top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 66


సంయాతి మరియు హూహు మధ్య భీకర గదాయుద్ధం, నేపథ్యంలో యయాతి త్వష్టతో పోరాడుతున్న దృశ్యం

Kachadevayani - Part 66 - Telugu Mythological Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 66 తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 22/08/2026


కచదేవయాని - పార్ట్ 66 లో దేవాసుర సంగ్రామం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. రెండో రోజు యుద్ధంలో యయాతి వ్యూహంతో దేవసైన్యానికి భారీ నష్టం కలగడంతో, దేవేంద్రుడు హూహును రంగంలోకి దింపుతాడు. మూడో రోజు గదాయుద్ధంలో సంయాతి, హూహు మధ్య భీకర పోరు జరుగుతుంది. సంయాతి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోవడంతో దానవ శిబిరంలో ఆందోళన నెలకొంటుంది. మరోవైపు యయాతి బల్లెంతో హూహును ఎదుర్కొని దానవ సైన్యానికి ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అదే సమయంలో త్వష్ట, ప్రభాసుడు తదితర దేవవీరులతో కూడా భీకర పోరాటం కొనసాగుతుంది. యుద్ధం ఎటు దారితీస్తుందో తెలుసుకోవాలంటే “కచ దేవయాని – 66” చదవండి.

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని. తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది. వృషపర్వుడు, నహుషుడు, యయాతి సమావేశమవుతారు. శుక్రాచార్యుడు కూతురితో కలిసి ఆరావళీ పర్వత ప్రాంతంలోని ఆశ్రమానికి వెళ్తాడు. దానవులకు  బంధీ అయిన కచుడ్ని విడిపిస్తాడు యయాతి. దేవదానవ యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. మొదటి రోజు యుద్ధంలో కచుడు–సంయాతి, యయాతి–ప్రభాసుడు, నహుషుడు–విశ్వావసు మధ్య భీకర పోరాటాలు జరుగుతాయి.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇరుపక్షాల వాళ్ళు ఆ రోజు జరిగిన యుద్ధం గురించి సమీక్షించుకొన్నారు. 

రెండో రోజు దానవ సేనాపతి శంఖాన్ని పూరించి యుద్ధాన్ని ప్రారంభించాడు. 

నిన్నటి కంటే ఉత్సాహంగా యుద్ధాన్ని చేస్తున్నారు దేవదానవులు. 


యయాతి చిన్న తమ్ముడైన ప్రయాతి తన వాడి బాణాలతో దేవ సైన్యాన్ని చికాకు పరుస్తున్నాడు. అతడిని నిలవరించడానికి ప్రభాసుడు ముందుకు దూకాడు. 

ఒక వైపు కచుడు దీర్ఘదర్శితో యుద్ధం చేస్తుంటే మరొక వైపు సోమకీర్తి త్వష్టతో తలపడుతున్నాడు. 


యయాతి అతి వేగంగా బాణాలు వేస్తూ దేవ గజాలను సంహరిస్తూ ముందుకు వెళ్తుంటే అతడికి అడ్డు తగిలాడు విశ్వావసు. 


యయాతి పది బాణాలతో విశ్వావసు గుండెల మీద కొట్టేసరికి రథంలోనే కూలబడ్డాడు విశ్వావసు. 


విశ్వావసును రక్షించడానికి సప్త వసువులు ఒక్కసారిగా యయాతిని ఎదుర్కొన్నారు. 

బాణాల వర్షాన్ని కురిపిస్తూ యయాతి సప్త వసువులను చావగొట్టి పంపించాడు. 

ఆ పూట యయాతిని ఎదుర్కోవడం దేవతలకు సాధ్యం కాలేదు. 


దీర్ఘదర్శి కచుడిని ఎటూ కదలనివ్వకుండా యుద్ధం చేస్తున్నాడు. 

అప్పటికి దేవ సైన్యానికి యయాతి వ్యూహం అర్థమైంది. 

అడ్డు అదుపు లేకుండా యయాతి దేవతల గజ, అశ్విక దళాలను సంహరిస్తున్నాడు. 

దేవతలకు కంగారు పుట్టింది. 


ఆ రోజు యుద్ధ విరామ సమయానికి దానవులు తమ సైన్యాన్ని కాపాడుకొంటూ దేవదళాన్ని భారీగానే దెబ్బతీశారు. 


ఆ సాయంత్రం తమ వీరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు దేవేంద్రుడు. 

"ఇంత మంది వీరులున్నారు. ఏం లాభం? ఈ రోజు మన సైన్యానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. "అన్నాడు కోపంగా. 


తలవంచుకున్నారందరు. 

"ఇప్పుడే హూహుకు కబురు చేస్తాను! రేపటికి మనం కూడా వ్యూహాత్మకంగా వెళ్ళాలి! "అంటూ హూహు కోసం దూతలను పంపించాడు దేవేంద్రుడు. 


ఇక్కడ దానవశిబిరంలో 

యయాతి తన వ్వూహాన్ని సహచరులకు వివరిస్తున్నాడు. 


"ఇప్పటికీ దేవతల గజ, అశ్విక దళాలను బాగానే నష్టపరిచాము. ఇంతటితో మనం గెలిచామనుకోవద్దు... రేపటికి దేవసైన్యం ప్రతీకారంతో యుద్దానికి వస్తుంది మన గజ, అశ్విక దళాలతో సోమకీర్తి, బృందారకులు ముందు దూకి అష్టవసువులను కట్టడి చేస్తారు. ప్రయాతి, సంయాతులు త్వష్టను, విశ్వావసును ఎదుర్కొని పడగొట్టాలి. 

మనం మన బలగాలను కాపాడుకుంటూ యుద్ధాన్ని చేయాలి. దీర్ఘదర్శి ఆ బాధ్యతను నిర్వహిస్తే నేను మిగిలిన వాళ్ళను చూసుకుంటాను. "


యయాతి చెప్పింది విని అందరూ "బాగు! బాగు! "అన్నారు. 


అప్పుడే ఒక దానవ గూఢచారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 


"ప్రభువులకు జయము! "అని నిలబడ్డాడు. 


"చెప్పు! ఏమిటి సమాచారం?" అడిగాడు వృషపర్వుడు. 


"ప్రభూ! రేపటి యుద్దానికి హూహు వస్తున్నాడని సమాచారం అందింది. "అన్నాడతడు. 


లేచి నిలబడ్డాడు వృషపర్వుడు. 


"కుమారా! హూహు వస్తున్నాడంటే మనకు గెలుపు అంత సులభం కాదు! మనమేం చేద్దాం?" అంటూ యయాతి వైపు చూశాడు వృషపర్వుడు. 


"కంగారు పడొద్దు మహారాజా! రేపటికి వ్యూహాన్ని మార్చుకోనవసరం లేదు... హోహు దీర్ఘకాయుడు. అతడు గదా యుద్ధంలో నిపుణుడు. భయం లేదు! ఎదుర్కొందాం! నా తమ్ముడు సంయాతి గదాయుద్ధం అంటే ముందుకు ఉరుకుతాడు. "అని సంయాతి వైపు తిరిగి 

"నువ్వు రేపు నీ ప్రతాపాన్ని చూపించు! నీకు తోడుగా దీర్ఘదర్శి ఉంటాడు. నీకు రక్షగా నేను ధనుర్బాణాలతో తయారుగా ఉంటాను.. ఎలాగైనా హూహును మట్టి కరిపించాలి! "అన్నాడు యయాతి. 


సంయాతి సంతోషంగా అన్నను కౌగలించుకొన్నాడు. 

"యుద్ధం అంటే వీరులకు పండగ! రేపు నా ప్రతాపాన్ని నువ్వే చూస్తావుగా! "అన్నాడు. 

దానవులు జయ జయ ధ్వానాలు చేశారు. 


మూడో రోజు యుద్ధం. 

ప్రభాసుడు శంఖాన్ని పూరించి యుద్ధాన్ని ప్రారంభించాడు. 

ఇరుపక్షాలు తమ శక్తికి మించి పోరాడుతున్నాయి. 

తన గదను తిప్పుతూ హూహు యుద్ధభూమిలో వీరవిహారం చేస్తున్నాడు. 


వీరత్వంగా అతడిని ఎదుర్కొన్నాడు సంయాతి. 

ఇద్దరి గదలు మెరుపులు కురిపిస్తున్నాయి. 

సంయాతికి రక్షణగా వెళ్దామనుకొన్న యయాతిని తన బాణాలతో ఎదుర్కొన్నాడు కచుడు. 


కచుడిని దాటి పోవడానికి యయాతికి కుదరటం లేదు. 

వృషపర్వుడిని కట్టడి చేస్తున్నాడు విశ్వావసు. 

 భీకరంగా యుద్ధం చేస్తున్న సంయాతి భుజంపై గదతో బలంగా కొట్టాడు హూహు. 

కళ్ళు తిరిగాయి సంయాతికి. 


అయినా నిలదొక్కుకొని ఒక్క గెంతు గెంతి గదతో హూహు గుండె మీద ఒక్క దెబ్బ వేశాడు సంయాతి. 


తమాయించుకొన్నాడు హూహు. 

అతడి కళ్ళు ఎఱ్ఱబడ్డాయి. 


పెద్దగా కేక పెడుతూ గదను తిప్పుతూ వచ్చి సంయాతి నడుం మీద కొట్టేసరికి ఇరవై రెండేళ్ల చిన్న కుర్రవాడైన సంయాతి రక్తం కక్కుకుంటూ దూరంగా పడ్డాడు. వెంటనే స్పృహను కోల్పోయాడతడు. దానవులు సంయాతిని శిబిరానికి తీసుకొని పోయారు. 

హాహాకారాలు చేశారు దానవులు. 


చూశాడు దీర్ఘదర్శి. 

వేగంగా వచ్చి హూహు తల మీద ఒక్క దెబ్బవేశాడు. 

హూహు శిరస్త్రాణం ముక్కలయ్యి ఎగిరి అవతల పడింది. 

హూహు ఊరుకోలేదు. 


దీర్ఘదర్శిని అంతే వేగంగా ఎదుర్కొని గదతో విచక్షణారాహిత్యంగా దెబ్బలు కొట్టసాగాడు. 


చూశాడు యయాతి. 

నాలుగు బాణాలతో కచుడి సారథిని కొట్టి, మరో నాలుగు బాణాలతో గుర్రాలను చంపేశాడు. 


రథంలో నుంచి కింద పడ్డాడు కచుడు. 


బల్లేన్ని తీసుకుని వేగంగా హూహు దగ్గరికి వెళ్లాడు. అప్పటికే హూహు చేతిలో దెబ్బలు తిని నేలమీద పడిపోయాడు దీర్ఘదర్శి. 


తిరిగి చూచి యయాతిని కూడా తన గదతో ఎదుర్కోబోయాడు హూహు. 

అంతలోనే యయాతి బలంగా బల్లెంతో హూహు పొట్టలో పొడిచాడు. 

నేల మీద పడ్డాడు హూహు. 


ఉత్సాహంగా దానవసైనికులు కేకలు పెట్టసాగారు. 

హూహు లేచాడు. 


ఈ లోపల హూహుకు ఆయుధాలతో రథాన్ని తీసికొని వచ్చారు దేవ సైనికులు. 

ఇటువైపు తన రథాన్నెక్కి బాణాలతో హూహును చికాకు పెడుతూ యుద్ధం చేస్తున్నాడు యయాతి. 


హూహుకు రక్షగా త్వష్ట వచ్చాడక్కడికి. 

యయాతి త్వష్టతో తలపడుతున్నాడు. 


మధ్యాహ్నటికి యుద్ధం తీవ్రమయింది. 


ఒక వైపు హూహు దానవ గజ సైన్యాన్ని నూర్చుతుంటే మరొక వైపు యయాతి త్వష్టను బలంగా బాణాలతో కొట్టేసరికి త్వష్ట తీవ్రంగా గాయపడ్డాడు. 


ప్రయాతి దెబ్బకు ప్రభాసుడు స్పృహ కోల్పోయాడు. 


సాయంత్రం యుద్దానికి విరామాన్ని ప్రకటించి ఇరుపక్షాలు తమ తమ శిబిరాలకు చేరుకున్నాయి. 

 

===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 67 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T. V. L. Gayathri

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page