top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 74

19 minutes ago
8 min read

కచ దేవయాని 74వ భాగంలో విమలా నది ఒడ్డున శర్మిష్ఠను వృషపర్వుడు తీసుకెళ్తుండగా విషాదంతో చూస్తున్న యయాతి.

Kachadevayani - Part 74 - Telugu Mythological Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 74 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 25/10/2026


కచ దేవయాని – 74వ భాగం | ప్రేమికుల వియోగం – సోమకీర్తి రహస్య వ్యూహం

ప్రేమించిన శర్మిష్ఠ కోసం రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయిన యువరాజు యయాతికి మరోసారి విధి ఎదురుదెబ్బ తగిలింది. విమలా నదిలో పడవపై తప్పించుకుంటున్న ప్రేమికులను వృషపర్వుడి సైనికులు పట్టుకున్నారు. తన కళ్లముందే శర్మిష్ఠను తండ్రి తీసుకెళ్లడంతో యయాతి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ప్రేమలో ఓడిపోయానని బాధపడుతున్న అతడికి మిత్రుడు సోమకీర్తి అనూహ్యమైన రాజనీతి వ్యూహాన్ని సూచించాడు. దేవయానితో వివాహం, శర్మిష్ఠతో భవిష్యత్తు, రాజ్యపాలన అనే మూడు సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు. ఆ వ్యూహం యయాతికి కొత్త ఆశను కలిగించిందా? టి. వి. యెల్. గాయత్రి గారి ఉత్కంఠభరిత ధారావాహిక ‘కచ దేవయాని’ 74వ భాగం చదవండి.


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.  శర్మిష్ఠ  ప్రేమించింది  యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని.


తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని  సహాయం  కోసం  దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. కానీ ప్రేమను వదులుకోలేక శర్మిష్ఠతో పడవలో బయలుదేరుతాడు.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 69 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 70 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 71 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 72 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 73 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 74 | ప్రేమికుల వియోగం – సోమకీర్తి వ్యూహం


నదిలో వేగంగా వెళ్తోంది పడవ. బలంగా తెడ్డు వేస్తున్నాడు యయాతి.


“ఇక రాజకుమారి గురించి దిగులు పడనవసరం లేదు. ప్రస్తుతానికి దేవయానితో యువరాజు పెళ్లి ఆగిపోయింది” అని వెనక్కి తిరిగిన దీర్ఘదర్శి ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు.


ఎదురుగా నిప్పులు కురిపించే కళ్లతో నిలబడి ఉన్నాడు వృషపర్వుడు.


“నువ్వే మన రాజ్యానికి ద్రోహం చేస్తున్నావా, దీర్ఘా!” అని గర్జించాడు.


గబుక్కున మోకాళ్లపై కూర్చుని, “నన్ను సంహరించండి మహారాజా!” అన్నాడు దీర్ఘదర్శి.


“ఇప్పుడే నీకు తగిన శిక్ష విధిస్తాను!” అని కత్తి దూసి దీర్ఘదర్శి వైపు రాబోతున్న వృషపర్వుడి చేతిని పట్టుకుని వారిస్తూ,


“మహారాజా! సేనాధిపతికి శిక్ష విధించడం తరువాత చూద్దాం. ముందు యువరాజును వెనక్కి తీసుకురావడానికి ఆజ్ఞ ఇవ్వండి!” అన్నాడు సోమకీర్తి.


తన సైనికుల వైపు చూశాడు వృషపర్వుడు.


కొంతమంది వెంటనే నదిలోకి దూకారు. మరికొంతమంది అక్కడ ఉన్న జనాలను పంపించివేస్తున్నారు.


“ఎవరో రాజద్రోహులు పారిపోతున్నట్లున్నారు” అనుకున్నారు జనులు.


వారికి అర్థం కాని విషయం ఏమిటంటే, అత్యంత విశ్వాసపాత్రుడైన సేనాధిపతి కూడా రాజద్రోహులను తప్పించాలనుకోవడం.


యయాతి చూశాడు. అతడికి అర్థమైంది.


తాము పట్టుబడ్డారు...


తెడ్డును వదిలేశాడు.


అతడి గుండెల్లో తల దాచుకుని గట్టిగా కళ్లు మూసుకుంది శర్మిష్ఠ.


ఆమె శరీరం వణుకుతోంది. ఆ వణుకు చలివల్ల కాదు. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యయాతికి దూరమవ్వబోతున్నాననే భయం ఆమెను నిలువునా కుదిపేస్తోంది.


ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు యయాతి.


ఏమని ఓదార్చగలడు?


‘భయపడకు! నీకు నేనున్నాను’ అని చెప్పాలనిపించింది. కానీ ఆ మాట అనడానికి కూడా అతడి మనసు అంగీకరించలేదు. తాను ఆమెకు అండగా నిలవగలడా? తన కళ్లముందే ఆమెను తీసుకెళ్లిపోతుంటే చూస్తూ ఉండిపోవాల్సి వస్తే?


రాజకుమారుడిగా ఎన్నో యుద్ధతంత్రాలు నేర్చుకున్నాడు. శత్రువును ఎదుర్కోవడం నేర్చుకున్నాడు. కష్టసమయాల్లో ధైర్యంగా నిలబడటం నేర్చుకున్నాడు.


కానీ ప్రేమించిన మనిషిని కోల్పోయే బాధను ఎదుర్కోవడం ఎలా?


తనలో తానే ప్రశ్నించుకున్నాడు.


వృషపర్వుడు శర్మిష్ఠకు తండ్రి. ఆమెను ప్రేమించే హక్కు ఆయనకు ఉంది. కానీ తన ప్రేమకు విలువ లేదా? తనను నమ్మి వచ్చిన శర్మిష్ఠ జీవితానికి తాను బాధ్యత వహించకూడదా?


తన ప్రేమ తప్పా?


తనను నమ్మి వచ్చిన ఆమెను తిరిగి తండ్రి చేతుల్లో పెట్టడం ద్రోహం కాదా?


ఆలోచిస్తున్న కొద్దీ అతడి హృదయం భారమవుతోంది.


శర్మిష్ఠను ప్రేమించాడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని కలలు కన్నాడు. ఆ కలల్లో ఎన్నో వసంతాలు ఉన్నాయి. ఎన్నో మధురమైన క్షణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఒక్క క్షణంలో చెదిరిపోతున్నాయి.


తాను రాజకుమారుడు.


తనకు ఒక రాజ్యం ఉంది. బాధ్యతలు ఉన్నాయి. తన నిర్ణయాలు ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తాయి.


కానీ ఈ క్షణంలో అవేవీ అతడికి గుర్తుకు రావడం లేదు.


తనకు కావలసింది ఒక్కటే.


శర్మిష్ఠ తన పక్కనే ఉండాలి.


ఆమె కన్నీళ్లు తుడవాలి. ఆమె భయాన్ని పోగొట్టాలి. తన మీద ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.


కానీ విధి మరోలా తీర్పు చెప్పింది.


కాసేపటికి సైనికులు పడవను చేరుకున్నారు. పడవ రేవు వైపుకు తిరిగింది.


యయాతికి ఆ ప్రయాణం అంతులేనిదిగా అనిపించింది.


ప్రతి అల తనను శర్మిష్ఠ నుంచి దూరం చేస్తున్నట్లుగా తోచింది. పడవ ముందుకు కదులుతోంది. కానీ అతడి జీవితం మాత్రం వెనక్కి జారిపోతోంది.


రేవు దగ్గరపడుతోంది.


తన స్వేచ్ఛకు ముగింపు దగ్గరపడుతోందా? లేక తన ప్రేమకు పరీక్ష మొదలవుతోందా?


తెలియదు.


కానీ ఒకటి మాత్రం తెలుసు.


శర్మిష్ఠను అంత సులభంగా మరచిపోలేడు. ఆమెను తన జీవితంలో నుంచి చెరిపివేయలేడు.


ఆమెను తన నుంచి దూరం చేయవచ్చు. కానీ ఆమెపై తనకున్న ప్రేమను ఎవరు దూరం చేయగలరు?


పడవ ఒడ్డుకు చేరుకుంది.


“రామ్మా!” అంటూ తన చేతిని అందించాడు వృషపర్వుడు.


శర్మిష్ఠ మెల్లగా నడిచి వచ్చి తండ్రి చేతిని పట్టుకుంది.


“మహారాజా! ఇందులో శర్మిష్ఠ తప్పేమీ లేదు. అంతా నేనే చేశాను” అన్నాడు యయాతి.


“కొద్దికాలం క్రితం నుంచే మీకు మా శర్మిష్ఠ తెలుసు, కుమారా! నేను తనను కనిపెంచిన తండ్రిని.”


మాట్లాడలేదు యయాతి.


“రాజకుమారిని తీసుకుని మీరు వెళ్లండి మహారాజా! మేము రాత్రి విందుకు వస్తాము!” అన్నాడు సోమకీర్తి.


వృషపర్వుడు శర్మిష్ఠ చేయి పట్టుకుని ముందుకు నడిచాడు. దీర్ఘదర్శి కూడా వారిని అనుసరించాడు.


వెళ్తూ వెళ్తూ శర్మిష్ఠ ఒక్కసారి యయాతి వైపు తిరిగి చూసింది.


ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. భయం ఉంది. బాధ ఉంది. తనను విడిచిపెట్టవద్దనే మౌనమైన వేడుకోలు ఉంది.


యయాతి అడుగు ముందుకు వేయాలనుకున్నాడు. కానీ కాళ్లు కదల్లేదు.


వృషపర్వుడు శర్మిష్ఠను తీసుకుని వెళ్లిపోయాడు.


ఆమె కనిపించకుండా పోయేవరకు చూస్తూ ఉండిపోయాడు యయాతి.


తన కళ్లముందే తన ప్రేయసి దూరమైపోయింది. ఆమెను ఆపలేకపోయాడు. తన మనసులోని బాధను ఆమెతో పంచుకోలేకపోయాడు.


తాను ఓడిపోయాడా?


ప్రేమలోనా? విధి దగ్గరనా? లేక తన నిర్ణయాల ఫలితాల ముందా?


సమాధానం దొరకలేదు.


అక్కడ యయాతి, శక్తిధరుడు, సోమకీర్తి మాత్రమే మిగిలారు.


నీళ్లలో కాళ్లు పెట్టుకుని కూర్చున్నాడు యయాతి.


పక్కనే కూర్చున్నారు మిత్రులు.


కాసేపు నిశ్శబ్దం.


రివ్వున గాలి వీస్తోంది.


“ఎందుకు ఇలా చేశావని అడగను. ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకో! గురుకులంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విద్య ఏమిటి?” అడిగాడు సోమకీర్తి.


“శత్రువును ఎలా జయించాలో!” బదులిచ్చాడు యయాతి.


“బాహ్య శత్రువునా? అంతఃశత్రువునా?”


మాట్లాడలేదు యయాతి.


“బాహ్య శత్రువు అయితే దేవయాని. అంతఃశత్రువు అయితే నీ దుఃఖం.”


సోమకీర్తి వైపు చూశాడు యయాతి.


“సముద్రంలో మునిగినవాడికే తెలుస్తుంది లోతు. ఒడ్డున కూర్చుని ఇతరులకు నేనూ కులాసాగా సలహాలు ఇవ్వగలను.”


నవ్వాడు సోమకీర్తి.


“ముందు కాస్త ఆవేశం తగ్గించుకుని ఆశావహంగా ఆలోచించు!”


“రెండు రోజుల్లో దేవయానితో పెళ్లి... ఇంకేం ఆశ ఉంది? శర్మిష్ఠను చూడలేను. ఇంతకంటే నరకం మరొకటి లేదు. పైగా దేవయానిని ముట్టుకోవాలంటే... నా వల్ల కాదు. నాకు మనసు లేదు కీర్తీ!”


“ఇప్పుడే ఆమెతో కాపురం చేయమని ఎవరు చెప్పారు? పెళ్లి చేసుకో! ప్రతిష్ఠానపురానికి తీసుకెళ్లు! అక్కడికి చేరేసరికి పదిహేను రోజులు పడుతుంది. తర్వాత సామంత రాజ్యాల్లో తిరుగుబాటు వచ్చిందని చెప్పు. కొంతకాలం గడుపు. రాజ్యం నీది. దేవయానిది కాదు. నువ్వక్కడ రాజువి. ఆలోచించు!”


వెనక్కు వాలాడు యయాతి. కొనసాగించాడు సోమకీర్తి.


“దేవయానికి ఏ లోటూ రానివ్వకు. బంగారు ఊయలలో ఊగనీ! రత్నాభరణాలు ధరించనీ! దాసదాసీజనంతో సేవలు చేయించుకోనీ! తన దాసీల మీద అజమాయిషీ చలాయిస్తూ, యువరాణి అనే హోదాను అనుభవించనీ! బంధువుల మధ్య, భోగభాగ్యాల మధ్య ఆమెకు కాలం గడిచిపోవాలి. ఆమెకు కావలసినవన్నీ సమకూర్చు.


నువ్వు వెంటనే ఆమెతో మనస్ఫూర్తిగా కాపురం చేయలేవని నాకు తెలుసు. నీ మనసు శర్మిష్ఠ దగ్గర ఉంది. అలాంటప్పుడు నీ మనసును బలవంతంగా మార్చుకోమని నేను చెప్పను. కొంతకాలం నీ మనసును, నీ శరీరాన్ని వేర్వేరుగా ఉంచి ఆలోచించు! రాజుగా నీ బాధ్యతను నిర్వర్తించు. దాంపత్యం పట్ల నీ మనసు సిద్ధపడటానికి సమయం తీసుకో! ఇప్పుడు నీకు కావలసింది ఆ సమయమే!


ఆలోగా సామంత రాజ్యాల్లో ఏదో ఒక సమస్య తలెత్తిందని చెప్పి, వాటి వ్యవహారాల్లో నిమగ్నమవ్వు. కొంతకాలం రాజధానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. నువ్వు రాజువి! రాజ్యకార్యాలు నీకోసం ఆగవు.


ఇక శర్మిష్ఠ విషయం... తొందరపడకు! ముందు నీ వివాహం జరగనీ. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకో. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు.

ఇంత మాత్రం రాజనీతి నీకు తెలియదా యయాతీ? గురుకులంలో ఏం చదువుకున్నావు?”


ఆలోచనగా సోమకీర్తి వైపు చూశాడు యయాతి.


“కానీ!... శర్మిష్ఠను రహస్యంగా పెళ్లి చేసుకున్నాననే అనుకో! దేవయానికి నిజం తెలిస్తే, ఆచార్యుడి నుంచి ఎదురయ్యే ప్రమాదం ఎంత పెద్దదో తెలుసా? దానికి మూల్యం శర్మిష్ఠా, నేనూ చెల్లించుకోవాలి.”


యయాతి భుజాన్ని తట్టాడు సోమకీర్తి.


“ఇక్కడే జాగ్రత్తగా వ్యవహరించాలి. శర్మిష్ఠను నీ రాజ్యానికి దగ్గరలో ఉంచకు! మా పుష్కర ద్వీపంలో నీకు భూభాగం ఉంది. అక్కడ ఒక రాజ్యాన్ని నిర్మించు! శర్మిష్ఠను అక్కడికి తీసుకొనిరా ! చేతిలో విమానం ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ రాజ్యానికి  వెళ్లి రావచ్చు. దేవయానిని కూడా  చూస్తూ ఉండొచ్చు.”


జుట్టును వెనక్కు తోసుకున్నాడు యయాతి.


“ఆలోచిస్తే, ఇది పెద్ద సమస్య కాదు. ముందు నువ్వూ, శర్మిష్ఠా ధైర్యంగా ఉండటం ముఖ్యం.”


సోమకీర్తి మాటలకు ఏమీ జవాబు ఇవ్వలేదు యయాతి.


పక్కనున్న రాళ్లను తీసి నదిలోకి విసిరాడు.


రాళ్లు నీళ్లలో గంతులు వేస్తూ వెళ్లాయి.


అతడి మనసులోని నైరాశ్యం కొద్దికొద్దిగా తగ్గుతోంది.


“ఇది ప్రమాదకరమైన ఆలోచన. కానీ ఎక్కడా లెక్క తప్పకుండా చూసుకోవాలి. ముందు మా వాళ్లతో మాట్లాడాలి... దేవయానిని ఒంటరిని చేయాలి. ఆమె చుట్టుపక్కల ఆమెకు సంబంధించినవాళ్లు ఉండకూడదు. జాగ్రత్తగా అడుగులు వేయాలి.”


అతడి మాటల్లో విశ్వాసం తొణికిసలాడింది.


“నువ్వు సరిగ్గా ఆలోచించు! నిజానికి దేవయాని అసలు సమస్యే కాదు. ఆమెను వంచించడం పెద్ద పని కూడా కాదు.ఆలోచిస్తే చాలా తేలిక. "


ఒక నిమిషం నిశ్శబ్దం.


తలను విదిల్చాడు యయాతి.


ఏదో నిశ్చయించుకున్నట్లుగా ఒక్కసారిగా నదిలోకి దూకాడు.


సోమకీర్తి, శక్తిధరులు కూడా అతడితో పాటు దూకి ఈత కొట్టసాగారు. చల్లటి నీళ్ళల్లో ఈత కొడుతుంటే యయాతిలో ఉన్న నైరాశ్యం కొద్దిగా తగ్గింది. దాని స్థానంలో ఉత్సాహం వచ్చి చేరింది...ఇప్పటికిప్పుడు సమస్యకు పరిష్కారం దొరికిందని కాదు. సమస్యను ఎదుర్కొనే ధైర్యం వచ్చింది.

పిరికివాడిలా పారిపోవటం సరైన నిర్ణయం కాదని అతడి మనసు చెబుతోంది.బుద్ధి జాగృతమవుతోంది.


మిత్రులు ముగ్గురూ ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ  సరదాగా గడిపారు.


కాసేపటికి యయాతి మనసులోని బాధ, ఉద్వేగం తగ్గాయి.


మిత్రులతో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చాడు.


ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక - 75 వ భాగం త్వరలో మీ ముందుకు రానుంది. 


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 75 త్వరలో

===============================================



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T. V. L. Gayathri

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page