top of page
Original.png

వ్యాపార ప్రపంచం – పార్ట్ 11

3 hours ago
8 min read

వ్యాపార ప్రపంచం పార్ట్ 11లో గీతా మాధురి ప్రతిభ గురించి కారులో చర్చిస్తున్న సుఖదేవ్, ప్రణవి; బాల్య జ్ఞాపకాలతో కూడిన పాఠశాల దృశ్యం.
వ్యాపార ప్రపంచం పార్ట్ 11లో గీతా మాధురి ప్రతిభ గురించి కారులో చర్చిస్తున్న సుఖదేవ్, ప్రణవి; బాల్య జ్ఞాపకాలతో కూడిన పాఠశాల దృశ్యం.

Vyapara Prapancham – Part 11 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 11 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

Published in manatelugukathalu.com on 26/10/2026


వ్యాపార ప్రపంచం – పార్ట్ 11లో భానుప్రసాద్ తన భవిష్యత్తును మార్చుకునేందుకు సెంట్రల్ సర్వీస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతాడు. విద్యాభవాని అతనికి సహకరించేందుకు ముందుకు వస్తుంది. మరోవైపు పిల్లల పేరెంట్స్ డే కార్యక్రమానికి వెళ్లిన సుఖదేవ్ పాఠశాల బెంచీలను చూసి తన బాల్య జ్ఞాపకాల్లో మునిగిపోతాడు. ఆ తర్వాత ప్రణవితో ప్రయాణిస్తూ సుగుణ్ ట్రేడర్స్ అభివృద్ధిలో గీతా మాధురి పోషిస్తున్న కీలక పాత్రను వివరిస్తాడు. ఆమెను ఇంటికి విందుకు పిలవాలన్న ప్రణవి స్పందన సుఖదేవ్‌ను ఆలోచనల్లో పడేస్తుంది. చివర్లో ఆఫీసులో మాలినితో జరిగిన అనుకోని సంఘటన కథకు మరో మలుపునిస్తుంది.

వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్  భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు.


రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది. గత ఆరేళ్ల కంపెనీ ఆర్థిక లెక్కలను పరిశీలించి తయారుచేసిన కీలక ఫైలుతో సుఖదేవ్‌ను ఆశ్చర్యపరుస్తుంది. గీతామాధురితో  దూరంగా  ఉండాల్సిన  అవసరం  లేదని  సుఖదేవ్ తో  చెబుతాడు నాగముని.  సుఖదేవ్ చెల్లెలు విద్యాభవానికి, భానుప్రసాద్ కు పరిచయం పెరుగుతుంది.

వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వ్యాపార ప్రపంచం – పార్ట్ 11 - భానుప్రసాద్ కొత్త లక్ష్యానికి విద్యాభవాని సహకారం


అతడు ఉన్నపాటున ఉద్వేగానికి లోనవుతూ ప్రక్కన సుఖదేవ్ ఉన్నాడన్నది మరచిపోయి భవాని చేయి అందిపుచ్చుకున్నాడు- “థాంక్స్ ఎ లాట్ భవానీ గారూ! మీ సహకారంతో తప్పకుండా నా ఉద్యమాన్ని నేను ఆరంభిస్తాను. ఇక్కడకు దగ్గరలో ఉన్న లాడ్జిలో చేరి మీకు అందుబాటులో ఉంటూ కావలసిన పుస్తకాలు గ్యాదర్ చేసుకుంటూ స్టడీస్ ఆరంభిస్తాను. ఈజ్ ఇట్ ఓకే?”

 

సెంట్రల్ సర్వీస్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సహకరిస్తానన్న విద్యాభవానికి కృతజ్ఞతలు తెలుపుతున్న భానుప్రసాద్.
సెంట్రల్ సర్వీస్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సహకరిస్తానన్న విద్యాభవానికి కృతజ్ఞతలు తెలుపుతున్న భానుప్రసాద్.

అతడి నోట ఆ మాట విని అన్నాచెల్లెలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. గెస్ట్ హౌస్ విడిచి వెళ్ళాలని అతడు చూపిస్తున్న వేగిరపాటుకి అబ్బురపడుతూ— ఏది ఏమైతేనేమి— ఎట్టకేలకు భాను ప్రసాద్ మనోవాంఛను గౌరవించడమే సబబు అని తీర్మానించారు ఇద్దరూ. 


కంపెనీ ప్రాంగణానికి మరీ దూరంగా లేని లాడ్జికి కంపెనీ స్టాఫ్ ని పంపించి అక్కడ భాను ప్రసాద్ రెగ్యులర్ గా ఉండేలా రూమ్ బుక్ చేయించారు. ఎంతటి బిజీ బిజినెస్ మ్యాన్ అయితే మాత్రం- విద్యావంతురాలు విధేయతలూ గల చెల్లి ప్రసాద్ పట్ల మొహమాటం విడిచి అంతటి అక్కర ఎందుకు చూపిస్తుందో సుఖదేవ్ కి తెలియదా! నగర వ్యాపార ప్రముఖుడు, రాజకీయ దురంధరుడుగా పేరొందిన రామచంద్రంగారి పుత్రరత్నం సంబంధానికి దూరంగా జరిగిన చెల్లి ఇప్పుడు మాత్రం ఉన్నపాటున ముక్కూ మొహమెరుగని భానుప్రసాద్ పట్ల అంతటి హృదయానురాగం ఎందుకు చూపిస్తుందో అతడు ఊహించలేడా! 


ఎట్టకేలకు చెల్లికి కళ్యాణ ఘడియ ఆసన్నమవుతుందన్నది తెలియటం లేదూ! దేనికైనా కాలం కూడా కలసి రావాలంటారు, అందుకేగా— ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిర్మానుష్యమైన రాత్రిపూట ఒంటరిగా తెగించి ఒక ఆడపిల్లను కుక్కల బారినుండి తెగించి ధైర్యంగా కాపాడిన గజపతినగరం భాను ప్రసాద్ నిజంగానే ఒక రాబిన్ హుడ్డే. ఇకపోతే, భానుప్రసాద్ అకాడమిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, అతడు గ్రాడ్యుయేషన్ వరకే పూర్తి చేసినట్టున్నాడు. సెంట్రల్ సర్వీస్ పోటీ పరీక్షలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ విషయ పరిజ్ఞానం కావలసి వస్తుందేమో— ఈ విషయంలో అకాడమిక్ క్వాలిఫికేషన్ లో, ముఖ్యంగా పోటీపరీక్షల్లో దిట్టయిన భవాని అతడికి చేదోడుగా ఉండగలదనే తోస్తుందతనికి. 


చెల్లి అతడి పట్ల దగ్గరితనం పెంచడం వలన ఇష్టాపూర్వకంగా ఏది చొరవ తీసుకుని చేసినా అటెంప్ట్ కష్టంగా తోచదు కదా! పోటీ పరీక్షల్లో ఎంచుకోవలసిన సబ్జెక్టుకి కావలసిన పుస్తకాల వెతుకులాటకు లోనుకాకుండా భవాని సులభతరంగా భానుప్రసాద్ కి చేయూత అందివ్వగలదు. ప్రసాద్ చేయబోయే అటెంప్ట్ కష్టమైనదే కావచ్చు, భవాని తన స్నేహపు నిచ్చెనతో అతడికి దిశానిర్దేశం చేయగలదు; మంచి ర్యాంకుతో గట్టెక్కించగలదు. 


అవసరమని తోస్తే నమ్మకమైన కోచింగ్ సెంటర్ లో చేర్పించగలదు. ఇక పాయింట్ ఆఫ్ ఆర్డర్ కి వస్తే, భానుప్రసాద్ వంటి ఉదాత్త లక్షణాలు గల వ్యక్తి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశిస్తే సగటు స్థాయి పౌరులకు క్షేమదాయకంగా ఉంటుంది. నలుగురికి చేసే సేవ నారాయణ సేవే కదా! అటువంటి పౌర సేవలు చేసే అవకాశం ప్రభుత్వాధికారులందరికీ విసృతంగా, విస్తారంగా లభించే బంగారు అవకాశమే కదా!

ఆరోజు వాగ్దేవి హైస్కూల్ లో పేరెంట్స్-డే మీట్ కి ఏర్పాటు చేసారు స్కూలు మేనేజ్మెంట్ వారు. రాఘవ్, కామిని ఇద్దరూ అదే స్కూలు బడి పిల్లలు కావటాన వాళ్లకు తోడుగా ప్రణవి, సుఖదేవ్ దంపతులిద్దరూ గార్డెన్ రోడ్డున ఉన్న హైస్కూలుకి చేరారు. పచ్చదనంతో తొణికిసలాడుతున్న బడి ప్రాంగణం భార్యాభర్తలిద్దర్నీ ఆకట్టుకుంది. ఇద్దరికీ ఒకనాటి వాళ్ళ బడిరోజుల్ని గుర్తుకి తెచ్చింది. పేరెంట్స్-డే ఫంక్షన్ కి హాజరయిన తరవాత పనిలో పనిగా పిల్లలిద్దరి క్లాస్ టీచర్లనూ కలుసుకుని క్లాసులోని వాళ్ళ స్టడీస్ గురించి, క్లాసు బయట వాళ్ళ ఆటపాటల గురించి అడిగి తెలుసుకుని టీచర్స్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ని స్వీకరించి బయటకు వచ్చి కొద్ది దూరం నడచి వచ్చి వెనక్కి చూస్తే అక్కడ సుఖదేవ్ కనిపించలేదు. 


ఓసారి చుట్టుప్రక్కల కళ్ళు పెద్దవి చేసుకుని చూసి పిల్లలిద్దర్నీ అడిగిందామె- “మీ నాన్న ఎక్కడర్రా! మీకు ఐస్ క్రీమ్ గట్రా తీసుకురావటానికి ప్రహరీ దాటి బయటకు వెళ్ళారా—” 


అప్పుడు రాఘవ్ చప్పున బదులిచ్చాడు- “అబ్బే— ఇక్కడ స్కూలు ముందు ఐస్ క్రీమ్ అమ్మరమ్మా! అమ్మనివ్వరమ్మా! కావాలంటే, రోడ్డు పైకి వెళ్ళాల్సిందే—” 


పిల్లల పాఠశాలలోని క్లాస్‌రూమ్ బెంచీపై కూర్చుని తన బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న సుఖదేవ్‌ను ఆశ్చర్యంగా చూస్తున్న ప్రణవి.
 పిల్లల పాఠశాలలోని క్లాస్‌రూమ్ బెంచీపై కూర్చుని తన బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న సుఖదేవ్‌ను ఆశ్చర్యంగా చూస్తున్న ప్రణవి.

అలాగా అంటూ ఆమె తలూపుతూ అటు తిరిగి అక్కడి క్లాసురూములో కూర్చున్న భర్తను చూసి నోరెళ్ళబెట్టింది ఆశ్చర్యంగా చూస్తూ— “ఇక్కడ కూర్చున్నారు! పిల్లల క్లాసురూములో కూర్చుని మీరేమి చేస్తున్నారు? మనం నడిచొచ్చింది కొద్ది దూరమేగా— అంతలో కాళ్ళు నొప్పి పెడుతున్నాయా!” 


అతడు తల అడ్డంగా ఆడిస్తూ క్లాసురూము నుండి బయటకు వచ్చాడు. వస్తూనే ప్రణవి చెవి దగ్గర చెప్పాడు- “జస్ట్ లైక్ దట్!” 


అంటే అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసిందామె. అతడు భార్య ప్రశ్నను అందుకోకుండా బదులిచ్చాడు- “ముందు పిల్లలిద్దర్నీ వాళ్ళ వాళ్ళ క్లాసురూముల్లో విడిచి వద్దాం. ఆ తరవాత విషయానికి వద్దాం. ఓకే!” అంటూ ముందుకు సాగాడతను. 


ప్రణవి ఇంకేమీ అనకుండా పిల్లల్ని క్లాసురూముల్లో దిగబెట్టిన తరవాత స్కూలు గేటు వేపు నడుస్తూ అడిగింది- “ఇప్పుడు చెప్పండి— ఎందుకలా సడన్ గా క్లాసురూములోకి చొరబడ్డారు? చూసేవారేమనుకుంటారో ఆలోచించారా!”


“చెప్తాను, సావధానంగా వింటావా!” 


“ఉఁ” అందామె. 


“నేనెప్పుడు ఎక్కడ పిల్లల బడి చూసినా నాకక్కడకు వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. అదే పని ఇక్కడ చేసాను. పిల్లల కుర్చీలు, బెంచీలు చూస్తే నేనాపుకోలేను. ఇట్ గివ్స్ మి ఎ గ్రేట్ సోఫ్ట్ ఎమోషనల్ ఫీల్!” 


ఆ మాట విని ఆమె భర్తవేపు విస్మయపూర్వకంగా చూసింది. వయసుతో ఎరుగుదలతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తిలోనూ బాల్యదశ ఏదో ఒక మూల దాగుంటుందనేది ఇందుకేనేమో! ఆమె అలా ఆలోచించుకుంటూనే తాడు కొసను మళ్ళీ పట్టుకుంది- “అదేదో సాఫ్ట్ ఫీలింగ్ కలుగుతుందని చెప్పారే— అదేమిటో చెప్తారా!”


“వెరీ సింపుల్— కఠిన పదాల బురఖా వెనుక దాక్కోనవసరం లేదు. నా చిన్ననాటి నేస్తాలందరూ కళ్ళముందు మెదులుతారు. విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్- నాతో గొడవలకు దిగిన క్లాస్ మేట్స్ పళ్లికిలిస్తూ గుర్తుకి వస్తారు. ఈజ్ ఇట్ నాట్ ఎ గ్రేట్ ఫీల్? ఇంకేమైనా అడగాలా కవయిత్రీ?” 


ప్రణవి ఏమీ అనలేదు. నిదానంగా అడుగులు వేస్తూ నడవసాగింది. మౌనముద్ర వేసి నడుస్తున్న భార్యను చూసి, అతడికి ఆశ్చర్యం ముప్పిరిగొంది. ఆమె కనురెప్పలు తడిసి ఉన్నాయి. బాల్యమంటే బాల్యమే కదా! అది అందరిలోనూ పొడసూపుతూనే ఉంటుంది కదా! వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వచ్చి కారులో కూర్చున్న తరవాత కారు స్టీరింగ్ ముందు సర్దుకుంటూ సుఖదేవ్ అన్నాడు- “ఇప్పుడు ఇంటికెళ్ళి చేసేదేమీ లేదు గనుక, నువ్వు కంపెనీ ప్రాంగణానికి వస్తావా!”


“చేసేదేమీ లేదంటే ఒప్పుకోనంటే ఒప్పుకోను సుమా— సేవలు చేయడానికి అత్తగారు లేరా, లేక చేతులు కలపడానికి ఆడపడుచు లేదా! సరే— ఎందుకు పిలుస్తున్నారో చెప్పండి, అప్పుడు తేలుస్తాను రావాలా వద్దా అన్నది—”


“మన స్వంత కంపెనీకి రావటానికి ఇంతటి పెద్ద షరతా! సరే విషయం చెప్తాను. మన కంపెనీకి కొత్తగా ఒక లేడీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చేరారు. పేరు గీతా మాధురి. కంపెనీ చేపట్టే అగ్రిమెంట్లకు, ఇన్వెస్ట్ మెంట్ వ్యవహారాలకు ఇన్చార్జి.”


“వినటానికిది విడ్డూరంగా ఉందే— విస్తరిస్తున్న సుగుణ్ ట్రేడర్స్ లో పెక్కుమంది సిబ్బంది, ఆఫీసర్లూ కలగలసి ఉంటారు. మీ మెప్పు పొందడానికి అహర్నిశలూ పాటుపడుతూ ఉంటారు. వాళ్ళలో ఆ సంగీత మాధురి- సారీ- ఆ గీతా మాధురి ఒకరు. అంతేగా!” 


భార్య మాటలకు సుఖదేవ్ నవ్వాడు. “మొదట్లో బాబాయి తయారు చేసిన సెలక్షన్ లిస్టు చూసి నేనూ అలాగే అనుకున్నాను, ఒక లేడీ అంతటి క్లిష్టతరమైన బాధ్యతలు నిర్వర్తించగలదా అని— సగం మనసుతోనే అమ్మకు కూడా ఓ మాట చెప్పి బాబాయి సిఫార్సుని ఎండార్స్ చేసాను. ఇప్పుడామె నిరూపిస్తోంది తను మామూలు సింపుల్ మైండెడ్ ఆఫీసర్ కాదని— ఎటువంటి పరిస్థితిలోనూ ఎవరికీ తీసిపోనని—” 


అంటే? అన్నట్లు అతడి వేపు ప్రశ్నార్థకంగా చూసింది ప్రణవి. 


అతడు డ్రైవ్ చేస్తూనే సంభాషణ కొనసాగించాడు. “చెప్తాను విను. కంపెనీని విస్తరిస్తున్నప్పుడు- ముఖ్యంగా ఎదుర్కొంటున్న పోటీదారుల ముందు నిలదొక్కుకోవడానికి వనరులు- అంటే ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ ని సమకూర్చడానికి బ్యాంకుల నుండి- నాన్ బ్యాంకింగ్ సంస్థల నుండి లోన్లు తీసుకోవాలి, ఔనా!” 


సుగుణ్ ట్రేడర్స్ ఆర్థికాభివృద్ధిలో గీతా మాధురి ప్రతిభను కారులో ప్రయాణిస్తూ ప్రణవికి వివరిస్తున్న సుఖదేవ్.
గీతా మాధురి ప్రతిభపై సుఖదేవ్–ప్రణవి చర్చ

ఆమె కారు ముందు చూపు నిలుపుతూనే బుర్రూపింది. అప్పుడతడు చెప్పసాగాడు- “గీతా మాధురి చేరిన తరవాత- కొన్ని నెలల వ్యవధిలోనే లయబిలిటీస్ తగ్గుముఖం పట్టాయి. అసెట్స్ సైడ్ పుంజుకుంది. బ్యాంకుల దృష్టిలో, ఫైనాన్స్ కంపెనీల దృష్టిలో కంపెనీ క్రెడిట్ స్కోరింగ్ పెరిగింది. దానితో బాటు కంపెనీ షేర్ వాల్యూ పెరిగింది. ఈజ్ ఇట్ నాట్ ప్రైజ్ వర్తీ!”


“తప్పకుండా— ఇందులో సందేహం దేనికి? మెచ్చుకోలుగా గీతా మాధురిని ఓసారి ఇంటికి పిలవండి. విందు భోజనంతో బాటు రెండు మూడు జ్ఞాపికలిచ్చి సత్కరిద్దాం. పిలిచేటప్పుడు ఆమెగారిని మాత్రమే పిలవకండి, ఆమె భర్తనూ పిల్లల్ని కూడా అదే ఊపున ఆహ్వానించండి!” 


అప్పుడతడు రోడ్డు మలుపున కారు తిప్పుతూనే బదులిచ్చాడు- “ఆమె సింగిల్. ఆమెకింకా వివాహం కాలేదు. ఎందుకని అడక్కు— బాబాయి ఇచ్చిన భోగట్టా ప్రకారం కొన్ని కుటుంబ పరిస్థితుల వలన అలా పెళ్ళికి దూరంగా ఉండవలసి వచ్చిందట. అదంతా ఇప్పుడెందుకు గాని, మన విషయానికి వద్దాం- మీ అత్తగారి ఆదేశానుసారం నువ్వు పూజలూ పరిహార వ్రతాలూ పూర్తి చేసినట్టున్నావు. ఇక మిగిలిన నోములు ఎప్పుడు పూర్తి చేస్తావు? నన్నెప్పుడు గట్టెక్కిస్తావు?”


“నిగ్రహంతో చేసేది నేను. చిత్తశుద్ధి పాటిస్తూ పూజా పునస్కారాలు చేస్తున్నది నేను. మధ్య మీకెందుకు అంతటి వర్రీ!”


“వర్రీ నాకు కాకపోతే ప్రక్కవీధిలో దమ్ములాగుతూ పోతున్న పోలయ్యకా ఉంటుంది? పూజలూ వ్రతాలూ వద్దనడం లేదు. నాకోసం కూడా కొంచెం ఆలోచించమంటున్నాను!”


“మీకోసం ఆలోచించకుండానే ఇద్దరు పిల్లలకు తల్లినయానా! అయినా నేను మరొకసారి చెప్తున్నాను, మీరు ఒప్పుకునే తీరాలి.” 


అదేమిటన్నట్టు తలతిప్పి చూసాడు సుఖదేవ్ కారు స్పీడు తగ్గిస్తూనే— 


“మీరీ మధ్య విదేశీ పర్యటనలకు వెళ్ళి వచ్చిన తరవాతనే ఇంతటి వికారమైన వేగిరపాటు మీలో కనిపించనారంభించింది.” 


ఆ మాట విని సుఖదేవ్ ఊరుకోలేదు, తన వంతు ఎగదోసాడు- “వేగిరపాటు హోరుమని విస్తరించడం వల్లనే నీకు మొన్న త్రీస్టార్-హోటెల్ రూములో అమర సౌఖ్యాల విజృంభణ వేగాన్ని చూపించగలిగాను! కాదని-లేదని గుండెల మీద చేయిపెట్టి చెప్పు చూద్దాం?” 


ఆ మాటతో ప్రణవి పొంగు తగ్గిన పాలలా మిన్నకుండిపోయింది. ఎంతగా ఇద్దరు పిల్లల తల్లయినా ప్రణవి నిండారోగ్యంతో మిసమిసలాడే యవ్వనవతే కదా! రసాత్మక ప్రణయపూర్వ శృంగార భావవీచికలు సోకకుండా ఉంటాయా! అలా సోకకుండా ఉంటే రతీ మన్మథులు ఊరుకుంటారా! 


అలా కారు సర్రున సాగిపోతున్నప్పుడు ప్రణవి సుఖదేవ్ చూపుని తన వేపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ అంది- “ఒక మాట చెప్తే మీరు నమ్ముతారో లేదో!” 


కారు డ్రైవ్ చేస్తూనే అదేమిటన్నట్టు ప్రణవి కళ్ళలోకి చూసాడు సుఖదేవ్. ఆమె మెరిసే కళ్ళతో విషయ వివరణ ఇచ్చింది- “వరుస క్రమం తప్పకుండా వ్రత పూజలు ఆరంభించిన దగ్గర్నుంచీ ఆ మహాతల్లి కలలోకి రావడం తగ్గించిందండీ— ముఖ్యంగా కామిని ఫోటో వేపు చేయి చూపడం మానుకుందండీ—” 


అతడేమీ స్పందించకుండా కారు డ్రైవ్ చేయడంలో నిమగ్నుడయ్యాడు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆ మహాతల్లి ప్రణవి కలలో మాత్రం కనిపిస్తుంది గాని- మరి తన కలలోకి ఒక్కసారి కూడా రాలేదేం? కామిని ఫోటో వేపు చేయి చూపిస్తూ తల్లిలేని అనాథగా మిగిలిన తన కూతురు గురించి ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తుందా— ఎంతైనా ప్రణవి తల్లితనం సంతరించుకున్న స్త్రీ కదా-- మరణించిన ఆవిడ దుఃఖాన్ని ప్రణవి మాత్రమే లోతుగా గ్రహించగలదనుకుంటుందేమో--


వారలా మాటలతో పువ్వుల రవ్వలు రువ్వుకుంటూ ఇంటి దగ్గరకు చేరుకునేటప్పటికి సుఖదేవ్ ఆఖరిమాటగా అడిగాడు- “ఇంతకీ గీతా మాధురిని విందుభోజనానికి పిలిచేదా వద్దా!” 


దానికి ప్రత్యుత్తరంగా ఇటు తిరిగి చూడకుండానే బదులిచ్చింది- “మీ ఇష్టం!” అని. 


ఇక సంభాషణకు ఫుల్ స్టాప్ పెడుతూ అతడు కారుని ఇంటిముందు ఆపుతూ బ్రేక్ వేసాడు. ఆడవారి మాటలకే కాదు, వారి మనోభావాలకు కూడా అర్థాలు వేరుగా ఉంటాయేమో! మిస్ మాధురిని విందు ఇవ్వడానికి ఇంటికి పిలవమన్నది తన భార్యమణే— ఇప్పుడేమో తన ఇష్టమని చెప్పి సందిగ్ధావస్థలో పడవేసింది కూడా భార్యామణే— ఊహించలేనిది ఈ జవరాండ్ర చిత్తముల్—


అతడలా పలు విధాలుగా ఆలోచించుకుంటూ భార్యను ఇంటివద్ద దిగబెట్టి అదే ఊపున కారు డ్రైవ్ చేసుకుంటూ కంపెనీ ప్రాంగణం చేరి ఎదురొచ్చిన కారు డ్రైవర్ కి కారు కీ అందించి లోపలకు నడిచాడు. అతడలా దించిన తల ఎత్తకుండా నడుచుకుంటూ తన ఛాంబర్ లోకి ప్రవేశించబోయాడు. అప్పుడు అనుకోనిది జరిగిపోయింది. 


మాలినిని ఉవ్వెత్తున ఢీకొట్టాడు. ఎక్కడని? ఎలాగని? ఎత్తయిన ఆమె గుండెలను బలంగా తాకాడు. అతడు తొట్రుపడుతూ తడబడుతూ సర్దుకున్నాడు- క్షమాపణలు చెప్పబోయాడు. మాలిని అసంకల్పితంగా అతడి చేయి పట్టుకుని ఆపింది- “పర్వాలేదు సార్! పొరపాటు నాపైన కూడా ఉంది. నేను లోపల ఫైలు పెట్టి బయటకు వచ్చేటప్పుడు చూసి రావల్సింది. సో— ఇద్దరమూ సమస్థాయిలో ఒకరిని ఒకరం ఢీకొట్టుకున్నాం, చెల్లు చేసుకున్నాం. నౌ- నథింగ్ టు ఫీల్ డిస్టర్బ్డ్ సార్” అంటూ లోపలకు వెళ్ళేందుకు బాస్ కి దారిచ్చింది. 


అతడు థ్యాంక్స్ చెప్తూ వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. ఆడదాని గుండ్రని గుండెల తాకిడి వల్ల వచ్చే సుఖం అంత త్వరగా మరవనిస్తుందా! వివాహిత స్త్రీ అయిన మాలినికి మాత్రం దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియదా!


=================================

ఇంకా ఉంది 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 12

త్వరలో మీ ముందుకు వస్తుంది.

=================================



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పాండ్రంకి సుబ్రమణి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page