ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 20
- Pandranki Subramani

- 7 hours ago
- 6 min read

Udayaraga Udvegalu - Part 20 - Telugu Web Series | Pandranki Subramani | ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 20 - తెలుగు ధారావాహిక |ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత పాండ్రంకి సుబ్రమణి
Published in manatelugukathalu.com on 22/03/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్. సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. శివగామి బ్యాంకు జాబ్ కు సెలెక్ట్ అవుతుంది.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 20 చదవండి.
“వెన్నెల భోజనం… కానీ ఒక్క మాటతో ఇంట్లో తుఫాను!” |
సాయంత్రం తమకు కేటాయించిన గదిలో దినపత్రిక చూస్తూ కూర్చున్న మధుమురళి వద్దకు వచ్చి శివగామి చిన్నగా దగ్గుతూ నిల్చుంది. సంగతేమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడతను.
"మీతో ఒక విషయం మాట్లాడాలి"
"ఉఁ" అన్నాడతను పేపరు మడచి ప్రక్కన పెడుతూ.
"రేపు చిత్తిర పౌర్ణమి"
"అంటే?" అన్నట్టు ఆమె ముఖంలోకి తేరి చూసాడు మురళి.
"ఇది మా ఊళ్ళో గొప్ప విశేషం. పూజా పునస్కారాలు జరుపుకున్న తరవాత వెన్నెల భోజనాలు. అంటే చందమామ ముందు వేడుకగా వరసగా కూర్చుని భోజనాలు తింటారు."
అతడు చిన్నగా నవ్వి పెద్దమ్మకు, వదినకూ ఓ మాట చెప్పి అలానే చేయమన్నాడు.
"ఇప్పుడు వెన్నెల భోజనాలు మన కోసం కాదు. గర్భిణీ స్త్రీలకు చిత్తిర పౌర్ణమి ప్రత్యేకం. మధులిక అక్కయ్యకు వెన్నెల భోజనం పెడదాం."
ఆ మాట విన్నంతనే మురళి శివగామి ముఖంలోకి సూటిగా చూసాడు. "నీకు మధులిక ఒక్కతే అక్కయ్యలా కనిపించవచ్చు. కాని నాకు ఇద్దరు వదినెలు న్నారు. మరొక వదినె పేరు కమలవాణి. ఒకరికి చేసి మరొకరికి చేయకుండా ఉంటే యేం బాగుంటుందో చెప్పు."
"అదెలాగండీ! ఎక్కడో లివ్విన్-రిలేషన్ షిప్పులో ఉన్నవాళ్ళందరూ యింటికోడళ్లెలా ఔతారు? వరసకు తోడికోడలెలావుతారు?"
ఈసారి మురళి ముఖాన రంగులు మారాయి. చూపులో సూటిదనం కనిపించింది. "ఓసారి నోర్మాసుకుంటావా శివగామీ! నీకు పూర్తిగా అవగాహన లేని విషయాల పైన కమెంట్ చేస్తున్నావు. సమస్య తెచ్చిపెట్టబోతున్నావు. రమణను యింట్లోకి తీసుకువచ్చి ఉండమని చెప్పావు. నీకు నువ్వు మంచి కార్యం చేసినట్లే ఫీలయావు. కాని రమణ గురించి మీ అత్తా మామలకు నచ్చచెప్పడానికి తల ప్రాణం తోకకు వచ్చింది.
మంచి చేయాలన్న తాపత్రయంలో పడి మాధవి వయసుకి వచ్చిన అమ్మాయన్నది మరచిపోయావు. నో-డౌట్- నువ్వు చేసినది మంచి పనే. ఆ కుర్రాడు స్పిన్నింగ్ మిల్లులో ట్రైనీగా చేరి కుటుంబానికి ఆసరాగా నిలచి ప్రయోజకుడయాడు. కాని మంచి కార్యం చేసేటప్పుడు కీడు కలగకుండా చూసుకోవడం నీ కర్తవ్యం కాదా!
ఇప్పుడు చూడు మరొక తప్పు చేయబోతున్నావు. మా అన్నయ్యకూ కమలవాణిగారికీ మధ్యనున్నది కేవలం లివ్విన్ రిలేషన్ షిప్పు వంటిదన్నావు. తప్పు! ఆ మాటను వాఫస్ చేసుకో! నువ్వనుకుంటున్నట్టు వాళ్ళది స్పైసీ రిలేషన్ షిప్పు కాదు. ఎమోషనల్ రిలేషన్ షిప్. పెద్దల సమక్షాన అన్నయ్య ఆమెగారి మెడన మంగళ సూత్రం వేసుండకపోవచ్చు. ఏడడుగులు కలసి నడచి ఉండకపోవచ్చు. కాని హార్ట్ ఆఫ్ ది మేటర్ యేమంటే కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్న రోజుల్లో అన్నయ్య ఆమె మెడన గర్భగుడిలో పుస్తె కట్టి ఇద్దరూ మాలలు మార్చుకున్నారు.
లాంఛనప్రాయంగా, సంప్రదాయబద్ధంగా పెద్దలకు చెప్పి శాస్త్రోక్తంగా వివాహం చేసుకోకముందు కమలవాణిగారు తీవ్ర అనారోగ్య స్థితికి లోనయ్యారు. ఏదో గ్రామానికి వైద్య శిబిరానికని వెళ్ళి విషజ్వరంతో మంచాన పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అసలామె మళ్ళీ ప్రాణాలతో కనిపిస్తుందని అన్నయ్య కలలో కూడా అనుకోలేదు.
చివరిగా చెప్తున్నాను విను. చిత్ర పౌర్ణమి నాడు మీ ఊరి సంప్రదాయం ప్రకారం వెన్నెల భోజనాలు పెట్టదలచుకుంటే పెట్టు, కాని ఇద్దరికీ పెట్టు. ఎందుకంటే ఇద్దరూ గర్భంతో ఉన్నవారే. వీలుకాక పోతే, యెవరికీ పెట్టకు!" అని అక్కణ్ణించి లేవబోయేంతలో ఇంద్రకిరణ్ దూసుకు వచ్చాడు.
"ఏరా చిన్నన్నయ్యా! ఎందుకో చిన్నవదినెతో తెగ హీట్ లో మాట్లాడుతున్నట్టున్నావు?"
"అదేమీ లేదురా కిరణ్! కమలవాణిగారిని చూడాలంటున్నది మీ చిన్న వదినె. వాళ్ళింటి విలాసం యివ్వు."
"విలాసం యివ్వడం యెందుకూ? నేను స్వయంగా చిన్నొదినెను వాళ్ళింటికి తీసుకెళ్ళనూ?"
"గుడ్. దీపాలు పెట్టే వేళకు ముందు మీ చిన్నొదినెను అక్కడకు తీసుకెళ్ళు."
అప్పుడామె ఇంద్ర కిరణ్ ని కదలనీయకుండా ఆపింది. ఆపుతూ స్వగతంలా అంది. "అవ్వా, పెద్దత్తయ్యా కోపగించుకోరు కదూ? నేనక్కడకు వెళితే..."
మధుమురళి అందుకున్నాడు. "ఖాతరు చేయకు. నువ్వు చేయబోతున్నది మంచి కార్యం. విషయం తెలుసుకుని మన్ను తిన్న పాముల్లా ఊరకుంటారు. పని గట్టుకుని అడిగితే, ముఖంలో ముఖం పెట్టి నిలదీస్తే అదంతా మా కాంచీపురం తమిళ సంప్రదాయమని, గర్భిణీ స్త్రీలను గౌరవించడం తప్పనిసరని చెప్పి తప్పించుకో."
-----------------------------------------------------------
మరునాడు ఉదయం నుంచి యింట్లో హడావిడి ఆరంభమైంది. వంటగది నలభీముడి పాకశాలలా తయారైంది. శివగామికి, పెద్దత్తయ్య, ఆడపుడుచు మాధవి సహాయకుల్లా మారారు. పొంగారే రకరకాల రంగులతో, రకరకాల సువాసనలతో వంటగదితో బాటు హాలు సహితం ఘుమఘుమలాడసాగింది. అదంతా దూరం నుంచి గమనిస్తూ తచ్చాడుతున్న మురళి మనసు ఓరన నవ్వుకున్నాడు. అక్కడి వాళ్ళకు యింకా తెలియనట్లుంది. చిత్తిర పౌర్ణమి వెన్నెల భోజనం ఒకరి కోసం మాత్రమే కాదని, యిద్దరు స్త్రీ మూర్తులకని. ఇద్దరూ ఒకరికొకరు పడని సవతులని.
శివగామి సూచన ప్రకారం సరిగ్గా ఐదున్నర ప్రాంతాన యింటి ముందు కారాగింది. ఈసారి శివగామి వంతయింది విస్తుపోవడం. కారులోనుంచి కమలవాణి మాత్రమే దిగలేదు. ఆమెతో బాటు ఆమె అమ్మానాన్నలూ దిగారు. హాలులో కూర్చుని సరదాగా కబుర్లాడుకుంటున్న యింటిల్లిపాదీ ఆశ్చర్యచకితులై లేచారు, నర్సమ్మ తప్ప. మొదట ఇంద్రకిరణ్ యెదురు వెళ్ళి
వచ్చిన వాళ్ళకు అభివాదాలు చెప్పి పలకరించాడు. "రండి మేడమ్! సరైన సమయానికి సరైన మంగళకరమైన చీర కట్టుకుని వచ్చారు. యు రియల్లీ లుక్ అమెజింగ్."
"నా చీర రంగు గురించి నీకెందుకు గాని? ఈ రోజైనా నన్ను వరస కలిపి పిలవవా! నన్నలా పిలవకని మీ అన్నయ్య ఆంక్షలు విధించాడా?" ఇంద్రకిరణ్ నవ్వుతూ దగ్గరకెళ్ళి ఆమె చేతినుండి పార్సల్స్ అందుకుని, "అబ్బే! అటువంటిదేమీ లేదు మేడమ్! సర్దుకోవడానికి టైము పడ్తుంది కదా మేడమ్!"
"లేదు. నువ్వు నన్ను వరస కలిపి పిలిస్తేనే నేను లోపలకు వచ్చేది."
"అలాగే వదినమ్మ గారూ! ఇప్పుడు యింట్లో మందస్మిత వదనంతో కాలు పెట్టి మా యింటిని, సారీ, మనింటిని పావనం చేయండి."
ఆ మాటతో మెరిసిన కళ్లతో ఇంద్రకిరణ్ రెండు చెంపలూ నిమిరి సరాసరి హాలులోకి వచ్చి తిన్నగా వెళ్ళి, ఉమాదేవి కాళ్ళకు, పుష్పవల్లి కాళ్ళకూ నమస్కరించి, పిదప నర్సమ్మ వద్దకు వెళ్ళి నమస్కరించడానికి వంగబోయింది. కాని ఆమె చటుక్కున కాళ్ళు వెనక్కి తీసుకుని సరసరా లేని శక్తిని పుంజుకుని ఊపిరి బిగబట్టి మేడ మెట్లు యెక్కి వెళ్ళిపోయింది. ఖిన్నురాలైన కమలవాణికి యేమి చేయాలో తోచలేదు. ఇబ్బందికరంగా ముఖం పెట్టి యెడంగా నిల్చున్న అమ్మానాన్నల వేపు చూస్తూ, దూరంగా నిల్చున్న సత్యానందం వేపు చేతులు జోడించి అందరికీ మధ్యన నిల్చున్న మధులిక ముఖంలోకి అభావంగా చూస్తూ ఉండిపోయింది.
అప్పుడు మాధవిని తనతో రమ్మని సైగ చేస్తూ శివగామి ఇద్దరు గర్భవతుల చేతుల్నీ అందిపుచ్చుకుని బాల్కనీ వేపు నడపించుకుంటూ తీసుకెళ్ళింది. ఆమె సమయస్ఫూర్తికి సోమశేఖరం ఆశ్చర్యపోయాడు. "ఈ వెన్నెల భోజనాల యేర్పాట్లన్నీ తమిళ మరదలి వ్యవహారన్నమాట!" అని మనసున తలపోస్తూ నిదానంగా వెళ్ళి కమలవాణి అమ్మానాన్నలిద్దరినీ తీసుకు వచ్చి తండ్రికి పరిచయం చేసాడు.
ముగ్గురూ ఒకరినొకరు పలకరింపుగా నవ్వులు చింది నమస్కరించుకున్నారే గాని, మాటా పలుకూ లేకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. త్యాగరాజు తానుగా వచ్చి తనను తను పరిచయం చేసుకుని వాళ్ళకు సమీపంగా వచ్చి కూర్చున్నాడు. అప్పుడప్పుడు మౌనం సముద్ర తలంపైన ఒలికిపౌయి పరచుకున్న చమురు తెట్టలా యెంత గాఢంగా, యెంత నలుపు నలుపుగా ఉంటుందో!
బాల్కనీలో వెన్నెల కాంతిలో మధులిక-కమలవాణి ఒకే వరసలో కూర్చున్నా ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ యెడం యెడంగానే ఉండిపోయారు. శివగామి, మాధవి యిద్దరూ కలసి కొసరి కొసరి వడ్డించారు, కాదు, తినిపించారు. కొందరి విషయంలో బంధుత్వాలు నీటి మీది గీతల్లా అంత తేలిగ్గా చెరిగిపోవని నిరూపించారు. వెన్నెల భోజనాలు అలా ఊసులూ, కబుర్ల మధ్య పూర్తయిన తరవాత మాధవి శివగామిని, మధులికను, కమలవాణిని దగ్గర దగ్గరగా కూర్చోబెట్టి తన ముబైల్ ద్వారా సెల్ఫీ తీసి ముగ్గురు చెంపలకూ ముద్దు పెడ్తూ 'థేంక్స్' అంది.
శివగామి చిలిపిగా నవ్వుతూ "థేంక్స్ యెందుకు మహరాణీ!" అని అడిగింది.
మాధవి ఆత్మానందంతో స్పందించింది గలగల నవ్వుతూ, "మళ్ళీ ముగ్గురు వదినెల్ని యిలా ఒకేచోట వెన్నెల కాంతిలో యెప్పుడు చూస్తానో కదా!"
ఆ మాటతో కరిగిపోయిన కమలవాణి చెమ్మగిల్లిన కళ్ళతో మాధవిని అక్కున చేర్చుకుని బుగ్గన ముద్దు పెట్టుకుంటూ శివగామి వేపు తిరిగి అంది, "యు ఆర్ లక్కీ శివగామీ!"
ఆ మాటను స్వీకరిస్తూ శివగామి తలూపింది. బాల్కనీలో చంద్రుడి వెలుగులో భోజనాలయి హిమ ద్రావకం తీసుకోవడం పూర్తయిన తరవాత అందరూ హాలులోకి వచ్చారు. హాలు మధ్య కుర్చీ వేసుకు కూర్చున్న నర్సమ్మ చేతిలో చీరలున్నాయి. ఉమాదేవి మొదట శివగామిని అత్తగారి వద్దకు పంపించింది. తల వంచి నమస్కరిస్తున్న శివగామినిని ఆశీర్వదించి ఆమెకు ఒక చీరను అందించింది యింటి పెద్దావిడ. ఆ తరవాత మధులిక మందహాసంతో వచ్చి నేలపైన వంగి నమస్కరించి, నర్సమ్మ యిచ్చిన చీరను లేచి అందుకుని తలవంచి నిల్చుంది. నర్సమ్మ మధులికను ఆశీర్వదించి పంపించింది. ఉమాదేవి చేత ఇద్దరికీ బొట్టు పెట్టించింది.
ఇక ఆఖరుగా కమలవాణి వంతు. శివగామి కనుసన్నలతో యిచ్చిన సైగ అందుకుని కమలవాణి పెద్దావిడ వేపు నడిచింది. ఆ ఉద్విగ్న క్షణం కోసం అందరూ ఊపిరి బిగబట్టి నిల్చుని చూడసాగారు. కాని ఎవరూ యెదురు చూడని విధంగా నర్సమ్మ యే మూడ్ లో ఉందో మరి, కమలవాణికి చీరనిచ్చి నెత్తిపైన చేతులుంచి ఆశీర్వదించింది. "ఈ ఆశీర్వాదం నీకూ, నీ బిడ్డకు. ధర్మార్థ కామ మోక్ష సంపూర్ణ ఫలసిద్ధి రస్తూ!"
కమలవాణి అమ్మానాన్నలిద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలారు. కాని ఆ స్వాంతన యెక్కువ సేపు నిలువలేదు. చీర అందుకుని అమ్మానాన్నల వేపు నడచి వెళ్తున్న కమలవాణిని ఆగమంది నర్సమ్మ. సోమశేఖరం ఊపిరి బిగబట్టాడు. ముసిల్ది యెటువంటి అణుశక్తి పూర్వక మిస్సాయిల్ వేస్తుందోనని. ఆ యింటి ప్రాంగణంలో ఆవిడ విసిరే మిస్సాయిల్ కి తిరుగుండదని అతడికి తెలుసు. ఆమె చూపే మొదటి చూపు, ఆమె మాటే చివరి మాట. "పిలిచారా అవ్వా!" అని తిరిగి చూసి దగ్గరకు వచ్చింది తెల్లబోతూ. ఇచ్చిన చీరను తిరిగి లాక్కుంటుందేమో!
"నువ్వు కడుపుతో ఉన్నావు. ఇక్కడకు మొదటిసారి వచ్చావు. మీ అమ్మానాన్నలతో కలసి వచ్చావు. నిన్ను యిబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. కాని చెప్పవలసింది చెప్పే తీరాలిగా! బాగా విను. నీ కడుపున ఉన్న బిడ్డ మీ యింటి బిడ్డ కాదు. మా యింటి బిడ్డ. మా యింటి వంశాంకురం. కాన్పయిన తరవాత బిడ్డను తిన్నగా వచ్చి మాకప్పగించు. ఆడో, మగో, బిడ్డ మాయింట్లోనే పెరుగుతుంది."
===============================================
ఇంకా వుంది
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 21 త్వరలో
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

telugu serial story, ఉదయరాగ ఉద్వేగాలు, Udayaraga Udvegalu, పాండ్రంకి సుబ్రమణి |




Comments