్చారు.
“మేనకోడలికి మా తరఫు నుంచి వివాహ కానుకలు” అని దేవయాని వైపు చూశాడు జయంతుడు.
దేవయాని, యయాతి జయంతునికి, హూహుకు నమస్కరించారు.
వారిని ఆశీర్వదించారు జయంతుడు, హూహు.
అందరితో కలిసి విందులో పాల్గొని, ఆ తర్వాత అమరావతికి వెళ్లారు వాళ్లు.
వారికి కూడా కానుకలు సమర్పించాడు నహుషుడు.
ఐదు రోజుల పాటు మిగిలిన వేడుకలు జరిగాయి.
గంభీరంగా ఉన్న యయాతిని చూసి శుక్రాచార్యుడి మనసు కలవరపడింది.
అయినా ఏం చేస్తాడు?
బలవంతంగానైనా పెళ్లి చేయగలిగాడు. కానీ... ఆ తర్వాత యయాతి తన కూతురి ముఖం కూడా చూడకపోతే ఎలాగ?
ఆయనకు దిగులుగా ఉంది.
అన్ని వేడుకలూ పూర్తయ్యాయి.
మగపెళ్లివారు ప్రతిష్ఠానపురానికి ప్రయాణమయ్యారు.
కూతురిని పక్కకు పిలిచాడు శుక్రాచార్యుడు.
“చూశావుగా! అతడు నీ పట్ల సుముఖంగా లేడు. అతడికి ఇది బలవంతపు పెళ్లి. వద్దని నేను చెప్పినా నువ్వు వినలేదు. సరే! జరిగినదేదో జరిగిపోయింది. అతడికి అనుకూలంగా ఉంటూ, అతడి మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించు!
అతడు నీకు భర్త మాత్రమే కాదు, బాధ్యత కలిగిన రాజకుమారుడు కూడా. అలిగి సాధించడం వల్ల మనుషులు దూరమవుతారు. అతడిని అర్థం చేసుకొని మసలుకో!
నేను హిమాలయాలకు వెళ్తున్నాను. అక్కడ దశవర్ష యాగం జరుగుతోంది. పదేళ్లపాటు నేను అక్కడే ఉంటాను. చిన్నచిన్న కలతలు ఏవైనా వస్తే, నువ్వే చూసుకొని సర్దుకుపోవడం నేర్చుకో! జాగ్రత్తగా ఉండి మంచి పేరు తెచ్చుకో!” అని హితబోధ చేశాడు.
అనునయంగా చెప్పినా తండ్రి మాటలు దేవయానికి బాధ కలిగించాయి.
తండ్రి తనను మొండిదానిలా చూస్తున్నాడని ఆమెకు అనిపించింది.
కళ్లనీళ్లతో నహుషుడి చేతులు పట్టుకున్నాడు శుక్రాచార్యుడు.
“మీరు నిశ్చింతగా ఉండండి, ఆచార్యా! ఈ క్షణం నుంచి దేవయాని మా కూతురు. అమ్మాయిని మా ప్రాణంగా చూసుకుంటాం” అని ఆయనకు నమస్కారం చేశాడు నహుషుడు.
దిగులుతోనే హిమాలయాలకు వెళ్లిపోయాడు శుక్రాచార్యుడు.
యయాతి దేవయాని విషయంలో తన పథకాన్ని అమలు చేస్తున్నాడు.
దేవయాని రథంలో తన మేనత్త ధర్మిణిని , ఆమె కూతుళ్లను కూర్చోబెట్టాడు.
ఆమె చుట్టూ ఎప్పుడూ యాభై మంది బంధువులు, వారికి తగిన దాసీలు ఉండేలా ఏర్పాటు చేశాడు.
వెనుక మదనిక, కణిక, నారాచీలతో కలిసి శర్మిష్ఠ ప్రయాణం చేస్తోంది.
శర్మిష్ఠ దగ్గరికి వచ్చాడు యయాతి.
అతడిని చూడగానే చెలులు రథం దిగిపోయారు.
శర్మిష్ఠ పక్కన కూర్చున్నాడు అతడు.
“ప్రతిష్ఠానపురం చేరేదాకా మనకు స్వేచ్ఛ. తర్వాత నువ్వొక బందీవి. నేనొక బందీని” అన్నాడు నవ్వుతూ.
“నేనంటే అక్కకు దాసిని. మీకు స్వేచ్ఛ లేకపోవడం ఏమిటి?” అంది శర్మిష్ఠ.
“నిన్ను చూడలేకపోవడం గొప్ప శిక్ష. అది అనుభవించాలి కదా!”
“ముందు ముందు ఎలాగ? ఇలా రహస్యంగా ఎంతకాలం?”
“ప్రస్తుతం నిన్ను చూస్తున్నాను. నీతో ప్రయాణం చేస్తున్నాను. రేపటి గురించి అస్సలు ఆలోచించడం లేదు” అంటూ శర్మిష్ఠను గట్టిగా హత్తుకున్నాడు.
తన పక్కన యయాతి ప్రయాణం చేస్తాడనుకుంది దేవయాని.
కానీ ఆ ప్రయాణమంతటా ఆమెకు యయాతి కనిపించలేదు.
ఆమెకు నిరాశగా అనిపించింది.
చేసేదేముంది?
బంధువులతో కాలక్షేపం అవుతోంది.
ఆ పదిహేను రోజులూ శర్మిష్ఠతో కబుర్లు చెబుతూ, మధ్యమధ్యలో సామాన్య ప్రజల మధ్యకు వెళ్లి, వారితో కలిసి ఆడుతూ పాడుతూ ప్రయాణం చేశాడు యయాతి.
చివరకు ప్రతిష్ఠానపురానికి చేరుకున్నారు.
వృషపర్వుడి రాజధాని కంటే వందరెట్లు అందంగా ఉంది ప్రతిష్ఠానపురం!
రథం రాజవీధుల్లోకి ప్రవేశించింది. ఇరువైపులా ఆకాశాన్నంటే సౌధాలు. వాటి గోడలపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఎత్తైన మేడల నుంచి ప్రజలు పూలవర్షం కురిపిస్తున్నారు. తోరణాలతో అలంకరించిన వీధులు, పతాకాలతో రెపరెపలాడుతున్న భవనాలు, మంగళవాద్యాల హోరు... ప్రతిష్ఠానపురం అమరావతిని తలదన్నేలా ఉంది.
దేవయాని కన్నులు ఆ వైభవాన్ని తనివితీరా చూస్తున్నాయి. మనసు గర్వంతో ఉప్పొంగుతోంది.
ఈ రాజ్యానికి కాబోయే సామ్రాజ్ఞి తను
అతి సంపన్నమైన రాజ్యం. అత్యంత సుందరుడైన యయాతి తన భర్త. భూలోక చక్రవర్తి తనకు మామగారు.
తనకంటే అదృష్టవంతురాలు ఈ లోకంలో ఇంకెవరైనా ఉంటారా?
ఊరేగింపు మెల్లగా ముందుకు సాగుతోంది. మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. భేరీల ధ్వనులు దిక్కులను మారుమోగిస్తున్నాయి. ముందు ఏనుగులు గంభీరంగా అడుగులు వేస్తుంటే, వాటి వెనుక అలంకరించిన గుర్రాలు ఠీవిగా నడుస్తున్నాయి. ఆవులు, ఎద్దులు బారులు తీరి సాగుతున్నాయి. పరివారం, సైనికులు, పరిచారకులతో రాజవీధి అంతా సందడిగా ఉంది.
ప్రజలు ఇళ్ల ముందు నిలబడి ఊరేగింపును ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు పూలు చల్లుతున్నారు. మరికొందరు మంగళహారతులు ఇస్తున్నారు. యువరాజు యయాతిని చూడాలని స్త్రీలు మేడల మీదకు చేరారు.
ఇంతలో భద్రగజంపై నహుష దంపతులు కనిపించారు. రాజలాంఛనాలతో అలంకరించిన ఆ ఏనుగు గంభీరంగా నడుస్తోంది. నహుషుడి పక్కన మహారాణి విరజాదేవి ఠీవిగా కూర్చుంది. వారిని చూడగానే ప్రజలు జయజయధ్వానాలు చేశారు. మంగళహారతులతో నీరాజనాలు పలికారు.
దేవయాని ముఖంలో చిరునవ్వు విరిసింది. తనకూ ఇలాంటి స్వాగతమే లభిస్తుందని ఆశించింది.
ఆమెను కూడా మరో భద్రగజంపై ఎక్కించారు. ఏనుగు వీపుపై అలంకరించిన అంబారీ ఎంతో అందంగా ఉంది. ఇరువైపులా ఇద్దరు దాసీలు కూర్చున్నారు.
కానీ...
యయాతి ఎక్కడ?
దేవయాని చూపులు జనసమూహంలో అతడి కోసం వెతికాయి.
అదిగో! వస్తున్నాడు.
మరో ఏనుగుపై ఠీవిగా కూర్చుని వస్తున్నాడు యయాతి. అతడి పక్కన ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.
దేవయాని చిరునవ్వు మెల్లగా చెరిగిపోయింది.
తన పక్కన కూర్చోవాల్సిన భర్త మరో ఏనుగుపై వస్తున్నాడేమిటి?
ఆమె చూపులు మళ్లీ మళ్లీ యయాతి వైపు మళ్లాయి. అతడేమో తన వైపు చూసినట్టే లేదు.
చుట్టూ ఉన్నవారి మాటలు ఆమె చెవిన పడ్డాయి.
“అదేమిటి? యువరాజు పక్కన పెళ్లికూతురు లేదే!”
“అవును! కొత్త దంపతులు విడివిడిగా ఊరేగుతున్నారేమిటి?”
“ఏమై ఉంటుందో?”
గుసగుసలు దేవయాని చెవులను తాకాయి. ఆ మాటలు తన గురించేనని ఆమెకు అర్థమైంది.
క్షణం క్రితం వరకు తన అదృష్టాన్ని తలచుకుని మురిసిపోయిన మనసు ఇప్పుడు బాధతో మూలిగింది. అందరి ముందు తనకు జరిగిన ఈ అవమానమేమిటి?
తాను ఏమి కోరుకుంది?
తనకేమి లభించింది?
ఆమె కన్నులు మరోసారి యయాతి వైపు చూశాయి. అతడు మాత్రం తన తమ్ముళ్లతో ఏదో మాట్లాడుతూ ముందుకు సాగిపోతున్నాడు.
దేవయాని గుండెల్లో ఏదో తెలియని అలజడి.
ఊరేగింపు సాగుతూనే ఉంది. మంగళవాద్యాలు మ్రోగుతూనే ఉన్నాయి. ప్రజల జయజయధ్వానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ దేవయాని మనసులో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయి.
తన చుట్టూ అంతటి వైభవం ఉన్నా, మనసులో మాత్రం ఏదో వెలితి.
కలవరపడుతున్న హృదయంతో దేవయాని రాజభవనంలోకి అడుగుపెట్టింది.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 77 త్వరలో
===============================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు టి. వి. యెల్. గాయత్రి. పూర్తి పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి. మా పుట్టిల్లు నెల్లూరు జిల్లాలోని మొగలిచర్ల గ్రామం.నేను గృహిణిని. మా అమ్మగారు ప్రముఖ రచయిత్రి పవని నిర్మల ప్రభావతమ్మ గారు. మా నాన్నగారు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహ స్వామి మరియు మొగలిచర్ల దత్తాత్రేయస్వామి దేవస్థానములకు ధర్మకర్తగా ఉండేవారు.
నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం అలవాటు. అలా చదువుతూ, పద్యాలు కథలు వ్రాద్దామని అనుకున్నాను.
2009 లో పునాకు వచ్చాను.
2019 లో శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ గారి 'అనంతఛందస్సు' అనే పద్యశిక్షణా సమూహములో చేరి పద్యాలు వ్రాయడం నేర్చుకొని వ్రాస్తున్నాను.
అలా 2019 నుండి పద్యాలు, కవితలు వ్రాస్తున్నాను.2023 నుండి కథలు వ్రాయటం మొదలు పెట్టాను.మా గురువుగారు మా చేత క్రొత్త వృత్తాలతో "అనంత ఛందస్సౌరభం "అనే గ్రంథమును వ్రాయించారు.
అందులో నేను కూడా 100 పద్యాలు వ్రాసాను.
నేను వ్రాసిన "పల్లె పిలిచింది "అనే స్వతంత్ర కావ్యము "మన తెలుగు కథలు డాట్ కామ్ "పత్రికలో దారావాహికంగా వచ్చింది.
మా గురువుగారు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వివిధ ప్రక్రియలు నేర్పిస్తూ ఉంటారు. అందులో గర్భ కవిత్వం ఒకటి. దానిలో కూడా కొన్ని పద్యాలను వ్రాయడం జరిగింది.
నేను వ్రాసిన పద్యములను , కవితలను పోటీలకు పంపిస్తూ ఉంటాను. విజేతగా చాలా ప్రశంసా పత్రాలు లభించాయి.
కథలు వ్రాయటానికి నాకు ప్రేరణ మా అమ్మగారు.
నా మొదటి కథ 'పరివర్తన 'గో తెలుగు డాట్ కామ్ అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది.
నేను కవితలు శతకాలు, కావ్యాలే కాకుండా కథలు వ్రాయగలను అన్న విశ్వాసం కలిగింది.
నా మొదటి కథకు పారితోషికం ఏమీ లేదు.
ఇప్పటి వరకు నేను 112కథలు,"క్రొత్త నీరు "అనే నవల వ్రాసాను.' కచ దేవయాని ' సీరియల్ గా "మన తెలుగు కథలు డాట్ కామ్ "అంతర్జాల. పత్రికలో వస్తోంది.నేను వ్రాసిన కథల్లో సగం కథలు వివిధ పోటీల్లో బహుమతులు తెచ్చుకున్నాయి.
మా పిల్లలతో నేను వ్రాయబోయే కథల గురించి చర్చిస్తూ ఉంటాను. ఒక్కోసారి కథాంశాన్ని వాళ్ళు చెప్పినట్లుగా మార్చుతాను.
సాధారణంగా నేనే కథలు వ్రాసి చూసుకొని పత్రికలకు పంపిస్తాను.
నాకు నచ్చిన కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. చిన్నప్పటి నుండి వారి సాహిత్యాన్ని చదువుతూ పెరిగాను.
నేను సమాజానికి మేలు చేసే రచనలను ఇష్టపడతాను.
నేను వ్రాసిన రచనల్లో బాగా పేరు తెచ్చిన కథ 'కప్పు తేనీరు '.ఇంటికి దీపం, నీ అడుగు జాడలో, సర్దుబాటు లాంటివి.
నావి రెండు కథాసంపుటాలు వచ్చాయి.అవి "నవ్య కథా సౌరభం -1"మరియు "నవ్య కథా సౌరభం :2 "అనేవి.
మూడు కావ్యాలు, ఐదు శతకాలు కలిపి '1.శతక విజయం. 2. కవన త్రివేణీ సంగమం 'అనే పుస్తకాలు ప్రింట్ అయ్యాయి.
ఇంకా వందల సంఖ్యలో పద్యాలు వ్రాసాను.
2024లో తానావారి పద్య కావ్యపోటీలో పాల్గొని తొమ్మిదవ స్థానం పొందాను.
2022 లో స్టోరీ మిర్రర్ వారు "ది ఆథర్ ఆఫ్ ద ఇయర్ "అవార్డు ఇచ్చారు.
2024 లో సాయివనంలో సాహిత్యం వ్వాట్సాప్ సమూహం వారు "కవనమణి "బిరుదు ఇచ్చారు.
2026 జనవరిలో శ్రీ గౌతమేశ్వర సాహితీ సంస్థ. మంత్రపురి వారు నిర్వహించిన 100 రోజుల కవితా పండుగలో పాల్గొని విజేతగా నిల్చినందుకు స్వర్ణకంకణమును ఇంటికి పంపించారు. అనారోగ్య కారణాల వలన నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను.
2026 ఏప్రిల్ లో మహారాష్ట్ర ప్రభుత్వము మరియు మహారాష్ట్ర తెలుగు అకాడమీ సంయుక్తంగా పూణే లో ఉగాది సన్మానం చేసారు.
2026 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూణే " ఆంధ్రా సంఘం "వారు సన్మానం చేసారు.












Comments