కచదేవయాని - పార్ట్ 73

Kachadevayani - Part 73 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 73 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 21/10/2026
కచదేవయాని - పార్ట్ 73 | రహస్య సొరంగంలో ఉత్కంఠ!
యయాతి–శర్మిష్ఠలు రాజభవనాన్ని వదిలి రహస్య సొరంగం గుండా తప్పించుకుంటుండగా, వృషపర్వుడు వారి పరారీ విషయాన్ని తెలుసుకున్నాడు. శర్మిష్ఠ నగలు చెల్లాచెదురుగా పడి ఉండటం, అద్దం వెనుక సొరంగ ద్వారం తెరిచి ఉండటం చూసి ఆయనకు నిజం అర్థమైంది. వెంటనే సోమకీర్తి, శక్తిధరులతో కలిసి వారిని వెంబడించేందుకు బయలుదేరాడు. మరోవైపు చీకటి సొరంగంలో గబ్బిలాల దాడిని ఎదుర్కొంటూ యయాతి తన ప్రియురాలిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దీర్ఘదర్శి చేసిన సహాయం వారి జీవితాలను కీలక మలుపు తిప్పింది. చివరకు విమలా నదిలో పడవ ఎక్కిన ప్రేమికులు రాజుల వెంబడింపు నుంచి తప్పించుకోగలరా? టి. వి. యెల్. గాయత్రి గారి ఉత్కంఠభరిత ధారావాహిక ‘కచ దేవయాని’ 73వ భాగం చదవండి.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని.
తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని సహాయం కోసం దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. కానీ ప్రేమను వదులుకోలేక శర్మిష్ఠతో సొరంగ మార్గంలో బయలుదేరుతాడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 69 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 70 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 72 | యయాతి కోసం మొదలైన రహస్య అన్వేషణ - చదవండి
శర్మిష్ఠ భవనం.
యయాతి వాళ్ళు వెళ్లిపోయాక ఆలాగే కూర్చుంది సుమాలినీ దేవి.
ఆమె గుండెల్లో భయం... విందు అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇంకా సమయం ఉంది. తను కూడా దేవయాని దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అందరూ శర్మిష్ఠ గురించి అడిగితే ఏమని చెప్పాలి? దాసీని పిలిచింది.
"రాజకుమారికి తలనొప్పిగా ఉంది. నిద్ర పోతోంది. అందుకని ఇప్పుడు జరిగే విందుకు రావడం లేదని విరజాదేవికి చెప్పు!... ఇంకో విషయం! భవనం లోపలికి ఎవ్వరినీ రానివ్వ వద్దు! రాజకుమారికి విశ్రాంతి అవసరం!" అని ఆదేశించింది.
దాసీ వెళ్లిపోయింది. అలాగే ఆసనం మీద కూలబడింది సుమాలినీ దేవి.
ఇంకో రెండు గంటలకు పిల్లలు రాజధానిని దాటి పోతారు.
అప్పటిదాకా ఎవరికీ తెలియకుండా ఉంటే చాలు!
ఆమెకు ఏమీ తోచడం లేదు.
భగవంతుడిని ప్రార్థిస్తూ ఆలాగే కూర్చుంది.
భవనం దగ్గరికి వచ్చాడు. వృషపర్వుడు. అతడికి కొద్ది దూరంలో ఆగిపోయారు మిగిలిన వాళ్ళు.
లోపలికి వస్తుంటే "ప్రభూ! రాజకుమారికి తలనొప్పిగా ఉంది. నిద్ర పోతున్నారు. మహారాణి ఎవ్వరినీ లోపలికి రానివ్వొద్దని ఆజ్ఞాపించారు." అంది దాసి వినయంగా.
"నన్ను కూడానా?"
అని ఒక్క ఉరుము ఉరిమి ముందుకు కదిలాడు వృషపర్వుడు.
నారాచి అడ్డుపడింది.
"ప్రభూ! రాజకుమారి అలసిపోయారు. మహారాణి కూడా కొంచెం నలతగా ఉన్నారు.... ఎవ్వరినీ రానివ్వొద్దని.. "
ఆమె మాట పూర్తి కాకుండానే "అడ్డులే నారాచీ! లేకపోతే చంపేస్తాను!" అని రౌద్రంగా కత్తి దూశాడు అతడు.
వణికిపోయింది నారాచి.
పక్కకు జరిగింది.
ఒక్క అంగలో గది లోపలికి వచ్చాడు వృషపర్వుడు.
శోకదేవతలా కూర్చుని ఉంది సుమాలినీ దేవి.
భర్తను చూడంగానే కలవరంగా లేచి నిలబడింది.
"రాజకుమారి ఎక్కడ?"
అంటూ లోపలి గదిలోకి వెళ్ళబోయాడు అతడు.
"నిద్ర పోతోంది మహారాజా! లేపకండి!" అని తలుపుకు అడ్డంగా నిల్చుంది ఆమె.
అప్పుడు గదిని పరికించి చూశాడు వృషపర్వుడు.
చెల్లాచెదురుగా పడి ఉన్న శర్మిష్ఠ నగలు.
విసురుగా భార్య చేతిని పట్టుకొని ఇవతలకు లాగి వేశాడు. తూలి ఆసనంలో కూలబడింది సుమాలినీ దేవి.
లోపలికి వెళ్లాడు. శర్మిష్ఠ ఎక్కడా కనిపించలేదు.
అతడి అనుమానం నిజమే!
సొరంగ మార్గం ఉన్న గదిలోకి వెళ్లాడు.
అద్దం పక్కకు జరిపి ఉంది. దగ్గరికి వెళ్లి చూశాడు. లోపల సొరంగం తలుపు విరిగి పడి ఉంది.
బయటకు పరిగెత్తాడు.
నిస్సహాయంగా భర్తను చూస్తూ ఉంది సుమాలినీ దేవి. ఆమెకు దుఃఖం పొంగుకొని వచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది.
"మహారాజా! రాజకుమారి?.. " అడిగాడు సోమకీర్తి.
"సోమకీర్తీ! సొరంగ మార్గం నుంచి వెళ్లారు. విమలా నది దగ్గరకు చేరతారు. ఎక్కువ సమయం లేదు! పద!" అన్నాడు వృషపర్వుడు.
ఈ లోపల రెండు రథాలను సిద్ధం చేసి తీసుకొని వచ్చాడు శక్తిధరుడు.
రథాలెక్కి బయలు దేరారు వాళ్ళు.
సొరంగం లోపల...
ఒక చేత్తో శర్మిష్ఠను పట్టుకొని, మరొక చేత్తో దివిటీని పట్టుకొని పరిగెడుతున్నాడు యయాతి.
ఎప్పుడూ మనుషులు తిరగని దారి అది.
నిండా గబ్బిలాలు.
ఒక్కసారిగా వీళ్ళ మీద దాడి చేశాయి.
దివిటీతో వాటిని చెల్లాచెదురు చేశాడు యయాతి.
దారంతా మలుపులు మలుపులు.
వేగంగా ముందుకు వెళ్తున్నారిద్దరు.
ఇంకోవైపు నలుగురు సైనికులను వెంటబెట్టుకొని దీర్ఘదర్శి విమలా నది దగ్గరికి చేరుకున్నాడు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి.
ఆ ప్రదేశంలో జాలర్లు కానీ పడవల వాళ్ళు కానీ ఉండరు.
నిర్జనమైన ప్రదేశం.
గుబురుగా చెట్లు పెరిగి ఉన్నాయి.
రాజ పరివారంలో ముఖ్యమైన ఒకరిద్దరికీ మాత్రమే అక్కడ సొరంగ మార్గం ఉందని
తెలుసు. అందులో దీర్ఘదర్శి ఒకడు.
ఆ ప్రదేశానికి రెండు క్రోసుల దూరంలో రేవు ఉంది.
"మీరు ఈ పొదలను, చెట్లను నరికి దారి చేయండి!" అని సొరంగ మార్గం వైపు చూపించాడు.
సైనికులు వేగంగా పొదలను తొలిగిస్తున్నారు.
దీర్ఘదర్శి కూడా కత్తి పట్టుకొని పొదలను నరుకుతున్నాడు. నిమిషమొక యుగంలాగా ఉంది అతడికి.
సొరంగ ద్వారం దగ్గరికి చేరుకున్నారు శర్మిష్ఠా యయాతిలు.
అక్కడ కూడా తలుపు ఉంది. కానీ అది కూడా బిగుసుకొని పోయింది.
తలుపును గట్టిగా కొడుతున్నాడు యయాతి.
బయట ఉన్న దీర్ఘదర్శికి అర్థమైంది.
సైనికులతో కలిసి తలుపును గట్టిగా ఊడబెరక సాగాడు. అటు యయాతి, ఇటు వైపు దీర్ఘదర్శి తలుపును గట్టిగా లాగుతుంటే తలుపు వదులయింది.
ఒక్క దెబ్బ కొట్టాడు యయాతి. ఊడి కిందపడింది.
దీర్ఘదర్శిని చూడంగానే భయంతో యయాతి వెనక్కు వెళ్లి నిల్చుంది శర్మిష్ఠ.
"భయం లేదు తల్లీ!మీకు సహాయం చేయడానికే వచ్చాను!" అన్నాడు దీర్ఘదర్శి.
"మామయ్యా!"అంటూ ముందుకు వచ్చింది శర్మిష్ఠ.
ముందుకు దారి తీశాడు దీర్ఘదర్శి.
"యువరాజా! పదండి!" అన్నాడు.
శర్మిష్ఠతో పాటు గుర్రాన్ని ఎక్కాడు యయాతి.
అందరి గుర్రాలు అతి వేగంగా రేవు వైపు పరుగు తీస్తున్నాయి.
అరగంటలో రేవు దగ్గరికి వచ్చారు వాళ్ళు.
అక్కడ పడవల వాళ్ళు ఉన్నారు.
శర్మిష్ఠ తన ముఖం కనిపించకుండా మేలి ముసుగును నిండుగా కప్పుకొంది.
యయాతి కూడా తన కళ్ళు మాత్రమే కనిపించే లాగా ముఖాన్ని కప్పేసుకొన్నాడు.
సైనికులు గుర్రాలను దిగి పడవ వాళ్ళతో మాట్లాడారు.
యయాతి, శర్మిష్ఠ పడవ నెక్కి కూర్చున్నారు.
"జాగ్రత్తగా వెళ్ళండి యువరాజా! ఇవిగో మీకు కొంచెం ఆహారం, మంచి నీళ్లు. " అని రెండు సంచీలను అందించాడు దీర్ఘదర్శి.
"మీ మేలును మరచి పోము సేనాధిపతీ!" అని కృతజ్ఞతలు చెప్పాడు యయాతి.
"సుఖంగా ఉండండి!" అన్నాడు దీర్ఘదర్శి.
పడవ కదిలింది.
నావికుడితో పాటు యయాతి కూడా తెడ్డు వేస్తూ పడవను నడుపుతున్నాడు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 74 త్వరలో
===============================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.







Comments