top of page
Original.png

రంగుల రాట్నం

10 minutes ago
4 min read

రంగుల రాట్నం కథలో జాతరలో కొబ్బరికాయలు, బొమ్మలు అమ్ముకుంటున్న మంగ, వెనుక రంగుల రాట్నం

Rangula Ratnam - Telugu Emotional Stories | Penumaka Vasantha

రంగుల రాట్నం - తెలుగు భావోద్వేగ కథలు | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 27/11/2026


జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ ఆత్మగౌరవంతో నిలబడిన మంగ జీవితాన్ని, ప్రేమతో కూడిన మానవీయ ముగింపును చెప్పే హృదయస్పర్శి కథ “రంగుల రాట్నం”.


మా ఊరి జాతర చాలా బాగా చేస్తారు. ప్రతి ఏడూ తప్పకుండా వెళ్తాను. ఎంత బిజినెస్ పనులతో బిజీగా ఉన్నా అక్కడికి వెళితే... ఎంతో రిలీఫ్. 


మా ఊరి కొండమీద అమ్మవారి గుడి ఉంటుంది. కొండ మెట్లంతా బంతిపూల దండలతో అలంకరించారు. 


ఒక్కో మెట్టుకు దణ్ణం పెట్టుకుని వెళ్తుంటే... "కొబ్బరికాయలు తీసుకోండి బాబూ" అన్న మాటకు వెనక్కి చూశాను. ఈ గొంతు బాగా పరిచయమున్న గొంతు. అది మంగది. మంగ కొబ్బరికాయల ప్యాకెట్ అందిస్తూ అంటున్నది.


ఒక మెట్టు దిగి వచ్చి, "మంగా! నువ్వేంటి ఇక్కడా?" అన్నాను ఆశ్చర్యపోతూ. "మరి ఏడ ఉంటాను ఈడ కాకపోతే...?" నవ్వుతూ అంది.


"సరే కానీ, నీకు పెళ్లయి వెళ్లిపోయావు కదా! ఇక్కడ ఏంటి?" మళ్లీ అడిగాను.


"ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ, ముందు గుడిలోకి పోయిరా. ఇదిగో ఈ ప్యాకెట్ తీసుకెళ్లు..!" కొబ్బరికాయ, పసుపు కుంకుమ, అగరొత్తులు, కర్పూరం ఉన్న ప్యాకెట్ ఇచ్చింది.


అవి తీసుకుని గుడిలోకి వెళ్లి అర్చన చేయిస్తూ ఆ అమ్మకు దణ్ణం పెట్టుకున్నా. 'నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూడు. మా ఊరి దేవతవు నువ్వు. 

మా ఊరిని కూడా నువ్వే కాపాడు తల్లీ!' అనుకుని ఒక నిమిషం కళ్లు మూసుకున్నా. కానీ మళ్లీ మంగ వచ్చింది ఆలోచనలోకి.


'హారతి తీసుకోండి' అన్న పూజారి మాటకు కళ్లు తెరిచి ఆ తల్లి అంకాలమ్మ తల్లిని చూస్తూ, 'బాగా బతికిన మంగ ఎందుకు కొబ్బరికాయలు అమ్మే స్థితికి వచ్చిందో తెలియదు అమ్మా. నువ్వే మంగను చల్లగా చూడు!' అనుకున్నాను.


గుడిలో ఎక్కువ సేపు కూర్చోకుండా, ఎవరో 'ప్రసాదు' అని పిలుస్తున్నా పట్టించుకోకుండా కొండ దిగాను. మంగ కొబ్బరికాయల ప్యాకెట్ ఇస్తూ బిజీగా ఉంది. 


నేను మంగ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వబోయాను. "వద్దు ప్రసాదు. నీ దగ్గర తీసుకుంటే... బాగోదు. ఈసారికి ఇట్లా కానివ్వు. మళ్లీ వచ్చే జాతరకు నేను బతికుంటే... ఇక్కడే కొబ్బరికాయలు అమ్ముతుంటే... అప్పుడు ఇద్దువులే..!" అంటూ నవ్వింది. పక్కన రెండేళ్ల పిల్లాడిని ఆడిస్తూ అమ్ముతూ ఉంది.


సాయంత్రం కొండ కింద తిరునాళ్లు జరుగుతాయి. అందరూ అక్కడకు వస్తారు. కొండ మీద గుడి లైటింగులో మెరుస్తూ ఉంది. ఒక పక్క పిల్లలు తిరిగే రంగుల రాట్నం, అన్ని రకాల వస్తువుల దుకాణాలు చూస్తూ ముందుకు నడిచాను. 


ఒక బొమ్మల దుకాణం దగ్గర ఆగాను. అక్కడ మళ్లీ మంగ బొమ్మలు అమ్ముతూ ఉంది.


"మంగా, నీతో మాట్లాడాలి" అన్నాను.


"ఏం మాట్లాడతావు ప్రసాదు? ఈ మంగ ఏంది మళ్లీ ఈడ ఉందని ఆశ్చర్యపోతున్నావా? తప్పదు, బతకాలంటే ఏదో ఒకటి చేయాలి."


"అదికాదు మంగా! నీకు బాగా ఉన్నవాళ్లకు ఇచ్చి పెళ్లి చేశాడు మీ నాన్న! మరి నువ్వెందుకు ఇలా బొమ్మలు అమ్ముతున్నావు?"


"ప్రసాదు, జీవితం రంగుల రాట్నం లాంటిది. నన్ను మా నాన్న ఫస్ట్ ఈ రంగుల రాట్నం ఎక్కించి పై డబ్బాలో ఉండాలని అప్పు చేసి మరీ పెళ్లి చేశాడు. 


కానీ మా ఆయన తాగుడు వల్ల మొత్తం ఆస్తి పోయింది. ఇదిగో వీడు కడుపుతో ఉన్నప్పుడు అప్పుల వాళ్ల బాధ తట్టుకోలేక మా ఆయన పురుగు మందు తాగాడు. 


మా నాన్న నా దిగులుతో మంచం ఎక్కాడు. అప్పుడు ఆయన ఎక్కిన డబ్బాలో నుండి వచ్చి కిందకు పడ్డాను. 


అప్పుడు అనిపించింది, జీవితం కూడా రంగుల రాట్నం లాంటిది. అందుకే ఒక్కోసారి పైకి పోతాం, మళ్లీ కిందకు వస్తాం. 


నేను మళ్లీ పైకి ఎక్కాలని చూస్తున్నా. ఇప్పుడు నాన్న చేసిన అప్పులు తీర్చటానికి, వాళ్లను పోషించడానికి ఇదిగో ఈ పనులు చేస్తున్నా. 


కానీ ఎవరి కడుపు కొట్టకుండా సంపాదిస్తున్నా. ఈ తిరునాళ్లప్పుడు ఇవి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి. 


నా సంగతి సరే కానీ, పెళ్లి అయిందా ప్రసాదు?"


"లేదు మంగా!"


"ఇంకా అవ్వలేదా? అదేం? మన క్లాస్‌మేట్స్ అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. 

తొందరగా చేసుకో పెళ్లి. అసలే సగం జుట్టు పోయింది. ఆ కాస్త పోయే లోపల చేసుకో. పోనీలే, ఈ జాతర వల్ల నిన్ను చూశాను. సరే ఉంటా ప్రసాదు" అంటూ నవ్వింది. 


ఆ నవ్వులో ఒక రకమైన బాధ కనిపించింది. ఇక మంగను ఆ స్థితిలో చూడలేక అక్కడి నుండి కదిలాను. మంగ ఎంతో చక్కగా ఉండేది. నేను తనతో కలిసి పది వరకు చదివాను. నేను ఇంటర్‌కు పట్నం వెళ్లాను. 


తర్వాత మంగకు పక్కూరి పెద్ద రైతుతో పెళ్లి జరిగిందని అమ్మ చెప్పింది. అప్పుడు అయ్యో మంగను మిస్ చేసుకున్నా అనే బాధ కలిగింది. 


డిగ్రీ అయి ఒక ప్రభుత్వ సంస్థలో నాకు ఉద్యోగం రావటం జరిగింది. అమ్మానాన్న పెద్దవాళ్లు అవటంతో పట్నంకి తీసుకుపోయాను. నాన్న పోయారు. ఇక అమ్మ నా దగ్గరే ఉంది.


ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మతో చెప్పాను మంగను చూశానని. అమ్మ ఆత్రంగా అడిగింది, "ఎట్లా ఉంది మంగ?"


చెప్పాను సంగతి. 


"వాళ్ల నాన్నకు బుద్ధి లేదు. మంచి పిల్లను తీసుకెళ్లి ఉన్నవాళ్లని ఇచ్చి గొంతు కోశాడు. పెళ్లి అయ్యాక తెలిసింది వాళ్లకు ఊరంతా అప్పులు అని."


"వాళ్ల ఆయన పోయాడు అమ్మా! చిన్న పిల్లాడిని దగ్గర పెట్టుకుని కొబ్బరికాయలు అమ్ముతుంది. ఆ అమ్మోరు కూడా మంగ మీద దయ చూపలేదమ్మా."


"అయ్యో పాపం! ఎన్ని కష్టాలు పడుతుంది. సరే గానీ, నిన్న ఆ సంబంధం వాళ్లు ఫోన్ చేశారు. వాళ్లకు నువ్వు నచ్చలేదట. విల్లా, కారు ఉంటేనే పిల్లని ఇస్తారట!"


"పోనీ అమ్మా. ఇక నేను పెళ్లి చేసుకోను. ఇక చూడబాకు. ముప్పై దాటాయి. ఈ బట్టతల వల్ల ఇంకా పెద్దగా ఉన్నాను. నన్నెవరు చేసుకుంటారు అమ్మా!"


"అయ్యో అదేంటిరా? నేను పోతే నిన్నెవరు చూస్తారు?" అంటూ అమ్మ బాధపడింది.


@@@@@


సంవత్సరం గిర్రున తిరిగింది. మళ్లీ ఊరి జాతరకు వెళ్తుంటే... అమ్మ "నేను కూడా వస్తాను" అంది. 


అమ్మ, నేను ఇద్దరం కొండ మెట్లు ఎక్కటం మొదలెట్టాం. అమ్మ "నేను చిన్నగా ఎక్కుతాను. నువ్వు వెళ్లు" అంది.


నేను గుడి మెట్ల మీద మంగ కోసం చూశాను. మంగ లేదు. పక్కనున్న వారిని అడిగాను. మంగ కొండ పైన కొబ్బరికాయలు అమ్ముతుంది అని చెప్పారు. అమ్మను తీసుకుని చిన్నగా కొండ ఎక్కాను.


కొండ పైన కొబ్బరికాయలు అమ్ముతూ కనపడింది మంగ. నన్ను, అమ్మను చూసి పలకరించి కొబ్బరికాయల ప్యాకెట్ ఇచ్చింది. 


"మంగా, కొంచెం ఇప్పుడే వద్దువు గాని నాతో రావా?" అన్నాను. 


పక్క వాళ్లకు చెప్పి కొడుకుని కూర్చోబెట్టి నాతో కలిసి గుడిలోకి వచ్చింది. ముగ్గురం వెళ్లి దర్శనం చేసుకుంటున్న సమయంలో నేను మంగ మెడలో తాళి కట్టాను.


"అదేంటి ప్రసాద్ ఇట్లా చేశావు?" అంటున్న మంగను పూజారి వచ్చి, "మంచి పనే చేశాడు తల్లీ. ఈ అమ్మోరి తల్లి దగ్గరి పసుపు తాడు నీకు కట్టాడు. ఇప్పుడు నీ మాంగల్యాన్ని అమ్మోరు కాపాడుతుంది. ఇద్దరూ కలకాలం కలిసి కాపురం చేయండి" అంటూ ఆశీర్వదించాడు. 


ఇద్దరం కలిసి గుడి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేశాం. తర్వాత అమ్మ కాళ్లకు నమస్కరించాము.


"మంచి పని చేశావురా! ఆ అమ్మే నీకు ఇలా బుద్ధి పుట్టించిందేమో. ఆ తల్లిని నమ్ముకున్నందుకు నీకు ఇట్లా దారి చూపింది. ఏమ్మా మంగా, నీకు ఇష్టమేగా?" అంటున్న అమ్మతో, "అత్తా! దేవుడు వరమిస్తే ఎవరు కాదంటారు?" అంటూ మంగ నా కాళ్లకు దణ్ణం పెట్టింది. 


ఒక మంచి పనికి ఈ అమ్మోరి జాతర సాక్షిగా నిలిచినందుకు ఆ తల్లికి మనసులో దణ్ణం పెట్టుకుని మంగను, అమ్మను తీసుకుని సంతోషంగా ముందుకు కదిలాను.


***









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page