top of page
Original.png

వ్యాపార ప్రపంచం – పార్ట్ 15

4 hours ago
8 min read

వ్యాపార ప్రపంచం పార్ట్ 15లో ఏడు కోట్ల వ్యాపార ఒప్పందంపై సుఖదేవ్, గీతా మాధురి చర్చ; తీర్థయాత్ర అనంతరం కుటుంబ పూజలు.
వ్యాపార ప్రపంచం పార్ట్ 15లో ఏడు కోట్ల వ్యాపార ఒప్పందంపై సుఖదేవ్, గీతా మాధురి చర్చ; తీర్థయాత్ర అనంతరం కుటుంబ పూజలు.

Vyapara Prapancham – Part 15 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 15 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

Published in manatelugukathalu.com on 27/11/2026


వ్యాపార ప్రపంచం – పార్ట్ 15లో విద్యాభవానికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో భానుప్రసాద్‌తో తన భవిష్యత్తు గురించి చర్చిస్తుంది. సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలన్న తన సంకల్పాన్ని భానుప్రసాద్ వెల్లడిస్తాడు. మరోవైపు తీర్థయాత్ర ముగించుకుని వచ్చిన సుఖదేవ్, ప్రణవి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కార్యాలయానికి వెళ్లిన సుఖదేవ్‌కు గీతా మాధురి ఒక కీలకమైన వ్యాపార ఒప్పందం గురించి వివరిస్తుంది. కనీసం ఏడు కోట్ల రూపాయల విలువైన ఆ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి శోభాదేవి ప్రత్యేకంగా సుఖదేవ్‌ను తమ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఈ పరిణామం కథలో మరో ఆసక్తికరమైన మలుపుకు నాంది పలుకుతుంది.

వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు.


రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది. గీతామాధురితో  దూరంగా  ఉండాల్సిన  అవసరం  లేదని  సుఖదేవ్ తో  చెబుతాడు నాగముని.


సుఖదేవ్ చెల్లెలు విద్యాభవానికి, భానుప్రసాద్ కు పరిచయం పెరుగుతుంది. ఆఫీసులో మాలినితో జరిగిన అనుకోని సంఘటన కథకు మరో మలుపునిస్తుంది. అనుకోని సంఘటనలో సుఖదేవ్ ఆమెను ముద్దుపెట్టుకోవడంతో గీతా మాధురి దిగ్భ్రాంతికి గురవుతుంది. గీతామాధురి తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరిస్తాడు సుఖదేవ్. అన్నా వదినెల ప్రయాణ ఏర్పాట్ల సందర్భంగా భానుప్రసాద్ సహాయం కోరుతుంది విద్యాభవాని.

వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



“మిమ్మల్నిక్కడకు పిలిపించింది వట్టి అన్నా వదినెల ప్రయాణ ఏర్పాటు గమనించడానికే కాదు. మరొకటి కూడా ఉంది.”


“అదే అడుగుతున్నాను, అదేమిటని—”


“ఉఁ చెప్తాను. ఇంట్లో నాకు పెండ్లి సంబంధాలు వెతుకుతున్నారు. అప్పట్లాగే ఇప్పుడు కూడా నాకోసం సంబంధాలు ఇంటి వాకిట తచ్చాడుతున్నాయి. ఎక్కువగా లాయర్ సంబంధాలే—” 


భవాని నోట ఆ మాట విని ఊరకుండిపోయాడు భానుప్రసాద్. హాలు పైకప్పు కేసి చూస్తూండిపోయాడు. అప్పుడామె కదలింది— “ఏం— వాళ్ళ ప్రపోజల్స్ కి నేను వెంటనే తలాడించాననుకుంటున్నారా!”


“నో! మేటర్ అది కాదు. మన స్నేహం గురించి మీ వాళ్ళకు తెలవదా?”


“పూర్తిగా తెలియదేమో— చెప్పే సమయం ఇప్పుడు ఆసన్నమయిందేమో—”


“ఔను. యు ఆర్ రైట్.. ఐతే ఒకటి. నేను నిదానంగా సౌమ్యంగా ఉన్నంత మాత్రాన నాలో ఉద్వేగాలు ఆవేశాలు లేవనుకోకూడదు. ఎటొచ్చీ నేను ఎదుర్కొంటున్న సందిగ్ధం ఒక్కటే— అవ్వా కావాలి బువ్వా కావాలని పంతం పట్టలేను కదా!” 


అంటే?— అన్నట్టు అతడి కళ్ళలోకి చూసిందామె— 


అతడు చిన్నగా నవ్వుతూ స్పందించాడు— “నీకు తెలియనిదేముంది భవానీ! సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ లో ముమ్మరంగా మునిగి ఉన్నాను. నిజానికి నీ ప్రోత్సాహం వల్లనే కదా ఈ పోటీ పరీక్షల స్టడీస్ ఆరంభించాను. అది నా కోసం కాకపోయినా నీ కోసమైనా సాధించి తీరాలి కదా! మీ అన్నగారి చూపులో నేను తగిన బావమరిదిని అవ్వాలంటే ఇందులో ఉత్తీర్ణుడనై హుందాగల పోస్టు అందుకోవడం అత్యవసరం కదా!” 


తమ వివాహం, సివిల్ సర్వీస్ పరీక్షల లక్ష్యం గురించి చర్చించుకుంటున్న భానుప్రసాద్, విద్యాభవాని.
తమ వివాహం, సివిల్ సర్వీస్ పరీక్షల లక్ష్యం గురించి చర్చించుకుంటున్న భానుప్రసాద్, విద్యాభవాని.

ఆమె తలూపుతూ అతడి వైపు పరిపూర్ణ ప్రేమావేశంతో చూసి చుట్టుపక్కల ఎవరి అలికిడీ లేదని రూఢి చేసుకుని అతడి రెండు చేతులనీ తన చేతుల్లోకి తీసుకుంది. పెదవులతో స్పర్శించి నిదానంగా అంది— “నాకిప్పుడు ఇంటర్ లో చదివిన ఏనుగు లక్ష్మణకవిగారి పద్యం గుర్తుకి వస్తుంది ప్రసాద్—”


“చెప్తే నేను కూడా జీర్ణించుకుంటాను కదా— పద్య భావ ప్రవాహంలోని జీవసారాన్ని—”


“గుర్తున్నంత మేర చెప్తాను.


‘తనిసిరే వేల్పులదధి రత్నముల చేత

విఱచిరే ఘోర కాకోల విషము చేత

విడిచిరే యత్నమమృతంబు వొడము దనుక

నిశ్చితార్థము వదలరు నిపుణమతలు—’ 


అది విని ప్రసాద్ చిన్నగా చప్పట్లు కొట్టాడు. “గ్రేట్ పొయమ్ ఎట్ ది గ్రేట్ మూమెంట్!” 


“సరే— లక్ష్మణకవిగారి పద్యం మననం చేసుకున్నాం. ఇక— ఇప్పుడు విషయానికి వద్దామా!”


“ఇంకా ఉందా చెప్పడానికి విషయం?” 


“ఔను. ఉంది. ఇప్పుడిది ప్రశ్నల రూపంలో ఉంటుంది. అడిగేదా?” 


అతడు తలూపాడు— ఆమె కొనసాగించింది— “తలూపితే చాలదు ప్రసాద్.. ఆర్ యు రెడీ?”


“ఇంకా ఈ ఉప ప్రశ్నలేమిటి— అడుగు మరి— నేను రెడీగానే ఉన్నాను.”


“మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి అడ్డతగిలి వద్దంటే ఏమి చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు?”


“నిన్ను ఎత్తుకుపోతాను నల్లమల అడవుల్లోకి—”


“నేను లాయర్ అన్నది గుర్తుంచుకునే మాట్లాడుతున్నారా!” 


“లాయర్ అయితేనేమి జడ్జివి అయితేనేమి— నేను ముందే చెప్పాను నేను గజపతినగరపు మనిషినని. కోరుకున్న దానికోసం సాహసిస్తాను. సాధిస్తాను.”


“ఓకే ఓకే— మీకున్న గుండెనబ్బరం తెలుసుకున్నాను. ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న— వాళ్ళకున్న స్వంత కారణాల వల్ల మీ ఇంట్లో వాళ్ళు మన కలయికను కాదంటే—”


“అనరు. అననే అనరు. నేను ఊరు విడిచి ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు వేసిన షరతు ఒకే ఒకటి— నాకిష్టమైన అమ్మాయిని వాళ్ళకు చూపించాలి. ఆ తరువాత ముందుకు సాగాలి. దానితో బాత్ ఖతం—” 


దానితో విద్యాభవాని ఊరకుండిపోయింది. కొన్ని క్షణాల తరువాత అడిగాడతను— “అదేమిటి అలా మౌనదీక్ష వహించావు! ఎనీ డౌట్?”


“మరేమీ లేదు. మీకు నిజంగా అంతటి సాహసం ఉందా అని”


“ఏం? నాకు ఆపాటి సాహసం ఉందో లేదోనని పరీక్షించాలనుకుంటున్నావా భవానీ!” అంటూ లేచి ఆమెను సమీపించాడు. 


వేగవంతమైన అతడి కదలిక గమనించి ఆమె హెచ్చరించింది— “దూరం! దూరం! ఇంట్లో నలువైపులా అలికిడి వినిపిస్తుంది. ప్లీజ్!”

“అలికిడి ఉంటేనేమి, లేకపోతేనేమి— ఇక తగ్గేదే లే—” అంటూ అమాంతం ఆమెను బాహువుల్లోకి తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. 


ఆ తరువాత మెడ చుట్టూ ముద్దుల వర్షం కురిపించాడు. అతడి భావోద్వేగ చర్యకు ఆమె ఆశ్చర్యపోతున్నట్లు చూసి “ప్లీజ్!” అంటూ అతడి కౌగిలి నుండి తొలగిపోవడానికి దూరంగా జరగబోయింది. కానీ— అతడామెను కదలనివ్వలేదు. 


“ఎక్స్క్యూజ్ మీ— ఒకే ఒక బృహత్ కార్యం ముగించవలసి ఉంది” అంటూ కాస్తంత క్రిందకు వంగి చీరను పక్కకు జరిపించి ఆమె పొత్తికడుపుపైన అదే రీతిన గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. 


ఈసారామె అతణ్ణి దూరంగా నెట్టలేకపోయింది. మత్తుగా అరమోడ్పు కళ్ళతో చూస్తూండిపోయింది. అంతలో ఎవరిదో అడుగుల జాడ వినిపించడం గమనించి భానుప్రసాద్ తానుగా తొలగిపోయి యథాప్రకారం సోఫాలో కూర్చుండిపోయాడు, వినమ్రవంతుడి భావన చూపిస్తూ— 


ఆమె కూడా ఏమీ జరగనట్టు సాఫీగా ముఖం పెట్టి అడిగింది— “ఉఁ— ఆ తరువాత?” 


దానికతడు సన్నగా స్పందించాడు— “సారీ— రియల్లీ సారీ! ఏదో పూనకం వచ్చినట్టు ఆవేశపడ్డాను. యవ్వన పొంగుతో మిలమిలా మెరిసే ఇంతటి నిండు యవ్వనవతిని ఇంత దగ్గరగా నేనెప్పుడూ చూడలేదుగా—” 


“ఇలా జరగడానికి నేను కూడా కారకురాలినే కదా!” 


ఎలా, అన్నట్టు ఆమె ముఖంలోకి చూసాడు భానుప్రసాద్.


 దానికామె బదులిచ్చింది— “మీ సాహస గుణం గురించి అదోలా ప్రస్తావించి మిమ్మల్ని రెచ్చగొట్టానుగా!”


“వెరీ కైండ్ ఆఫ్ యు—”


“మరీ ఎక్కువగా నమ్రత చూపించకండి బాస్— రేపు పరిపూర్ణంగా పొందేదాంట్లోనుంచి ఇప్పుడు కాస్తంత అడ్వాన్సుగా— కొసరుగా తీసుకున్నారు. అంతే కదా!”


“వాట్ ఎ లవ్లీ వాయిస్— విత్ వాట్ ఎ లవ్లీ ఫీల్!” అంటూ దగ్గరకు వచ్చి చేయి అందుకోబోయాడు. 


అప్పుడామె అడ్డుకుంది— “దూరం – దూరం. ఇటెవ్వరో వస్తున్న అడుగుల సవ్వడి వినిపించడం లేదూ!”


“ఇట్ ఈజ్ ఓకే— ఇప్పుడు మనముందున్న తదుపరి సంగతేమిటి? సెలవిస్తారా!”


“ఉంది బాస్. మీ సివిల్ సర్వీస్ స్టడీస్ ఎలా సాగుతుంది?”


“బాగానే సాగుతుందనాలి. కానీ— ఇప్పుడు దాని గురించి చెప్పే మూడ్ లో లేను. ప్లీజ్ అండర్ స్టాండ్!”


“సరే— ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి— భార్గవ్ గారి సూచనలు ఉపయోగకరంగా ఉన్నాయా?” 


చాలావరకు ఉపయోగకరంగా ఉన్నాయని బదులిచ్చాడతను.


“ఓకే ఓకే— అర్థమైంది. కనీసం ఇదైనా రూఢి చేస్తారా— అందిన పుస్తకాలన్నీ అప్‌డేట్ పొజిషన్ లో ఉన్నాయా లేవా అని చూసుకున్నారా!”


“చూసుకున్నాను. అదంతా చూసుకోవడానికే ఒక రోజు పట్టింది. ఆల్మోస్ట్ ఫైన్—”


“దెన్ ఇట్ ఈజ్ ఫైన్. మరొక విషయం— చెప్పాచెయ్యకుండా సర్రున లేచి వెళ్ళిపోకండి. మాతో కలసి భోంచేసి వెళ్ళండి.”


“విత్ గ్రేట్ ప్లెజర్ మేడమ్” అంటూ నవ్వేశాడతను.

-------------------------------------------------------------------------------------


తీర్థయాత్ర ముగించుకుని పిల్లలతో కలిసి దీపారాధన నిర్వహించి వనజమ్మ ఆశీస్సులు పొందుతున్న సుఖదేవ్, ప్రణవి.
తీర్థయాత్ర ముగించుకుని పిల్లలతో కలిసి దీపారాధన నిర్వహించి వనజమ్మ ఆశీస్సులు పొందుతున్న సుఖదేవ్, ప్రణవి.

భార్యతో తీర్థయాత్ర ముగించుకుని ఊరు చేరాడు సుఖదేవ్. తమతో బాటు తెచ్చుకున్న ప్రసాదాలు, చిన్న చిన్న ఫ్యాన్సీ పూజా సామగ్రితో బాటు దేవుడి ఫోటోలు, ఋషి పుంగవుల చిత్రపటాలు వగైరావన్నీ వనజమ్మకు అప్పగించి పిల్లలిద్దర్నీ మురిపెంగా ఎత్తుకుని మేడపైకి తీసుకు వెళ్ళారు. 


పనిగత్తెలిద్దరికీ దగ్గరకు రాకని కళ్ళతో సంకేతం ఇచ్చి పిల్లలిద్దరికీ స్వయంగా స్నానాలు చేయించి తాము కూడా తలంటు స్నానాలు చేసి వనజమ్మగారి సూచన ప్రకారం పూజా గదిలో పిల్లలిద్దర్నీ పక్కన కూర్చోబెట్టుకుని విఘ్నేశ్వర స్తుతి, విష్వక్సేన స్తుతి పఠించి దీపారాధన గావించారు. ఆ తరువాత మరచిపోకుండా వనజమ్మగారి కాళ్ళకు నమస్కరించారు. 


కొడుకూ కోడలినీ నిండు మనసుతో ఆశీర్వదించి మనవడూ మనవరాలినీ అక్కున చేర్చుకుని అంది వనజాక్షమ్మ— “ఇక పైన ఇంటా బయటా మీకు సర్వమూ మంగళదాయకమే— ఇంకా రెండు మూడు వ్రత పూజలు జరిపితే నోము పూర్తవుతుంది. సరేనా!” అంటూ అక్కణ్ణించి కదలబోతున్నప్పుడు అక్కడకు కోర్టుకి వెళ్ళేందుకు సంసిద్ధురాలవుతూ విద్యాభవాని చేరింది— “గ్రేట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ రా అన్నయ్యా! మీరు సంపాదించుకు వచ్చిన పుణ్యంలో నాకూ భాగముంటుందిరోయ్— ఎందుకంటే మీ ఇద్దరి ప్రయాణ ఏర్పాట్లకు అమాంబాపతు ముందస్తు రోడ్ మ్యాప్ వేసిచ్చింది నేనే కదా— మొక్కుబడులు చెల్లిస్తున్నప్పుడల్లా నన్ను మరచిపోలేదు కదా!”


“అదెలా మరచిపోతానే బుల్లి చెల్లెలా! నీకు వత్తాసుగా వచ్చిన భాను ప్రసాద్ ని కూడా మరచిపోను. చాలా—“ 


“థ్యాంక్యూ థ్యాంక్యూ వెరీ మచ్ రా అన్నయ్యా!” అంటూ వదినెను హగ్ చేసుకుని మళ్ళీ అన్నయ్య వద్దకు వెళ్ళింది— “అన్నట్టు అడగడం మరిచాను— అంత దూరం వెళ్లి మాకందరకూ చాలానే తెచ్చారు కదా— మరి మీకందరకూ రోజంతా సేవలు చేసే చంగాళమ్మ, రాములమ్మలకు ఏమీ తేలేదేమిటి?”


“ఎందుకు తేలేదు? ఎలా మరచిపోతాం? మదురైలో మీనాక్షి అమ్మవారి గుడి దర్శించి గుడి పక్కనే ఉన్న బట్టల షాపులో వాళ్ళిద్దరికీ రెండు చీరలు సెలక్ట్ చేసి తీసుకు వచ్చాం. మీ వదిన వాటిని అమ్మ చేతుల మీదుగా అందిస్తుంది లే— ఇక నేను బయల్దేరాలి. ఏదో ముఖ్యమైన డీల్ గురించి చర్చించడానికి నా ఉనికి అవసరమని బాబాయి గారి నుండి మెసేజ్ వచ్చింది.” అంటూ దుస్తులు మార్చుకునేందుకు మేడ మెట్ల వైపు సాగిపోయాడు సుఖదేవ్.


కంపెనీ కార్యాలయం చేరుకుని, కారు కీని అక్కడ తనకోసం ఎదురు చూస్తూ నిల్చున్న డ్రైవర్ కి అందచేసి వడివడిగా నడుచుకుంటూ తన ఛేంబర్ వైపు నడిచాడు సుఖదేవ్.


 అతణ్ణి చూసి లేచి నిల్చున్న ఇద్దరు పియేల వందనాలను స్వీకరిస్తూ వాళ్ళ పక్కన నవ్వుతూ నిల్చున్న గీతా మాధురిని చూసి ఆగిపోయాడతను. రవంత విస్మయంగా చూస్తూ అడిగాడు— “ఇక్కడ మీరేమి చేస్తున్నారు మాధురిగారూ?” 


ఆమె నవ్వు ముఖంతో స్పందించింది— “జస్ట్ వెయిటింగ్ ఫర్ యు సార్!”


“అలాగా— ప్లీజ్ డు కమ్—” అంటూ లోపలకు నడిచాడతను. మాధురి అతణ్ణి అనుసరించి బాస్ తలూపుతూ సంజ్ఞ చేసిన తరువాత ఎదురుగా కూర్చుంది. అతడు బ్రీఫ్ కేసుని పక్కన పెడుతూ గ్లాసులోని మంచి నీళ్ళను చప్పరించి అడిగాడు— “చాలా అర్జంట్ వ్యవహారమా?” 


చేతి వేళ్లకు గాయమైనప్పటికీ కార్యాలయానికి వచ్చి ఏడు కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందం గురించి సుఖదేవ్‌కు వివరిస్తున్న గీతా మాధురి.
చేతి వేళ్లకు గాయమైనప్పటికీ కార్యాలయానికి వచ్చి ఏడు కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందం గురించి సుఖదేవ్‌కు వివరిస్తున్న గీతా మాధురి.

ఔనన్నట్టు తలూపి చెప్పడానికి ఉపక్రమించబోయింది. అతడు ఆపమని సంజ్ఞ చేసి బ్రీఫ్ కేసు తెరచి అందులోనుంచి కుంకుమ ప్రసాదం తీసి అందించాడు— 


ఆమె మొహమాటంగా ఇబ్బందికరంగా నవ్వుతూ— “సారీ సార్. కుడి చేతి వేళ్ళతో తీసుకొని బొట్టు పెట్టుకోలేను.” అంటూ కుడి చేయి తీసి చూపించింది. వేళ్ళకు కట్టుకట్టి ఉంది. అతడు విస్మయంగా అడిగాడు ఏమైందని— 


“మరేం లేదు సార్! స్టవ్ పైన బియ్యానికి ఎసరు పెట్టేటప్పుడు నిప్పు చేతికి తగిలి రవంత కాలిపోయింది.” 


“మరెందుకు వచ్చినట్టు— మూడు నాలుగు రోజుల తరువాత రావచ్చు కదా— ఆ లోపల గాయం పూర్తిగా నయం అయిపోతుంది కదా—” 


దానికామె మృదువుగా ఇబ్బందికరంగా నవ్వుతూ బదులిచ్చింది— “ఈరోజు మీరు వస్తారని తెలుసు కదా! మీకు ఉదయమే కనిపించాలని— ముఖ్యమైన డీల్ గురించి మీకు చెప్పి మీ సలహా ప్రకారం ఫైనల్ టచెస్ ఇవ్వాలని— ముఖ్యమైన డీల్ చేజారిపోకూడదని—” 


ఆమె అంతఃకరణలోని స్పందన అతడికి ఓ విధమైన భావోద్వేగాన్ని కలుగజేసింది. “ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం ముందుకు వంగుతారా!” ఆమె ఎందుకని అడక్కుండానే తలను అతడి వైపు పావురంలా వంచింది. అతడు మరు పలుక్కి తావులేకుండా తన కుడి చేతితో బొట్టు తీసి ఆమె నుదుట పూసాడు. ఆమె ఆశ్చర్యంగా చూసి ఏమి చేయాలో ఎలా స్పందించాలో తోచక కళ్ళను రెపరెపలాడిస్తూ తలవంచుకుంది. 


సుఖదేవ్ అదేమీ గమనించనట్లు— అదొక లాంఛనప్రాయమైన చర్యగా భావిస్తున్నట్టు భావన చూపిస్తూ అన్నాడు— “నౌ— లెట్స్ కమ్ టు అవర్ పాయింట్ ఆఫ్ బిజినెస్— ఇప్పుడు మీరు పేర్కొన్న ముఖ్యమైన బిజినెస్ డీల్ గురించి వివరణాత్మకంగా చెప్తారా!” 


ఆమె వెంటనే నార్మల్ మూడ్ లోకి రావడానికి పూనుకుంటూ— ఉద్వేగాన్ని అణచుకుంటూ— “యస్ సార్!” అంటూ ప్రాథమిక దశకు చేరుకున్న డీల్ వివరాలను చెప్పసాగింది. 


అంతా విన్న సుఖదేవ్ కొన్ని క్వరీలను మాత్రమే లేవదీసి అడిగాడు— “మరెందుకు డీల్ కి ఫైనల్ టచెస్ ఇచ్చి పూర్తి చేయలేదు? ఇందులో మన కంపెనీకి అడ్డుతగిలే ఆటంకాలేవీ లేవు కదా!” 

వెంటనే బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయింది గీతా మాధురి. 


“అలా మౌనముద్ర వేస్తే నాకెలా మేటర్ అర్థమవుతుంది?” సూటిగా అడిగాడతను. 


ఈసారామె తక్షణం స్పందించింది—

“ఆ క్లయింట్ మరెవ్వరో కాదు. మన లాంగ్ స్టాండింగ్ పార్టీ— అగర్వాల్స్—”


“ఐతే మాత్రం? నాతో ఫోనులో మాట్లాడరా!”


“మేటర్ అది కాదు సార్. మిమ్మల్ని వాళ్ళింటికి పిలుస్తున్నది మిస్టర్ అగర్వాల్ గారు కాదు. ఆయన సతీమణి శోభాదేవి గారు. అంకుల్ గారు కూడా ఇదే మాట అన్నారు.”


“ఇదే మాటంటే—ఏ మాట అన్నారు నాగమునిగారు?” 


“మీరు వెళితేనే ఫైనల్ టచెస్ పూర్తవుతాయన్నారు.”


“ఇంకేమన్నారు?”


“చెప్పేదా సార్!” 


ఉఁ అన్నాడతను— 


“మాస్టర్ కీ మీ వద్దే ఉందన్నారు. బై ది బై— ది డీల్ ఈజ్ వర్త్ ఆఫ్ నాట్ లెస్ దెన్ సెవెన్ క్రోర్స్—” 


అతడు తలూపుతూ మనసున ఓ చైనీస్ నాయకుడి మాటల్ని మననం చేసుకుంటూ ఇలా అనుకున్నాడు: పిల్లి తెల్లదా నల్లదా అన్నది ముఖ్యం కాదు. అది ఎలుకను పట్టుకోగలదా లేదా అన్నదే ముఖ్యం. ఇలా అనుకుంటూనే ఎట్టకేలకు అన్నాడు— “నాతో మీరు కూడా వస్తారు. ఓకే—”


“భలే వారే— మీరు పిలిస్తే నేను రాకపోవడమా! మరి నేనిప్పుడు మీకొక మాట చెప్పాలి మీకు గాని ఆక్షేపణ లేకపోతే—”


“నాకెందుకు ఆక్షేపణ ఉంటుంది? ఐతే— ఇదంతా టీలు తీసుకున్న తరువాత చెప్పుకుందాం. ఓకే!”


“యస్ సార్!” అందామె నిండు నవ్వు ముఖంతో—


=================================

ఇంకా ఉంది 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 16

త్వరలో మీ ముందుకు వస్తుంది.

=================================









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పాండ్రంకి సుబ్రమణి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page