top of page
Original.png

జోక్స్ – నవంబర్ 2026

3 days ago
7 min read

జోక్స్ నవంబర్ 2026 – మనతెలుగుకథలు.కామ్ జోక్స్ పోటీలో రచయితలు పంపిన సరదా తెలుగు జోక్స్, నవ్వుతున్న కుటుంబ సభ్యుల హాస్య చిత్రం.
జోక్స్ – నవంబర్ 2026 | తెలుగు రచయితల సరదా జోక్స్ కలెక్షన్ – మనతెలుగుకథలు.కామ్.

😂 జోక్స్ – నవంబర్ 2026 😂

నవ్వండి... నవ్వించండి... హాయిగా ఆనందించండి!

మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న జోక్స్ పోటీ 2026–27లో భాగంగా రచయితలు పంపిన సరదా తెలుగు జోక్స్ మీ కోసం!

సెట్ నంబర్ – 06: మున్నంగి శ్రీనివాస్

1. భార్య: "ఏమండీ, మీరు రోజూ ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకోరు?"

భర్త: "ఒసేయ్ పిచ్చిదానా, అలా చేస్తే ఆఫీస్‌కి వెళ్లాలనిపించదు, అందుకే!"

భార్య: "మరి వచ్చేటప్పుడు ఇవ్వొచ్చు కదా!"

భర్త: "అప్పుడు ఇంటికి రావాలనిపించదు కదా!"


2. టీచర్: "ఒరేయ్ బుజ్జి, చరిత్ర అంటే ఏమిటో చెప్పు?"

బుజ్జి: "సార్, మన పూర్వీకులు చేసిన తప్పులన్నీ మనకు పరీక్షల్లో ప్రశ్నలుగా అడగడాన్నే 'చరిత్ర' అంటారు సార్!"


3. భర్త: "ఏంటి ప్రియా, ఈరోజు కూరలో ఉప్పు ఎక్కువైంది?"

భార్య: "అవునండీ, ఈరోజు కూరలో ప్రేమ ఎక్కువైంది, ఉప్పు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయింది!"


4. డాక్టర్: "ఏంటండీ, నేను ఇచ్చిన మందులు వాడటం లేదా? జ్వరం తగ్గట్లేదు!"

రోగి: "డాక్టర్ గారు, బాటిల్ మీద 'పిల్లలకు దూరంగా ఉంచండి' అని ఉంది కదా! మా పిల్లాడు తాగేస్తాడేమోనని నేనే తాగట్లేదు!"


5. కస్టమర్: "ఏంటయ్యా, ఈ సాంబార్‌లో ఈగ పడింది?"

బాయ్: "సార్, అది సాంబార్‌లో ఈత కొట్టడం నేర్చుకుంటోంది, కాసేపు ఆగితే అదే బయటకు వస్తుంది సార్!"


6. నాన్న: "ఒరేయ్, క్లాస్‌లో ఎవరితోనైనా గొడవ పడ్డావా?"

కొడుకు: "లేదు నాన్నా, ఈరోజు మా టీచరే అందరితో గొడవ పడ్డారు, అందుకే మేమంతా ప్రశాంతంగా ఉన్నాం!"


7. బాస్: "రేయ్, నిన్న ఆఫీస్‌కి ఎందుకు రాలేదు?"

ఉద్యోగి: "సార్, నిన్న ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ లేకపోతే ల్యాప్‌టాప్ పనిచేయదు కదా అని రాలేదు సార్!"


8. అత్తగారు: "అమ్మా, ఈరోజు టీ నువ్వే పెట్టావా? చాలా బాగుంది!"

కోడలు: "అవును అత్తయ్యా, మీరు మెచ్చుకుంటారని మనసుపెట్టి పెట్టాను!"

అత్తగారు: "మరి రోజూ ఎందుకు అలా పెట్టవు?"


9. భార్య: "ఏమండీ, రేపు సినిమాకి వెళ్దామా?"

భర్త: "కుదరదోయ్, రేపు చాలా ముఖ్యమైన పని ఉంది."

భార్య: "ఏంటి?"

భర్త: "ఇన్‌స్టాగ్రామ్‌లో పెండింగ్ రీల్స్ అన్నీ చూసి లైక్ చేయాలి!"


10. పోలీస్: "సిగ్నల్ పడినా బండి ఎందుకు ఆపావు?"

కుర్రాడు: "సార్, పచ్చ లైట్ చూడగానే పచ్చగడ్డి గుర్తొచ్చింది, మా ఆవు తింటున్నట్లు కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను సార్!"


సెట్ నంబర్ – 05: సత్తి స్వాతి రెడ్డి

జోక్ 1: పరీక్ష ఫలితాలు

తండ్రి: ఏరా! పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి కదా, మార్కులు ఎలా వచ్చాయి?

కొడుకు: మన పక్కింటి సురేష్ గాడు ఫెయిల్ అయ్యాడు నాన్నా!

తండ్రి: వాడి సంగతి నాకెందుకురా? నీ మార్కులు చెప్పు!

కొడుకు: నీకు నమ్మకం ఎక్కువ కదా నాన్నా... నేనేమైనా వాడికంటే తెలివైనవాడినా? నేను కూడా ఫెయిలే!

జోక్ 2: పెళ్లి భయం

స్నేహితుడు 1: ఒరేయ్, పెళ్లి అంటే ఒక పెద్ద యుద్ధం లాంటిది అంటారు కదా, నిజమేనా?

స్నేహితుడు 2: లేదురా, యుద్ధంలో అయితే శత్రువు ఎవరో మనకు ముందే తెలుస్తుంది. కానీ పెళ్లిలో మన పక్కన ఉన్నవాళ్లే ఎప్పుడు శత్రువు అవుతారో తెలియదు!

జోక్ 3: గూగుల్ మ్యాప్స్

భార్య: ఏవండీ, గూగుల్ మ్యాప్స్ కనిపెట్టింది మగాడేనా?

భర్త: కచ్చితంగా ఆడదే అయి ఉంటుంది!

భార్య: ఎలా చెప్పగలరు?

భర్త: ఎందుకంటే, మనం ఒక్క తప్పు దారి తీసుకున్నా చాలు... వెనక్కి తిరిగి చూసుకోకుండా అర గంట సేపు క్లాస్ పీకుతుంది కాబట్టి!

జోక్ 4: డాక్టర్ సలహా

పేషెంట్: డాక్టర్ గారు, మీరు రోజుకు ఒక ఆపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా, కానీ నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు.

డాక్టర్: రోజుకు ఒక ఆపిల్ తింటున్నావా?

పేషెంట్: తింటున్నాను డాక్టర్, కానీ ఆపిల్ ఫోన్ తింటే అరగడం చాలా కష్టంగా ఉంది!

జోక్ 5: ఆన్‌లైన్ షాపింగ్

భార్య: ఏవండీ, ఆన్‌లైన్‌లో నాకోసం ఒక మంచి చీర ఆర్డర్ చేశాను, చూడండి.

భర్త: చాలా బాగుంది, కానీ దీనికి పేమెంట్ ఎవరు చేస్తారు?

భార్య: మన ఇద్దరి మధ్య 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) ఉంది కదా... డెలివరీ బాయ్ రాగానే మీ జేబులోంచి క్యాష్ ఇచ్చేయండి!

జోక్ 6: క్లాస్‌రూమ్ సైన్స్

టీచర్: రాజు! గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటో ఒక ఉదాహరణతో చెప్పు.

రాజు: మనం పైకి విసిరిన వస్తువు ఏదైనా సరే కింద పడటాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు సార్.

టీచర్: వెరీ గుడ్! మరి కింద పడనిది ఏదైనా ఉందా?

రాజు: మన స్కూల్ ఫీజులు సార్... ఎప్పుడూ పైకే వెళ్తాయి కానీ కిందకు రావు!

జోక్ 7: లాటరీ టికెట్

భర్త: ఒసేయ్, నాకు ఒక కోటి రూపాయల లాటరీ తగిలితే నువ్వు ఏం చేస్తావు?

భార్య: ఇంకేం చేస్తాను, మీ ముఖం మీద సగం డబ్బులు పారేసి, నా పుట్టింటికి వెళ్లిపోతాను!

భర్త: అబ్బా! నీకు పుణ్యం ఉంటుంది, ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకో, నాకు వంద రూపాయల లాటరీ తగిలింది... నీ సగం యాభై రూపాయలు ఉంచుకుని ఇప్పుడే వెళ్ళిపో!

జోక్ 8: తెలివైన దొంగ

పోలీస్: రాత్రి బ్యాంకులో దొంగతనం చేసినప్పుడు అలారం మోగింది కదా, మరి నువ్వు ఎలా తప్పించుకున్నావు?

దొంగ: సార్, నేను బ్యాంకు గోడ మీద 'నిశ్శబ్దం పాటించండి' అని రాసి ఉన్న బోర్డు చూసి, అలారం వైపు గట్టిగా కళ్ళురిమి చూశాను, దాంతో అది భయపడి సైలెంట్ అయిపోయింది!

జోక్ 9: హోటల్ తిండి

కస్టమర్: ఏమయ్యా సర్వర్! సాంబార్‌ లో ఈగ పడింది, చూసుకోవా?

సర్వర్: ఏంటి సార్, పది రూపాయల సాంబార్ కి అందులో కోడి చికెన్ ముక్క పడుతుందా ఏంటి? ఈగ పడక!

జోక్ 10: చదువు వద్దు

చింటూ: నాన్నా! రేపటి నుంచి నేను స్కూల్ కి వెళ్ళను.

తండ్రి: ఎందుకురా? ఏమైంది?

చింటూ: ఈరోజు క్లాస్‌లో టీచర్ గారు 'రేపు అందరినీ నిలబెట్టి ప్రాణాలు తీస్తాను' అన్నారు నాన్నా.

తండ్రి: ఒరేయ్ పిచ్చోడా! అది 'ప్రాణాలు తీస్తాను' కాదురా... 'ప్రశ్నలు అడుగుతాను' అని ఉంటారు!


===============================================

సెట్ నంబర్ – 04: శ్రీనివాసరావు జీడిగుంట

1) పడవలో "లాహిరి లాహిరి" అనుకుంటూ భార్యతో తిరుగుతున్న రమణమూర్తి, సరదాగా పడవ అతనితో, "హఠాత్తుగా పడవ మునిగిపోతుంటే మా ఇద్దరిలో ఎవరిని రక్షిస్తావు?" అని అడిగాడు. 


"నన్ను!" అంటూ పడవలోంచి దూకేసి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు.


2) "ఎన్నిసార్లు అడగాలి తీసుకున్న అప్పు తీర్చమని? ఎప్పుడూ రేపు రండి అంటారు!" అన్నాడు సేటు. 


"నేను ఆడి తప్పను" అన్నాడు అప్పారావు.


3) జడ్జిగారు బోనులో ఉన్న జేబుదొంగతో, "సిగ్గులేదా ప్రతీ నెల కోర్టుకు రావడానికి?" అన్నారు. 


"సార్, తమరు రోజూ వస్తున్నారు కదా, మీకు లేనిది నాకెందుకు?" అన్నాడు జేబుదొంగ.


4) "ఈ మధ్య పొట్టిగా అయిపోతున్నానేమో అనిపిస్తోంది" అన్నాడు కుమార్ తన డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి. 


ప్రిస్క్రిప్షన్లో "నడక తగ్గించు" అని రాసి ఐదు వందలు ఫీజు వసూలు చేశాడు.


5) "మా ఆవిడ కురుక్షేత్రం టూర్ కి తీసుకుని వెళ్లండి, యుద్ధం అంటే చూస్తాను అంటోంది" అన్నాడు తన స్నేహితుడు మురళితో. 


దానికి, "అక్కడ దాకా ఎందుకు, రేపు మా ఇంటికి తీసుకుని రా" అన్నాడు రాజారావు.


6) "ఏరా, నీ కొత్త గడియారం ఎలా ఉందిరా?" అన్నాడు సూర్యం. 


"బాగానే ఉందిరా, నాకు వాచ్ రిపేర్ షాప్ వాడికి మధ్య తిరుగుతోంది" అన్నాడు చంద్రం.


7) "ఏమిటయ్యా, కాఫీలో ఈగ పడింది!" అన్నాడు కస్టమర్. 


"భలేవారే, మీరు ఇచ్చే పది రూపాయలకు హంస పడుతుందా? తీసేసి తాగండి సార్" అన్నాడు సర్వర్.


8) "ఏమండీ, ఈరోజు నన్ను అలా తీసుకొని వెళ్లి ఐస్క్రీమ్ తినిపిస్తారా?" అంది. 


"అదేమిటే, క్రిందటి ఏడాది తిన్నావుగా!" అన్నాడు పిసినారి భర్త.


9) "ఐదు నిమిషాలలో పీకే పన్నుకు ఐదు వేలు ఫీజా? అన్యాయం డాక్టర్ గారు!" అన్నాడు ఏకదంతం. 


"కావాలంటే గంట సేపు పీకుతాను, ఫీజు మాత్రం తగ్గదు" అన్నాడు డెంటిస్ట్.


10) సుందరమ్మ భర్త ఏదో తప్పు చేశాడు అని అప్పడాల కర్ర వాడుతోంది. అదే సమయంలో పక్కింటి సూరమ్మ వచ్చి, "పిన్ని, ఒకసారి అప్పడాల కర్ర ఇస్తావా?" అని అడిగి, "అయ్యో సరే, నీ పని అయ్యాక ఇవ్వు, మా ఆయన ఆగుతాడులే" అంది.


సెట్ నంబర్ – 03: శ్రీనివాసరావు జీడిగుంట

1) "ఏమండీ, ఈరోజు ఏ కూర వండాలి?" అని షేర్ మార్కెట్ చూసుకుంటున్న భర్తని అడిగింది. 


అసలే మార్కెట్ లాస్‌లో ఉండటంతో చిరాకుగా "నా తలకాయ వండు" అన్నాడు భర్త.


"వేపుడు చెయ్యమంటారా లేకపోతే పప్పులో వెయ్యమంటారా?" అంది ఆ అయోమయం భార్య.


2) "ఇదేమిటి కూర ఇంత రుచిగా ఉంది, పక్కింటి పంకజం ఇచ్చిందా?" అన్నాడు భార్యతో. 


"అమ్మ కడుపు చల్లగా" అంటూ పులుసు గరిటతో దీవించింది.


3) "ఏమిటే మీ ఆయన పోయారుటగా?" అంది సుశీలమ్మని పలకరిస్తూ. 


"పోలేదు, చంపేశాను" అంది గయ్యాళి. 


"నాకు కూడా ఎలా చంపావో చెప్పవా, మా ఆయన మీద ప్రయోగం చేస్తాను" అంది ఛాయాదేవి.


4) "నీ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చెడగొడతాను అన్నావుగా, మరి అమ్మాయి పెళ్లి అయిపోయిందిగా" అన్నాడు రమణ తన స్నేహితుడు సుబ్బారావుతో. 


"ఏం లాభం రా, అప్పటికి జీలకర్రా బెల్లం దాచేశాను" అన్నాడు వెర్రిమోహం వేసుకుని.


5) "ఏమిటి ఈ మధ్య రోజుకొరకం చెప్పులు వేసుకొస్తున్నావు?" అని అడిగాడు రమణారెడ్డి తన స్నేహితుడు పద్మనాభంని. 


"ఈ మధ్య గుడికి వెళ్తున్నాలే" అన్నాడు పద్మనాభం.


6) "ఏమండీ, పిల్లలు దీపావళి సామాను కావాలి అని ఏడుస్తున్నారు" అంది సుమ. 


"ఎందుకే డబ్బులు దండగ, ఎలాగో మన ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు కిందకి వచ్చి కాలుస్తారుగా, సరదాగా వాళ్ళతో కలిసిపోమను" అన్నాడు సింగినాధం.


7) పాతపెట్టెలో తండ్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి, "ఇంతోటిదానికేనా నాకు మార్కులు బాగా రాలేదు అని కొడుతున్నారు?" అన్నాడు కొడుకు కోపంగా.


8) "ఏమిటోయ్, నీ కథలు బాగా పడుతున్నట్టు ఉన్నాయి?" అని అడిగాడు తన స్నేహితుడు మూర్తిని.


 "ఆ, తిరిగొచ్చి వాకిట్లో పడుతున్నాయి" అన్నాడు శంకరం.


9) "ఏమండీ, చెత్త బండి వాడు వచ్చే టైం అయ్యింది, బయటకు వెళ్ళకండి" అంది భర్తని సాధించే ఇల్లాలు.


10) "ఇదిగో, ఐదు వేలు పంపించమంటోంది, పంపమంటావా?" అన్నాడు ఫోన్ చేతిలో పట్టుకొని.


"ఒకసారి అలవాటు చేస్తే వదలరు, లేదు అని చెప్పండి" అంది భార్య.


"మీ అమ్మాయి లేదని చెప్పమంది మామయ్యగారు" అని ఫోన్ పెట్టేశాడు. 


"మీ నాన్న అనుకున్నాను, మా నాన్న.." అని తెల్లబోయింది.


సెట్ నంబర్ – 02: గంటి సుబ్రహ్మణ్యశర్మ


1)

ఒక అరబ్ షేక్ సహారా ఎడారిలో తన ఒంటెపై కూర్చుని ప్రయాణం చేస్తూ ఉంటాడు.

అతడికి ఇసుకలో ఒక దీపం కనిపిస్తుంది. దానిని తీసుకుని రుద్దితే పేలిపోయి, ఒంటెతో సహా మరణిస్తాడు.

నీతి: కనిపించిన ప్రతి లాంప్ అల్లావుద్దీన్ లాంప్ కాదు, కొన్ని "బిన్ లాడెన్" లాంపులు కూడా ఉంటాయి అని.

————-

2)

ఒక మధ్యవయస్కురాలైన స్త్రీ భగవంతుడిని ఆరాధిస్తే, భగవంతుడు ప్రత్యక్షమై, "నీ 50 సంవత్సరాల వయసులో నీకు మరణం ఉంది. అయినా నేను ఇంకో 30 సంవత్సరాలు ఆయువు పెంచాను" అని వరం ఇచ్చాడు. వెంటనే ఆమె బ్యూటీ పార్లర్‌కు వెళ్లి, ఒక 35 ఏళ్ల ఆమెలా అలంకరించుకుని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ప్రమాదంలో మరణిస్తుంది. స్వర్గంలో దేవుడిని కలిసి,

"మీ వరం నాకు ఎందుకు పనికిరాదు?" అని ఆమె భగవంతుడిని ప్రశ్నిస్తుంది.

"అమ్మా! అసలు నిన్ను గుర్తుపట్టలేదు".

———

3)

ఒక చర్చ్ ఫాదర్, అతని భార్య, కొడుకు కలిసి ఒక స్కూటర్‌పై వెళ్తూ ఉండగా పోలీస్ అధికారి ఆపి, "ఒక స్కూటర్‌పై ముగ్గురు ప్రయాణించడం ప్రమాదం కదా?" అని అడుగుతాడు.

"పిచ్చివాడా! మాతో దేవుని కుమారుడు కూడా ఉన్నాడు" అని బదులిస్తాడు.

"అలాగా! అయితే ఒక స్కూటర్ మీద నలుగురు ప్రయాణం చేస్తున్నారు అని కేసు రాస్తాను" అంటాడు.

———

4)

సుబ్బారావు పెంచుకుంటున్న చిలుక రానురానూ అరిచి గోల చేయడం భరించలేక, దానిని పంజరంలో నుండి బయటకు వదిలివేస్తాడు.

ఆ చిలుక ఒక వేశ్యామందిరం చేరి అక్కడ పెరుగుతూ ఉంటుంది.

ఒకరోజు సుబ్బారావు అక్కడికి వెళ్లినప్పుడు, ఆ చిలుక ఇంకో చిలుకతో, "నా ఇల్లు కొత్తది కానీ, కస్టమర్ పాతవాడే" అంటుంది.

———-

5)

"రాజూ! నాకిప్పుడు మూడో నెల. మనం కంగారుపడి మన ఇరువైపులా ఉన్న పెద్దలను ఒప్పించి ఎంత తొందరగా వివాహం చేసుకుంటే అంత మంచిది" అంటుంది రాణి.

"ఆడవారు వయసు తక్కువ చెప్పడం సహజమే అయినా, మరీ ఇంత తక్కువ చెప్పాలా?".

———

6)

గీత తన భర్త సమాధి వద్ద కూర్చుని ఒక విసనకర్రతో విసురుతూ ఉంటుంది. అది గమనించిన ఆమె స్నేహితురాలు, "నీ ప్రేమను దూరం చేసుకోవడం నీ భర్త దురదృష్టం, బాధపడకు" అంటుంది.

"లేదు! ఆయన సమాధి పూర్తిగా గట్టిగా అయిన తర్వాతే నేను మరలా పెళ్లి చేసుకోగలను".

———-

7.

ఒక విదేశీ వనిత చెన్నై విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చి, ఒక వ్యక్తిని, "టైమ్ ఎంత?" అని అడుగుతుంది.

దానికి ఆ వ్యక్తి "8:30" అంటాడు.

"అది జీఎంటీ (గ్రీనిచ్ మీన్ టైమ్) కదా?" అని ఆమె మరలా అడుగుతుంది.

"లేదు మేడమ్, ఇది హెచ్‌ఎంటీ" అంటాడు ఆ వ్యక్తి.

(హెచ్‌ఎంటీ అనేది భారతదేశంలో ఒకనాటి వాచ్ కంపెనీ).

————-

8)

కోర్టులో జడ్జి గారు బోనులోని ముద్దాయితో, "నీ అన్ని నేరాలకు సంబంధించి నీ సమాధానం, నీ వాదన ఎవరు చెబుతారు? నీకు వకీలు ద్వారా న్యాయసహాయం కావాలా?" అని అడుగుతారు.

ముద్దాయి: "నాకు ఏ వకీలూ వద్దు సార్, నేను నిజం చెప్పేద్దామనుకుంటున్నాను!".

———————

9)

రామనాథం: "ఏమిటయ్యా! వంకాయలు, టమోటాలు అంత ఎక్కువ ధర చెబుతున్నావు?"

కాయగూరల వ్యాపారి:

"టమోటాలు, వంకాయలు అని చిన్నచూపు చూడకండి సార్! త్వరలో 'ఐపీఓ'కి వస్తున్నాయి".

—————

10.

డాక్టర్ రోగి నాలుక పరీక్షిస్తూ, "ఇదేమిటి, నాలుక మీద రెవిన్యూ స్టాంప్ ఉంది?" అని అడుగుతాడు.

రోగి: "అయ్యో డాక్టర్! నిన్నటినుంచీ దానికోసమే వెతుకుతున్నాను".


సెట్ నంబర్ – 01: శ్రీనివాసరావు జీడిగుంట

1) ఏకాంబరం కన్ను నొప్పిగా ఉందని డాక్టర్ ముక్కంటి దగ్గరికి వెళ్లాడు. కావలసిన పరీక్షలు చేసి "అంతా బాగానే ఉంది, కానీ ఎడమ కంటిలో దిష్టి ఉంది. ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీరు ఎవరిని చూస్తే వాళ్లకు దిష్టి తగులుతుంది" అన్నాడు. 


"ఇదొక రకం కొత్త బిజినెస్ అనుకుంటా" అనుకుంటూ బయటకు నడిచాడు ఏకాంబరం.


2) మా కాలేజీలో తెలుగు లెక్చరర్ గారికి బట్టతల, దాని మీద పెద్ద గోళీ లాంటి కంతి ఉండేది. అసలే తెలుగు క్లాస్, ఆయన రాగానే కొంతమంది స్టూడెంట్స్ "ఒరేయ్, గోళీ గారు వస్తున్నారు" అనడం విని, బాధ భరించలేక ఆయన వారం రోజులు సెలవు తీసుకుని, తల మీద ఉన్న కంతికి ఆపరేషన్ చేయించుకుని "హమ్మయ్య" అనుకుంటూ క్లాసుకి వచ్చాడు. 


వెనుక బెంచ్ స్టూడెంట్స్ "ఒరేయ్, కట్ గోళీ గారు వచ్చారు" అనడంతో వాళ్లతో పాటు తను నవ్వేసి క్లాస్ తీసుకున్నాడు.


3) ఒక దొంగ రాత్రి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు.

ఇంటి యజమానికి మెలకువ వచ్చి అడిగాడు.


యజమాని: ఎవరు నువ్వు?


దొంగ: దొంగను సార్!


యజమాని: మరి ఏం కావాలి?


దొంగ: డబ్బులు కావాలి.


యజమాని: బీరువాలో ఉన్నాయి, తీసుకో.


దొంగ బీరువా తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు.

దొంగ: సార్! ఇందులో డబ్బులు లేవే!


యజమాని: అందుకే కదా నేను కూడా రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతున్నాను.


4) ఒక వ్యక్తి లాయర్ దగ్గరకు వెళ్లాడు.

వ్యక్తి: సార్! నేను ఒకరిని కొట్టాను, నాకు శిక్ష పడుతుందా?


లాయర్: ఎందుకు కొట్టారు?


వ్యక్తి: అతను నన్ను గాడిద అన్నాడు.


లాయర్: అందుకని కొడతారా?


వ్యక్తి: మరి నన్ను గాడిద అంటే ఊరుకోవాలా?


లాయర్: మీరు గాడిద కాదని నిరూపించగలరా?


వ్యక్తి: ఎలా సార్?


లాయర్: నేను అడిగిన ఫీజు ఇచ్చి వెళ్లండి, మీ తెలివి మీరే నిరూపించుకున్నట్లు అవుతుంది.


5) ఒక కస్టమర్ కూరగాయల దుకాణానికి వెళ్లాడు.

కస్టమర్: టమాటాలు కిలో ఎంత?


వ్యాపారి: 60 రూపాయలు.


కస్టమర్: పక్క దుకాణంలో 50 రూపాయలకే ఇస్తున్నారు కదా!


వ్యాపారి: అయితే అక్కడే కొనుక్కోండి సార్.


కస్టమర్: వాళ్ల దగ్గర అయిపోయాయి.


వ్యాపారి: అందుకే మా దగ్గర అరవై రూపాయలు!


6) భర్త: నీకు ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి ఎవరో తెలుసా?


భార్య: తెలుసు, మా నాన్నగారు.


భర్త: ఎందుకని?


భార్య: నన్ను మీకు అంటకట్టారుగా, అందుకే!



7) మేనేజర్: మీరు ఎలాంటి పని అయినా చేయగలరా?


అభ్యర్థి: చేయగలను సార్.


మేనేజర్: మీకు అనుభవం ఉందా?


అభ్యర్థి: లేదు సార్.


మేనేజర్: మరి ఎలా చేయగలనంటున్నారు?


అభ్యర్థి: అనుభవం ఉన్నవాళ్లు చేయలేని పనులు కూడా నేను చేస్తాను సార్!


8) తండ్రి: డబ్బు చాలా విలువైనది, దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి.


కొడుకు: నాన్నా! మీరు కూడా అలాగే చేస్తారా?


తండ్రి: తప్పకుండా.


కొడుకు: మరి అమ్మకు షాపింగ్‌కు అంత డబ్బు ఎందుకు ఇస్తారు?


తండ్రి: ఇంట్లో ప్రశాంతత కొనుక్కోవడానికి కొన్ని ఖర్చులు తప్పవురా!



9) భార్య: నా నుంచి మీకు ఏం కావాలి?


భర్త: మనశ్శాంతి.


భార్య: అంటే నేను మనశ్శాంతిని ఇవ్వడం లేదా?


భర్త: ఇస్తున్నావు కదా!


భార్య: ఎప్పుడు?


భర్త: నువ్వు నిద్రపోయినప్పుడు!


10) ఒక వ్యక్తి జ్ఞానిని అడిగాడు:


వ్యక్తి: గురువుగారూ! మనిషి జీవితంలో గొప్ప విజయం ఏది?


జ్ఞాని: తన కోపాన్ని తాను జయించడం.


వ్యక్తి: మరి భార్య కోపాన్ని జయించడమా?


జ్ఞాని: నాయనా! నేను జ్ఞానిని మాత్రమే... మహాత్ముడిని కాదు!



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page