top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 65

Aug 12
6 min read

Updated: Aug 22


Kacha and Sanyati facing each other in a fierce Deva-Asura battlefield duel

Kachadevayani - Part 65- Telugu Mythological Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 65 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 12/08/2026


కచ దేవయాని – 65 భాగంలో కథ కీలకమైన మలుపుకు చేరుకుంటుంది. దేవతలు యుద్ధానికి సిద్ధం కావడంతో దేవాసుర సంగ్రామం ప్రారంభమవుతుంది. గురువుగారు శుక్రాచార్యులు లేకపోవడం దానవులకు ఆందోళన కలిగించినప్పటికీ, అరుణకేశి మహర్షి సహాయం అందిస్తానని చెప్పడంతో యయాతి సైన్యంలో ధైర్యం పెరుగుతుంది. పాతాళలోకం నుంచి మయాచార్యుడు, పుష్కర ద్వీపం నుంచి వీతిహోత్రుడు కూడా యుద్ధానికి చేరుకుంటారు. మొదటి రోజు యుద్ధంలో కచుడు–సంయాతి, యయాతి–ప్రభాసుడు, నహుషుడు–విశ్వావసు మధ్య భీకర పోరాటాలు జరుగుతాయి. తండ్రి నహుషుడిని రక్షించేందుకు యయాతి రంగంలోకి దిగడం, ఆ సమయంలో అతని మనసులో చారుమతి జ్ఞాపకం మెదలడం ఈ భాగానికి మరింత భావోద్వేగాన్ని జోడిస్తుంది.





జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని. తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది. వృషపర్వుడు, నహుషుడు, యయాతి సమావేశమవుతారు. శుక్రాచార్యుడు కూతురితో కలిసి ఆరావళీ పర్వత ప్రాంతంలోని ఆశ్రమానికి వెళ్తాడు. దానవులకు  బంధీ అయిన కచుడ్ని విడిపిస్తాడు యయాతి. దేవదానవ యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


“గురువు లేకుండా మొదలైన దేవాసుర సంగ్రామం… తొలి రోజే రణరంగాన్ని రక్తికట్టించిన భీకర పోరాటం! కచుడు, యయాతి, నహుషుల్ని ఎదుర్కొన్న దేవవీరులెవరు? చివరికి ఎవరు పైచేయి సాధించారు?” 


టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 65వ భాగంలో వినండి. 


యయాతి కోసం ఎదురు చూస్తున్నారందరు. 

అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. 

"యుద్ధం వస్తోంది!మన బలాబలాలను సమీక్షించుకొని ముందుకు వెళదాము!"అని నహుషుడు తీర్మానించాడు. 


" గురువుగారు లేకుండా యుద్ధానికి వెళ్ళటం మనకు అంత శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం!ఇంత వరకు ఆయన మన వెనుక ఉన్నారు కాబట్టి గెలుపును సాధిస్తూ వచ్చాము!ఇప్పుడు.... "ఆగిపోయాడు వృషపర్వుడు. 


దానవ ప్రముఖులందరూ యయాతి వైపు చూస్తున్నారు. 


"మన దగ్గర మృతసంజీవని విద్య లేదని మీ భయం! అవునా! ఇప్పుడు ఆ విద్య అరుణకేశి మహర్షి దగ్గర కూడా ఉంది. ఆయన మనకు సహాయం చేస్తానన్నారు. "అన్నాడు యయాతి. 


అరుణకేశి మహర్షి పేరు వినగానే దీర్ఘదర్శి తల దించుకొన్నాడు. ఆనాడు అగ్నిదత్తుడిని సంహరించిన వాడు దీర్ఘదర్శి. 


"కానీ! నేడు దేవబలం పెరిగింది. కుమారా! గురువుగారి గురించి మాకు బాగా తెలుసు. ఆయన కరుణామయుడు. ఇంత కష్టం వచ్చినప్పుడు ఆయనకు తెలియపరచకుండా, ఆయన ఆశీస్సులు తీసుకోకుండా యుద్ధానికి వెళ్ళటం అంత మంచిది కాదు! గురుకృప ఉంటే చాలు ప్రపంచాన్ని జయించగలము! ఆలోచించండి!" యయాతిని అభ్యర్థించాడు వృషపర్వుడు. 


"నాకు గురువుగారి మీద ద్వేషం లేదు మహారాజా! మీరు దూతలతో యుద్ధం గురించిన సమాచారాన్ని ఆయనకు పంపించండి. ఈ లోపల మేము చేయాల్సిన ఏర్పాట్లను చేస్తుంటాము!" అన్నాడు యయాతి. 


ప్రాణం లేచి వచ్చింది వృషపర్వునికి. 


"అయితే ఈ రాత్రికే గురువుగారి దగ్గరికి వెళ్తాను! నేను పిలిస్తే తప్పకుండా వస్తారు!"

అంటూ కొద్ది మంది సహచరులతో అప్పుడే అతి వేగంగా పరిగెత్తే గుర్రాలు తోలే రథాన్ని ఎక్కి వృషపర్వుడు ఆరావళీ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. 


యాయాతి తన సైన్యాధికారులను సమావేశపరిచాడు. 

తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. 


"నాన్నగారూ! మనకు ఇంకా ఎవరైనా సహాయం చేస్తారేమో చూద్దాం!... ముందు మన సామంత రాజులకు కబురు చేద్దాము!" అన్నాడు. 


"సమయం తక్కువ ఉంది కుమారా! త్వరగా దూతలను పంపించు!" అని ఆదేశించాడు నహుషుడు. 


యయాతి శక్తిధరుడిని పిలిచి 

"నువ్వు పుష్కర ద్వీపానికి వెళ్లి వీతిహోత్ర చక్రవర్తికి విషయం చెప్పి వారిని ఇక్కడికి తీసుకొని రావాలి! నేను ఉత్తరాన్ని వ్రాసిస్తాను!" అని కార్యోన్ముఖుడైనాడు. 


యయాతి చురుకుదనం చూసి దానవుల్లో ఉత్సాహం వచ్చింది. అరుణకేశి మహర్షి సహకారం వారిలో ధైర్యాన్ని నింపింది. 


పాతాళ లోకం నుండి మయాచార్యుడు వచ్చాడు. ఇక్కడి ఏర్పాట్లను చూస్తున్నాడు. 

పాతాళలోక వాసులు కూడా యుద్ధానికి సిద్ధమై సైన్యాలను దానవ రాజ్యానికి తీసుకొని వస్తున్నారు. 


ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కూడా శర్మిష్ఠా యయాతీలకు తీరిక దొరకటం లేదు. 

రాజ్యానికి వచ్చి చేరుతున్న మిత్ర సేనలకు ఏర్పాట్లు చూసుకుంటోంది శర్మిష్ఠ పరివారం. 


యయాతి అందరితో మాట్లాడుతూ యుద్ధ వ్యూహాలను రచిస్తున్నాడు. 


ఆరావళీ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు వృషపర్వుడు. 

అక్కడ ఉన్న ఆశ్రమ వాసులు దానవరాజుకు మర్యాదలు చేశారు. 


"గురువుగారితో మాట్లాడాలి! ఆయన ఎక్కడున్నారు?" అని వాళ్ళను అడిగాడు వృషపర్వుడు. 


"గురువుగారు మౌనవ్రతంలో ఉన్నారు మహారాజా! ఆయన లేచి వచ్చేదాకా మీరు ఇక్కడే ఉంటారా? లేక ముఖ్యమైన విషయం అయితే ఆయన వ్రతం సమాప్తం అయ్యాక మేమే చెప్తాము!" అన్నారు ఆశ్రమ వాసులు. 


"అలా అయితే గురుపుత్రిక దేవయానితో విషయం చెప్తాను!" అన్నాడు వృషపర్వుడు. 


"గురువుగారు గురుపుత్రికను వారి తండ్రి గారింటికి పంపించారు. "


నిరాశపడ్డాడు వృషపర్వుడు. 


గురువుగారు మౌనవ్రతంలో కూర్చుంటే ఎప్పటికి కళ్ళు తెరుస్తారో తెలియదు... ఏమిటి చెయ్యటం?


"సరే!గురువుగారు కళ్ళు తెరిచాక నేను వచ్చి వెళ్ళానని చెప్పండి! దేవతలు యుద్దానికి వస్తున్నారని చెప్పండి! గురువుగారి సహాయం కోసం వచ్చానని చెప్పండి!" అని ఆశ్రమవాసులకు చెప్పి వెను తిరిగి రాజ్యానికి వచ్చాడు వృషపర్వుడు. 


అతి వేగంగా యుద్దసన్నద్ధాలు జరుగుతున్నాయి. 


వీతిహోత్రుడు కుమారులతో సహా వచ్చి యయాతికి బాసటగా నిలిచాడు. యయాతి తమ్ముళ్లయిన సంయాతి, ప్రయాతిలు కూడా చేరుకున్నారు. 


అమరావతి నుండి దేవసైన్యం కదిలి వచ్చింది. 


మొదటి రోజు యుద్ధం మొదలైంది. 

కచుడు శంఖాన్ని పూరించాడు. 

ఇటువైపు సంయాతి ముందుగా శంఖాన్ని పూరించి రథంతో కచుడి వైపుకు దూసుకొని వచ్చాడు.  కచుడు బాణాన్ని సంధించే లోపల సంయాతి నాలుగు బాణాలతో కచుడి సారథిని కొట్టి, అతడి ధ్వజాన్ని ముక్కలు చేశాడు. కచుడు ఊరుకోలేదు. వెంటనే తను కూడా పదునైన బాణాలను సంయాతి రొమ్ముకు బలంగా తగిలేట్లు వేశాడు. 


ఒక చేత్తో బాణాలను పెరికి వేసి వరుస పెట్టి పది బాణాలతో కచుడిని చికాకు పెట్టాడు సంయాతి. 


మరొక వైపు అష్టవసువుల్లో ఆఖరివాడైన ప్రభాసుడితో యుద్ధం చేస్తున్నాడు యయాతి. ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకొని పౌరుషంగా చెలరేగుతున్నారు. 


ఇంకొక వైపు త్వష్టను నిలవరిస్తున్నాడు వృషపర్వుడు. 


బృందారకుడు, సోమకీర్తి దేవసైన్యాన్ని నూర్చుతున్నారు. 


తన గదను తిప్పుతూ విశ్వావసుతో తలపడ్డాడు నహుషుడు. 

ఇద్దరూ భీకరంగా గదా యుద్ధం చేస్తున్నారు. 

ఎవరూ తగ్గటం లేదు. చివరకు నహుషుడు విశ్వావసు భుజం మీద బలంగా కొట్టాడు. 

ఒక్కసారిగా కిందపడ్డాడు విశ్వావసు. 


జయజయ ధ్వానాలు చేశారు దానవులు. 

మళ్ళీ నహుషుడు ఎగిరి విశ్వావసు మీదకు దూకబోతుండగా సారంగ దేవుడు అతి వేగంగా వచ్చి నహుషుడిని ఎదుర్కొన్నాడు. 


గాయంపడిన విశ్వావసును అతడి సారథి రథంలోకి ఎక్కించుకొని వెంటనే గుడారానికి తీసికెళ్లాడు. 

నహుషుడికి సారంగ దేవుడికి యుద్ధం జరుగుతోంది. 


సారంగదేవుడు బల్లెంతో నహుషుడి భుజాన్ని కొట్టాడు. భుజం పట్టుకొని ఒక నిమిషం నిలబడ్డాడు నహుషుడు. 


'ఆ సమయం చాలనుకొంటూ 'సారంగ దేవుడు కత్తి దూసి నహుషుడి వైపు వస్తుంటే మధ్యలోనే అడ్డుతగిలాడు యాయాతి. 


తను కూడా కత్తి దూసి సారంగదేవుడి కవచాన్ని చీల్చి గాయపరిచాడు. కళ్ళు భైర్లు కమ్మాయి సారంగదేవుడికి. 


మరొక మారు సారంగ దేవుడిపైన కత్తి దూసిన యయాతి మనసులో చారుమతి మెదిలింది. 


సారంగ దేవుడిని వదిలేసి తండ్రిని రథాన్నెక్కించి గుడారానికి పంపించి అష్టవసువులతో పోరాడటానికి వెళ్ళాడు యయాతి. 


ఇలా మొదటి రోజు సాయంత్రం దాకా యుద్ధం జరిగింది. 

యుద్ధాన్ని విరమించి ఎవరికి వాళ్ళు గుడారాలను చేరుకున్నారు. 


ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక - 66 వ భాగం త్వరలో మీ ముందుకు రానుంది. 





T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T. V. L. Gayathri

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page