వ్యాపార ప్రపంచం – పార్ట్ 12

Vyapara Prapancham – Part 12 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 12 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 01/11/2026
వ్యాపార ప్రపంచం – పార్ట్ 12లో సుగుణ్ ట్రేడర్స్ వ్యాపార వ్యవహారాలు ఆసక్తికరమైన మలుపు తిరుగుతాయి. శోభా అగర్వాల్‌తో కీలక ఒప్పందాన్ని పూర్తి చేయడానికి సుఖదేవ్ వెంట గీతా మాధురి వెళ్తుంది. ఒప్పందంలోని అంశాలను సమర్థంగా విశ్లేషించి తన వ్యాపార నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. అయితే అక్కడ జరిగిన అనుకోని సంఘటనలో సుఖదేవ్ ఆమెను ముద్దుపెట్టుకోవడంతో గీతా మాధురి దిగ్భ్రాంతికి గురవుతుంది. తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పిన సుఖదేవ్, ఆ తర్వాత ఆమెతో నేరుగా వ్యవహరించడాన్ని తగ్గించుకుంటాడు. మరోవైపు భానుప్రసాద్–విద్యాభవాని మధ్య సాన్నిహిత్యం పెరుగుతుండగా, సెంట్రల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న భానుప్రసాద్‌కు విద్యాభవాని కొత్త మార్గాన్ని సూచిస్తుంది.
వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్వైజర్ దీనదయాళ్ భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు.
రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది. గత ఆరేళ్ల కంపెనీ ఆర్థిక లెక్కలను పరిశీలించి తయారుచేసిన కీలక ఫైలుతో సుఖదేవ్‌ను ఆశ్చర్యపరుస్తుంది. గీతామాధురితో దూరంగా ఉండాల్సిన అవసరం లేదని సుఖదేవ్ తో చెబుతాడు నాగముని. సుఖదేవ్ చెల్లెలు విద్యాభవానికి, భానుప్రసాద్ కు పరిచయం పెరుగుతుంది. ఆఫీసులో మాలినితో జరిగిన అనుకోని సంఘటన కథకు మరో మలుపునిస్తుంది.
వ్యాపార ప్రపంచం గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అతడు అన్యమనస్కుడై సీటులో కూర్చుని ముందున్న రెండు దస్త్రాలను క్లియర్ చేసిన తరవాత లేడీ మెసేంజర్ వచ్చి రెండు కప్పుల టీ టేబుల్ పైన ఉంచింది.
రెండు కప్పులెందుకూ— అన్నట్టు ప్యూను వేపు చూసాడు.
”పెద్దాయన వస్తున్నానని కబురు పంపించారండీ--” అని బాస్ కి బదులిచ్చింది లేడీ మెసేంజర్.
అలాగా అన్నట్టు తల ఊపి చూసేటప్పటికి అక్కడ నాగముని ప్రత్యక్షమయ్యాడు శుభోదయం పలుకుతూ- సుఖదేవ్ తన గంభీర ముద్రను చెదరనీయకుండానే సీట్లోనుండి సగం వరకూ లేచి బాబాయితో చేతులు కలిపాడు.
ఎప్పటిలాగే అతడు లాంఛనప్రాయంగా- “థాంక్యూ సర్!” అని ఎదుట కూర్చున్నాడు అక్కడున్న టీ కప్పుని అందుకుంటూ--
అప్పుడు సుఖదేవ్ అడిగాడు- “చెప్పండి ఎనీ ఇంపార్టెంట్ మేటర్?”
ఔను ఉందన్నట్టు తలూపుతూ టీ తాగడం పూర్తిచేసాడు నాగముని.
“మరి చెప్పండి—ఉదయమే ఊరకే రారుగా మహానుభావులు!”
“యు ఆర్ రైట్! ముఖ్యమైన డీల్-యేదో ఉన్నట్లుంది. మిసెస్ అగర్వాల్ మిమ్మల్ని పిలిచింది ఫైనల్ టచెస్ ఇవ్వటానికి--”
“యు-మీన్-- మిసెస్ శోభాగారేనా! మరి మిస్టర్ అగర్వాల్ గారికేమయింది? సాధారణంగా ఆయనతోనే కదా మనం డీల్స్ ఫైనలైజ్ చేస్తుంటాం— ఇప్పుడామె చొరవ తీసుకోవడం ఏమిటి—”
“విషయం ఉంది. ఆమెగారు ఇంతవరకూ భర్తకు చేదోడుగా ఉంటూ సహాయపడేది. ఇప్పుడేమో భర్తతో కలసి బిజినెస్ వ్యవహారాలలో పైవోటల్ రోల్(pivotal) తీసుకోవటానికి సంసిద్ధురాలయినట్లుంది. అంతేకాదు ఆమె మీ కోసం స్పెషల్ ఆఫర్ చేసింది. మధ్యాహ్న భోజనం చేయకుండా రమ్మంది. అక్కడే ఆమెతో కలసి భోంచేసేటట్లు ఏర్పాట్లు చేస్తానంది. స్వతహాగా ఆమె వెజిటేరియన్. అయినా తమ కోసం రుచికరమైన నాన్-వెజ్ ఐటెమ్స్ ఆఫర్ చేస్తానంది.”
సుఖదేవ్ స్పందించలేదు. మౌనంగా ఉండిపోయాడు. జీవన స్రవంతిలో చిత్రాతి చిత్రమైన తాత్వికతతో కూడిన జీవనాంశం ఇదే! దేనికైతే మనిషి దూరంగా ఉండాలనుకుంటాడో— అదే వేయి కోరలతో ఎదురవుతుంటుంది. మోహ సముద్రంలో మునిగి తేలమని, ఎత్తైన ఆశల గోపురాలను అందుకోమని ప్రేరేపిస్తుంది.
అతడి కళ్ళముందు శోభ విశాలమైన వక్షస్థలం టెంప్ట్ చేసేలా మెదిలింది. బిగువైన ఆమె బ్యాక్ సైడ్ కోర్కెల తుంపరను మనసు మైదానంలో కురిపించింది. తప్పుకోవాలన్నా తప్పుకోనివ్వని ఉద్రేక పూరిత ఉక్రోశ పూరిత విషమ స్థితి—
అబ్బాయి మానసిక స్థితిని అర్థం చేసుకుని కావాలా నాగముని కలుగ చేసుకున్నాడు- “నాకు తెలుసు మీరక్కడకి వెళితే సందిగ్ధావస్థకు లోనవుతారని- ఆమెగారి కామ ప్రకోపిత వాడీ వేడీ గల చూపులు నిన్ను పదే పదే తాకుతూ కలవరపరుస్తుంటాయని- అందుకని మీకు తోడుగా—”
అతడా వాక్యాన్ని పూర్తిచేయకముందే సుఖదేవ్ అందుకున్నాడు- “మీరొస్తారా బాబాయి గారూ!”
“కాదు. నేను రాను. అది డీల్ స్ట్రైక్ చేసే విషయం కదా- అటువంటి వ్యవహారాలలో పటిష్టమైన పట్టు ఉన్న గీతా మాధురి గారు నీతో వస్తారు— నీకక్కడ బుల్లెట్ వెస్ట్ లా నిల్చుంటారు. ఓకే!”
అతడేమీ అనలేదు. తలూపుతూ ఉండిపోయాడు. పొడవుగా ఎరుపుగా వయ్యారంగా కనిపించే మాధురి స్టైలిస్టుగా కాకుండా నిరాడంబరంగా రూపానికి తగ్గట్టు కనిపించినా ఆమెలో మిసమిసలాడే నిండు యవ్వన కలశం దాగదు కదా! ఇప్పటి ఉద్రేకపూరితమైన మూడ్ లో ఎప్పుడేమి జరుగుతుందో- ఎటువంటి లయాన్విత స్పందన ఏ రూపాన చెలరేగుతుందో తనకే తెలియదు.
మగాడి చేతులు మోటైనవి మాత్రమే కాదు— చురుక్కున వేడెక్కిన చువ్వల్లాంటివి. ఉన్నచోట నిలవవు. చెప్పినట్టు వినవు. ఆమాంబాపతు దూరం వరకూ సాగటానికి వెనుకాడవు. నిలువెల్లా వెంపర్లాడుతుంటాయి. మగాడిగా ఆ విరహ బాధ తనకే కదా తెలుసు.
అప్పుడు ఉన్నపాటున వికసిత తామర పుష్పం వంటి ప్రణవి రూపం మనసున మెదిలింది. తనకేర్పడ్డ ఇప్పటి పాట్లన్నీ శారీర వాంఛల పట్ల ఆమె చూపిస్తున్న విముఖత వల్ల ఏర్పడినవే కదా! దోష పరిహారానికై గ్రహశాంతికై ఆమె చేపట్టే వ్రతాలు ఒకటా రెండా— నోచిన నోములు ఒకటా రెండా— అడిగితేనేమో— అంతా తన మంచికేనంటుంది. తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసమంటుంది.
ఈ కఠోర దీక్షలు ఈ ఉపవాస వ్రతాలు ఎప్పుడు పూర్తవుతాయో కదా! భూ తాపం వంటి తన దాహం ఎప్పుడు తీరుతుందో కదా! దెబ్బపైన దెబ్బ తగలడమంటే ఇది కాదూ!
అగర్వాళ్స్ ఇల్లు బంగళా టైపులో ఉంటుంది. ఇంటి చుట్టూ పచ్చటి పూదోటతో పండ్ల చెట్లతో లావిష్ గా పసందుగా ఉంటుంది. ఒకసారి వస్తే, మళ్ళీ రావాలనిపించేలా సర్వ రంగుల హంగులతో విరాజిల్లుతుంటుంది. ఇద్దరూ హౌస్ కీపర్ తో చెప్పి లోపలకు ప్రవేశించేటప్పటికి అక్కడ తీరుబడిగా ఆసీనురాలై ఉన్న శోభ సుఖదేవ్ ప్రక్కన గీతా మాధురిని చూసి కనురెప్పలల్లార్చింది.
తన ప్రక్కన మాధురిని చూసి శోభ అలా స్పందిస్తుందని అతడు ఎదురు చూసినదే— అంచేత తనకు తాను మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూనే కరచాలనం చేసి శోభకు మాధురిని పరిచయం చేసాడు. మాధురి కూడా “హాయ్!” అంటూ ఆమెను హగ్ చేసుకుంది.

అతడు సోఫాలో కూర్చుంటూ హాలు పరకాయించి చూసాడు. తన రాకను గుర్తించి కావాలి శోభ హాలుని ఎంత సుందరంగా సొగసుగా అలంకరించిందంటే— నలువైపులా మరువం, మాచీపత్రి, దవనం చిలికిన జాస్మైన్ స్ప్రేతో కలసి గుండెలను కదలించేలా కైపెక్కించేలా గుభాళిస్తున్నాయి. పర్ణశాలలోని మునిపుంగవుడికి సహితం కైపు తుంపరలను రేపే భోగ విలాస వాతావరణం.
తన ప్రక్కన కర్తవ్య చింతనాపరురాలైన గీతా మాధురి గాని లేకపోతే తనీపాటికి ఎక్కడ ఎలా ఉండేవాడో తనకే తెలియదు. బహుశా ఆమె శయన మందిరంలో తూలుతూ తేలుతూ ఉండేవాడేమో— ఇప్పుడున్న హాట్ అండ్ హీట్ మూడ్ లో ఏమైనా జరుగును. ఎంతైనా జరుగును.
అప్పుడు ఉన్నపళాన అతడికి మత్తయిన కవితా పంక్తి ఒకటి మనసున ఫెళ్ళున మెదిలింది-- “ఎంత తాగాలనుకుంటున్నావో అంత తాగు. మనసనే మధు పాత్రలోకి సొగసుగా ఒంపుకుని తాగు. అమృత బిందువుని తాగిన పిదప విచారింపనేల?”
అతడు తల విదిలిస్తూ వాళ్ళ హౌస్ మెయిడ్ అందించిన పండ్ల రసపు గాజు గ్లాసుని అందుకున్నాడు-
గ్లాసుని అందుకుంటూనే అనుకున్నాడు మది మూలన- ఇదంతా శృంగారానికి సమర శంఖం పూరిస్తున్నట్లు లేదూ! ----
అలా పండ్ల రసం తాగుతూ నథింగ్స్ వంటివి మాట్లాడుకుని అగర్వాళ్ గారి స్టడీలోకి వెళ్ళి డీల్ ఫైనలైజ్ చేసారు.
నాగముని బాబాయి ప్రస్తావించినట్లే గీతా మాధురి డీల్ లోని వివరాలను క్షుణ్ణంగా అనలైజ్ చేసి క్వరీలు లేవదీసి విషయాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నించింది. విన్-విన్ సిచువేషన్ కి దోహదం పలకాలంటే శోభకు మాధురి చెప్పినట్టు చేయడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని తెలుస్తూనే ఉంది కదా!
బిజినెస్ డీల్ పైన చర్చలు పూర్తయిన తరవాత, అదెక్కడో పనిపైన ఉన్న అగర్వాల్ గారికి తెలియజెప్పడం జరిగిన తరవాత మధ్యాహ్న భోజనాలకు ఏర్పాటు చేయడానికి డైనింగ్ హాలు వేపు వెళ్తున్నానని చెప్పి పనిగత్తెలను తోడు తీసుకుని లోపలకు వెళ్ళింది శోభ.
అప్పుడు గీతా మాధురి స్టడీనుండి బయటకు వస్తూ అక్కడ హాలులో ఎవరితోనో మొబైల్ లో మాట్లాడుతూ కూర్చున్న సుఖదేవ్ ని చూసి- “సార్! మీరిక్కడున్నారు! ఒక పత్రం పైన మీ సంతకం తీసుకోవలసి ఉంది. శోభగారు వాళ్ళ సంస్థ తరపున సంతకం చేసారు. ఇక మీదే మిగిలి ఉంది” అంటూ రవంత వేగిరపాటుతో వస్తూ అక్కడున్న నేల కార్పెట్ కొన తగిలి తుళ్ళుతూ తడబడుతూ పట్టు తప్పి సరాసరి సుఖదేవ్ పైన పడింది.
పట్టు తప్పి బోర్లా పడిపోకుండా అతడి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. ఆ ఒక్క క్షణం ఏమి జరిగిందో అతడికే తెలియదు. వికసిత పూరేకుల వంటి ఆమె పెదవుల్ని గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు. అతడి అనౌచిత చేష్టకి బిత్తరపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయిందామె. ఆమె ఏమాత్రమూ ఎదురు చూడని క్షణమది.
అప్పుడతను మొదటిసారి గమనించాడు మాధురిది నిండైన ఎద సంపదని— మరి కొద్ది క్షణాలలో తేరుకుంటూ- “సారీ మాధురీ! పట్టు తప్పిపోయింది. అనుకోకుండా జరిగిపోయింది. ఇంత దగ్గరగా మిమ్మల్నింత వరకూ చూడలేదేమో- అదొక విధమైన ఎమోషనల్ ఫీలింగ్ తో ప్రేరేపితుణ్ణయ్యాను. సారీ!” అని ఆమెను సుతారంగా లేవనెత్తాడు.

ఆమె ఏమీ అనలేదు. గుండెల మీది దుపట్టాను సర్దుకుంటూ ఎడంగా జరిగి కూర్చుంది; మౌనం వహిస్తూ-- అప్పుడతను అలర్ట్ గా సర్దుకుని అన్నాడు- “అలా ఏదో అనుకోని విధంగా జరిగిపోయిందని క్షమాపణ చెప్పుకున్నానుగా!”
“అబ్బే— కారణం అది కాదు సార్! పొరపాటు నాపైన కూడా ఉంది కదా— నేను పట్టుతప్పి మీకు గాయం తగిలేలా అమాంతం మీపైన పడిపోయుండకూడదు కదా! ఐ ఆల్సో ఫీల్ సారీ!”
“సరే—మనమిప్పుడొక జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ కి వద్దాం. ఇకపైన మీ విషయంలో అలా జరక్కుండా చూసుకుంటాను. ఈ ఒప్పుదలకు సంకేతంగా నువ్విప్పుడు నాతో కలసి భోంచేస్తావు. ఓకే!”
ఆమె ఇంకేమీ అనకుండా హాలు పైకప్పు వేపు చూస్తూ మిన్నకుండిపోయింది; చిరునవ్వు చిందించడానికి ప్రయత్నిస్తూ- ఆ మాట ప్రకారం ఇద్దరూ అగర్వాళ్స్ ఇంటిలో కలిసే భోంచేసారు.
మరునాటి నుంచీ సుఖదేవ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. గీతా మాధురితో అతడికి పని ఏర్పడ్డా ఆమెతో పనిచేసే జూనియర్ ఆఫీసర్లను పిలిచి సందేహ నివృత్తి చేసుకుంటూ వివరణ తీసుకుంటున్నాడు.
అప్పుడప్పుడు మరీ ముఖ్యమైన వ్యవహారమైతే బాబాయి నాగముని గారి ద్వారా కార్యనిర్వహణకు పూనుకుంటున్నాడు. గీతా మాధురి బాస్ పోకడ గమనించి లీలగా పెదవుల ఓరన నవ్వుకుంది. నవ్వుకుంటూ ఇలా అనుకుంది; సుఖదేవ్ గారు మంచి బాస్ మాత్రమే కాదు, జెంటిల్ మ్యాన్ బాస్ కూడాను--
------------------------------------------------------------------------------
ఆరోజు సెలవు దినం కావాటాన భాను ప్రసాద్ విద్యాభవాని సూచన ప్రకారం కోర్టు విజిటర్స్ హాలులో కూర్చున్నాడు. ఏదో ముఖ్యమైన లీగల్ కేసు విషయమై తన సీనియర్ కి అసిస్ట్ చేసి వస్తానని తనకోసం విజిటర్స్ హాలులో కూర్చోమని భాను ప్రసాద్ కి ఫోనులో చెప్పిందామె.
అనుకున్న ప్రకారం కేసుకి సంబంధించిన పత్రాలు సవ్యంగా సీనియర్ కి అందించి, ఆ కేసు విషయమై వాద ప్రతివాదనలు ముగిసిన తరవాత ఆమె కోర్టు నుండి బయటకు వచ్చి విజిటర్స్ హాలులోకి తొంగి చూసింది.
కాల వ్యవధానానికి తావివ్వకుండా అతడు తనతో తెచ్చుకున్న నోట్సు తిరగేసుకుంటున్నాడు. ఆమె అతడి వేపు నడుస్తున్నప్పుడు ఎవరో అడ్డువచ్చి పలకరించబోతే, “వన్ మినిట్!” అంటూ దాటవేసి అతణ్ణి చేరుకుంది- “హాయ్!”అంటూ వికసిత పూల గుచ్ఛంలా పరిమళిస్తూ--
ఆమెను చూసి అతడు వెంటనే లేచి నిల్చున్నాడు- “హాయ్! గుడ్ మార్నింగ్!” అంటూ స్పందిస్తూ—
అప్పుడామె అదే నవ్వు ముఖంతో అడిగింది- “నేను రావటానికి ఆలస్యమయిందా?”
“నాట్ ఎట్ ఆల్— మీ కోసం నేనొకటి తెచ్చాను. ఇక్కడివ్వలేను. బయటకు వెళ్ళిన తరవాత అందిస్తాను. అయితే— దానికొక షరతు ఉంది”
అదేమిటన్నట్టు అతడి కళ్ళలోకి చూసిందామె. “ఏదైనా ఒక ముఖ్యమైన కేసుని సీనియర్స్ వత్తాసు లేకుండా మీరు స్వయంగా లీడ్ చేయడం చూడాలనుంది. ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ—”
“ఇంతగా వేడుకోవాలా! అదేమీ పెద్ద ఘనకార్యం కాదులెండి. ఇంతకు ముందే రెండు మూడు చిల్లర కేసుల్ని లీడ్ చేసి సక్సెస్ అయ్యాను. మా సీనియర్ ముఖ్యమైన కేసేదైనా నాకు అప్పగిస్తే మీకు తప్పకుండా చెప్తాను. ఇప్పుడు నాకోసం తెచ్చినది నాకప్పగిస్తారా!”
“నేను ముందే చెప్పాగా బయటకు వచ్చి అందిస్తానని—” అంటూ బయటకు నడిచాడతను.

ఆమె మెడనున్న రోబ్ ను మాత్రం ఊడదీసి అతణ్ణి అనుసరించింది. వాళ్ళలా నడుస్తూ ఓ చెట్టు క్రిందకు చేరారు. అప్పుడతను జేబునుండి తడి గుడ్డలో చుట్టిన మల్లె దండను ఆమెకు అందించాడు. దానినామె వెంటనే అందుకోకుండా చుట్టుప్రక్కల ఓసారి పరకాయించి చూసి అంది- “ఏం— మీరు కొప్పులో పెట్టకూడదా! లేక పూలను కొప్పులో పెట్టడం రాదా—”
”క్లిప్పు తగిలించి పూలు కొప్పులో ఎలా తురమాలో తెలుసు. కానీ— దానికింకా సమయం రాలేదు కదా!”
అది విని ఆమె మల్లెదండను అందుకుని తానుగా కొప్పులో తురుముకుంటూ పదునుగా స్పందించింది- “సమయం రాలేదంటే దగ్గరితనం ఏర్పడలేదనేగా! యస్— ఐ యాక్సెప్ట్- పరస్పరావగాహన కలగడానికి మరింత కాలం పట్టవచ్చు. కానీ— ఇప్పటిప్పుడు దానికి నాంది పలకవచ్చుగా!”
అదెలా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడతను.
అప్పుడామె ఇలా సూచించింది- “ఇక నుంచి మీరు నన్ను బహువచనంతో పిలవడం మానుకోవచ్చు కదా! కనీసం దీనికి సమయం వచ్చిందని మీరు తెచ్చిన మల్లెలు చెప్తున్నాయిగా—”
“యస్—యు ఆర్ కరెక్ట్—మరి నువ్వు కూడా నన్ను ఏక వచనంతోనే పిలవాలి. ఓకే!”
”అది తరవాతి మాట—మీరు మాత్రం ఇప్పుడిప్పుడు ఒప్పుకున్నట్టు నన్ను పిలిచేటప్పుడు బహువచన ప్రయోగం చేయకూడదు. యస్ ఆర్ నో—”
అతడు తలూపుతూ ఆమె చేతిని అందుకున్నాడు. అందుకుంటూనే అన్నాడు- “నువ్వు ఫుల్ అడ్వకేట్ రోబ్స్ లో కనిపిస్తున్నా పూలు పెట్టుకున్న తరవాత మార్వెలెస్ గా ఉన్నావు. ముఖ యవ్వనం నిండు పాలకుండలా తొణికిసలాడుతోంది”
“థాంక్స్—ఇక బయల్దేరుదామా!”
“ఐ యామ్ ఎవర్ రెడీ- ఎందుకో ఎక్కడికో నువ్వు సెలవిస్తే నేనిక ముందుకు సాగిపోవడమే—”
విద్యాభవాని చిన్నగా నవ్వి అతడి చేతిని చిన్నగా నొక్కి వేసుకున్న రోబ్స్ విప్పి వస్తానని లాయర్స్ ఛేంబర్ వేపు వెళ్ళేందుకు లోపలకు నడిచింది.
ఇద్దరూ న్యాయస్థాన ప్రాంగణం దాటి రోడ్డుపైకి వచ్చిన తరవాత భాను ప్రసాద్ చురుకైన చూపులు ప్రసరిస్తూ అడిగాడు- “ఇప్పుడు సెలవిస్తారా యువ న్యాయవాదిగారూ ఎక్కడకి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో—”
“ఉఁ ఎందుకు చెప్పనూ— బాగా వినండి, సర్వమూ మన స్వంత విద్యార్జనతోనే సాధించాలనుకోవడం సాధ్యం కాదు. మన స్వంత అనుభవంతో ముందుకు అడుగేయాలనుకుంటే కాలయాపన జరిగిపోవచ్చు. అందుకని— మనం నేర్పరితనంతో ఎదుటి వారి అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధపడాలి. తదనుగుణంగా ఉపయోగించుకోవడానికి సిద్ధపడాలి, మొహమాటాలకూ దాపరికాలకూ తావు లేకుండా—”
అతడు గలగల నవ్వుతూ ఆమె నడుం చుట్టూ పోనివ్వటానికి చేతులు చాచి చటుక్కున వెనక్కి లాక్కున్నాడు వెనక్కి తగ్గుతూ అన్నాడతను- “బాగుంది, వినటానికి బాగుంది. కానీ— నువ్వు ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నావో పూర్తి అవగాహనకు రావడం లేదు విద్యా!”
“ఇంకా అర్థం కాలేదా! సగం కూడా అర్థం కాలేదా!”
ఊహుఁ అంటూ తల అడ్డంగా ఆడించాడు భాను ప్రసాద్.
అప్పుడామె కొనసాగించింది- “చెప్తాను. తప్పుతుందా మరి— ఒక్కొక్కరికీ ఒక్కొక్క టెంపర్మెంట్ ఉంటుంది. అది అంతర్గతంగా ఉంటుంది. ఆ రీతిన చూస్తే కొందరికి పోటీ పరీక్షల పట్ల అంతులేని ఆసక్తి ఉంటుంది. అపేక్ష ఉంటుంది. ఇటువంటి సహజ సిద్ధమైన టెంపర్మెంట్ నా కాలేజీ సహాధ్యాయి భార్గవ్ కి ఉంది.
ఎంచుకున్న ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ లోనూ ఫ్లైయింగ్ కలర్స్ తో దూసుకు వచ్చేవాడు. స్టేట్ గవర్నమెంట్- సెంట్రల్ గవర్నమెంట్- పబ్లిక్ సెక్టార్- అన్నిటిలోనూ కృతకృత్యుడయ్యేవాడు. చివరికతడికి దేంట్లోకి ప్రవేశించాలో- దేంట్లో ఫిట్ అవ్వాలో తెలియని సందిగ్ధావస్థకు లోనయ్యాడు. అతడి ముందు అదొక పెద్ద ప్రశ్నై కూర్చున్నది.
అయితే- నాకు అదే కాలేజీలో పరిచయమున్న ఇద్దరు ముగ్గురు క్లాస్ మేట్స్ ఉన్నారు. వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని పోస్టులకు అటెంప్ట్ చేసినా తేరుకోలేక చతికలబడేవారు. అలా ఎందుకు జరిగేదో నాకిప్పటికీ అగమ్య గోచరంగానే ఉంటుంది. ఇక ఇప్పుడు విషయానికి వస్తున్నాను.
మనమిప్పుడు పోస్టల్ డిపార్టుమెంటులో డైరెక్టరుగా పనిచేస్తున్న భార్గవ్ వద్దకు వెళ్తున్నాం. అతడితో అపాయింట్ మెంట్ తీసుకున్నాను, ఆయనతో దీర్ఘమైన సంభాషణ జరిపిన తరవాత మీకు తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సహేతుకంగా ఛార్జింగ్ అయినట్లు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక విషయానికి వస్తాను.
అదేమంటే మాటల్లో పడి మనం అసలు విషయాన్ని విస్మరించవచ్చు. అందుకే అడుగుతున్నాను, మీకు సెంట్రల్ సర్వీస్ తో బాటు బ్యాంకింగ్ సర్వీస్ కి కూడా అటెంప్ట్ చేయాలని ఉందా! ఎందుకడుగుతున్నానంటే— ఎస్ బీ ఐ తో బాటు ఇతర బ్యాంకులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్డ్ వ్యవస్థలే— ఆర్ బి ఐ తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలే—”
అది విని అతడు తల అడ్డంగా ఆడించాడు- బలంగా ఆడించాడు. “లేదు విద్యాభవానీ! మా గజపతి నగరం వాళ్ళకు ఇదంతా అర్థం కాదు. స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో— లేదా పురపాలక సంఘమో— చేయబోయే కొలువు ప్రభుత్వ పరంగా ఉండాలి. అవి కాక, మరే ఇతర వ్యవస్థలో చేరినా వాళ్ళకు గుండెలాగిపోయినంత పనవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్ స్టాండ్ మై పొజిషన్ విద్యా!
అన్నట్టు మాటల్లో పడి అడగడం మరచిపోతానేమో- ఇక నాకు సహ అభ్యర్థుల్లా కోచింగ్ సెంటర్ లో చేరే అవసరం లేదంటావా లేక అందులో చేరే అవకాశమే లేదంటావా-- ”
“ఓ! అదా తమరి అనుమానం! ఆ ఆప్షన్ కూడా బారుగా తెరిచే ఉంది. ఈ ప్రయత్నాలన్నీ పూర్తి చేసిన తరవాత తదుపరి చర్య అదే--ఏమో! ఇప్పటికిప్పుడు చెప్పలేను గాని— మీరు అంకిత భావంతో చదివే తీరు చూస్తే, గ్రంథాలయాలు దర్శించే విధానం చూస్తుంటే, కోచింగ్ సెంటర్ కి వెళ్ళవలసిన అవసరం కలగదేమో!”
“థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్- ఎందుకైనా మంచిది— కీడెంచి మేలెంచమన్నారుగా! ఇది నీకు కూడా తెలుసుగా— అంటే- ఎందుకైనా మంచిది ఓసారి నువ్వు ప్రస్తావించిన ఆ భార్గవ్ గారిని కలుసుకునే వెళదాం”
“ఓకే ఓకే! అర్థమైంది. బాగా అర్థమైంది. అన్నట్టు మరొక విషయం చెప్పాలి- మీకు చదవటానికి వీలుగా అదనపు పుస్తకాల కోసం ఆన్ లైన్ లో బుక్ చేసాను. రెండు మూడు రోజుల్లో మీకు చేరుతాయి. ఆర్ యు హ్యాపీ నౌ?”
“వెరీ వెరీ హ్యాపీ! అయితే, నా తరపున నేనొకటి చెప్పాలి” అంటూ ఆమె కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు- అప్పుడామె గలగల నవ్వుతూ చేతిని వెనక్కి తీసుకోకుండానే స్పందించింది- “చేతులు కలపితే చాలదోయ్ మిత్రమా! అదిగో— ఉడిపి హోటల్.. అక్కడ హాట్ అండ్ స్ట్రాంగ్ కాఫీ తీసుకుందామా? చెప్పాలనుకుంటున్నది కాఫీ తీసుకున్న తరవాత చెప్తారా లేక ఇప్పటికిప్పుడే చెప్తారా?”
“పెద్ద విషయమేదీ కాదు గాని— ఇప్పుడే చెప్తాను. చదివి రాయవలసిన సబ్జెక్టులు ఎంపిక చేసుకున్నాను కాబట్టి, చిక్కడపల్లి కేంద్ర పుస్తక భండాగారానికి తీరిక చిక్కినప్పుడల్లా వెళ్ళి అందినకాడ పుస్తకాలు అందుకుని చదవనారంభించాను. అంటే బండిని ఫ్రిక్షన్ లో పెట్టనారంభించానన్నమాట— ఇక పుస్తకాలన్నీ చేరిన తరవాత వేగం పుంజుకోవలసిందే— ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ న్యూస్?”
ఆఫ్ కోర్స్ అందామె.
అతడు మళ్ళీ అందుకున్నాడు- “ఇప్పుడు మన మేటర్ కి వస్తున్నాను- వట్టి కాఫీ మాత్రమేనా! ఏది కావాలంటే అది- కడుపార తిని నాకు నీ సంతోషాన్ని పంచు—” అంటూ ఆమె చేతిని అందిపుచ్చుకుని హోటల్ ఎంట్రన్స్ వేపు నడిపించాడు.
ఆమె ఎక్కడా ఆగకుండా అతడితో నడుస్తూనే అడిగింది “మరి మీరు నాకేమి పంచుతారు?”
అతడు బదులివ్వలేదు. లోతుగా నవ్వుతున్న ఆమె కళ్ళల్లోకి చూసాడు. అసంకల్పితంగా తలదించుకుందామె. తనను తాను సమర్పించుకోవడానికి సంసిద్ధురాలవుతుందామె; భాద్రపదం శుభప్రదం అన్న రీతిన కట్టలు తెంచుకున్న చెరువు గట్టులా అణువణువున తపిస్తూ పరవశిస్తూ— వెన్నెల వెలుగులోని చామంతిలా పరిమళిస్తూ—
=================================
ఇంకా ఉంది
వ్యాపార ప్రపంచం – పార్ట్ 13
త్వరలో మీ ముందుకు వస్తుంది.
=================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a















Comments