జి హెచ్ లో డి
- Penumaka Vasantha

- 38 minutes ago
- 3 min read
#పెనుమాకవసంత, #PenumakaVasantha, #GHLoDi, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

బంగారంలో హెచ్చు తగ్గుల జబ్బు
G H Lo Di - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 27/12/2025
జి హెచ్ లో డి - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
"మా ఆవిడను చూడండి.. డాక్టర్ ఎలా ఉందో?" ఎంతో ఆవేదనతో అడిగాడు సుబ్బు నాయన.
"ఏమైంది?" చాలా కూల్ గా అడిగాడు డాక్టర్ మహా ముదురు.
"ఒక ఆరు నెలల నుండి మా వైఫుకు బిపి తగ్గుతూ, పెరుగుతూ వస్తుంది" అన్నపుడు వాళ్ళ ఆవిడ మొహంలో
కాసేపు సంతోషం కాసేపు దుఃఖం కనిపించాయి డాక్టరుకు.
'అబ్బో, మస్తు షేడులున్నాయిగా? ఈమెలో’ అనుకున్నాడు డాక్టర్.
"ఏం చేయాలి డాక్టర్.. !? దీనికి పరిహారమే లేదా?"
మొహంలో ఎన్నో ఎఫెక్ట్స్ చూపుతూ అన్నాడు
సుబ్బు నాయన!
"ఉంది.. ! తప్పకుండా మీ ఆవిడ జి హెచ్ లో డి
పోగొడతాను. మీ ఆవిడ లాంటి జబ్బున్న వాళ్ళని చూడు.. !" అంటూ హాల్లో కూచున్న లేడీస్ను చూపించాడు.
“వీళ్లందరూ.. ! అని నోరెళ్ళబెట్టిన సుబ్బు
నాయనతో "వాళ్లందరూ ఈ గోల్డ్ బాధితులే. బంగారం పెరిగినపుడు హై బిపిలో, తగ్గినపుడు లో బిపిలో వుంటారు.
దీనికి నివారణ మందులకన్నా డబ్బా ఫోన్ బెస్ట్.. ! ఇలాంటి మొండి కేసుల్ని డీల్ చేస్తేనే.. నాకు మహా ముదురు
అనే బిరుదు ఇచ్చారు జనాలు” అన్నాడు.
"అసలు పేరు మీది.. !"అంటూ వినయంగా అడిగాడు సుబ్బు.
"పిచ్చయ్య.. !" అన్నాడు డాక్టర్.
"దానికన్నా డాక్టర్ గారు, ఈ పేరు చాలా బాగుంది. "
"థాంక్స్.. ! యూ ట్యూబ్ చూస్తుందా మీ ఆవిడ. "
"ఎపుడు దానిలోనే ఉంటుంది సార్.. !"
"అయితే వైఫై కట్ చేయించు. లేదా నంబర్లూ నొక్కే చిన్న
డబ్బా ఫోన్ కొనివ్వు.. !” అన్నాడు మహా ముదురు. ఎందుకంటే.. ఈయన కూడా గోల్డ్ బాధితుడే కాబట్టి.
"కానీ మా ఆవిడ వైఫై తీస్తే.. గోల చేస్తది డాక్టర్.. !"
అయితే.. హిప్నాటిజంతో ఆవిడలోని జి హెచ్ లో డి జబ్బు పోగొడతాను. "
ఏదోకటి చేసి మా ఆవిడ జీ హెచ్ లో డీ తగ్గించండి డాక్టర్!"
"కనకం గారు.. ! ఇటు చూడండి.. !" అంటూ ఒక లాకెట్ చైన్ ఆమె దగ్గర గిరగిరా తిప్పుతూ అన్నాడు మహా ముదురు.
కనకం ఆ చైన్ వైపు ఆత్రంగా చూస్తూ "ఇది గోల్డ్ ఏనా? ఎపుడు, ఎక్కడ ఎంతకీ కొన్నారు. " అని ఆవేశ పడుతూ
అడిగింది.
‘గోల్డ్ పిచ్చి హై పీక్సులో ఉంది ఈమెకు.’ లోపల అనుకున్నాడు.
"కూల్ కనకం గారు.. ! కూల్.”
పక్కనున్న సుబ్బు నాయన.. !
"ఇషు.. ఇష్యూ.. !" అంటూ భార్యను ఊరుకోబెట్టాడు.
"మీకు గోల్డ్ అంటే.. ఇపుడు ఇష్టం పోయింది. మీరు గోల్డ్ అంటే.. అసహ్యం. అసలు గోల్డ్ కొన్న వాళ్ళు మీకు పాపాత్ములగా అనిపిస్తున్నారు.” ఆమె మైండ్ లో గోల్డ్ పట్ల అయిష్టత వచ్చేట్లు చేసాడు మహా ముదురు.
తర్వాత తన మెళ్ళో చైన్ చూపిస్తూ.. !”ఏమ్మా.. ఎలా ఉంది?” అన్నాడు డాక్టర్.. !
వెంటనే కనకం "డాక్టర్.. ! మీమెళ్ళో ఏంటి గోల్డ్ చైన్ చెండాలంగా. మీరు పాపాత్ములాగా కనిపిస్తున్నారు
నాకు. "
నా హిప్నాటిజం పని చేసిందని ఆనంద పడుతూ టివి ఆన్ చేశాడు డాక్టర్. బంగారంలోని హెచ్చుతగ్గుదలకు
ఇద్దరు మహిళలకు పిచ్చి ఎక్కిన వైనం అన్న వార్త వింటూనే.. టీవీ మీదకు పేపర్ వెయిట్ విసర బోతున్న భార్య చేతిలోని దాన్నిలాక్కుని మందలిస్తున్న సుబ్బును
డాక్టర్ వారించాడు సంతోషంగా.
తర్వాత తన మెళ్ళో ని గోల్డ్ చైన్ తీసి సుబ్బు మీద విసిరేసింది.
అది పాకెట్ లో వేసుకుంటూ.. "సార్ మీరు నా పాలిట
బ్రహ్మంగారే.. సర్.. !" అంటూ ఆయనకు నమస్కరించి
బయటకు కదిలాడు సుబ్బునాయన.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.




Comments