top of page
Original.png

సాహస బాలుడు

1 hour ago
3 min read

అభిమన్యుడి సాహసం మరియు పద్మవ్యూహాన్ని చూపించే పిల్లల కథ ‘సాహస బాలుడు’ చిత్రీకరణ

Sahasa Baludu - Telugu Childrens Stories | Varalakshmi Yanamandra

సాహస బాలుడు - తెలుగు బాలల కథలు | వరలక్ష్మి యనమండ్ర  

Published in manatelugukathalu.com on 28/11/2026


అభిమన్యుడి ధైర్యం, సాహసం, త్యాగాన్ని పిల్లలకు పరిచయం చేస్తూ, ఏ పనినైనా పూర్తిగా నేర్చుకుని చేయాలనే మంచి సందేశాన్ని అందించే బాలల నీతి కథ ‘సాహస బాలుడు’.


ఆ రాత్రి కూడా భోజనాలయ్యాక ఐదుగురూ అరుగుమీదకి చేరారు. ఆకాశంలో చందమామ వెలుగులు చల్లుతోంది.


"అమ్మమ్మా! తొందరగా రా! ఈరోజు కొత్త కథ చెప్పాలి" అని కేకలు పెడుతున్నారు.

చేసేది లేక పని ఆపి వచ్చింది అమ్మమ్మ.


"అమ్మమ్మా! ఈ రోజు ఎవరి కథ?" అడిగింది మహతి.


"ఈ రోజు బాల అభిమన్యుడి కథ చెబుతాను" అంది అమ్మమ్మ.

"అభిమన్యుడు అంటే అర్జునుడి కొడుకే కదా?" అన్నాడు మహి.


"అవును నాన్నా. అర్జునుడి భార్య సుభద్ర. అభిమన్యుడు ఇంకా అమ్మ కడుపులో ఉండగానే ఒక అద్భుతం జరిగింది."


"అమ్మ కడుపులోనా? ఏమైంది అమ్మమ్మా?" ఆశ్చర్యంగా అడిగాడు కార్తికేయ.


"ఒకరోజు అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహం గురించి చెబుతున్నాడు. అది యుద్ధంలో శత్రువులు చేసే గుండ్రని వలయం లాంటి వ్యూహం. 


లోపలికి వెళ్లడం తేలిక, బయటికి రావడం చాలా కష్టం. సుభద్ర వింటూ వింటూ నిద్రపోయింది. అందుకే వ్యూహంలోకి వెళ్లే మార్గం వరకే కడుపులో ఉన్న బాబు విన్నాడు."

"అమ్మో! అప్పుడే విన్నాడా!" అంది మయూఖ.


"అందుకే పుట్టాక చిన్నప్పటి నుంచే అభిమన్యుడు చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు. విలువిద్యలో మహా నేర్పరి."


"నేను కూడా తెలివైనవాడినే!" అన్నాడు మిట్టు.

"ఔను, నిన్న పజిల్ పూర్తి చేసావు కదా నీవు" అన్నది మహతి.


"పెద్ద యుద్ధం వచ్చింది. అందరు పెద్దవాళ్లు వేరే చోట పోరాడుతున్నారు. అప్పుడు శత్రువులు పద్మవ్యూహం పన్నారు. దాన్ని ఛేదించగలిగేవాడే మన అభిమన్యుడు. 


'నేను వెళ్తాను పెదనాన్నా!' అన్నాడు. 'కానీ బయటికి రావడం నీకు తెలియదు కదా' అన్నారు పెద్దవాళ్లు. 'మీరంతా నా వెనకే రండి' అన్నాడు అభిమన్యుడు."


"అభిమన్యుడు భయపడలేదా?" అడిగింది మయూఖ.


"ఏమాత్రం లేదు తల్లీ. ధైర్యంగా లోపలికి వెళ్లాడు. కానీ శత్రువులు మోసంతో, అందరూ కలిసి ఒక్కడిపై దాడి చేశారు. చివరికి అభిమన్యుడు వీరమరణం పొందాడు."


పిల్లలంతా కాసేపు మౌనంగా ఉండిపోయారు.

"అయ్యో! పాపం" అంది మహతి నెమ్మదిగా.


"బాధపడకు తల్లీ. కొన్నిసార్లు గెలుపు కన్నా ధైర్యమే గొప్పది. చిన్న వయసులోనే అభిమన్యుడు ధైర్యంతో చరిత్రలో నిలిచిపోయాడు."


"అమ్మమ్మా, ఆయన పెద్దవాళ్ల మాట వినకుండా వెళ్లాడా?" అడిగాడు కార్తికేయ.


"లేదు నాన్నా. పెద్దలకు సాయం చేయడానికే వెళ్లాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏ పని చేసినా పూర్తిగా నేర్చుకుని చేయాలి. అభిమన్యుడికి బయటికి రావడం తెలిసి ఉంటే కథ వేరుగా ఉండేది."


"అంటే మనం ఏ పనైనా పూర్తిగా నేర్చుకోవాలన్నమాట!" అన్నాడు మహి.

"అవును. ధైర్యంతో పాటు తెలివి, నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉండాలి. పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి."


"నేను ఇక నుంచి టీచర్ చెప్పింది పూర్తిగా వింటా!" అన్నాడు మిట్టు.

"సాహస బాలుడు... కదా అమ్మమ్మా!" అంది మహతి.


అమ్మమ్మ ఐదుగురినీ ప్రేమగా దగ్గరకు తీసుకుంది. "మీరందరూ నా బుజ్జి అభిమన్యులు! ధైర్యంగా ఉండండి, బాగా నేర్చుకోండి."


చందమామ చిరునవ్వు నవ్వింది. ధైర్యవంతుడైన బాలుడిని తలచుకుంటూ పిల్లలు హాయిగా నిద్రపోయారు.


వరలక్ష్మి యనమండ్ర ✒️


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y







వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వరలక్ష్మి యనమండ్ర

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర

పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర 

కలం పేరు: లేదు

స్వస్థలం: అద్దంకి,‌ప్రకాశం జిల్లా

ప్రస్తుత నివాసం: హైదరాబాద్ 

వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని 

విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.


ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు


1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి) 

2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి) 

3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి) 

        తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది. 

కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం

4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి) 

5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)

6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక) 

          (400 ఆటవెలది పద్య సంపుటీ)

   7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు) 


అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి. 


పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు 

కొన్ని సమూహాలను నిర్వహణ,‌ కొన్ని సమూహాలలో సమీక్షణం 

యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను 



నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,‌బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.


ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.


జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం. 







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page