కన్నీటివాగు

Kannetivagu - Telugu Family Story | Yasoda Gottiparthi
కన్నీటివాగు - తెలుగు కుటుంబ కథ | యశోద గొట్టిపర్తి
Published In manatelugukathalu.com On 01/11/2026
కన్నీటివాగు యశోద గొట్టిపర్తి రచించిన హృదయాన్ని కదిలించే తెలుగు కుటుంబ కథ. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, డబ్బు వ్యామోహం, మానవీయ విలువల ప్రాముఖ్యతను ఈ కథ చక్కగా తెలియజేస్తుంది.
అల్లుకున్న మల్లెతీగల్లా కొందరి పందిరి ఆశల మల్లె, మొల్లల మరువాలం మనం.
అమ్మను చూడని,
అక్క చెల్లెళ్ల, అన్నదమ్ములం
కాకున్నా బంధాల బంధువులం అందరం అనాధ పిల్లలం.
ఆనందంగా అమాయక ప్రపంచంలో పెరుగుతున్నాం అంటూ హాయిగా ఆడుకుంటున్నారు "అమ్మ" అనాధాశ్రమం పిల్లలు.
“మేము పెంచుకోవడానికి ఒక అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఫరవాలేదు.
తీసుకుపోవడానికి అన్ని అర్హతలున్న భార్యాభర్తలం. ఈ మూడేళ్ల అబ్బాయి మాకు బాగా నచ్చాడు.
మేము ఎటువంటి లోటు లేకుండా సాదుకుంటాము” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ప్రాధేయపడ్డారు దంపతులు.
అక్కడే ఆ అబ్బాయితో ఆడుకుంటున్న పిల్లలు వచ్చి, “మా తమ్ముడు కాని తమ్ముడు, మా గారాల చిన్నోడు. మేము ప్రేమతో చూసుకుంటున్నాం. మా దగ్గరి నుండి ఎవరూ తీసుకుపోవద్దు. మేడం ప్లీజ్ మేడం” అని బ్రతిమిలాడుతుంటే...
“ఏమిటిరా? మీకే దిక్కులేదు అంటే తీసుకుపోతాము అన్న వాళ్లకు ఆత్మీయ భావాలు మాయమయ్యేట్లు! పొండిరా లోపలికి వెళ్లి ఆడుకోండి” అని మందలించింది వార్డెన్. “బయట కనిపించవద్దు” అని కోప్పడి వెళ్ళమని...
“రండి అమ్మా! మీరు రండి. అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తరువాత ఈ అబ్బాయిని తీసుకుపోవచ్చు. మీకు సొంత పిల్లలు ముఖ్యంగా అబ్బాయి ఉండకూడదు.”
“మాకు ఎవరూ లేరు అమ్మ” అని చెప్పగానే,
“అమ్మా! మేము మా తమ్ముని విడిచి ఉండలేం” అంటూ ఏడుస్తూ "గట్టు తెగిన వాగు లాగా" కాళ్లకు అడ్డం పడుతూ ఉంటే... “బాబూ, మిమ్మల్ని చూస్తే మాకు బాధ కలుగుతుంది.
మీ బాధను మేమెలాగూ తీర్చలేము... కానీ ఒక మేలు మాత్రం చేస్తాం, చేయగలుగుతాం. మాదగ్గరే ఉన్నట్టు, మీకు పెద్దయిన తరువాత కూడా గుర్తుండే విధంగా, మమ్మల్ని ఎక్కడున్నా గుర్తుపట్టే విధంగా... మీకు మా ఫోటో, బాబుతో కలిసి దిగిన ఫోటో, అడ్రెస్ కూడా మీకిస్తాం.
ఎప్పుడైనా చూడాలని ఉన్నా మీరు పెద్దవాళ్ళయినప్పుడు వచ్చి మమ్మల్ని కలుసుకోవచ్చును” అని ఆ ఫోటోలు ఇచ్చి వారి దుఖాన్ని పోగొట్టారు. అరవింద్ అని పేరు పెట్టారు.
కొన్ని సంవత్సరాల తరువాత అల్లరిముద్దుగా పెరుగుతున్న అరవింద్ ఉన్నత చదువులు చదివాడు.
“నాన్నా! నా ప్రధాన లక్ష్యం మిమ్మల్నిద్దరినీ కంటికి రెప్పలా చూసుకోవడమే.”
“ఎలా చూసుకోవాలని అనుకున్నా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లకురా నాయనా! ప్రతి ఒక్కరికీ డబ్బు పిచ్చి పట్టినట్టుంది. అదే పిచ్చి అందరికీ అంటుకుంటోంది.”
“అమ్మా! డబ్బే కదా ముఖ్యం. ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప వ్యక్తిగా చలామణి అవుతాడు.”
“డబ్బును చూసి దగ్గరయ్యే వాళ్ళు డబ్బుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి... నీ దగ్గరి నుండి ఏది కావాలో అదే దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు.”
“కనీస అవసరాల కోసమైనా డబ్బు కావాలి. మనం లక్షాధికారులం కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అమ్మా.”
“డబ్బు కోసం వచ్చిన వాళ్ళు చుట్టూ చేరుతూ, చివరకు స్నేహితులు కూడా ఒక ఆధిక్యత పొందాలనే భావంతో మసలుకుంటూ ఏదో ఒక బలహీనతను ఆసరా చేసుకుని అనామకుడిని చేసే ప్రయత్నం చేస్తారు.
మీ నాన్నగారి స్నేహితుడు మొదటి నుండి గుర్రం పందాలు అంటే పిచ్చిగా ఇష్టపడేవారు. డబ్బుతో పాటు పందాలలో పెట్టుబడి పెడుతున్నాడని తెలిసి ఎంతోమంది అప్పులుగా తీసుకుని... తాము కూడా పందాలలో పాల్గొంటున్నాం అనే ఉత్సాహాన్ని కలిగించి ఉన్న డబ్బుతో పాటు శక్తిని నిర్వీర్యం చేశారు” అని వాపోతుంటే,
“నేను డబ్బును ఎలా సంపాదించాలో సక్రమ మార్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఆలోచన చేస్తాను అమ్మా. నువ్వేమీ ఆందోళన పడకు. నీ ఆరోగ్యం పాడవుతుంది.”
అన్ని విధాలుగా ఆలోచన చేసి... ఏ మగవాడైతే ఏ విషయాలపై ప్రియంగా ఉంటాడో... ఏ అంశాలను తన జీవితానికి అన్వయం చేసుకుంటాడో పసిగట్టిన అమ్మాయిల కుటుంబాలు లోకజ్ఞానంతో పరిచయం చేసుకుని... కూతురును ఎరగా వేస్తారు.
“అరవింద్! నువ్వు ఇంత వినయంగా ఎదుటివాళ్లను నొప్పించకుండా, అమ్మాయిలను ఏడిపించే వాళ్లకు మంచిపని కాదని అలాంటి వాళ్లకు హితబోధ చేస్తావు. నువ్వు వాళ్ల వయసు వాడివి, వాళ్ల జీవన విధానంతో సమంగా పెరుగుతున్నవాడివి. అలా ఎలా సాధ్యమవుతుంది?” అంది శృతి.
“ఇదంతా మా అమ్మా నాన్నల పెంపకం” అంటూ కాలర్ ఎగురవేశాడు.
“నేనూ అంతే అరవింద్, నీ క్వాలిటీస్ నచ్చాయి. ఎదుటి వారి కష్టాలకు విలువ ఇస్తాను, పెద్దవాళ్లను గౌరవిస్తాను” అనే మాటలు చాలా మాట్లాడుతూ, కొన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ అరవింద్ ని ఆకట్టుకుంది.
ఇద్దరూ కలిసి డబ్బు, ఆనందం, విలాసం వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లే ప్రయత్నం... తల్లితండ్రికి తెలిసింది. వద్దనుకున్న డబ్బే తమను దూరం చేస్తుంది అని తెలుసుకున్న అరవింద్ తల్లితండ్రులు కుంగిపోసాగారు.
అనుకోకుండా ఒకరోజు అరవింద్... తన తల్లితండ్రిని "అమ్మ" అనాధ శరణాలయంలో చూశాడు. లోపలికి వెళ్లి అడిగితే విరాళం ఇవ్వడానికి వచ్చారని చెప్పారు.
వాళ్ల ఆర్థిక సహాయం ఎంతోమంది అనాధలకు జీవం అవుతుంది. వాళ్ల అబ్బాయి కూడా ఇక్కడివాడే అని జరిగినదంతా చెప్పారు. అక్కడే కళాశాలలో పనిచేస్తున్న అరవింద్ వెంట పెరిగిన చిన్నప్పటి ఫ్రెండ్ కూడా వచ్చి, ముగ్గురూ ఉన్న ఫోటో తెచ్చి చూపించి కళ్ళనీళ్లు తీసుకున్నాడు.
విషయమంతా తెలుసుకున్న అరవింద్ తల్లితండ్రుల పాదాలకు నమస్కరించి, భార్యా మాటలు విన్నందుకు క్షమాపణలు అడుగుతూ... "గుండెలోని కన్నీటి వాగు కట్టలు తెంచుకుంది. అమ్మా, నాన్నా! నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లను" అన్నాడు.
మారిన అరవింద్ ను చూసి అక్కడున్న వారంతా సంతోషంతో అరవింద్ ను అక్కున చేర్చుకున్నారు.
సమాప్తం
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం













Comments