top of page
Original.png

యూనివర్సిటీ మెడల్

1 day ago
4 min read

యూనివర్సిటీ పెయింటింగ్ పోటీలో మొదటి బహుమతి మెడల్ అందుకుంటున్న ఆనంద్

University Medal - Telugu Inspirational Story | Harish Babu Pondugula

యూనివర్సిటీ మెడల్ - తెలుగు ప్రేరణాత్మక కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 22/11/2026


అవకాశాలు మన కోసం ఎదురుచూడకపోయినా, పట్టుదలతో ప్రయత్నిస్తే వాటిని విజయంగా మార్చుకోవచ్చు. “యూనివర్సిటీ మెడల్” ఆనంద్ ఆత్మవిశ్వాసం, తల్లి ప్రేరణ, నిరంతర ప్రయత్నం అతని కలను ఎలా నిజం చేశాయో చెప్పే ప్రేరణాత్మక కథ.


హరీష్ బాబు "కవితా, నా కంపెనీ డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ ఎక్కడ పెట్టావు?" అంటూ పిలిచాడు ఆనంద్.


"ఆ, వస్తున్నా.." అంటూ కిచెన్ నుండి బెడ్‌రూమ్‌కు వెళుతూ, "పొద్దున్నే ఈయనకు కంపెనీ డాక్యుమెంట్స్‌తో పనేంటో" అనుకుంటూ వెళ్ళింది కవిత..


"ఇదిగో ఈ షెల్ఫ్‌లోనే ఉన్నాయి కదా.." అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది.. "ఓహ్! ఇక్కడే ఉన్నాయా.. థాంక్స్. 


ఆ కొత్త కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇవ్వాలంటే పాత కంపెనీ డాక్యుమెంట్స్ పంపమన్నారులే, ఆ పనిలో ఉన్నా.. నువ్వెళ్ళు నేను చూస్తాలే."


సరే అంటూ మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళింది కవిత.. ఆ ఫైల్ తెరిచి ఒక్కొక్కటి డాక్యుమెంట్స్ తీస్తుంటే ఒక మెడల్ కింద పడింది.. ఏమిటా అని చూస్తే..


అది తాను డిగ్రీ చదివే రోజుల్లో యూనివర్సిటీ లెవెల్‌లో మొట్టమొదటి సారి చిత్రలేఖనంలో తీసుకున్న మొదటి బహుమతి తాలూకు జ్ఞాపకం...


కింద నుంచి తీసి ఒక్కసారి ఆ మెడల్ చూస్తూ.. జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు ఆనంద్.. రోజులు గర్రున వెనక్కి తిరిగాయి..


అవి ఆనంద్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు.. ఆనంద్ స్వతహాగా ముభావంగా ఉండే ఇంట్రోవర్ట్ (అంతర్ముఖుడు) కూడా కావటం చేత తన భావాలను ఎక్కువగా ఎవరికీ వ్యక్తపరిచేవాడు కాదు.. 


ఒకవేళ వ్యక్తపరిచినా తన భావాలు నెగటివ్‌గా ఉన్నాయి అని ఎవరైనా అంటే తీసుకోలేకపోయేవాడు. అలాగే.. కాలేజ్‌లో ఎప్పుడైనా.. 


ఏదైనా ఫేర్‌వెల్ డే, ఆగస్టు 15, జనవరి 26, యాన్యువల్ డే లాంటి స్పెషల్ డేస్ జరిగిన నాడు అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు మొహం బాధగా పెట్టేసేవాడు.. 


కారణం తను ఎందులోనూ ఎంపిక అవ్వకపోవటమే.. తనకి డ్యాన్స్ రాదు, స్పోర్ట్స్ రావు, పాటలు రావు.. కాస్తో కూస్తో యాక్టింగ్ (నటన) అయితే చేయగలడు... 


కానీ ఇప్పుడు డ్రామా సెక్షన్ కాలేజ్ వాళ్ళు తీసేశారట... అంతా డ్యాన్స్ అంటే గెంతులు, పాటలు అంటే అరుపులే ఇప్పుడు ట్రెండ్.... కదా.. 


అందుచేత మిగతా రోజులు బాగానే ఉండేవాడు కానీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడే కాస్త దిగాలుగా ఉండేవాడు.


తను ఎందులోనూ లేనప్పుడు ఇక అక్కడకు వెళ్ళి మాత్రం ఏమి చేయాలి అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళేవాడు కాదు.. ఎప్పటికైనా తను కూడా ఏదో ఒక కళలో... 


మంచి ప్రైజ్‌తో... అందరినీ సర్‌ప్రైజ్... చేయాలని ఉవ్విళ్ళూరుతుండేవాడు.


అదిగో అలాంటి అప్పుడే ఒక రోజు పొద్దున్నే కాలేజ్ మెట్లు ఎక్కుతుండగా ఆ నోటీస్ కనిపించింది: "యూనివర్సిటీ లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్" (చిత్రలేఖనం పోటీలు).


అది చూస్తూనే మనసులో దాదాపు ఎగిరి గంతేశాడు ఆనంద్. ఆ వెంటనే తన పేరు నమోదు చేసేశాడు. ఎదురు చూస్తున్న.. ఆ పోటీ రోజు రానే వచ్చింది. 


ఇంట్లో అమ్మను అడిగి ఖర్చులకు వంద రూపాయలు తీసుకుని ఆ నోటీస్‌లో ఇచ్చిన యూనివర్సిటీ అడ్రస్‌కి బయలుదేరాడు. 


ఆ స్టాప్‌కి అయితే బస్సు దిగాడు కానీ ఆ చెప్పిన బిల్డింగ్ కాస్త కన్ఫ్యూజన్‌గా ఉండి చాలా మందిని అడుగుతూ అడుగుతూ వెళ్లాల్సి వచ్చింది. 


మెయిన్ రోడ్డు నుంచి దగ్గరే అయినా బస్సు స్టాండ్ నుంచీ పది నిమిషాలు పట్టింది. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. గబాగబా నడుస్తూ చెమట్లు కక్కుతూ వెళ్ళాడు.


తనతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగుండేది అనిపించింది... ఆ బిల్డింగ్ ముందు బోర్డు చూశాడు.


చిత్రలేఖన పోటీ మధ్యాహ్నం రెండింటికి అని రాసి ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. టాపిక్ : "మత సామరస్యం" పర్వాలేదు తెలిసిన టాపికే కదా అనుకున్నాడు..


తనతో పాటు తెచ్చిన పెన్సిల్స్, పెయింట్స్ అన్నీ సరిచూసుకున్నాడు. సమయం రెండు అయింది.. పోటీ నిర్వహించే హాల్‌లోకి వెళ్ళాడు.. పోటీ రెడీ అన్నారు..


కానీ షాక్ ఏంటంటే "డ్రాయింగ్ పేపర్స్ ఇవ్వటం లేదు, ఎవరి పేపర్స్ వారే తెచ్చుకోవాలి" అని చెప్పారు. అదేంటి అని అడిగితే అది అంతే అన్నారు.. 


ఇప్పుడు ఏమిటి చేయటం.. ఆ బిల్డింగ్ చుట్టూ ఏ కాలనీ లేదు.. కనీసం నాలుగు ఐదు కి.మీ. వెళితే కానీ ఏమీ దొరకవు.. రాయిలాగా అక్కడే నిలబడిపోయాడు.. తన ఆశలు ఆవిరి అయిపోయినట్టు కనిపించాయి... పాజిటివ్‌గా ఆలోచించాలి.. అనుకున్నాడు..


తోటి వాళ్ళను అడిగాడు.. ఎవరూ కూడా ఎక్స్‌ట్రా షీట్స్ లేవు అని చెప్పారు... మరి ఏమిటి చేయటం.. ఏ మహానుభావుడో వచ్చి వెనకాల భుజం తట్టి "ఇదిగో తీసుకో" అంటే బాగుణ్ణు అనుకున్నాడు.. కానీ అలా జరగలేదు.. ఆలోచనతో సమయం మించిపోతోంది..


అమ్మ ఇచ్చిన వంద రూపాయలు తీసి చూసుకున్నాడు. చిన్న కాలిక్యులేషన్ (లెక్క) చేశాడు.. పోటీకి 90 మినిట్స్ సమయం ఇస్తారు.. నేను ఇప్పుడు రోడ్డు వరకు వెళ్ళటానికి 15 నిమిషాలు, షాప్‌కి 15 నిమిషాలు, రావటానికి 15 నిమిషాలు = టోటల్ 45 నిమిషాలు.. పోగా ఇంకా 45 నిమిషాలు ఉంటాయి.. 


నాకు సరిపోతుంది.. తప్పదు ఒక చిన్న గ్యాంబుల్ చేయాలి.. ఇంకో దారి లేదు అని తన పరిస్థితిని ఇన్విజిలేటర్‌కి వివరించి.. అంతా తను అనుకున్నట్టే జరుగుతుంది అనే నమ్మకంతో.. గేట్ వైపు నడిచాడు..


నడుస్తూ ఉంటే అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది: "గెలుస్తాను అనే నమ్మకంతో నీ ప్రయత్నం నువ్వు చేయి.. ఈ ప్రపంచమే నీకు సహాయం చేస్తుంది.." అని.


రోడ్డు చేరుకోగానే అటు ఇటు చూస్తే ఒక్క ఆటో కూడా లేదు.. ఒకే ఒక్క ఆటో దూరం నుంచి వస్తోంది... ఆపినా ఆగలేదు.. కానీ ఏమి ఆలోచించాడో తెలీదు ఆటో డ్రైవర్ దూరం వెళ్ళి ఆగి రమ్మన్నాడు.. అతని దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి వివరించాడు...


దానికి అతను "నేను పొద్దుట్నుంచి ఏమీ తినలేదు బాబూ.. దాదాపు రెండున్నర కావస్తోంది.. పర్వాలేదులే బాబూ ఎక్కు, దింపేస్తాలే" అన్నాడు. సమయం గర్రున తిరుగుతోంది... చెప్పిన సమయం లోపల తిరిగి వస్తానో లేదో అని టెన్షన్ పడుతున్నాడు లోలోపల. కానీ.. 


వెళ్ళటం, పేపర్స్ తీసుకోవటం, వచ్చేయటం అన్నీ అనుకున్నట్టుగానే 45 నిమిషాల్లో జరిగిపోయాయి.. ఇన్విజిలేటర్ కూడా లేట్ అయినా అలౌ చేశాడు.. తక్కువ సమయం ఉన్నా కూడా బొమ్మ బాగానే వచ్చింది.. ఇన్విజిలేటర్‌కి ఇచ్చేసి ఇంటికి వచ్చాడు..


రెండు వారాలు గడిచాయి.. ఒక మార్నింగ్ కాలేజ్ మెట్లు ఎక్కుతుంటే... అందరూ తనని చూసి పలకరిస్తున్నారు... ఏంటా అని చూస్తే నోటీస్ బోర్డులో తన పేరు ఫస్ట్ ప్రైజ్ (at university level) యూనివర్సిటీ స్థాయిలో మొదటి బహుమతి... ఆనంద్ అని తన ఫోటోతో సహా ఉంది.. ఆనంద్ కళ్ళలో నీళ్లు నిండాయి.. తన కల నిజమైంది.. తను కూడా ఇప్పుడు ఒక స్టార్.. మరుసటి రోజు.. యూనివర్సిటీ వీసీ నుంచి మెడల్ తీసుకున్నాడు ఆనంద్.. అమ్మ మాట మళ్ళీ గుర్తుకి వచ్చింది... "నువ్వు గట్టిగా కోరుకుంటే ప్రపంచం నీకు సహాయం చేస్తుంది"


మెడల్ చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్న ఆనంద్‌ని చూసి భార్య కవిత "ఏంటి ఆ మెడల్ చూసి ఏమి గుర్తొచ్చింది?" అంది. "ఏమీ లేదులే" అంటూ ఫైల్‌లోకి మెడల్‌ని మళ్ళీ పెట్టేశాడు ఆనంద్.


--- సమాప్తం ---



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:




హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page