వేషం మార్చెను.. అయినా..
- Penumaka Vasantha

- 3 hours ago
- 3 min read
#పెనుమాకవసంత, #PenumakaVasantha, #VeshamMarchenuAyina, #వేషంమార్చెనుఅయినా, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Vesham Marchenu Ayina - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 12/12/2025
వేషం మార్చెను.. అయినా.. - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
రాత్రి పదవుతుంది. ఒక ముసలాయన ఒక ఆడ మనిషి సాయంతో
కర్ర పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చాడు. ఆయన నలిగి
మురికిగా ఉన్న పంచె.. చింపిరి జుట్టు మూతికి మాస్క్ తో వున్నాడు.
అక్కడి స్టాఫ్ను "తనకు జలుబు, దగ్గు ఉన్నాయి, ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి?"
అని ఎంతో ఆందోళనగా అడిగాడు.
"కొంతమంది అదిగో ఆ పైకి పో ఆడ చేస్తారని..! కాస్త మర్యాదగా మాట్లాడారు.
మరికొందరు "ఏ ముసలాయనా..! రేపు పొద్దున అన్ని సెక్షన్స్ తెరిచి ఉంటాయి. రేపు పొద్దున
రాపో.. ! ఏడ నుండో వత్తారు..!" అని విసుక్కున్నారు.
పక్కనున్నామే "అయ్యా నిద్ర పట్టటంలేదు మా తాత. ఈ రాత్రి నిద్రపోడు? జలుబు, దగ్గు చూసే డాక్టర్ యాడో చూపించు..!"అని వేడుకుంది.
మనసులో "రేపు ఉంటదిలే మీకు..!" అని లోపల నవ్వుకుంది
అదిగో అక్కడ కనపడేది ల్యాబ్. ఇపుడు టెస్టులు చేయాలన్న ఎవరు వుండరు? రేపు పొద్దున రాపో తల్లి..! అర్ధరాత్రి ఎవరు చూస్తారు." అని విసుక్కున్నారు.
కట్ చేస్తే.. పొద్దున ఎవరైతే.. విసుక్కున్నారో వాళ్ళకి మెమోలు వెళ్ళాయి.
అందరికీ మీటింగ్ లు పెట్టారు. ఈలోపు ఒక సిస్టర్ అందరికీ వచ్చి
ఇక వీడియో చూపించింది. రాత్రి ఒక ముసలాయన వచ్చాడు
ఒక అమ్మాయిని తీసుకుని. ఆయన ఎవరో కాదు గవర్నమెంట్ హాస్పిటల్
సూపర్నిడెంట్ యశస్వి గారు..!
స్టాఫ్ కు "చూడండి..!" అని చూపించింది.
మారువేషము లో గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్నిడెంట్ తనిఖీ అన్న
స్క్రోలింగ్ చూసి అందరూ అలెర్ట్ అయ్యారు.
నేను రాత్రి ఆయనతో మర్యాదగా మాట్లాడా.
అని ఒక నర్సు ఊపిరి పీల్చుకుంటే.. ఇంకో
నర్స్, నేను విసుక్కున్నా.
అసలే మన సార్ పనిలో హిట్లర్ లాంటి
వాడని బాధ పడింది.
ఇంతకీ ఎవరా? సూపర్నిడెంట్.
డాక్టరు యశస్వీగారు.
ఆయన వచ్చి ఒక ఏడాదిలో హాస్పిటల్లో
బయట గేట్ బాగు చేయటం,
చెట్లు నాటడంతో పాటు అన్ని
విభాగాలను మంచిగా
చేసి తనదైన ముద్ర వేశారు
అంతా బాగుంది ఇపుడు హాస్పిటల్
అని ప్రశంసిస్తున్నారు
కానీ కొన్ని పత్రికలు రాత్రుల పూట
హాస్పిటల్లో పెద్దగా రోగులను పట్టించుకుని
వైనం, కుక్కల విహారం లాంటి వార్తలు
చూసి పని రాక్షసుడు యశస్వి కొంచం బాధపడి
అప్పటికపుడు తీసుకున్న నిర్ణయం
ఈ మారువేషం.
నాకు ఇది చదవగానే..
రాజులు పాలించే రోజుల్లో రాజ్యంలో
ప్రజల బాగోగులు తెలియడానికి
రాజు, మంత్రి మారువేషాల్లో తిరిగిన
కథలు కళ్ల ముందు మెదిలాయి.
మరి హాస్పిటల్ కు ఆయన రాజే కదా?"
మొత్తానికి రాత్రి పూట కూడా
స్టాఫ్ ను వణికించిన మన డాక్టర్ యశస్వి
కి అభినందనలు. ఇక్కడ ఆయనకు పేరు వచ్చి
అంతా బానే ఉంది.
ఇపుడు మొదలైనది అసలు కథ.
ఒక ముసలాయన బాగా మురికి
పట్టిన బట్టలతో హాస్పిటల్ కు వచ్చాడు.
ఇపుడు అందరూ అతనికి రాచ
మర్యాదలు చేసారు. ఒక్క ఎత్తుకోవడం
తప్పా అన్ని చేసారు.
ఆ ముసలాయన నవ్వుకుని
చంకలో వున్న పేపర్ ను తీసి క్లిప్పింగ్
చూసుకుని "మీ వల్ల నన్నిపుడు అందరూ
బాగా చూత్తన్నారు సార్..!మీరు సల్లగా వుండాలా!
మీరు కొన్నాళ్ళ పాటు ఈ హాస్పిటలోనే
డ్యూటీ చేయాలా? దండాలు..! మీకు"
డాక్టర్ యశస్వికి పెట్టుకున్నాడు
ఇక రాత్రి పూట ముసలోళ్ళు, పేదవారు,
వికలాంగులు, అందరూ బాగా
పట్టించుకుంటున్నారని క్యూకట్టారు.
హాస్పిటల్లో స్టాఫ్..! వాళ్ళకు
వంగి వంగి దండాలు పెడుతున్నారు.
కొంచం విసుక్కున్నా వారి జుట్టు
చూడటం, మాస్క్ తీసి చూసి
వచ్చింది సూపర్నిడెంట్ కాదు కదా
అని తనిఖీ చేసి శ్రద్ధగా చూసి పంపుతున్నారు.
జనాలు మహా ముదురులు కదా.
మాస్క్ పెట్టుకుని వస్తున్నారు..
మాస్క్ తీయమంటే..
మేము తీయమని చెప్పి
హుందాగా సేవలు చేయించుకుంటున్నారు.
ఇపుడు రాత్రి పూట పేషెంట్లు
ఎక్కువయ్యారు. ఏ మనిషిలో
సార్ మారు వేషంలో వుంటారోనని.
రాత్రి పూట బాగా చూస్తున్నారు.
ఉదయం పేషంట్స్ లేకపోవటంతో
మా హాస్పిటల్ ఇరవై నాల్గు గంటలు
అందుబాటులో మీకు సేవలు చేయటానికి ఉంది.
దయచేసి ఉదయం కూడా
మీకు మా సేవలు కొనసాగిస్తాము
మాకు సహకరించండి అని
హాస్పిటల్ నిర్వాహకులు
బోర్డ్ పెట్టిన తర్వాత జనాలు
రాత్రి రావటం ఆగారు.
స్టాఫ్ ఊపిరి పీల్చుకున్నారు.
యశస్వి అందరిని పిలిచి "మీ
నిర్లక్యం వల్ల ఇలా జరిగింది.
నా సంగతి తెలుసుగా? రాత్రి
లేదు పగలు లేదు. ఎపుడు
ఎక్కడ ఎలా ఏ అవతారం ఎత్తుతానో
నాకే తెలియదు? బి కేర్ ఫుల్..!" అని వార్నింగ్
తో అప్పటికి ఆ గోల సర్దుబాటు అయింది.
ఇది చూసి కొంతమంది
ఆయన దగ్గరకు వచ్చి ఇంకొన్ని
విభాగాల్లో మమ్మల్ని పట్టించుకోవటం
లేదంటే.. మళ్ళీ ఈసారి ముసలి వేషం
కాకుండా నడి వయస్కుడు వేషం వేసాడు
డాక్టర్ యశస్వి.
అపుడు దశావతారాలు వున్నట్లుగా
మన డాక్టర్ యశస్వి ఇంకా ఎన్ని వేషాలు
మార్చునో కదా?
అన్నట్లు ఈసారి ఆయన వేషం
గూర్చి హాస్పిటల్లో నీ వర్గాలతో పాటు
సామాన్య జనాల్లో కూడా చర్చ మొదలైంది.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.




Comments