విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 3

Viswaroopuni Charithra - Part 3 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.
విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 3 - తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 27/11/2026
విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 3లో భాగంగా శ్రీమన్నారాయణ కవచం మహిమను, దాని ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ భాగంలో తెలుసుకుందాం. విష్ణువు వివిధ అవతారాలను స్మరిస్తూ రక్షణను కోరే ఈ కవచ విశేషాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
శుక్రాచార్యుని నీతిమార్గం చేత దేవతల సంపదలు రాక్షసుల వశమయ్యాయి. అడ్డులేని విష్ణుమాయా ప్రభావంతో విశ్వరూపుడు తిరిగి ఆ సంపదలు తెచ్చి ఇంద్రుని పరం చేశాడు. అదే శ్రీమన్నారాయణ కవచం.
(ప్రతి ఒక్కరూ ఈ కవచాన్ని నిత్యమూ చదువుకుంటే శివుని రుద్రకవచంలా, వెంకటేశ్వర వజ్రకవచంలా మనలను సర్వకాలసర్వావస్థలనుండి కాపాడుతుందనుటలో సంశయమే లేదు.)
శ్రీమన్నారాయణ కవచం
మునీశ్వరుడైన విశ్వరూపుడు ఇంద్రునికి సాంగంగా నారాయణ కవచాన్ని తెలియజేశాడు. అది హరియొక్క ఒక మాయాశక్తి. దాని స్వరూపం తెలియశక్యం కాదు. అది గొప్ప ఫలాన్నిస్తుంది. ఆ కవచం విజయాన్నిస్తుంది.
విశ్వరూపుడు పాదాలు, చేతులు కడుగుకుని
ఉత్తర ముఖంగా కూర్చుని అంగాన్యాసాలు,
కరన్యాసాలు చేసి నారాయణ కవచాన్ని చేశాడు.
ఈ విధంగా నారాయణ కవచాన్ని కూర్చి పాదాలయందు, మోకాళ్ళయందు,
హృదయమందు, ముఖమందు, తలయందు, వక్షస్థలమందు, తొడలయందు, పొట్టయందు -
ఈ విధంగా ఎనిమిది అంగములందు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని న్యాసం చెయ్యాలి.
"ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం చెయ్యాలి. ఈ అంగాన్యాస, కరన్యాసాల వల్ల సాధకుడు తాను మంత్రస్వరూపుడు అవుతాడు.
హృదయంలో ఓంకారాన్ని, తలపై 'వి' అనే అక్షరాన్ని, కనుబొమ్మల మధ్యలో షకారాన్ని, తలమీద పిలక ఉండే ప్రదేశంలో ణకారాన్ని, కన్నులయందు 'వే' కారాన్ని, అన్ని కీళ్ళలోనూ నకారాన్ని, అస్త్రమునుద్దేశించి మకారాన్ని న్యాసం చేస్తే సాధకుడు మంత్రస్వరూపుడే అవుతాడు.
ఇంకా "ఓం నమః అస్త్రాయ ఫట్" అని దిగ్బంధనం చేసి పరమేశ్వరుణ్ణి ధ్యానంలో నిల్పి నారాయణ కవచాన్ని చేశాడు. ఆ కవచం జ్ఞానరూపం, తపోరూపం, ఆరు శక్తులు కలది.
పాదాలు గరుత్మంతుని వీపుపై ఉంచి తన చేతులతో శంఖం, చక్రం, డాలు, ధనుస్సు, కత్తి, బాణాలు, పాశం, గద మొదలైన సాధనాలు ధరించి, అష్టైశ్వర్యాలతో, అష్టబాహువులతో కూడిన విష్ణుమూర్తి నన్ను రక్షించు గాక.
గొప్ప కీర్తికల మత్స్యావతారం, మొసళ్ళ రూపమైన వరుణపాశాలవలన, నీటి వలన మరణం కలుగకుండా నన్ను రక్షించు గాక.
బ్రహ్మచారి మాయతో నటించేవాడు, బలికి కలుగు మంగళములను ప్రతిఘటించడంలో సౌర్యం చూపించినవాడు, గొప్పవైన మూడడుగులుకల వామనమూర్తి భయంకరమైన స్థలములందు నన్ను రక్షించును గాక.
శ్రీనృసింహుడు హిరణ్యకశిపుని వధించే సమయంలో దిక్కులన్నీ వణికిపోయేలా పెద్ద పెద్ద కోరలున్న ముఖంతో ఇంతని చెప్పలేని ఆకారంతో అతిభయంకరంగా ఉన్నాడు.
అటువంటి నృసింహుడు అడవులలోనూ, చొరరాని చోట్ల, మంటలలో, యుద్ధాల్లో అన్ని ఆపదలలో ప్రశస్తమైన రీతిలో నన్ను రక్షణ కల్పించు గాక.
భూమి మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు తన కోరతో ఆదివరాహమూర్తి దాన్ని పైకెత్తాడు.
ప్రళయజాలాల్లో ఆటలాడే వరాహమూర్తి భూమికి భర్త. ఎంతో దయగల వరాహస్వామి నిరంతరం ప్రయాణాలు సాగే త్రోవలలో అటువంటి ఆదివరాహం నన్ను రక్షిస్తూ ఉండుగాక.
పరశురాముడు భృగు వంశంలో జన్మించి దానిని శోభింపజేశాడు.
శ్రీమంతుడు అయిన భార్గవ రాముడు పర్వతశిఖరములందు నన్ను రక్షించు గాక.
తాటకను చంపి, విశ్వామిత్రుని యాజ్ఞాన్ని రక్షించి, శివుని విల్లు విరచి, విరాధుడు, కబంధుడు, ఖరుడు మొదలైన రాక్షసులను చంపి, సముద్ర గర్వం అణచి, విభీషుణ్ణి లంకకు అభిషిక్తుణ్ణి చేసి, సీతతో అయోధ్యకు వెళ్లి రాజ్యసుఖాలు అనుభవించిన శ్రీరామచంద్ర ప్రభువు స్వస్థలం విడచి దూరప్రాంతాలతో ఉన్న సమయాలలో నన్ను రక్షించును గాక!
మూడవ భాగం సమాప్తం.
విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 4 త్వరలో
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి










Comments