top of page
Original.png

విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 2

9 minutes ago
3 min read

విశ్వరూపుని చరిత్ర పార్ట్ 2లో రాక్షసుల చేతిలో ఓడిన దేవతలు బ్రహ్మదేవుని సూచనతో త్రిశిరస్సుల విశ్వరూప మహర్షిని గురువుగా స్వీకరించే పౌరాణిక దృశ్యం.
విశ్వరూపుని చరిత్ర పార్ట్ 2లో రాక్షసుల చేతిలో ఓడిన దేవతలు బ్రహ్మదేవుని సూచనతో త్రిశిరస్సుల విశ్వరూప మహర్షిని గురువుగా స్వీకరించే పౌరాణిక దృశ్యం.

Viswaroopuni Charithra - Part 2 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.

విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 2 - తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 22/11/2026



అహింసామార్గంలో నడిచి, అవినీతికి మారుపేరుగా ఉన్న దైత్యులు బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా భయంకరమైన జయ జయ ధ్వానాలు చేస్తూ గుర్రాలతో, ఏనుగులతో, రథాలతో దేవతలపై దండెత్తారు. 


దేవతలు కూడా తలపడటం ప్రారంభించి అస్త్రాలు ప్రయోగిస్తే, తమ గురువు శుక్రాచార్యుని మంత్ర ప్రభావంతో విశేష శక్తిని పొందిన దైత్యులు వాటిని నిర్మూలనం చేసి గుంపులు గుంపులుగా బాణాలు నాటేసరికి దేవతలు యుద్ధం చేయలేక పలాయనం చిత్తగించారు. 


చెరో దిక్కుకు పారిపోయిన దేవతలు రాక్షసులనే బోయెల చేతిలో చరమృగాలైపోయారు.


దేవతలకు సంపదనిచ్చేవాడు, సర్వజగత్తులను జయించే మన్మథుని సోదరుడు, పవిత్ర యోగిజనుల మనస్సులను జయించినవాడు, సరస్వతీ హృదయవల్లభుడు అయిన బ్రహ్మదేవుని కడకు వెళ్ళి నమస్కరించారు దేవతలు వెంటనే.


చతుర్ముఖ బ్రహ్మ చిరునవ్వుతో, దయతో కూడిన మాటలతో దేవతల బడలిక పోగొట్టి అభయం ఇచ్చాడు.

"మీరు పుట్టిననాటి నుంచి మీకు జ్ఞానానిచ్చి, లోకాలను పరిపాలించడానికి రాజ్యాభిషేకం చేసి, మిమ్మల్ని పెంచిన దయాళువు, బ్రహ్మజ్ఞాన నిధి అయిన బృహస్పతిని లక్ష్యపెట్టక ఐశ్వర్యంతో కొవ్వుపట్టి పాపపుపని చేసి తప్పు చేశారు. 


గురుద్రోహం శత్రురూపంలో వెంటనే దాని ఫలాన్ని అనుభవించేలా చేసింది. బలవంతులైన మిమ్మల్ని బలహీనులైన రాక్షసులు శుక్రాచార్యుని మంత్రప్రభావంతో బలవంతులు కావడంతో నా సత్యలోకాన్ని కూడా ఆక్రమించగలిగే సామర్థ్యంతో గర్వం కలిగి ఉన్నారు. అటువంటి వారికి స్వర్గాన్ని ఆక్రమించడం తృణప్రాయం.


అందువల్ల మీరు త్వష్టమనువ పుత్రుడైన విశ్వరూపుడనే మునిని ఆరాధించండి. ఆయన గొప్ప తపోమహిమ కలవాడు. సత్త్వస్వభావుడైన అతడు మీరు కోరినదానిని సమకూర్చగలడు. ఎంతటి ఆపదలనైనా తొలగింపగలడు." 


బ్రహ్మ చెప్పిన మాటలకు శాంతించిన దేవతలు ప్రజాపతి దగ్గర సెలవు తీసుకుని విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నారు…


"నాయనా! నీకు శుభం. నిన్ను ఒకటి అడగడం కోసం నీ ఇంటికి వచ్చాం. తండ్రులతో సమానమైన మా కోరిక తీర్చి కీర్తి సంపాదించు. కొడుకులకు తండ్రి సేవ మహా పుణ్యాన్ని ఇస్తుంది. పితృసేవ కంటే గొప్పది ఏముంది?

గురువు పరబ్రహ్మస్వరూపం, తండ్రి బ్రహ్మదేవుని రూపం, తల్లి భూదేవి రూపం, సోదరుడు ఇంద్రస్వరూపం, అభ్యాగతుడు అగ్నిదేవుని రూపం, సర్వప్రాణులు విష్ణుస్వరూపం. 


కనుక నాయనా!! కడు దుఃఖితులము, నీకు తండ్రితో సమానమైన మమ్ము చల్లగా చూసి శత్రుభయం పోగొట్టి అఖండ తపస్సుతో విరాజిల్లి మమ్మల్ని బ్రతికించు. బ్రహ్మజ్ఞానివైన నిన్ను ఆచార్యునిగా స్వీకరించి నీ ప్రభావంతో శత్రువుల్ని సంహరిస్తాం. తనకోసం తనకంటే చిన్నవాని పాదాలకు నమస్కరించడంలో తప్పులేదని వేదాలు చెప్తున్నాయి. నమస్కరిస్తూ నీ ఎదుట నిలబడిన దేవతలమైన మమ్ము అంగీకరించి మాకు పురోహితుడవు కమ్ము."


దేవతల మాటలకు విశ్వరూపుడు పెద్దగా నవ్వి 

"మీరు కోరిన పౌరోహిత్యం బ్రహ్మతేజస్సును నశింపజేసేది. ధర్మశీలురచే నిందింపబడేది అని తెలిసిన నా వంటి తపస్వితో దేవతలు ఇంత తేటతెల్లంగా తియ్యగా ఎలా చెప్పారో!!


ప్రత్యేకంగా శిష్యులు గురువులకు దక్షిణ రూపంలో ధనమియ్యవలసిన అగత్యం లేదు.

గురూపదేశం పొంది, మంత్రవిదులై ధర్మాన్ని అనుష్ఠించే శిష్యులే గురువులకు సంపదలు.


నీచమైన పద్ధతిలో పౌరోహిత్యం వలన ధనం సంపాదించవలసిన అవసరం లేదు. కానీ మీ ఆజ్ఞను అనుసరించి మీకాచార్యునిగా ఉండటానికి అంగీకరించాను. ప్రాణాలను, ధనమును దాచుకొనక మీకభీష్టమును సమకూరుస్తాను," అని విశ్వరూపుడు శపథం చేసి ఏకాగ్రతతో దేవతల పౌరోహిత్యానికి అంగీకరించాడు...



విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 3 త్వరలో  



*** 








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page