top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 68

5 hours ago
6 min read

కచ దేవయాని పార్ట్ 68లో శుక్రాచార్యుడి శివశక్తి అగ్నివలయం జయంతుడు ప్రయోగించిన దివ్యాస్త్రాన్ని అడ్డుకుంటుండగా యుద్ధరంగంలో హూహుతో పోరాడుతున్న యయాతి

Kachadevayani - Part 68 - Telugu Mythological Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 68 తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 13/09/2026


శుక్రాచార్యుడు తిరిగి రావడంతో దేవ–దానవ యుద్ధం ఒక్కసారిగా మలుపు తిరిగింది. జయంతుడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను శుక్రాచార్యుడి ‘శివశక్తి’తో ఏర్పడిన అగ్నివలయం అడ్డుకోవడంతో దేవసైన్యం దిగ్భ్రాంతికి గురైంది. మరోవైపు యయాతి హూహును ఎదుర్కొని దానవ సేనను విజయపథంలో నడిపించాడు. చివరకు దేవతలు సంధికి సిద్ధపడగా, యుద్ధం ముగిసిన వెంటనే దేవయాని విషయంలో యయాతి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. టి. వి. యెల్. గాయత్రి గారి ‘కచ దేవయాని’ ధారావాహిక 68వ భాగం చదవండి.


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని. తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది. వృషపర్వుడు, నహుషుడు, యయాతి సమావేశమవుతారు. శుక్రాచార్యుడు కూతురితో కలిసి ఆరావళీ పర్వత ప్రాంతంలోని ఆశ్రమానికి వెళ్తాడు. దానవులకు  బంధీ అయిన కచుడ్ని విడిపిస్తాడు యయాతి. దేవదానవ యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. శుక్రాచార్యుని సహాయం కోసం దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కచ దేవయాని – పార్ట్ 68 | శివశక్తితో మారిపోయిన యుద్ధం


శుక్రాచార్యుడు తిరిగి వచ్చాడనంగానే దానవ సైన్యంలో ఉత్సాహం వచ్చింది.

మరునాడు ఇరుపక్షాల వాళ్ళు యుద్ధభూమికి చేరుకున్నారు.ఈ సారి ధనుర్బాణాలు ధరించి జయంతుడు వచ్చాడు.


శుక్రాచార్యుడు తన యోగ దండాన్ని ఆకాశంలో నిలబెట్టాడు. చూస్తుండంగానే ఆ యోగ దండం పెద్ద అగ్ని వలయాన్ని సృష్టించింది.శివశక్తి మహిమ అది.


దేవసైన్యానికి అర్ధం కాలేదు.

దేవతల వైపు శంఖాన్ని పూరించి జయంతుడు యుద్ధాన్ని మొదలు పెట్టాడు.

అతడిని ఎదుర్కొన్నాడు సోమకీర్తి.


ముందు వాయువ్యాస్త్రంతో దానవ సైన్యాన్ని చెల్లాచెదురు చేద్దామనుకొని అభిమంత్రించి బాణాన్ని వదిలాడు జయంతుడు.

ఆశ్చర్యం! వాయువ్యాస్త్రం శుక్రాచార్యుడు సృష్టించిన అగ్ని వలయంలో పడిపోయింది.


నివ్వెర పోయాడు జయంతుడు.

ఒకవైపు సోమకీర్తితో యుద్ధం చేస్తూనే ఒక్కొక్కటిగా దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్న జయంతుడికి నిరాశ ఎదురవుతున్నది.


అగ్ని వలయాన్ని దాటి అస్త్రాలు ముందుకు పోవడం లేదు.

ఇటువైపు హూహుతో గదా యుద్ధం చేస్తున్నాడు యాయాతి.

తన తమ్ముడిని గాయపరచిన హూహును దెబ్బలు కొడుతూ రెచ్చిపోతున్నాడతడు.

మరో వైపు కచుడిపై బాణ వర్షం కురిపిస్తున్నాడు ప్రయాతి.

యుద్ధం భీకరంగా మారింది.


దానవులు దేవ సైన్యాన్ని నూర్చుతూ ముందుకు పోతున్నారు.


వృషపర్వుడు విశ్వావసును ఎదుర్కొని ముందుకు రానివ్వకుండా కట్టడి చేస్తున్నాడు.

మరోవైపు తన భద్ర గజం మీద వచ్చిన నహుషుడు త్వష్ఠను తీవ్రంగా గాయపరిచాడు.

క్రమంగా హూహు బలం క్షీణించసాగింది.


అది గమనించిన యయాతి హూహు పైకి దూకి గదతో అతడి గుండెల మీద కొట్టేసరికి రక్తాన్ని కక్కుకుంటూ హూహు ఎగిరి అవతల పడి స్పృహను కోల్పోయాడు.

దానవులు జయజయ ధ్వానాలు చేశారు.


మధ్యాహ్నటికి దానవుల గెలుపు ఖాయమయింది. దేవసైన్యం కకావికలయింది. సప్త వసువులు ప్రయాతి దెబ్బకు పారిపోయారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిలబడిన వాడు ఆఖరివాడు ప్రభాసుడు ఒక్కడే! బింకంగా యుద్ధం చేస్తున్నాడతడు.

తమ్ముడికి సాయంగా వచ్చాడు యయాతి.


యయాతి కొట్టిన దెబ్బకు కళ్ళు భైర్లు కమ్మాయి ప్రభాసుడికి.


సాయంత్రానికి దేవసైన్యాన్ని ఊచకోత కోస్తూ ముందుకు వస్తున్నారు దానవులు.

పరిస్థితిని గమనించిన బృహస్పతి దేవేంద్రుడి దగ్గరికి వచ్చాడు.

తలవంచుకొని నిలబడ్డాడు దేవేంద్రుడు.


"ఇప్పటికి జరిగిన నష్టం చాలు ఇంద్రా! సంధి ప్రయత్నాలు చెయ్యి! కశ్యప మహామునితో రాయబారం పంపించు! "ఆదేశించాడు బృహస్పతి.


చేసేదేముంది?

ఒక్కరోజులో మొత్తం తారుమారయింది.

ఆ రాత్రి కశ్యప, భరద్వాజ, అత్రి మహామునులు దానవ శిబిరానికి వచ్చారు.

శుక్రాచార్యునితో సహా అందరూ సమావేశమయ్యారు.


"ముందు యుద్ధాన్ని మొదలు పెట్టింది దేవతలు. కాబట్టి మాకు పరిహారాన్ని చెల్లించాలి! "అన్నాడు శుక్రాచార్యుడు.


"మీకు ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి! "అన్నాడు అత్రిమహాముని.


"మీ దగ్గర ఉన్న విమాన శాస్త్రాన్ని మా వాళ్లకు నేర్పించాలి! ఇకపై దివ్యాస్త్రాలను మా వాళ్లపై ప్రయోగింపరాదు... పరిహారంగా కొంత దేవభూమిని మాకు ధారపోయాలి."


శుక్రాచార్యుడు కోరిన కోరికలను తీర్చడానికి ఒప్పుకున్నారు మధ్యవర్తులు.


హిమాలయ సానువుల్లో దేవతలకు చెందిన భూమిని నహుషుడికి ధారాదత్తం చేశాడు దేవేంద్రుడు.దానితో పాటు విలువైన రత్నరాశులను కూడా పంపించాడు. వాటిని తమకు సహాయంగా వచ్చిన మిత్రులకు పంచేశాడు యయాతి.


యుద్ధం ఆగిపోయింది.

దానవ రాజ్యానికి వచ్చారందరు.

ఆ రాత్రి తన శిష్యులను పిలిచాడు శుక్రాచార్యుడు.


"మా నాన్నగారి ఆశ్రమంలో అమ్మాయి దేవయాని ఉంది. రథంలో అమ్మాయిని ఇక్కడికి తీసుకొని రండి! "అని ఆదేశించాడు.


అక్కడే ఉన్న యయాతి వెంటనే 

"ఆగండి ఆచార్యా! "అన్నాడు.


నిర్ఘాంత పోయారందరు.

వృషపర్వుడికి గుండె ఆగినంత పనయింది.

శుక్రాచార్యుడి కళ్ళు ఎఱ్ఱబడ్డాయి.


"ఆచార్యా! దేవయాని నా ధర్మపత్ని. ఆమె ప్రతిష్ఠానపురానికి యువరాణి. నా సామ్రాజ్యానికి కాబోయే మహారాణి. ఆమె కోసం విమానాన్ని పంపించి సకల రాజ లాంఛనాలతో ఇక్కడికి తీసికొని వచ్చే ఏర్పాటు చేస్తాను! "అన్నాడు యయాతి.


ఊపిరి పీల్చుకున్నాడు వృషపర్వుడు.

ప్రసన్నంగా యయాతిని చూశాడు శుక్రాచార్యుడు.


తన కూతురిని భార్యగా స్వీకరించడానికి ఇష్టపడని వాడు యయాతి. కేవలం దానవ జాతి కోసం బలవంతంగా ఆమెను ధర్మపత్నిగా స్వీకరించాడు.


అయినా సరే తన కూతురిని ధర్మపత్నిగా గుర్తించి, యువరాణి హోదాను ఇచ్చి గౌరవిస్తున్నాడు.ఇంకొద్ది రోజులు గడిస్తే తప్పకుండా ప్రేమతో చూసుకుంటాడు.

యయాతి వ్యక్తిత్వానికి అబ్బురపడ్డాడాయన.


వదినగారిని తీసుకొని రావడానికి ప్రయాతి రాకుమారుడితో పాటు యయాతి మేనత్త ధర్మిణి కూడా బయలు దేరింది.వాళ్ళ వెంట కానుకలను తీసుకొని వంద మంది దాసదాసీలు కూడా వెళ్లారు.


ఆ మరునాటికి విమానంలో రాజధానికి చేరుకుంది దేవయాని.

అప్పుడే హడావుడిగా దేవయానితో యయాతి వివాహానికి ఏర్పాట్లు చేశాడు వృషపర్వుడు. 


కాదనలేదు యయాతి. 

పదిహేను రోజుల తర్వాత దేవయాని, యయాతీల వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించారు పెద్దలు.


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 69 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T. V. L. Gayathri

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page