కచదేవయాని - పార్ట్ 71

Kachadevayani - Part 71 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 71 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 06/10/2026
శర్మిష్ఠతో సాధారణ జీవితం గడపాలనే నిర్ణయంతో రాజధానికి తిరిగివచ్చిన యయాతి తన జీవితాన్నే మార్చే సాహసానికి సిద్ధమయ్యాడు. ‘కచ దేవయాని’ 71వ భాగం ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్తుంది.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని.
తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని సహాయం కోసం దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. శర్మిష్ట ముఖంలో దుఃఖపు ఛాయలు బయటపడక పోవడంతో దేవయాని అసంతృప్హి చెందుతుంది. రాజ్యాన్ని వదలి శర్మిష్ఠను తీసుకొని జనపదాల వైపు వెళ్తాడు యయాతి.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 71 చదవండి
యయాతి, రుద్రబాహు రాజ్యానికి వచ్చారు.
తన భవనంలోకి వెళ్లే ముందు ద్వారం దగ్గర ఆగి, "రుద్రా! ఇప్పుడు జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పకు! నీ నోట్లోంచి ఒక్క మాట బయటకు వచ్చినా ఏమి జరుగుతుందో తెలుసు కదా!" అన్నాడు యయాతి కఠినంగా.
"తెలుసు ప్రభూ!" అని వంగి దణ్ణం పెట్టాడు రుద్రబాహు.
భవనం లోపలికి వెళ్ళాడు యయాతి.
అక్కడ అతడి కోసం దాస దాసీలు ఎదురు చూస్తున్నారు.
అందులో ముఖ్యుడు గోపతి. యయాతికి దగ్గరుండి అలంకారం చేయడం అతడి బాధ్యత.
"ప్రభూ! మిమ్మల్ని తోడ్కొని రమ్మని అమ్మగారు ఆదేశించారు!" అన్నాడు గోపతి.
"తయారవుతున్నాను గోపతీ! అందరూ వెళ్లిపోండి!" అని ఆదేశించాడు యయాతి.
మిగిలిన సేవకులను పంపించి వేసి తను మాత్రం అలాగే నిల్చున్నాడు గోపతి.
"ఈ రోజు నేనే తయారవుతాను! నువ్వు కూడా వెళ్ళు!"
కదల్లేదు గోపతి.
ఈ మధ్య యువరాజు ప్రవర్తన చిత్రంగా ఉంటోంది. ముతక దుస్తులను ధరించడం... ఎవ్వరితో మాట్లాడక పోవడం.
"నువ్వు కూడా వెళ్ళు!" ఉరిమాడు యయాతి.
కదల్లేక కదల్లేక గదిలో నుంచి బయటికి వెళ్లిపోయాడు గోపతి. అతడి మనసు కీడును శంకిస్తోంది.
వెంటనే యయాతి ఒక పత్రాన్ని తీసుకొని తండ్రికి లేఖను వ్రాశాడు.
'తను రాజ్యాన్ని వదలి పోతున్నానని, తన రాజ్యభాగాన్ని తమ్ముళ్లిద్దరికీ పంచమని, తనను క్షమించమని' వేడుకుంటూ లేఖను ముగించి తన ఉంగరంతో ముద్రను వేసి అక్కడున్న బల్ల మీద పెట్టి బయటికి వచ్చాడు.
అక్కడ గోపతి, రుద్రబాహుతో పాటు చాలా మంది పరివారం ఉన్నారు.
"రుద్రా! వీళ్ళనందరిని ఇక్కడి నుండి పంపించు!" అని ఆజ్ఞాపించాడు.
కాసేపటికి అక్కడ ఉన్న సేవకులు వెళ్లిపోయారు.
తన కళ్లు మాత్రమే కనిపించేలాగా ఉత్తరీయాన్ని ముఖానికి కప్పుకొని శర్మిష్ఠ భవనంలోకి వెళ్ళాడు యయాతి.
అతడి అదృష్టం!
ద్వారం దగ్గర నారాచి కనిపించింది.
ఎవరో అగంతకుడు రాజకుమారి భవనం దగ్గరికి వచ్చాడనుకొని కత్తి దూసి అతడి గుండెలపై పెట్టింది నారాచి.
"నేను నారాచీ! యువరాజును!" అన్నాడు ముసుగును కొద్దిగా తొలగించి.
నారాచి ఆశ్చర్యంగా,
"ఏమిటిది యువరాజా?" అంది.
"ముందు శర్మిష్ఠను చూడాలి!" అన్నాడు యయాతి.
"ఇటువైపు రండి యువరాజా!" అంటూ యయాతిని ఎవరూ చూడకుండా ఉండటానికి వెనుక ద్వారం వైపు నుంచి భవనం లోపలికి తీసుకొని వెళ్ళింది నారాచి.
గదిలో శర్మిష్ఠ, సుమాలినీదేవి కూర్చుని ఉన్నారు.
యయాతి, నారాచీలు గదిలోకి అడుగుపెట్టారు.
"మహారాణీ! యువరాజు!" అంటూ చెప్పి వినయంగా ప్రక్కన నిల్చుంది నారాచి.
సుమాలినీదేవి అయోమయంగా చూస్తుండగానే,
"క్షమించండి మహారాణీ! నేను రాజ్యాన్ని, రాచరికాన్ని వదిలి వచ్చాను. శర్మిష్ఠను నాతో తీసికెళ్తాను!" అన్నాడు.
యయాతి ఏమి చెబుతున్నాడో అర్ధం కాలేదు తల్లీ కూతుళ్లకు.
నిర్ఘాంతపోయి చూస్తోంది సుమాలినీదేవి.
శర్మిష్ఠకు దగ్గరగా వచ్చాడు.
ఆమె చేతిని పట్టుకున్నాడు.
"చెప్పు శామూ!రాజ్యం లేని వాడితో, వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే వాడితో వచ్చేస్తావా?" అన్నాడు.
ఇప్పుడు అర్థం అయింది శర్మిష్ఠకు.
"మరి అక్క?... ఎలాగ?" అంది.
కంగారుగా ఉంది ఆమెకు.
"రాజ్యం గీజ్యం లేని వాడిని మీ అక్క చేసుకోదు! నువ్వు చెప్పు! నాతో వస్తావా! ఇప్పుడే అన్నీ వదిలేసి వెళ్లిపోదాం!"
అతడి కళ్ళల్లోకి చూసింది శర్మిష్ఠ.
అతడి కళ్లల్లో ప్రేమ, విశ్వాసం కలబోసి కనిపిస్తున్నాయి.
"వస్తాను!" అంది నిబ్బరంగా.
"వెళ్ళండి కుమారా! ఎక్కడైనా సుఖంగా ఉండండి!" అంది సుమాలినీదేవి.
"మహారాణీ!..." అన్నాడు యయాతి. అతడికి సంతోషంగా ఉంది.
"నారాచీ! అమ్మాయి సామాన్లు సర్దు!" అంది మహారాణి కళ్లనీళ్లు తుడుచుకొంటూ.
"అవేమీ వద్దు మహారాణీ! మేము సామాన్యుల లాగా నగరాన్ని దాటాలి! ఈ దుస్తులను మార్చుకో శామూ! ఆ నగలు కూడా తీసెయ్! సమయం లేదు! వెంటనే బయలుదేరాలి!"
అని యయాతి చెప్పగానే తన నగల్ని గబగబా తీసేయసాగింది శర్మిష్ఠ.
ఆ కంగారులో కొన్ని నగలు నేల మీద చెల్లా చెదురుగా పడిపోయాయి.
దుస్తులను మార్చుకోవడానికి లోపలి గదిలోకి పరిగెత్తింది శర్మిష్ఠ.
ఈలోగా కొన్ని బంగారు నాణేలను సంచీలో పోసి యయాతికి ఇచ్చింది మహారాణి.
"వద్దు మహారాణీ! నన్ను నమ్మండి! నా భార్యను నేను పోషించుకోగలను!"
"నీ మీద నమ్మకం లేక కాదు కుమారా! చేతిలో ఉంటాయి! ఆడపిల్లను ఒట్టి చేతులతో పంపకూడదు! ఉంచండి!"
సంచీని తీసుకొన్నాడు యయాతి.
ఈ లోపల శర్మిష్ఠ వచ్చింది.
ఆమె చేతిని పట్టుకొని కదలబోయాడు యయాతి.
"ఉండు కుమారా! మీరు రాచమార్గంలో వెళ్లొద్దు. ఈ భవనానికి రహస్య మార్గం ఉంది. సొరంగంలో నుంచి వెళితే విమలా నది ఒడ్డుకు చేరతారు. అక్కడి నుండి క్షేమంగా వెళ్ళండి!" అని మరొక గదిలోకి దారి తీసింది మహారాణి.
నాలుగు గదులు దాటారు వాళ్ళు.
ఆ తర్వాత ఒక చిన్న గది ఉంది. దానిలో పనికి రాని సామాన్లు పెట్టి ఉన్నాయి.
ఆ గదిలో ఒక పెద్ద అద్దం ఉంది.
"నారాచీ! ఈ అద్దాన్ని పక్కకు జరుపు!" ఆజ్ఞాపించింది మహారాణి.
నారాచి బలంగా అద్దాన్ని పక్కకు నెట్టసాగింది.
యయాతి, శర్మిష్ఠలు కూడా వచ్చి అద్దాన్ని పక్కకు జరిపారు.
అక్కడొక చిన్న తలుపు ఉంది.
అయితే ఆ తలుపు బిగుసుకొని ఉంది.
వీళ్ళు నెడుతుంటే తెరుచుకోవడం లేదు.
"ఈ భవనాన్ని కట్టినప్పుడు మయాచార్యుడు ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఒక్కసారైనా తీయలేదు. తలుపు బిగుసుకుపోయిందేమో!" అంది మహారాణి కంగారుగా.
"ఇంకో దారి లేదు! పగలగొట్టడమే!" అంటూ యయాతి తలుపును తన చేతులతో బలంగా రెండు సార్లు కొట్టాడు. దెబ్బకు తలుపు విరిగి పడింది.
అయితే లోపల చీకటిగా ఉంది.
"నారాచీ! దివిటీ తీసుకొని రా!"
మహారాణి చెప్పింది విని నారాచి గబగబా దివిటీని వెలిగించి తెచ్చింది.
కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకొంది మహారాణి.
"నారాచీని కూడా మీతో తీసికెళ్లండి!" అంది.
"వద్దు మహారాణీ! మేము స్థిరపడ్డాక మీ దగ్గరికి వస్తాము! మీరు దిగులు పడకండి!" అని ఆమె పాదాలకు నమస్కారం చేశాడు యయాతి.
తల్లిని కౌగలించుకొని తను కూడా తల్లి పాదాలకు మొక్కింది శర్మిష్ఠ.
ఇద్దరినీ ఆశీర్వదించింది మహారాణి.
ఇద్దరూ ఆ సొరంగంలో గబగబా నడవసాగారు.
రాజకుమారి భవనం దగ్గరికి వెళ్లిన యయాతి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రుద్రబాహుకు అర్థం అయింది.
యువరాజు వెళ్లిపోయాడు!
అతడు స్వామిభక్తిపరాయణుడు.
ఇప్పుడు ఏమిటి కర్తవ్యం?
బలవంతుడు, సమర్థుడైన యువరాజు లేకపోతే వచ్చే ఉపద్రవం ఏమిటో అతడికి తెలుసు. శత్రువులు ఊరుకుంటారా? ప్రశాంతంగా ఉన్న రాజ్యం ప్రమాదంలో పడుతుంది.
ఎవరితోనైనా ఈ విషయాన్ని చెబితే యయాతి తన ప్రాణాలు తీస్తాడని కూడా తెలుసు.
ఆలస్యం చేయలేదు రుద్రబాహు.
వృషపర్వుడి దగ్గరికి పరిగెత్తాడు.
మరోవైపు, అరగంట తర్వాత యయాతి భవనంలోకి వచ్చిన గోపతికి బల్లమీద పెట్టిన లేఖ కనిపించింది. యువరాజు మాత్రం గదిలో లేడు!
కంగారుగా లేఖను పట్టుకొని నహుష చక్రవర్తి దగ్గరకు పరిగెత్తాడు గోపతి.
ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక - 72వ భాగం త్వరలో మీ ముందుకు రానుంది.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 72 త్వరలో
===============================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.







Comments