కచదేవయాని - పార్ట్ 72

Kachadevayani - Part 72 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 72 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 14/10/2026
శర్మిష్ఠతో రాజ్యాన్ని వదిలి రహస్య సొరంగ మార్గంలో వెళ్లిపోయిన యయాతి గురించి రాజభవనంలో కలకలం మొదలైంది. యువరాజు అదృశ్యమైన విషయాన్ని రుద్రబాహు ద్వారా తెలుసుకున్న దీర్ఘదర్శి, వారిద్దరికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు యయాతి రాసిన రాజ్యత్యాగ లేఖను గోపతి నహుష చక్రవర్తికి అందించాడు. సభలో ఎవరికీ అనుమానం రాకుండా నహుషుడు తెలివిగా వ్యవహరించినా, విషయం వృషపర్వుడికి తెలియడంతో పరిస్థితి మారిపోయింది. సాయంత్రంలోగా యువరాజును తిరిగి తీసుకురావాలని నహుషుడు ఆదేశించాడు. యయాతి–శర్మిష్ఠల రహస్య ప్రయాణం సఫలమవుతుందా? టి. వి. యెల్. గాయత్రి గారి ఉత్కంఠభరిత ధారావాహిక ‘కచ దేవయాని’ 72వ భాగం చదవండి.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని.
తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని సహాయం కోసం దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. రాజ్యాన్ని వదలి శర్మిష్ఠను తీసుకొని జనపదాల వైపు వెళ్తాడు యయాతి.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 69 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 72 | యయాతి కోసం మొదలైన రహస్య అన్వేషణ - చదవండి
వృషపర్వుని భవనంలోకి వెళ్ళాడు రుద్రబాహు. అక్కడ వృషపర్వుడు బంధుమిత్రులతో కొలువుదీరి ఉన్నాడు.
అక్కడే నహుష చక్రవర్తి తోపాటు వీతిహోత్ర చక్రవర్తి కూడా పరివారంతో కూర్చుని ఉన్నాడు. అందరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
రుద్రబాహుకు ఏమి చేయాలో తోచడం లేదు. ఇటువంటి సమయంలో యువరాజు గురించి ఎలా చెప్పడం? ఎవరితో చెప్పడం? ఆలాగే చూస్తూ నిల్చున్న రుద్రబాహును గమనించి దీర్ఘదర్శి అతడి దగ్గరికి వచ్చాడు.
"ఏమిటి రుద్రా! విందుకు వేళవుతోంది. యువరాజు వస్తున్నారా?" అన్నాడు.
"ప్రభూ! మహారాజుతో ఒక రహస్యం చెప్పాలి! "అన్నాడు రుద్రబాహు చిన్నగా.
"రహస్యమా?" అంటూ రుద్రబాహును తీసుకొని ఎవ్వరూ లేని చోటుకు వచ్చాడు దీర్ఘదర్శి.
"ఇప్పుడు చెప్పు! "
"ప్రభూ! యయాతి యువరాజు శర్మిష్ఠ రాకుమారితో రాజ్యాన్ని వదలి వెళ్లిపోయారు. "అంటూ ఉదయం నుండి జరిగిందంతా చెప్పాడు.
ఎగిరిగంతు వేయాలనిపించింది దీర్ఘదర్శికి.
'ఎంత మంచి పని చేశాడు యువరాజు 'అని మనసులో అనుకొని పైకి కంగారును నటిస్తూ
"నాతో చెప్పి మంచిపని చేశావు రుద్రా! నేను మహారాజుతో విషయాన్ని చెప్పి యువరాజును వెనక్కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు! .. జాగ్రత్త! ఇంకెవ్వరితో చెప్పకు! "అన్నాడు.
"అలాగే ప్రభూ! "అని రుద్రబాహు వెళ్లిపోయాడు.
దీర్ఘదర్శి సంతోషంగా శర్మిష్ఠ భవనం వైపు వెళ్ళాడు.
ద్వారం దగ్గర నారాచి ఉంది.
నారాచికి తెలియకుండా శర్మిష్ఠ ఎక్కడికి వెళ్ళదు.
"నారాచీ! ఇలారా! "అన్నాడు.
అతడి దగ్గరికి వచ్చింది నారాచి.
చుట్టూ చూచి "నేను విన్నది నిజమేనా? యువరాజుతో మన రాజకుమారి...." అని చిన్నగా అడిగాడు.
"అవును ప్రభూ!" అంది నారాచి రహస్యంగా.
"శభాష్! ఆ దయ్యం ఇప్పుడేం చేస్తుంది? ఎంతసేపయింది? ఎలా వెళ్లారు?"
"అరగంట అయింది ప్రభూ! సొరంగ మార్గం ద్వారా వెళ్లిపోయారు. "
"ఇంకో గంట సేపు ఓపిక పడితే నది దగ్గరికి వెళ్లి పోతారు. ఈ లోపల నువ్వు జాగ్రత్తగా ఉండు! ఎవ్వరితో మాట్లాడకు! నేను విమలా నది దగ్గరికి వెళ్తాను! రాజమారికి తోడుగా ఉంటాను. ఆ దేవుడు మన రాజకుమారికి మేలు చేస్తాడు" అని వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు దీర్ఘదర్శి.
నారాచి సంతోషంగా అతడు వెళ్లిన వైపే చూస్తూ నిల్చుంది.
యయాతి వ్రాసిన లేఖను పట్టుకొని గోపతి దానవ రాజభవనానికి వచ్చాడు.
అంతమంది ముందు విషయాన్ని చెప్పడానికి ఒక నిమిషం సందేహించినా విషయం ముఖ్యమైనది కాబట్టి ముందుకు అడుగు వేశాడు.
అప్పుడే ఒక దాసి పళ్లెంలో ఫలరసాల లోటాలను పెట్టుకొని వస్తూ కనిపించింది.
"వాటిని ఇలా ఇవ్వు! చక్రవర్తి గారికి నేను అందిస్తాను!" అని ఆమె చేతిలో నుంచి పళ్లాన్ని తీసుకొన్నాడు.
అందరికీ అందిస్తూ నహుషుడి దగ్గరికి వచ్చాడు గోపతి.
ఆయనకు పళ్ళ రసాన్ని అందిస్తూ" ప్రభూ! ఈ లేఖను చదవండి!" అని గుసగుసగా చెప్పి లేఖను తెరిచి ఆయన ఒడిలో పడేశాడు.
లేఖలో అక్షరాలు కనిపిస్తున్నాయి.
విషయం అర్ధం అయింది.
ఏ మాత్రం తొణకలేదు నహుషుడు.
లోటాతో పళ్ళరసాన్ని తాగుతున్నట్లు నటిస్తూ కొంచెం తన దుస్తుల మీద ఒలక బోసుకున్నాడు.
"అయ్యో! ప్రభూ!" అన్నాడు గోపతి.
అందరూ అటువైపు చూశారు.
"ఫర్వాలేదు! ఫర్వాలేదు! నేను దుస్తులను మార్చుకొని వస్తాను! "అని లేచాడు నహుషుడు.
ఆయన వెంట కదిలాడు శక్తిధరుడు.
అనుసరించారు పింగళ, గోపతిలు.
తను వెళ్తూ వెళ్తూ వీతిహోత్రుని భుజం తట్టాడు నహుషుడు.
దాని అర్థం తనతో రమ్మని.
వీతిహోత్రుడు లేచి వస్తుంటే ఆయన కుమారుడు సోమకీర్తి గమనించి అతడు కూడా వీళ్ళను అనుసరించాడు.
మిగిలిన వాళ్ళు ఎవరి కబుర్లలో వాళ్ళు ఉన్నారు. వృషపర్వుడు మాత్రం చక్రవర్తినే చూస్తున్నాడు.
గోపతి సభలోకి రావడం దగ్గర్నించి అతడి ప్రవర్తన కొంచెం సందేహంగా ఉంది.
ఇప్పుడు చక్రవర్తి దుస్తులను మార్చుకోవడానికి వెళ్తుంటే ఇంతమంది వెంట వెళ్లడం ఎందుకు?
'విషయం ఇంకేదో ఉంది' అనుకుంటూ వృషపర్వుడు కూడా వాళ్ళ వెనకాల వెళ్లాడు.
మరొకభవనంలోకి వెళ్లారు అందరూ.
"సమస్య ఏమిటంటే యువరాజు రాజ్యం వదలి వెళ్లిపోయాడు" అన్నాడు నహుషుడు.
అతడి ముఖం గంభీరంగా ఉంది.
చుట్టూ ఉన్న వాళ్ళు నిర్ఘాంతపోయి చూస్తున్నారు.
అప్పుడే లోపలికి వచ్చాడు వృషపర్వుడు.
"రాజకుమారిని తీసుకొని యువరాజు వెళ్లి పోయాడు" అని లేఖను అతడికి చూపించాడు నహుషుడు.
వృషపర్వుని ముఖం పాలిపోయింది.
చురుకుగా ఆలోచిస్తున్నాడు సోమకీర్తి.
"ఎంతసేపయింది?" అని అడిగాడు.
"అరగంట దాటింది ప్రభూ!" అన్నాడు గోపతి.
"ఎక్కువ దూరం వెళ్లి ఉండరు! పింగళా! వెళ్లి రాజధాని ప్రధాన ద్వారపాలకులను విచారించు!" అన్నాడు నహుషుడు.
సంధించిన బాణం లాగా పరిగెత్తాడు పింగళుడు.
"నగరం లోనుంచి యయాతి రాజకుమారితో పాటు వెళ్లాలంటే కొంచెం కష్టం! ఇంకేదైనా మార్గం ఉందా?" అడిగాడు సోమకీర్తి.
"ఆ విషయం నేను కనుక్కుంటాను! చక్రవర్తీ! మీరు బంధుమిత్రులతో ఎప్పటిలాగా గడపండి!" అన్నాడు వృషపర్వుడు.
"అవును చక్రవర్తీ! యువరాజు మాతో విందులో పాల్గొంటున్నట్లు ప్రకటించండి! బంధుమిత్రులకు ఎటువంటి అనుమానం రాకూడదు! దానవరాజా పదండి!" అన్నాడు సోమకీర్తి.
"అదే మంచిది! ఎట్టి పరిస్థితుల్లోను యువరాజు సాయంత్రం లోపల ఇక్కడ ఉండాలి!" అని తన భవనంలోకి వెళ్లాడు నహుషుడు.
వెంటనే అక్కడి నుండి శర్మిష్ఠ భవనానికి బయలుదేరారు సోమకీర్తి, వృషపర్వుడు, శక్తిధరులు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 73 త్వరలో
===============================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.







Comments