top of page
Original.png

జోక్స్ – నవంబర్ 2026 - పార్ట్ 2

52 minutes ago
16 min read

జోక్స్ నవంబర్ 2026 – మనతెలుగుకథలు.కామ్ జోక్స్ పోటీలో రచయితలు పంపిన సరదా తెలుగు జోక్స్, నవ్వుతున్న కుటుంబ సభ్యుల హాస్య చిత్రం.
జోక్స్ – నవంబర్ 2026 - పార్ట్ 2 | తెలుగు రచయితల సరదా జోక్స్ కలెక్షన్ – మనతెలుగుకథలు.కామ్.

😂 జోక్స్ – నవంబర్ 2026 - పార్ట్ 2 😂

నవ్వండి... నవ్వించండి... హాయిగా ఆనందించండి!

మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న జోక్స్ పోటీ 2026–27లో భాగంగా రచయితలు పంపిన సరదా తెలుగు జోక్స్ మీ కోసం!


జోక్స్ – నవంబర్ 2026 - పార్ట్ 2

సెట్ నంబర్ – 27: వీరేశ్వర రావు మూల గారు


1. ఒక రైల్వే ఇంటర్వ్యూ లో, ‘సిగ్నల్ సిస్టం పాడైంది, ఒకే ట్రాక్ మీద ఎదురు ఎదురుగా రెండు రైళ్ళు వస్తున్నాయి, నీ దగ్గర ఎర్ర లాంతరు కాని ఎర్ర గుడ్డ కాని లేదు, కటిక చీకటి.. ఏం చేస్తావు? ‘ అని అడిగితే, కాండిడేట్ ‘ఏముంది, వెంటనే ఇంటికి పరుగెడతాను నా భార్య ని తీసుకొని రావడానికి.'

" ఆవిడా? ఆవిడేం చేస్తోంది.?" 

" ఏం చెయ్యదు. అది రెండు రైళ్ళు గుద్దుకుంటుంటే  చూడాలని ఎప్పటినుంచో గోల పెడుతోంది,’ అని అన్నాడు


2. ఒక  హార్ట్ పేషెంట్ కి లాటరి లో 50 లక్ష లు వచ్చాయి . ఆ విషయం ఎలా చెప్పాలో  పేషెంట్ కి అని పేషెంట్ భార్య కంగారు పడుతోంది . ఆ విషయం డాక్టర్ కి చెప్పింది . ఆయన కి ఎలా చెప్పాలో నాకు వదిలెయ్యండి .నేను చూసుకుంటానుగా .

డాక్టర్ వెళ్లి “ మీకు లాటరి లో పది లక్ష లో వచ్చాయనుకోండి . ఏమి చేస్తారు ? “ అడిగాడు. 

“ నా భార్య కి బంగారం కొనుక్కోవడానికి ఇస్తాను “

“ లాటరి లో 20 లక్ష లు వస్తే ? “

“ అబ్బాయి స్థలానికి ఇస్తాను “

“ లాటరి లో 40 లక్ష లు వస్తే “

“ అమ్మాయి కి పది లక్షలు , అబ్బాయి కి పది లక్ష లు . మిగిలింది నాకు “

“ లాటరి లో 50 లక్షలు వస్తే ? “

“ మీకు సగం ఇచ్చేస్తాను “

అంతే డాక్టర్ గుండె ఆగిపోయింది .


​ 3. రంగారావు కి నూరేళ్ళు నిండాయి. పూర్ణ ఆయువు రహస్యం తెలుసు కోవడానికి విలేఖర్లు   వచ్చారు.

" మీ నూరేళ్ళ రహస్యం ?"

" శాఖాహారిని,మద్యం సేవించను. బ్రహ్మ చారి ని

   నిత్యం యోగ,ప్రాణాయామం చేస్తాను. ' తన రహస్యం చెప్పాడు రంగారావు.

 అక్కడికి ఒక ముసలాయిన వచ్చి నన్ను కూడా ఇంటర్వ్యూ చెయ్యండన్నాడు. 

" మీ ప్రత్యేకత ఏమిటో అన్నారు. ? " అన్నారు విలేఖరులు.

 "రాసుకోండి" అన్నాడు.

"నాకు పదిహేడో సంవత్సరం లో పెళ్ళయింది.

తరువాత ఎంతమంది భార్య లో లెక్క లేదు.

చుట్ట,బీడి,సిగరెట్ ఏది దొరికితే అది కాలుస్తాను.

నాటు సారా నుండి రాయల్ స్టాగ్ వరకూ ఏది దొరికితే అది తాగుతా.

" కోడి,మేక,పోట్టేలు ఇలా ఏది కుదిరితే అది తింటాను.

మొత్తం జీవితాన్ని పూర్తి గా అనుభవించాను."

"రంగారావు ని చూస్తే జాలేస్తోంది." అన్నాడా ముసలాయిన. 

"ఎందుకు ? ఇంతకీ మీరు రంగారావు కి ఏమవుతారు."

" నేనా మీ నూరేళ్ళ   రంగారావు తండ్రిని "

విలేఖర్లు :????!!!!!!


4. ఒక ఎం.ఎల్ ఏ గారికి మంత్రి వర్గం లో స్థానం ఉందని తెలిసింది. ఉత్సాహంగా భార్య ని పిలిచి, 

" ఈ రోజు రాత్రి నువ్వు మంత్రి గారి పక్కలో పడుకుంటున్నావు." అన్నాడు. ఆరోజు అసెంబ్లీ వెళ్ళాక ఎం. ఎల్. ఏ గారికి కి మంత్రి వర్గం లో స్థానం లేదని తెలిసింది. 

విచారం గా ఇంటికి వచ్చాడు. అతని భార్య చక్కగా ముస్తాబయి ఇలా అంది. 

" ఏమండి మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారా? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా? "

ఎం. ఎల్. ఏ :!!!! 


5. "ఎందుకండి. నా ఆస్తి డాక్యుమెంట్లు, షేర్ల వివరాలు అడుగుతున్నారు. డాక్టర్ గారు" అడిగాడు పేషెంట్. 

  "రేపు ఆపరేషన్ ప్రారంభం అవుతుంది గా" అన్నాడు డాక్టర్. 


6. " మీ ఆయన సాహిత్య సేవ చేస్తారా? నవలలు, కధలు రాస్తారా? "

" కాదు పుస్తకాలకు Binding చేస్తారు. "


7. " నీకు, మీ   ఆయనకి కెమిస్ట్రీ వర్క్అవుటయ్యిందా? అంత అన్యోన్యంగా ఉన్నారు?" అడిగింది కోమలి స్నేహితురాలిని. 

   " కాదు. మా మామగారికి, మా నాన్న గారికి

   మాథ్స్ (Maths) వర్కవుటయ్యింది." 


8. ఒక జడ్జి గారు ఖైదీ కి శిక్ష వేస్తూ, మళ్ళీ ఖైదిని చూసి 

   " నిన్ను ఎక్కడో చూసినట్టుంది." అన్నారు. 

  " అవునండి. మీ భార్య కి గతం లో సంగీతం పాఠాలు చెప్పాను" 

    

 " అలాగ, జైలు శిక్ష రెండు ఏళ్ళు ఎక్కువ వేస్తున్నాను. "


9. "తండ్రులు గొప్పవాళ్ళా? కొడుకులు గొప్ప వాళ్ళా?" అడిగాడు చింటూ. 

" తండ్రులే" అన్నాడు చింటూ తండ్రి. 

" ఐతే, అబ్రహం లింకన్ తండ్రి ఎందుకు ప్రెసిడెంట్ అవ్వలేదు.?" 

చింటూ తండ్రి :!!!! 


10." ఏరా, ప్రభుత్వం అచ్చు వేసినట్టు నోట్లు ప్రింట్ చేసావు. మరి ఏలా పట్టుబడ్డావు? " అన్నాడు పాత ఖైది కొత్త ఖై దిని అడిగాడు. 

" అలవాటు లో పొరపాటు గా, ప్రింటెడ్ ఎట్ పరమ్ ప్రెస్ ' అని కొట్టించా "

పాత ఖైది :!!!!! 


సెట్ నంబర్ – 26: శ్రీనివాసరావు జీడిగుంట గారు

1)  పెళ్లి అయిన నెలరోజులకు పెళ్ళికొడుకు సడన్ గా అత్తగారింటికి వచ్చి కోపంగా మామయ్యగారు ఒకసారి మా పెళ్లి చేయించిన శాస్త్రి గారి అడ్రస్ యిస్తారా వెళ్లి చితక్కోట్టాలి అన్నాడు. మా అమ్మాయి అసలు రూపం తెలిసిపోయిందా అల్లుడు అన్నాడు ఆ మామగారు.


2) సార్ మేము వృద్ధాశ్రమం స్టార్ట్ చేస్తున్నాము మీరు ఏమైనా డొనేట్ చేస్తారని వచ్చాము అన్నాడు సెక్రటరీ.  అలాగే దానిదేం భాగ్యం మా అత్తగారు వుంది తీసుకునివెళ్ళండి అన్నాడు యజమాని.


3) బాబూ క్రాఫ్ చెయ్యటానికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు తల మీద రెండు వెంట్రుకలు వున్న సోమేశం.  ఆయన తల వంక చూసి వెంట్రుకల ప్రకారం లెక్క సార్ అన్నాడు ముసి ముసి నవ్వులు నవ్వుతో బార్బర్.


4)త్వరగా భోజనం కి రండి ఆ వార్తలు చదివే పిల్ల ఎప్పుడో వెళ్ళిపోయింది అంది చొంగ కార్చుకుంటో టీవీ చూస్తున్న భర్తతో.


5) సినిమా ఎలా వుంది అని అడిగాడు నిర్మాత జనం లో నుంచుని. నిర్మాత కోసం వెతుకుతున్నాము పచ్చడి చెయ్యటానికి అన్నాడు ఒకడు.


6) నిమ్మకాయ చారు ఎలావుంది అని అడిగింది భర్తని.  బాగానే వుంది నిమ్మకాయ రసం వెయ్యడం మర్చిపోయావు అనుకుంట అన్నాడు నెమ్మదిగా.


7)  అమ్మా కాకి అరుస్తోంది అన్నాడు కొడుకు. బహుశా మీ నాన్న వైపు చుట్టాలు వస్తున్నట్టున్నారు కదండీ అంది. నిజమే మీ చుట్టాలు అయితే గాడిద అరిచేది కదా అన్నాడు భర్త.


8) సెతస్కోప్ మెడలో వేసుకున్నారు దానిని వాడరా అన్నాడు అసహనం గా డాక్టర్ తో.  అక్కర్లేదు అది నేనే డాక్టర్ అని తెలియటానికి అంతే అన్నాడు.


9) ఏమిటి తొమ్మిది బట్టలకి పన్నెండు బట్టల డబ్బులు అడుగుతావేమిటి అంది ఇస్త్రీ చాకలితో. మరి ప్యాంటు జేబులో కుక్కిన జేబురుమాలు కి డబ్బులు ఎవ్వరిస్తారు మేడం అన్నాడు.


10)  ఏమండీ మీ హోటల్లో భోజనం ఎలావుంటుంది సార్ అని అడిగాడు సుబ్బారావు. మీ యింటి భోజనంలా ఉంటుంది సార్ అన్నాడు హోటల్ యజమాని. అయితే వద్దులే అని బయటకు నడిచాడు.


సెట్ నంబర్ – 25: కొల్లు ప్రశాంత్ కుమార్ గారు

1.

​భర్త: "ఏమోయ్,పక్కంటి వాళ్ల ఆవిడ రోజూ రకరకాల ఫ్రై వంటలు చేసి భర్తకు బాక్స్‌లో పెట్టి పంపిస్తోంది. నువ్వెప్పుడైనా నాకు అలా ప్రేమగా వండి పెట్టావా?"

​భార్య: "అయ్యో, మీకేం తక్కువ! పక్కంటి ఆవిడ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తుంది, మనకి కూడా చేయమంటారా?

భర్త : వద్దులే ఈ ఆన్లైన్ తగలెట్టా!


​2.

​కొడుకు: "నాన్న, మీ కాలంలో నువ్వు హోంవర్క్ ఎలా చేసేవాడివి? అప్పట్లో ChatGPT ఉండేదా?"

​తండ్రి: "ఛాట్ జీపీటీ ఏంటిరా బాబూ! చీపురుకట్ట తో ఒకటే....జీపీటీ’ ఉండేది. ప్రశ్న కు సెకన్లలో సమాధానంతో పాటు మెదడులో జ్ఞానోదయం అయిపోయేది!"


​3.

​రోగి: "డాక్టర్ గారూ! నా భార్యకు మతిమరుపు రోజురోజుకూ ఎక్కువైపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా అస్సలు గుర్తుపెట్టుకోలేకపోతుంది. దీనికి ఏమైనా మందు ఉందా?"

​డాక్టర్: "ఇది చాలా సాధారణ సమస్యే. అయితే, ముందుగా ఆమెకు మీ అప్పుల లెక్కలు కాకుండా తన పుట్టినరోజు, ఆమె నగల వివరాలు గుర్తుచేయడానికి ప్రయత్నించండి, అప్పుడు రిజల్ట్ మీకే తెలుస్తుంది!"



​4. 

​ఉద్యోగి: "సార్! గత ఐదేళ్లుగా నేను ఈ కంపెనీ కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాను, ఒక్క రోజు మాత్రమే లీవ్ పెట్టాను మరి నా జీతం ఎందుకు పెంచడం లేదు?"

​బాస్: "అరే నువ్వు లీవ్ పెట్టిన ఆ ఒక్కరోజే అర్దమయ్యిందిరా మా కంపెనీకి పట్టిన శని గాడివి నువ్వే అని!"


​5. 

​వెంకట్రావు :"అయ్యా, ఈ డిస్కౌంట్ సేల్‌లో ఈ జాకెట్ కొంటే నాకు ఎంత మిగులుతుంది?"

​సేల్స్ మ్యాన్: "మనలో మన మాట అస్సలు కొనుక్కోకపోతే వంద శాతం మిగులుతుంది సర్! సాటి మగవాడిగా చెప్తున్నా"


​6. 

​ఓటరు: "అన్నా! ఎన్నికలొచ్చినప్పుడు మా ఊరి రోడ్లు బాగుచేయిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఐదేళ్లయినా రోడ్డు మీద గుంతలు తప్ప అస్సలు మారలేదు ఏంటి?"

​నాయకుడు: "అరరే! ఎలక్షన్ రోజే డబ్బులిచ్చేసానే మిరింకా రోడ్డు వేయించు కోలేదా! అయ్యో! వెళ్లి రోడ్డు వేసుకోండి! హాహాహా!

ఓటరు : ఇప్పుడు అర్ధ మైంది సార్ డబ్బులతో అభివృద్ధి ని నరికేస్తున్నాం అని 



​7. 

​ప్రయాణికుడు: "కండక్టర్ గారూ! ఈ బస్సు పిఠాపురం వెళ్తుందా?"

​కండక్టర్: "వెళ్తుంది బాబు,ఎక్కెయ్ !"

​ప్రయాణికుడు: "మరి డ్రైవర్ గారికి పిఠాపురం రూట్ సరిగ్గా తెలుసంటారా? అప్పుడప్పుడు దారి తప్పి వేరే ఊరు వెళ్తుంటాడని విన్నాను!"

​కండక్టర్: "అయ్యో అందుకేం టెన్షన్ పడకు బాబు! వాళ్ళ ఆవిడకు విషయం తెలిసి చిన్నీళ్లు గాని పెట్టాడేమో అని అనుమానం తో బస్సులోనే ప్రక్కన కూర్చుటుంది.


​8. ​భర్త: "ఏంటి పెళ్ళాం గారూ! పొద్దుటి నుంచి రాత్రి వరకు రీల్స్ చేస్తూ కూర్చున్నావు, కనీసం ఇల్లు కూడా ఊడవలేదేంటి?"

​భార్య: "అయ్యో అమాయకా! ఇప్పుడే ‘ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఎలా?’ అని నేను చేసిన రీల్‌కు పది లక్షల వ్యూస్ వచ్చాయి... ఆ వ్యూస్ చూసి ఆనందించాలా? లేక ఇల్లు ఊడుస్తూ కూర్చోవాలా?"


​9. ​మాస్టారు: "రామూ! చిన్న హోంవర్క్ కూడా ఎందుకుతప్పులు చేసావు ? రేపు మీ నాన్నగారిని స్కూల్‌కి తీసుకురా!"

​విద్యార్థి: "అయ్యో సార్! మా నాన్నగారు రావడం అస్సలు కుదరదు సార్!"

​మాస్టారు: "ఎందుకురా, అంత బిజీగా ఉన్నారా?"

​విద్యార్థి: "అది కాదు సార్... నిన్న రాత్రి నా హోంవర్క్ ఆయనే కదా చేశారు, అందులో అన్నీ తప్పులే వచ్చాయని తెలిస్తే పాపం అవమానంతో తలెత్తుకోలేరు సార్!"


​10.

​కస్టమర్: "వెయిటర్! మా వాడు గొంతులో నువ్విచ్చిన రొయ్య ఫ్రై లో ఒకరోయ్య ఇరుక్కుపోయింది మా ఫుడ్ గొంతులో నెయ్యిలా దిగిపోద్ది అనిచెప్పావు!."


​బార్ వెయిటర్: "అయ్యో సార్, ఇక్కడ బీర్ మూత లేదు సార్!"


సెట్ నంబర్ – 24: తాత మోహనకృష్ణ గారు

1. భర్త: "ఒసేయ్! మాల్‌లోకి అడుగుపెట్టి మూడు గంటలు దాటింది.. ఒక్క చీర కూడా నచ్చలేదా?"

భార్య: "నాకు అన్నీ నచ్చాయి అండీ.. మీ ముఖం చూసి ఏది వదులుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను!"


2. భార్య: "ఏమండీ..! నేను కాసేపు బయటకి వెళ్తున్నాను. మీకు ఏమైనా కావాలా?"

భర్త: "అదే కావాలి!"

భార్య: "ఏంటది?"

భర్త: "నువ్వు బయటకి వెళ్ళడం!"


3. ఫ్రెండ్ 1: "పెళ్ళి అంటే ఏమిటి?"

ఫ్రెండ్ 2: పెళ్లి అనేది ఒకే ఒక్క వీడియో గేమ్. ఇందులో విలన్ ఎవరనేది మొదట్లోనే తెలిసిపోతుంది, కానీ గేమ్ మాత్రం ఎప్పటికీ ఎండ్ అవ్వదు!


4. భార్య: "ఏమండీ..! మన ఇంట్లో నా మాట చెల్లుతుందా, మీ మాట చెల్లుతుందా?"

భర్త: "ఖచ్చితంగా నా మాటే చెల్లుతుంది.. కానీ నిర్ణయం మాత్రం నీదే!"


5. భార్య: "ఏమండీ..! నేను లావయ్యానా?"

భర్త: "అయ్యో లేదు డార్లింగ్.. నువ్వు ఉన్న రూమ్ సైజ్ కొంచెం చిన్నదైంది అంతే!"


6. భర్త ఫోన్‌కి మెసేజ్ వచ్చింది: "మీ అకౌంట్ నుండి ₹15,000 డెబిట్ అయ్యాయి."

భర్త..కంగారుగా: "ఒసేయ్! నా కార్డు ఎక్కడో పోయింది, ఎవడో షాపింగ్ చేసేస్తున్నాడు!"

భార్య.. కూల్‌గా: "కంగారు పడకండి.. కార్డు సేఫ్ చేతుల్లోనే ఉంది. నేను మీ పక్క రూమ్‌లోనే ఉన్నాను!"


7. భార్య: "ఏమండీ..! ఆ షాప్ బయట 'బై వన్ గెట్ త్రీ ఫ్రీ' అని బోర్డు పెట్టారు! ఎంత మంచి ఆఫరో కదా!"

భర్త: "అవును డార్లింగ్.. నువ్వు ఒక చీర కొంటే, దాంతో పాటు నా బ్యాంక్ బ్యాలెన్స్, నా ప్రశాంతత, నా నిద్ర.. ఈ మూడూ ఉచితంగా ఎగిరిపోతాయి!"


8. అబ్బాయి: డార్లింగ్, నీ నాచురల్ లుక్ ఫొటో ఒకటి వాట్సాప్ చెయ్ ప్లీజ్!

అమ్మాయి: నో మేకప్ ఫొటో పంపించింది.

అబ్బాయి: చూసి షాక్ అయి... థాంక్స్ డియర్! నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. ఇకపై ఇలాంటి 'హారర్' ప్రయోగాలు చేయకు!


9. అమ్మాయి: నువ్వు ఎక్కడున్నా నా మనసు నిన్నే వెతుకుతుంది డార్లింగ్!

అబ్బాయి: అంత కష్టపడకు డియర్, వాట్సాప్‌లో 'లైవ్ లొకేషన్' షేర్ చేశాగా

అమ్మాయి: ఛీ.. నీకు అస్సలు రొమాన్స్ తెలీదు! 


10. భార్య: "ఏమండీ..! ఇవాళ నేను షాపింగ్‌కి వెళ్తే ఒక చీర ₹5,000 అంటే, నేను బేరమాడి ₹2,000 కే కొన్నాను.. ఎలా ఉంది నా టాలెంట్?"

భర్త: "అబ్బా.. ₹3,000 మిగిల్చావ్ అన్నమాట! ఆ మిగిలిన డబ్బులు ఇవ్వు, నా బైక్‌కి పెట్రోల్ కొట్టించుకుంటాను"

భార్య: "అదేం కుదరదు.. ఆ ₹3,000 మిగిలాయి కదా అని ఇంకో చీర కొనేసాను!"


సెట్ నంబర్ – 23: మున్నంగి శ్రీనివాస్ గారు

1. మోడర్న్ భక్తి

భక్తుడు: "స్వామీ! రోజూ గుడికి వస్తున్నా, కొబ్బరికాయ కొడుతున్నా, అయినా నా కష్టాలు ఎందుకు తీరట్లేదు?"

దేవుడు: "ఒరేయ్ భక్తా! నువ్వు గుడికి వస్తున్నావు సరే... కానీ సెల్ ఫోన్ సైలెంట్ లో పెట్టి దణ్ణం పెడుతున్నావు, నా దగ్గరకు నీ మనసు చేరట్లేదు!"


2. బస్సులో కన్ఫ్యూజన్

కండక్టర్: "ఏమండీ, వెనక్కి జరగండి... ఆ సీటు కోసం అందరూ ఎగబడుతున్నారు!"

ప్రయాణికుడు: "అదేంటి, అదేమైనా సినిమా హాల్ సీటా?"

కండక్టర్: "కాదండి బాబు! అది ఈ బస్సులో గాలి బాగా వచ్చే కిటికీ సీటు!"


3. భార్యాభర్తల కరెంట్ బిల్లు

భర్త: "ఏంటి, ఈసారి కరెంట్ బిల్లు ఏకంగా పది వేలు వచ్చింది!"

భార్య: "నేనేం చేశానండీ? రోజూ మీతో మాట్లాడటం మానేసి సైలెంట్ గా కూర్చుంటున్నా కదా!"

భర్త: "అందుకేనే బిల్లు పెరిగింది... చీకట్లో కూర్చుని టీవీ చూస్తావుగా!"




4. దొంగ - పోలీసు

పోలీసు: "ఒరేయ్! పారిపోతున్న నిన్ను పట్టుకోవడానికి నాకు ప్రాణం పోయింది!"

దొంగ: "అయ్యో సార్... నేను ముందే చెప్పాను కదా, నన్ను వెంబడించకండి అని. మీరే వినలేదు!"


5. డాక్టర్ గారి సలహా

పేషెంట్: "డాక్టర్ గారు! మా ఆయన నన్ను అసలు పట్టించుకోవడం లేదు, నా పేరు కూడా సరిగ్గా పిలవడం లేదు. ఏం చేయమంటారు?"

డాక్టర్: "ఒక పని చేయండి అమ్మా... రేపటి నుండి ఆయన పేరుతో పక్కింటి ఆయన్ని పిలవండి, ఆటోమేటిక్ గా మీ పేరు గుర్తొస్తుంది!"


6. ఆఫీస్ లో ఇంటర్వ్యూ

బాస్: "నీకు గతంలో ఎక్కడైనా పనిచేసిన అనుభవం ఉందా?"

అభ్యర్థి: "ఉంది సార్! గత ఆఫీస్ లో నేను ఏ పని చేసినా... అందరూ వచ్చి 'ఇది నువ్వే చేశావా?' అని ఆశ్చర్యంగా అడిగేవారు!"

బాస్: "ఓహో! అంత బాగా చేసేవాడా?"

అభ్యర్థి: "కాదు సార్... నేను ఆ ఆఫీస్ లో వాచ్‌మన్‌ని!"


7. వైఫై లవర్స్

ప్రేమికుడు: "ప్రియురాలా! నీకోసం ఏడు సముద్రాలనైనా దాటేస్తాను, నిప్పుల్లోనైనా నడుస్తాను!"

ప్రియురాలు: "అబ్బో... సరే కానీ, ముందు ఆ వైఫై పాస్‌వర్డ్ చెప్పు, సిగ్నల్ రావడం లేదు!"



8. రెస్టారెంట్ తిప్పలు - కొత్త వెర్షన్

కస్టమర్: "వెయిటర్! ఈ బిర్యానీలో ఉప్పు లేదు!"

వెయిటర్: "అయ్యో సార్... క్షమించండి, ఉప్పు వేసే అతను ఈరోజు సెలవు, ఉప్పు కూడా సెలవు పెట్టింది!"


9. భార్య గారి ప్రశ్న

భర్త: "పెళ్లయి ఐదేళ్లయినా నువ్వు నా కోసం ఒక్క గిఫ్ట్ కూడా కొనలేదు!"

భార్య: "మరి నీకు అంతగా కావాలంటే... ఈరోజే నా ఆన్ లైన్ షాపింగ్ కార్ట్ లో ఉన్నవన్నీ కొనిపెట్టు!"

భర్త: "అందులో ఏమున్నాయి?"

భార్య: "ఒక బెంజ్ కారు, గోల్డ్ నెక్లెస్ అంతే!"


10. పెళ్లి చూపులు

పెళ్ళికొడుకు తండ్రి: "అమ్మాయికి వంట వచ్చా? మా అబ్బాయికి మసాలా లేని కూరలు అస్సలు పడవు."

పెళ్ళికొడుకు: "నా గురించి టెన్షన్ పడకండి నాన్నా... వంట రాకపోయినా పర్వాలేదు, మన మధ్య 'ఆర్డర్' చేసే యాప్స్ ఉన్నాయిగా!"


సెట్ నంబర్ – 22: Ch. ప్రతాప్ గారు

1. భార్య: ఏవండీ! నాతో మనసు విప్పి మాట్లాడండి. మీరు ఏం చెప్పినా కోప్పడను.

భర్త: నిజంగానా?

భార్య: నిజమేనండీ! మీరు ధైర్యంగా చెప్పండి.

భర్త: మరి గతంలో చేసిన తప్పులన్నీ కూడా చెప్పేయనా?

భార్య: అవన్నీ నాకు తెలుసు. నాకు తెలియకుండా చేసినవి ఏమైనా ఉంటే చెప్పండి!

2.

భర్త: ఏమోయ్! ఈరోజు వంట అద్భుతంగా కుదిరింది. ఇంత రుచిగా ఎప్పుడూ తినలేదు!

భార్య: నిజంగానా?

భర్త: ఒట్టు! రోజూ ఇలాగే వండితే ఎంత బాగుంటుందో!

భార్య: అయితే రేపటి నుంచి మీరే వండండి. మీ చేతివంట రుచి ఎలా ఉంటుందో నాకూ తెలియాలి కదా!

3.

ప్రియుడు: నీ కోసం ఆకాశంలోని చుక్కలనైనా తెచ్చి ఇస్తాను!

ప్రియురాలు: అంత శ్రమ ఎందుకులే! ముందు నా పుట్టినరోజుకు బహుమతి కొనడానికి తీసుకున్న అప్పు తీర్చు.

ప్రియుడు: అది చిన్న విషయం! చుక్కల సంగతి చెప్పు.

ప్రియురాలు: చుక్కలు తర్వాత చూద్దాం. ముందు నీ అప్పులు తీరితే నా కళ్లలోనే చుక్కలు కనిపిస్తాయి!

4.

పరీక్షలో ప్రశ్నపత్రం చూడగానే విద్యార్థి కళ్లు మూసుకుని ప్రార్థించడం మొదలుపెట్టాడు.

మిత్రుడు: ఏంట్రా! అంతలా ప్రార్థిస్తున్నావు?

విద్యార్థి: నేను చదవని పాఠాల నుంచి ప్రశ్నలు రాకూడదని దేవుడిని వేడుకుంటున్నాను.

మిత్రుడు: అయితే ప్రశ్నపత్రం ఖాళీగా ఇవ్వమని కోరుకోరా! నువ్వు చదివిన పాఠం ఒక్కటీ లేదుగా!

5.

నాయకుడు: నన్ను గెలిపించండి! మీ ఊరి సమస్యలన్నీ మాయమైపోయేలా చేస్తాను.

గ్రామస్థుడు: నిజంగానా సార్?

నాయకుడు: తప్పకుండా! ఇది నా హామీ.

ఎన్నికల తర్వాత గ్రామస్థుడు నాయకుడిని అడిగాడు.

గ్రామస్థుడు: సార్! మా సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. మీరేమో కనిపించడం లేదు!

నాయకుడు: నేను చెప్పింది సమస్యలు మాయమవుతాయని కదా! ముందు మీ కళ్లకు కనిపించకుండా నేనే మాయమయ్యాను!

6.

యజమాని: మన సంస్థలో పనిచేసే ఉద్యోగులంతా నాకు కుటుంబ సభ్యులతో సమానం!

ఉద్యోగి: చాలా సంతోషం సార్! మరి మమ్మల్ని మీ సొంత కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారా?

యజమాని: అందులో సందేహమేముంది?

ఉద్యోగి: అయితే మీ ఆస్తిలో మాకు వాటాలు ఎప్పుడు పంచుతారో కూడా చెప్పండి సార్!

7.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఉదయం ఐదు గంటలకు లేచి నడకకు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.

ఆ నిర్ణయాన్ని ఎంత క్రమశిక్షణతో పాటిస్తున్నానో తెలుసా?

ప్రతిరోజూ సరిగ్గా ఐదు గంటలకు నిద్రలేచి, నడకకు వెళ్లాలన్న నిర్ణయాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసి మళ్లీ హాయిగా నిద్రపోతున్నాను!

8.

స్నేహితుడు: ఒరేయ్! నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని గుర్తుంచుకో!

మిత్రుడు: చాలా సంతోషంరా! ప్రస్తుతం ఓ ఐదు వేల రూపాయలు అవసరం. కాస్త అప్పుగా ఇస్తావా?

స్నేహితుడు: ఛఛా! ఐదు వేల రూపాయల్ని కూడా కష్టంగా భావిస్తావేంట్రా?

మిత్రుడు: మరి ఇస్తావా?

స్నేహితుడు: ముందు నిజమైన కష్టం ఏదైనా వస్తే చెప్పు. అప్పుడు తప్పకుండా నీ పక్కన నిలబడతాను!

9.

ప్రియురాలు: మన ఇద్దరి ఆలోచనలు అచ్చం ఒకేలా ఉంటాయి కదూ!

ప్రియుడు: అవును! ముఖ్యంగా షాపింగ్ విషయంలో!

ప్రియురాలు: అదెలా?

ప్రియుడు: నువ్వు ఏం కొనాలా అని ఆలోచిస్తావు. నేను బిల్లు ఎంతవుతుందా అని ఆలోచిస్తాను. ఇద్దరి ఆలోచనలూ నీ షాపింగ్ చుట్టూనే తిరుగుతాయి కదా!

10.

డాక్టర్: మీ ఆరోగ్యం బాగుండాలంటే తీపి పదార్థాలు పూర్తిగా మానేయాలి. లేకపోతే ప్రమాదం!

రోగి: తీపి తినకుండా ఉండటం చాలా కష్టం డాక్టర్ గారూ! వేరే మార్గం లేదా?

డాక్టర్: లేదు! నా మాట తప్పకుండా పాటించాలి.

రోగి: సరే డాక్టర్ గారూ! ఈ రోజే ఒక నిర్ణయం తీసుకుంటాను.

అప్పటినుంచి తీపి పదార్థాలు తినడం మాత్రం మానలేదు. కానీ ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లడం పూర్తిగా మానేశాడు!


సెట్ నంబర్ – 21: Ch. ప్రతాప్ గారు

1.

రంగయ్య: ఏమేవ్! నా కళ్లద్దాలు ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు. కాస్త వెతికి పెట్టవా?

సుబ్బలక్ష్మి: అదేమిటండీ! అవి మీ కళ్లకే ఉన్నాయి కదా!

రంగయ్య: ఓహో! అందుకే నువ్వు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నావన్నమాట! లేకపోతే నిన్ను కూడా వెతకాల్సి వచ్చేది!

2.

వెంకట్రావు: బాబూ! టైమెంతైందో కాస్త చెబుతావా?

యువకుడు: చెప్పను సార్!

వెంకట్రావు: అదేమిటి? టైం చెప్పడానికి కూడా అభ్యంతరమా?

యువకుడు: ఇప్పుడు టైం చెబితే మీరు ధన్యవాదాలు చెబుతారు. ఆ తర్వాత మాటలు కలుస్తాయి. ఇద్దరం ఒకే ఊరికి వెళ్తున్నామని తెలిస్తే పక్కపక్కనే కూర్చుంటాం. నాకు మంచి ఉద్యోగం ఉందని తెలుసుకుని మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు!

వెంకట్రావు: అయితే ఏంటయ్యా?

యువకుడు: నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సార్! అందుకే టైం చెప్పను!

3.

అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూరిన దొంగ ఎంత వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. విసుగెత్తి ఇంటి యజమానిని నిద్రలేపాడు.

దొంగ: ఏవయ్యా! ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు. దొంగతనం చేయడానికి ఒక్క వస్తువు కూడా దొరకడం లేదేంటి?

యజమాని: అంత బాధపడకయ్యా! మా ఆవిడ పుట్టింటికి వెళ్తూ బీరువా తాళాలు తీసుకెళ్లింది.

దొంగ: మరి నేనేం చేయాలి?

యజమాని: రేపు ఉదయం రా! తాళాలు వచ్చాక ఇద్దరం కలిసి వెతుకుదాం!

4.

ఉపాధ్యాయుడు: పిల్లలూ! మీ అమ్మానాన్నలు చేయలేని పని మీలో ఎవరైనా చేశారా?

రాజు: నేను చేశాను సార్!

ఉపాధ్యాయుడు: శభాష్! ఏమిటా గొప్ప పని?

రాజు: మా నాన్నకు ఈత రాదు. మా అమ్మకు కూడా ఈత రాదు. కానీ నిన్న నేను బావిలో పడి ఎవరి సాయం లేకుండా బయటకు వచ్చేశాను సార్!

ఉపాధ్యాయుడు: ఒరేయ్! ముందు నిన్ను బావిలోంచి ఎవరు బయటకు తీశారో చెప్పు!

రాజు: అదేనండీ! బయటకు తీసినవాళ్లను అడిగితే వాళ్లకు కూడా ఈత రాదన్నారు!

5.

డాక్టర్: మీ జబ్బు తగ్గాలంటే రోజుకు మూడుపూటలా భోజనానికి ముందు ఒక మాత్ర, తర్వాత ఒక మాత్ర వేసుకోవాలి.

రోగి: సరే డాక్టర్ గారూ! కానీ నాకు చిన్న సందేహం.

డాక్టర్: మందులు ఎలా వేసుకోవాలో అర్థం కాలేదా?

రోగి: మందుల సంగతి బాగానే అర్థమైంది సార్! కానీ రోజుకు మూడుపూటలా భోజనం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి!

6.

రమేష్: ఏంటోయ్! ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది, కారం లేదు. పైగా అంతా గడ్డలు కట్టేసింది. అసలు ఎలా చేశావు?

సుధ: వంటల పుస్తకంలో ఉన్నట్లే చేశానండీ! ఒక్క అక్షరం కూడా తప్పలేదు.

రమేష్: మరి ఇలా తయారైందేంటి?

సుధ: బహుశా ఆ పుస్తకంలోనే అచ్చుతప్పులు ఉన్నాయేమో! రేపు ప్రచురణకర్తకు ఫిర్యాదు చేస్తాను!

7.

ఊరి పెద్ద: మన గ్రామంలో దోమల బెడద ఎక్కువైపోయింది. వాటిని తరిమికొట్టడానికి ఎవరైనా మంచి సలహా ఇవ్వండి.

గోపాలం: ఊరి చుట్టూ పెద్ద గోడ కట్టేద్దామండీ! అప్పుడు బయటి దోమలు లోపలికి రావు.

ఊరి పెద్ద: మరి ఇప్పటికే ఊళ్లో ఉన్న దోమల సంగతేంటి?

గోపాలం: గోడకు చిన్న తలుపు పెడదామండీ! రాత్రిపూట దోమలన్నింటినీ బయటకు తరిమేసి తలుపు మూసేద్దాం!

ఊరి పెద్ద: మరి అవి మళ్లీ లోపలికి వస్తే?

గోపాలం: మన ఊరి దోమలకు అంత తెలివి ఎక్కడిదండీ!

8.

టికెట్ తనిఖీ అధికారి: ఏవయ్యా! టికెట్ అడిగితే జేబులన్నీ వెతుకుతున్నావేంటి?

ప్రయాణికుడు: టికెట్ ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు సార్!

అధికారి: కంగారు పడకు. దొరక్కపోతే జరిమానా కట్టాల్సి వస్తుంది. అంతే!

ప్రయాణికుడు: జరిమానా గురించి నా బాధ కాదు సార్!

అధికారి: మరి దేనికి?

ప్రయాణికుడు: నేను దిగాల్సిన ఊరు పేరు కూడా ఆ టికెట్ మీదే ఉంది సార్!

9.

సందర్శకుడు: మీ చిత్రంలో చెట్టు ఆకులన్నీ నల్లగా ఉన్నాయేంటి?

చిత్రకారుడు: అడవిలో అగ్నిప్రమాదం జరిగిన దృశ్యమది. అందుకే ఆకులు కాలిపోయి నల్లగా మారాయి.

సందర్శకుడు: మరి చెట్టు కింద గడ్డి మాత్రం పచ్చగా ఉందేంటి?

చిత్రకారుడు: అది నా చిత్రకళలోని ప్రత్యేకత!

సందర్శకుడు: అదెలా?

చిత్రకారుడు: మంటలు చెట్టుకు మాత్రమే అంటుకునేలా గీశాను. గడ్డికి కూడా అంటుకుంటే మళ్లీ రంగులు వేయాలి కదా!

10.

కృష్ణయ్య: ఏంటయ్యా! రెండు ఇడ్లీలు తింటే ఇంత బిల్లు వేశావేంటి?

హోటల్ యజమాని: ఇడ్లీలకే కాదండీ! మా హోటల్‌లోని చల్లని గాలి పీల్చుకున్నారు. రేడియోలో పాటలు కూడా విన్నారు. వాటికీ కలిపే బిల్లు!

కృష్ణయ్య: అలాగా! అయితే ఇదిగో నీ డబ్బులు!

అంటూ జేబులోంచి కొన్ని నాణేలు తీసి యజమాని చెవి దగ్గర గలగలలాడించాడు.

యజమాని: ఏంటండీ ఇది? డబ్బులివ్వకుండా శబ్దం చేస్తారేంటి?

కృష్ణయ్య: నువ్వు గాలికి, పాటలకు డబ్బులు వేశావు. నేను నాణేల శబ్దంతో బిల్లు కట్టేశాను. లెక్క సరిపోయింది కదా


సెట్ నంబర్ – 20: Ch. ప్రతాప్ గారు


1.


జడ్జి: ఒకే బట్టల దుకాణంలో వరుసగా మూడు రాత్రులు దొంగతనం చేశావు. ఎందుకు?


దొంగ: మొదటి రాత్రి మా ఆవిడ కోసం చీర తెచ్చాను సార్!


జడ్జి: మరి మిగతా రెండు రాత్రులు?


దొంగ: రంగు నచ్చలేదని మార్చుకురమ్మంది సార్! దొంగనైనా భార్య మాట వినక తప్పుతుందా?


2.


క్షురకుడు: క్షమించండి సార్! జుట్టు కత్తిరిస్తుంటే పొరపాటున మీ చెవికి చిన్న గాయమైంది.


కస్టమర్: ఏ చెవికి?


క్షురకుడు: కుడి చెవికి సార్!


కస్టమర్: అయితే పర్వాలేదులే! మా ఆవిడ తిట్టేటప్పుడు ఆ చెవే దగ్గరగా పెడుతుంటాను. కనీసం రెండు రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు!


3.


బ్యాంకు మేనేజర్: ఏవండీ! మీ సంతకం రికార్డులో ఉన్న సంతకంతో అస్సలు సరిపోవడం లేదు. మళ్లీ చేయండి.


కస్టమర్: క్షమించండి సార్! నిన్న రాత్రి మా ఆవిడతో పెద్ద గొడవైంది. అప్పటినుంచి చెయ్యి వణుకుతూనే ఉంది.


మేనేజర్: అయితే ఇంటికి వెళ్లి ప్రశాంతంగా సంతకం చేసి తీసుకురండి.


కస్టమర్: అదే కుదరదని బ్యాంకుకు వచ్చాను సార్! ఇంట్లో ప్రశాంతత ఎక్కడుంది?


4.


కండక్టర్: ఏవయ్యా! టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నావు. జరిమానా కట్టాలి!


ప్రయాణికుడు: నా దగ్గర డబ్బులు లేవండీ! కానీ నా కష్టాలు వింటే మీకే కన్నీళ్లు వస్తాయి.


కండక్టర్: సరే, చెప్పు!


ప్రయాణికుడు: నిన్న కూడా ఇలాగే టికెట్ లేకుండా ఎక్కాను. అప్పుడు కండక్టర్ నా కథ విని జాలిపడి వదిలేశాడు.


కండక్టర్: మరి ఈ రోజు?


ప్రయాణికుడు: ఆ కథ మీకూ నచ్చుతుందేమోనని మళ్లీ వచ్చాను!


5.


అధ్యాపకుడు: ఏరా! నిన్న ఇచ్చిన అసైన్‌మెంట్ ఏది?


విద్యార్థి: మా ఇంట్లో కుక్క తినేసింది సార్!


అధ్యాపకుడు: అబద్ధాలు చెప్పడానికి ఇదే దొరికిందా?


విద్యార్థి: నిజం సార్! అయితే మొత్తం తినలేదు. సగమే తిని వదిలేసింది.


అధ్యాపకుడు: ఎందుకట?


విద్యార్థి: మీరు చెప్పిన పాఠం దానికి కూడా బోరు కొట్టిందేమో సార్!


6.


కస్టమర్: ఏంటయ్యా! నా సూప్‌లో ఈగ ఈదుతోంది!


వెయిటర్: కంగారు పడకండి సార్! అది చాలా చిన్న ఈగ. ఎక్కువ సూప్ తాగలేదు.


కస్టమర్: నేను అడిగింది సూప్ ఎంత తాగిందని కాదు!


వెయిటర్: అలాగైతే చెప్పండి సార్! ఈగను బయటకు తీయమంటారా? లేక ఈత కొడుతున్నందుకు అదనంగా డబ్బులు తీసుకోవద్దంటారా?


7.


ఫొటోగ్రాఫర్: పెళ్లికొడుకుగారూ! కాస్త నవ్వండి. ఫొటోలు బాగా వస్తాయి.


వరుడు: నవ్వాలని నాకూ ఉందయ్యా! కానీ ఉదయం నుంచి అందరూ ఒక్కటే మాట చెబుతున్నారు.


ఫొటోగ్రాఫర్: ఏమంటున్నారు?


వరుడు: ఈ రోజు బాగా నవ్వుకో బాబూ! రేపటి నుంచి నవ్వుతావో లేదో నీ అదృష్టమని!


8.


నర్సు: లేవండి సార్! లేవండి!


రోగి: ఏంటమ్మా! మంచి నిద్రలో ఉన్నాను. ఎందుకు లేపారు?


నర్సు: రాత్రి పది గంటలకు నిద్ర మాత్ర వేసుకోవాలని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు పది అయింది.


రోగి: విచిత్రంగా ఉందమ్మా! నిద్రపట్టడం లేదని ఆసుపత్రికి వస్తే, నిద్రపోతున్న నన్ను లేపి నిద్ర మాత్ర ఇస్తారా?


9.


ఇంటి యజమాని: ఏవయ్యా! గోడలకు మేకులు కొట్టకూడదని ముందే చెప్పాను కదా?


అద్దెదారు: మా ఆవిడ ఫొటో తగిలించుకోవడానికి ఒక్క మేకైనా కొట్టక తప్పదండీ!


యజమాని: కుదరదు! గోడ మీద ఒక్క గీత కూడా పడకూడదు.


అద్దెదారు: సరేనండీ! అయితే ఫొటో తగిలించే బదులు మా ఆవిడనే గోడ పక్కన నిలబెడతాను. మీరు వచ్చినప్పుడు మాత్రం కదలకుండా ఉండమని చెబుతాను!


10.


కస్టమర్: ఈ చొక్కా రంగు వెలిసిపోదని గ్యారెంటీ ఇస్తావా?


దుకాణదారు: నూటికి నూరుపాళ్లు గ్యారెంటీ సార్! దీని రంగు అస్సలు పోదు.


కస్టమర్: మరి కొత్త చొక్కానే ఇంత వెలిసిపోయినట్లు కనిపిస్తోందేంటి?


దుకాణదారు: అందుకే గ్యారెంటీ ఇస్తున్నాను సార్! పోవాల్సిన రంగంతా ముందే పోయింది. ఇక పోవడానికి ఏముంది?


సెట్ నంబర్ – 19: Ch. ప్రతాప్ గారు

1. భార్య భర్తతో కోపంగా, ‘‘పెళ్లికి ముందు నేను నవ్వితే ప్రపంచాన్నే మరిచిపోతానని చెప్పేవారు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు!’’ అంది.


భర్త అమాయకంగా, ‘‘అప్పట్లో నీ నవ్వు చూసి ప్రపంచాన్ని మరిచిపోయేవాడిని. ఇప్పుడు కరెంటు బిల్లు చూసి నన్ను నేనే మరిచిపోతున్నాను!’’ అన్నాడు.


2. రమేష్ కొత్తగా కొన్న స్మార్ట్‌ఫోన్‌ను స్నేహితుడికి చూపిస్తూ, ‘‘దీంట్లో కృత్రిమ మేధస్సు ఉంది. నేను అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతుంది!’’ అన్నాడు.


స్నేహితుడు, ‘‘అయితే నీ భార్య ఎందుకు అలిగిందో అడుగు’’ అన్నాడు.


ఫోన్ వెంటనే, ‘‘ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేంత సాహసం నాకు లేదు!’’ అని చూపించింది.


3. ప్రియురాలు ప్రియుడితో, ‘‘నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఒక్క మాటలో చెప్పు’’ అంది.


ప్రియుడు ఆలోచించి, ‘‘అపరిమితం!’’ అన్నాడు.


‘‘అయితే నా కోసం ఏం త్యాగం చేయగలవు?’’ అని అడిగింది.


‘‘నీ కోసం నా ఫోన్‌లోని ఆటలన్నీ తొలగిస్తాను!’’ అన్నాడు.


‘‘అంత ప్రేమా?’’ అని ఆశ్చర్యపోయింది.


‘‘అవును! అయితే నువ్వు నా ఫోన్‌ను ముట్టుకోకూడదు!’’ అన్నాడు.


4. భార్య భర్తతో, ‘‘మన పెళ్లిరోజు గుర్తుందా?’’ అని అడిగింది.


భర్త గర్వంగా, ‘‘ఎలా మరిచిపోతాను? ఆ రోజు నా జీవితంలో ఒక చారిత్రక సంఘటన!’’ అన్నాడు.


‘‘అయితే తేదీ చెప్పండి’’ అంది భార్య.


భర్త కాసేపు ఆలోచించి, ‘‘చరిత్రలో జరిగిన ప్రతి సంఘటన తేదీ చరిత్రకారులకు కూడా గుర్తుండదు కదా!’’ అన్నాడు.


5. ఉద్యోగి తన అధికారితో, ‘‘సార్! నా పనితీరు పెరగాలంటే జీతం పెంచాలి’’ అన్నాడు.


అధికారి గంభీరంగా, ‘‘డబ్బు మనిషిని సోమరిపోతును చేస్తుంది. అందుకే నీ జీతం పెంచడం లేదు’’ అన్నాడు.


ఉద్యోగి వినయంగా, ‘‘అయితే మీ జీతం మొత్తం నాకు ఇచ్చేయండి సార్! మీ ఆరోగ్యం, పనితీరు రెండూ కాపాడినవాడినవుతాను!’’ అన్నాడు.


6. టీచర్ విద్యార్థిని అడిగింది, ‘‘ఇంట్లో చదువుకోవడానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తున్నావు?’’


విద్యార్థి, ‘‘రెండు గంటలు మేడమ్!’’ అన్నాడు.


‘‘చాలా మంచిది! ఏం చదువుతున్నావు?’’


‘‘మొదటి గంటలో అమ్మ ఫోన్‌లో వచ్చిన సందేశాలు, రెండో గంటలో నాన్న ఫోన్‌లో వచ్చిన వార్తలు!’’ అన్నాడు.


7. భార్య కొత్త చీర కట్టుకుని భర్తను అడిగింది, ‘‘నన్ను చూస్తే నీకు ఏ హీరోయిన్ గుర్తుకొస్తోంది?’’


భర్త కాసేపు పరిశీలించి, ‘‘ఏ హీరోయిన్ గుర్తుకురావడం లేదు. నువ్వే ప్రత్యేకంగా కనిపిస్తున్నావు!’’ అన్నాడు.


భార్య సంతోషంగా, ‘‘నిజంగానా?’’ అంది.


‘‘అవును! ఆ చీర ధర చూసినప్పటి నుంచి నాకు ఇంకెవరూ కనిపించడం లేదు!’’ అన్నాడు.


8. యువకుడు తన ప్రియురాలితో, ‘‘నీ కోసం ప్రపంచంలోని ఏ సమస్యనైనా పరిష్కరిస్తాను!’’ అన్నాడు.


ఆమె వెంటనే, ‘‘అయితే మా ఇంట్లో ఇంటర్నెట్ ఎందుకు నెమ్మదిగా పనిచేస్తోందో చూడు’’ అంది.


గంటసేపు ప్రయత్నించిన యువకుడు, ‘‘మన ప్రేమకు ఇలాంటి సాంకేతిక సమస్యలు అడ్డురాకూడదు. మనం ఉత్తరాలు రాసుకుందాం!’’ అన్నాడు.


9. డాక్టర్ రోగిని అడిగాడు, ‘‘మీకు నిద్రలేమి సమస్య ఎప్పటి నుంచి ఉంది?’’


రోగి, ‘‘నా భార్యకు ఆన్‌లైన్ షాపింగ్ అలవాటైనప్పటి నుంచి డాక్టర్!’’ అన్నాడు.


‘‘షాపింగ్ చేస్తే మీ నిద్రకేం ఇబ్బంది?’’


‘‘ఆమె రాత్రంతా వస్తువులు ఎంపిక చేస్తుంది. నేను ఉదయం వరకు బ్యాంకు ఖాతాలో డబ్బులు మిగిలాయో లేదో చూసుకుంటాను!’’ అన్నాడు.


10. మిత్రుడు శేఖర్‌ను అడిగాడు, ‘‘పెళ్లయిన పదేళ్ల తర్వాత కూడా మీ ఇంట్లో గొడవలే లేవంటావు. రహస్యమేమిటి?’’


శేఖర్ గర్వంగా, ‘‘మా ఇంట్లో ప్రతి ముఖ్యమైన నిర్ణయం నేనే తీసుకుంటాను. చిన్న విషయాలన్నీ మా ఆవిడ చూసుకుంటుంది!’’ అన్నాడు.


‘‘అయితే ముఖ్యమైన నిర్ణయాలంటే?’’ అని అడిగాడు మిత్రుడు.


‘‘దేశ ఆర్థిక విధానం, అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ శాంతి వంటి విషయాలు!’’ అన్నాడు శేఖర్.


సెట్ నంబర్ – 18: Ch. ప్రతాప్ గారు

1. రోజూ ఏదో ఒక విషయానికి భర్తతో గొడవపడే భార్య ఆ రోజు ఉదయం నుంచి మౌనంగా ఉంది. ఆశ్చర్యపోయిన భర్త, ‘‘ఏమిటి? ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నావు?’’ అని అడిగాడు.

భార్య నవ్వుతూ, ‘‘రేపు మీ పుట్టినరోజు కదా! పదేళ్లుగా మీరు చేసిన తప్పులన్నీ రేపు గుర్తుచేయాలి. అందుకే ఈరోజు గొంతుకు సెలవిచ్చాను!’’ అంది.

2. బరువు తగ్గాలని నిర్ణయించుకున్న రమేష్ తన ఆహార నియమాలన్నీ ఇంట్లోని కృత్రిమ మేధస్సు వ్యవస్థకు చెప్పాడు. అర్ధరాత్రి ఆకలేసి వంటగది దగ్గరికి వెళ్లగానే తలుపు తెరుచుకోలేదు.

‘‘తలుపు తియ్యి!’’ అని అరిచాడు.

‘‘క్షమించండి! మీ ఆరోగ్యం కోసం ఉదయం ఆరు గంటల వరకు వంటగది మూసివేయబడింది’’ అని సమాధానం వచ్చింది.

రమేష్ కోపంగా, ‘‘నువ్వు నా పనిమనిషివా, మా ఆవిడవా?’’ అని అరిచాడు.

3. ఎన్నికల ముందు ఒక నాయకుడు జ్యోతిష్యుడిని సంప్రదించాడు.

జ్యోతిష్యుడు చేయి చూసి, ‘‘ఈ వారం మీరు ఏం చెప్పినా అది తప్పకుండా నిజమవుతుంది!’’ అన్నాడు.

నాయకుడు కంగారుపడి, ‘‘అయితే నా ఎన్నికల ప్రసంగాలన్నీ వెంటనే రద్దు చేయించండి!’’ అన్నాడు.

‘‘ఎందుకంత భయం?’’ అని అడిగాడు జ్యోతిష్యుడు.

‘‘నిన్ననే ప్రతి ఇంటికీ పది లక్షలు ఇస్తానని ప్రకటించాను. నా ఆస్తులన్నీ అమ్మినా సరిపోవు!’’ అన్నాడు.

4. వెన్నెల రాత్రి ప్రియురాలితో రవి, ‘‘నీ కోసం ఆకాశంలోని నక్షత్రాలన్నీ తెచ్చి నీ కాళ్ల దగ్గర పోస్తాను!’’ అన్నాడు.

ప్రియురాలు నవ్వుతూ, ‘‘అంత శ్రమ వద్దు. నేను నిన్న కొన్న పట్టుచీర బిల్లు కట్టేస్తే చాలు!’’ అంది.

రవి వెంటనే, ‘‘నక్షత్రాలే మంచివి. కనీసం వాటికి ధరలు ఉండవు!’’ అన్నాడు.

5. పరీక్ష గదిలో గంటసేపైనా ఒక్క ముక్క రాయకుండా కూర్చున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగాడు.

‘‘ఏమిటి? ఒక్క సమాధానం కూడా రాయలేదే?’’

‘‘అన్నీ తెలిసిన ప్రశ్నలే వచ్చాయి సార్!’’ అన్నాడు విద్యార్థి.

‘‘మరి ఎందుకు రాయలేదు?’’

‘‘ప్రశ్నలన్నీ తెలుసు సార్! కానీ సమాధానాలే కొత్తగా కనిపిస్తున్నాయి!’’ అన్నాడు.

6. ఒక వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెళ్లి, ‘‘డాక్టర్ గారూ! నాకు మతిమరుపు చాలా ఎక్కువైంది’’ అన్నాడు.

వైద్యుడు, ‘‘ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది?’’ అని అడిగాడు.

‘‘ఏ సమస్య డాక్టర్?’’ అన్నాడు రోగి.

వైద్యుడు ఆశ్చర్యంగా, ‘‘మీ మతిమరుపు గురించే అడుగుతున్నాను!’’ అన్నాడు.

రోగి మరింత ఆశ్చర్యంగా, ‘‘నాకు మతిమరుపా? ఆ విషయం మీకు ఎవరు చెప్పారు?’’ అన్నాడు.

7. ఉద్యోగి తన అధికారితో, ‘‘నా జీతం పెంచకపోతే వెంటనే రాజీనామా చేస్తాను. ఇప్పటికే మూడు సంస్థలు నా కోసం వెతుకుతున్నాయి!’’ అన్నాడు.

అధికారి కంగారుగా, ‘‘అంత డిమాండ్ ఉందా నీకు? ఇంతకీ ఆ సంస్థలేవి?’’ అని అడిగాడు.

ఉద్యోగి ప్రశాంతంగా, ‘‘విద్యుత్ శాఖ, బ్యాంకు రుణాల విభాగం, ఇంటి అద్దె వసూలు చేసే యజమాని!’’ అన్నాడు.

8. ఇద్దరు స్నేహితులు ఖరీదైన హోటల్‌లో కడుపునిండా భోజనం చేశారు. బిల్లు రాగానే మొదటి వ్యక్తి జేబులో చేయి పెట్టబోయి ఆగిపోయాడు.

‘‘అయ్యో! నా చేతికి నొప్పిగా ఉంది. జేబులోంచి డబ్బులు తీయలేకపోతున్నాను!’’ అన్నాడు.

రెండో వ్యక్తి వెంటనే, ‘‘నువ్వెందుకు బాధపడతావు? నీ జేబులోంచి నేనే తీస్తాను!’’ అంటూ చేయి చాచాడు.

వెంటనే మొదటి వ్యక్తి, ‘‘అద్భుతం! నీ స్నేహం వల్ల నా చేతినొప్పి కూడా తగ్గిపోయింది!’’ అన్నాడు.

9. అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన దొంగ బీరువా మొత్తం వెతికినా ఒక్క రూపాయి కూడా కనిపించలేదు.

ఇంతలో నిద్రలేచిన ఇంటి యజమాని, ‘‘ఏమైనా దొరికిందా బాబూ?’’ అని ఆశగా అడిగాడు.

‘‘ఏమీ దొరకలేదు!’’ అన్నాడు దొంగ విసుగ్గా.

యజమాని నిరాశగా, ‘‘నేను నెల రోజులుగా వెతుకుతున్నాను. నువ్వైనా కనిపెడతావనుకున్నాను!’’ అన్నాడు.

దొంగ జాలిపడి జేబులోంచి వంద రూపాయలు తీసి, ‘‘ఇదిగో! ముందు ఏదైనా తిను. మళ్లీ ఇలాంటి ఇంట్లోకి రావాలంటే నాకు కూడా ధైర్యం కావాలి!’’ అన్నాడు.

10. పెళ్లి విందులో ఒక యువకుడు భోజనం చేయకుండా ప్లేటులోని వంటకాలను రకరకాల కోణాల్లో ఫొటోలు తీస్తున్నాడు.

పక్కనే ఉన్న తాతయ్య, ‘‘నాయనా! ఆకలిగా ఉందన్నావు. మరి తినకుండా ఫొటోలెందుకు?’’ అని అడిగాడు.

యువకుడు గర్వంగా, ‘‘వీటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టాలి తాతయ్యా! అందరూ చూసి మెచ్చుకోవాలి!’’ అన్నాడు.

తాతయ్య నవ్వుతూ, ‘‘అయితే నువ్వు ఫొటోలు పెట్టు. నేను భోజనం చేస్తాను. నీకు మెప్పులు, నాకు మెతుకులు!’’ అన్నాడు.


సెట్ నంబర్ – 17: Ch. ప్రతాప్ గారు

1.

వ్యక్తి: ఆరు నెలలుగా మీ జిమ్‌కు వస్తున్నాను. ఒక్క కిలో కూడా బరువు తగ్గలేదు. ఏంటండీ ఇది?

శిక్షకుడు: జిమ్‌కు వస్తే సరిపోదండీ! ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తాలి. దాని మీద కూర్చుని చాక్లెట్ మిల్క్‌షేక్ తాగితే బరువు ఎలా తగ్గుతుంది?

2.

అధికారి: నీలో ఉన్న పెద్ద బలహీనత ఏమిటి?

అభ్యర్థి: చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా గమనిస్తుంటాను సార్!

అధికారి: అది బలహీనత ఎలా అవుతుంది?

అభ్యర్థి: మీ వెనక గడియారం నాలుగు నిమిషాలు ముందుంది. ఏడో అంకె పక్కన గీత ఉంది. అన్నట్టు, మీ చొక్కాకు రెండో బొత్తాం కూడా లేదు సార్!

3.

రోగి: డాక్టర్ గారూ! వేడి కాఫీ తాగినప్పుడల్లా నా కుడి కన్ను విపరీతంగా నొప్పి పెడుతోంది.

డాక్టర్: అదేం విచిత్రం! కాఫీ ఎలా తాగుతారో ఒకసారి చూపించండి.

రోగి కాఫీ తాగి చూపించాడు.

డాక్టర్: ఓరి దేవుడా! ముందు కప్పులో ఉన్న చెంచా తీసేయండి. మీ కంటి నొప్పి అదే తగ్గిపోతుంది!

4.

భార్య: సలాడ్ తయారు చేస్తానన్నావు కదా! మరి వంటగదంతా పొగ ఎందుకు వస్తోంది?

భర్త: ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలు చలికి వణికిపోతున్నాయనిపించింది. అందుకే కాస్త వేడి చేశాను!

భార్య: వాటికి చలి తగ్గిందో లేదో తెలియదు కానీ, నీకు మాత్రం ఈ రోజు భోజనం లేదన్న సంగతి గుర్తుంచుకో!

5.

తాతయ్య: ఒరేయ్ మనవడా! ఈ కొత్త గడియారం ప్రతి గంటకూ లేచి నడవమని గోల పెడుతోంది.

మనవడు: మంచిదే కదా తాతయ్యా! అలా నడిస్తే ఆరోగ్యంగా ఉంటావు.

తాతయ్య: అంత శ్రమ మనకెందుకురా! గడియారాన్ని ఫ్యాన్‌కు కట్టేశాను. అది తిరుగుతోంది, నేను హాయిగా నిద్రపోతున్నాను!

6.

ప్రయాణికుడు: మన విమానం అరగంట నుంచి విమానాశ్రయం పైనే చక్కర్లు కొడుతోంది. ఎందుకండీ?

విమాన సిబ్బంది: పైలట్ గారి కళ్లద్దాలు ఎక్కడో పడిపోయాయట!

ప్రయాణికుడు: అయితే త్వరగా వెతికి ఇవ్వండి!

విమాన సిబ్బంది: అదే ప్రయత్నంలో ఉన్నాం సార్! కళ్లద్దాలు లేకపోతే విమానాశ్రయం ఎక్కడుందో ఆయనకు కనిపించడం లేదట!

7.

ఇంటి యజమాని: ఏవయ్యా! ఈ గోడ పడగొడితే పైకప్పుకు ప్రమాదం ఉండదని నీకు ఖచ్చితంగా తెలుసా?

మేస్త్రీ: మరో రెండు నిమిషాల్లో తెలిసిపోతుంది సార్!

యజమాని: అదెలా?

మేస్త్రీ: గోడ కూల్చాక పై అంతస్తులోని స్నానాల తొట్టి అక్కడే ఉంటే ప్రమాదం లేదు. కిందపడితే మాత్రం మనం పొరపాటు చేసినట్లే!

8.

గ్రంథాలయ అధికారి: ఏవండీ! ఇది గ్రంథాలయం. ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు.

వ్యక్తి: క్షమించండి సార్! నేను ఎవరితోనూ మాట్లాడటం లేదు.

అధికారి: మరి ఇప్పటిదాకా ఎవరితో వాదిస్తున్నారు?

వ్యక్తి: ఈ నవలలో హీరో చివరికి విలన్ అని తెలిసింది. అది నమ్మలేక పుస్తకాన్నే నిలదీస్తున్నాను!

9.

పొరుగువాడు: మీ ఇంటి ముందు గడ్డి ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతుంటుంది. అసలు నీళ్లు కూడా పోయరు కదా! రహస్యమేంటి?

యజమాని: పెద్ద రహస్యమేమీ లేదండీ! గతవారం మూడు డబ్బాల ఆకుపచ్చ రంగు కొని గడ్డికి వేసేశాను.

పొరుగువాడు: మరి గడ్డి ఎండిపోతే?

యజమాని: అప్పుడు ఇంకో డబ్బా రంగు వేస్తాను. అంతే!

10.

అధికారి: ఏవయ్యా! ప్రతిరోజూ పదకొండు గంటలకు వస్తున్నావు. తొమ్మిదికల్లా ఆఫీసులో ఉండాలని తెలియదా?

ఉద్యోగి: తెలుసు సార్! కానీ చిన్న సందేహం.

అధికారి: ఏమిటది?

ఉద్యోగి: తొమ్మిది గంటలకు ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకూ చాలా ఆసక్తిగా ఉంది సార్! కానీ ఇంతవరకూ ఆ అదృష్టం కలగలేదు!


===============================================



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page