top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Udayaraga Udvegalu - Part 15 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 13/02/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:


తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.


తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.


సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది.


భర్తను విమర్శిస్తున్న అత్తగారిని వారిస్తుంది మధులిక.


కమలవాణి డిప్యూటీ ఎమ్.డి.గా ఉన్న ఆఫీసులో ఇంద్ర కిరణ్‌కు ఉద్యోగం వస్తుంది.




గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 15 చదవండి.


ఇంద్రకిరణ్ ట్రైనీగా చేరిన వారం రోజుల తరువాత అనుకోకుండా కంపెనీ కాంప్లెక్స్ ప్రాంగణంలో అతడికి సోమశేఖరం తటస్థపడ్డాడు. ముఖం చాటేసుకోకుండా కారు వద్ద నిల్చున్న అన్నయ్య వద్దకు వచ్చి పలకరించాడు – “ఇక్కడేం చేస్తున్నావురా అన్నయ్యా! ఆఫీసుకి వెళ్ళలేదూ?” తమ్ముడిలో ఇంకా ఆకతాయితనం పోలేదని గ్రహించాడు శేఖరం. వాడేమిటి ఇంకా బడి కుర్రోడా, తను ఎందుకోసం ఇక్కడకు వచ్చాడో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో తెలియకపోవడానికి! ఇదంతా తెలుసుకుని ఇంటికెళ్లి వాళ్ల వదినెకు పెద్దలందరికీ చేరవేయడానికన్నమాట. మొత్తానికి వాడు పూర్తిగా వదినె పార్టీగా మారిపోయాడు. “నేనిక్కడకు ఎందుకోసం వచ్చానో నీకు ఎలాగూ తెలియదు కాబట్టి – ఇంటికొచ్చి తీరిగ్గా చెప్తాలే! ముందు కారెక్కు.” “ఎందుకూ?” అన్నట్టు అన్నయ్య వైపు చూసాడు ఇంద్రకిరణ్. “భోజనం వేళ కదా! రెస్టారెంట్‌కి వెళ్లి భోంచేసి వద్దాం.”


“ఇప్పుడు వీలు పడదురా అన్నయ్యా! డ్యూటీ ఫస్ట్ కదరా! నేను మా కొలీగ్స్‌తో కలసి ఇక్కడి క్యాంటీనులో తింటాను. లంచ్ టైమ్ అరగంటలోపలే కదా. సాయంత్రం నువ్వెలాగూ ఇంటికి వస్తావుగా! అప్పుడు మనం కలసి తిందాం. వదిన మన కోసం ఎదురు చూస్తుంటుంది” అని విసవిసా నడచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంద్రకిరణ్. శేఖరం ముఖం చిట్లించి చూసాడు. రాను రాను వీడికి తల తిక్క ఎక్కువై పోతున్నట్లుంది. అక్కడ వీడికి మధులిక వదినైతే – మరి ఇక్కడ కమలవాణి ఏమవుతుందట? బుర్ర ఉపయోగించవద్దూ! తన యవ్వన జీవితంలో – ముఖ్యంగా తన చదువుకునే రోజుల్లో తన ప్రేమ వ్యవహారం ఎలా ఆరంభమయిందో ఎంత వరకు వచ్చి ఆగిపోయిందో విపులంగా అందరి ముందూ చెప్తున్నప్పుడు వీడక్కడ లేడూ! అసలు అదంతా అలా బాహాటం కావడానికి సూత్రధారి వీడే కదా! అలాంటప్పుడు అన్నయ్యకు ఎదురైన గడ్డు పరిస్థితి గురించి సావధానంగా ఆలోచించి విశ్లేషించుకోలేడూ! అంతలో అతడి ఆలోచనా తీగల్ని తెంచుతూ అక్కడకి పర్సనల్ స్టాఫ్‌తో వచ్చింది కమలవాణి. వస్తూనే అడిగింది – “తమ్ముడితో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. ఛేంబర్ కిటికీ నుండి చూసాను. ఏమంటున్నాడు? పెడ ముఖంతో విరుపులతో మెరుపులతో మాట్లాడి ఉంటాడే?” నవ్వుతూనే వాళ్ల మధ్య జరిగింది చెప్పాడామెకు సోమశేఖరం. ఆమె తెచ్చిపెట్టుకున్న ముఖంతో అంది – “వదినంటే మీ తమ్ముడికి చాలా ప్రేమలా ఉంది!”


“వీడికే కాదు – ఇంట్లోని వారందరికీ ఆవిడంటే మీదు మిక్కిలి అభిమానమే. అందులో వీడికి మరీను – వదిన పట్ల హనుమంతుడంతటి భక్తి” అంటూ పక్కన నిల్చున్న కంపెనీ డ్రైవర్ వైపు చూపు సారిస్తూ డోరు తెరచి కూర్చోబోయాడు. అప్పుడు కమల వాణి వారించింది. “వద్దు శేఖర్! అందర్నీ భోజనాలకు వెళ్ళనియ్యి. ఇది భోజనాల సమయం. అంతర్గతంగా విలువైన తరుణం. నేను కారు డ్రైవ్ చేస్తాను. రండి – ముందు కూర్చోండి” అంటూ డ్రైవర్ సీట్లోకి వెళ్లి కూర్చుంది. అనవరతం ఆమె చుట్టూ ఆమె ప్రాపకం కోసం తిరిగే తన సిబ్బంది పట్ల ఆమె చూపించిన అక్కర అతడు గమనించకపోలేదు. ఆమెది నేల విడిచి సాము చేసే తత్వం కాదని అతడికి తెలుసు. ఆమె పక్కన కూర్చుంటూ సేఫ్టీ బెల్ట్ బిగించుకుంటూ తన కుడిచేతిని కమల వాణి నడుం చుట్టూ పోనిచ్చాడు సోమశేఖరం. కారు స్టార్ట్ చేస్తూ – ఆమె తగ్గకుండా ఎమోషనల్లీ స్పందించింది “మరింత గట్టిగా బిగుతుగా!” అందామె మరింత కైపెక్కించేలా. సోమశేఖరం పక్కున నవ్వేసాడు.-----ఉదయం ఎనిమిది కావస్తూంది. శివగామి అత్తయ్యా, మామలకు, భర్తకూ ఇడ్లీలు, దోశెలూ ప్లేట్లలో పెట్టి ఇస్తూంది. సాంబారు కూడా మూడు చిన్నగిన్నెళ్ళో పెట్టి వాళ్ల ముందు కుదురుగా ఉంచింది. 


ఇడ్లీలు సాంబారులో ముంచి తిన్న త్యాగరాజు పుష్పవల్లి వైపు మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు – “నీ కాంచీపురం కోడలు సాంబారు బాగా చేస్తూంది కదూ!” దానికామె నవ్వుతూనే స్పందించింది – “సాంబారుకేం – కొబ్బరి పచ్చడి కూడా బాగానే చేస్తుంది.” అని అటు తిరిగి కాస్తంత గొంతు హెచ్చించి అంది – “అమ్మా శివగామీ – ఇవన్నీ మీ ఆడపడుచుకి కూడా నేర్పించమ్మా!” అప్పుడు పక్కనే నిల్చున్న మాధవి స్పందించింది. “నేర్చుకుంటున్నానమ్మా! ఊతప్పం, పొంగలూ – ఇవి కూడా వదిన నేర్పిస్తుందమ్మా? వదిన ఏవో హయ్యర్ పోస్టుల కోసం పరీక్షలు చదువుతుందిగా! పోటీ పరీక్షల్లో పాసయి ప్రభుత్వ పోస్టు గాని వస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చుగా! ఆ లోపల అన్నీ నేర్చేసుకుంటానులే.” ఆ మాటతో భార్యాభర్తలిద్దరూ కొడుకు వైపు చూసారు సంగతేమిటన్నట్టు. అప్పుడు మురళికి సంభాషణలో పాలు పంచుకోక తప్పలేదు. “ఔను బాబూ! శివగామికి నేచురల్ టాలెంట్ ఉంది. బాధ్యతలు తీసుకుని నిర్వహించ గల సరైన టెంపర్‌మెంట్ ఉంది. అటువంటి స్త్రీ ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకూడదు. చూసారా ఎంత త్వరగా తెలుగు నేర్చుకుంటుందో – ఎంత చక్కగా తెలుగు మాట్లాడ సాగిందో!” కొడుకుకి పుష్పవల్లి ఏదో చెప్పబోయేంతలో మాలతి, చంద్రిక ఇద్దరూ ఒకేసారి ప్రవేశించారు. మాలతిని అందరూ ఆశ్చర్యంగా చూసారు; నువ్వెప్పుడొచ్చావూ అన్నట్టు. “ఏం? నేను రాకూడదా!” మాలతి మూతి వంకర్లు తిప్పుతూ అడిగింది. “ఏం మాటలే అవి! నిన్నెప్పుడు రావద్దన్నాం? మెట్టింటికి వెళ్ళిన తర్వాత మరీ నల్లపూసవయి పోయావు కదా – అందుకే ఆశ్చర్యపోతున్నాం. ఇంతకీ వచ్చిన విశేషం చెప్తావా?”


“ఎందుకు చెప్పనూ! అందుకేగా వచ్చాను. మా వీధి నుండీ, పక్క వాడ నుండీ పూలూ పండ్లతో మీ ఇంటి తమిళ టీచరమ్మ కోసం చాలా సేపట్నుంచీ బయట నిల్చున్నారు. ఎందుకొచ్చారోనని అడిగి తెలుసుకున్నారా!” ఈసారి నివ్వెరపోవడం అందరి వంతయింది. శివగామి అత్తామామల ప్లేట్లలో అల్లం పచ్చడి పెడ్తూ – “నాకోసమా!” అని అడిగింది. “ఔను వదినా! నీకోసమే వచ్చి బయట నిల్చున్నారు. కాసేపు వచ్చి పలకరించి వెళతావా?” శివగామి చేతి గుడ్డతో రెండు చేతులూ తుడుచుకుని మధుమురళి వైపు చూసింది. “అదేమిటి నా వైపు చూస్తావు! నేనా వాళ్ళ కోచింగ్ గైడ్‌ని” అంటూ లేచి వాష్ బేసిన్‌లో చేతులు కడుక్కొని శివగామితో గుమ్మం వైపు నడిచాడు. మొదట సోమ్రాజు వచ్చి పండ్ల తట్టను శివగామికి అందించాడు. “సెంట్రల్ గవర్నమెంట్ డిపార్టుమెంటులో సెక్యూరిటీ అసిస్టెంటుగా సెలెక్ట్ అయ్యాను మేడమ్. హైదరాబాదులో ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత రెగ్యులర్ పోస్టు ఇస్తానన్నారు. ఇప్పటికి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడో తెలియదు.”


“గుడ్! మరి – మీరెందుకు వచ్చినట్టు?” అని వీరరాఘవ వైపు చూసిందామె. అతడూ, బాల్రాజూ కలసి ఒకేసారి పండ్ల తట్టను అందించారు. “మేమిద్దరమూ స్టయిపెండరీ ట్రైనీలుగా సెలెక్ట్ అయ్యాం మేడమ్. ట్రైనింగ్ పీరియడ్‌లో మేం ఉండటానికి, భోజనాలకీ అవసరమైనవన్నీ వాళ్ళే చూసుకుంటారన్నారు మేడమ్. కంపెనీ ఆఫీసు మన ఊరి పొలిమేరనే ఉంది మేడమ్. ట్రైనింగ్ పూర్తయిన తరువాత క్వాలిఫైయింగ్ పరీక్ష పెడతామన్నారు. అందులో పాసయితే అక్కడే పోస్టులిస్తామన్నారు.”


“అలాగా! గుడ్ – కంగ్రాట్స్!” అని అటు వైపు తిరిగి అడిగింది “మరి మీ సంగతేమిటి వాసూ! నాకు గుర్తుండి మీరు రెండు మూడు పరీక్షలు వ్రాసారు. ఎందులో ఫలితం వచ్చింది?” అతడు కూడా నవ్వుతూ ముందుకు వచ్చి పూలూ పండ్లూ ఉన్న తట్టను ఆమెకు అందిస్తూ అన్నాడు – “స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలో పాసయి ఇంటర్వూకి కూడా వెళ్ళొచ్చాను మేడమ్. మీరిచ్చిన సలహా ప్రకారమే కుదురుగా కూర్చుని దేహ భాషను తగు మోతాదులో చూపిస్తూ హాజరయాను మేడమ్. నాకు శంషాబాదు విమానాశ్రయంలో స్టాఫ్ క్లారికల్ క్యాడర్‌లో పోస్టు ఇవ్వొచ్చన్నారు. థాంక్యూ మేడమ్.”


“మరొకసారి మీకందరికీ కంగ్రాట్స్ చెప్తూ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడే మీకందరికీ చెప్పాలి. నేర్చుకోవలసిన పనితనాన్ని ఎప్పుడు ఆపకూడదు. నేర్చుకున్నది చాలని తలపోస్తూ పేనాను పక్కన పెట్టేయకూడదు. గంగమ్మ తల్లి ప్రవహించడం ఆగిపోయినట్లో, ఎండిపోయినట్లో ఎప్పుడైనా విన్నామా? పనితనం కూడా అలాగే నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. పనితనం గల వాడికే విలువుంటుందన్నది ఎప్పుడూ మరచిపోకూడదు. ఇంకా కొందరు సక్సీడ్ కాకపోవచ్చు. వాళ్ళకు నథింగ్ టు వర్రీ అని చెప్పండి. మొహమాట పడకుండా నావద్దకు రమ్మనమండి. నిరాశ చెందకుండా మరొక ప్రయత్నం చేయమనండి. వాళ్ళ ముందున్న ఆప్షన్ అదొక్కటేగా!” అని అక్కడ నిల్చున్న వారందరికీ చేతులూపుతూ మధుమురళి చేతిని అందుకుని వెనక్కి తిరిగింది శివగామి. మాధవి, చంద్రిక, మాలతి ముగ్గురూ అక్కడున్న పూల తట్టలను, పండ్ల తట్టలనూ అందుకుని శివగామి వెనుక నడిచారు. ఎందుకో మధుమురళికి శివగామి పక్కన నడుస్తుంటే ఎప్పుడో చదివిన కవిగారి పద్యం అసంకల్పితంగా గుర్తుకొచ్చింది. గుండెలో ఆర్ద్రత చోటు చేసుకుంది. “అశ్రువులు నన్నెపుడు ఆదుకొని వుండాలె - అశ్రువులు లేనట్టి అసువులేల నాకు?” సహాయం చేయడం కాదు ముఖ్యం. ఆ సహాయాన్ని నిశ్శబ్దంగా నిరాడంబరంగా చేస్తూ పోవడంలోనే ఉంది ఔన్నత్యం. ఏదీ ఎదురు చూడకుండా పంచుకుంటూ పోవడంలోనే ఉంది సౌజన్యత.


కాసేపటికి ఉపాహారం తీసుకోవడం పూర్తయిన తరువాత అందరూ హాలులో తీరుబడిగా కూర్చున్నారు. అప్పుడు చంద్రిక అక్క ఎదురు చూడని రీతిన ఆసక్తికరమైన విషయాన్ని లేవనెత్తింది – “వదినా – నువ్వు బాగా పాటలు పాడతావటగా! నీ కంఠ స్వరం బాగుంటుందటగా!” ఆ మాటకు శివగామి జర్కింగ్‌కు లోనైనట్టు చూస్తూ అడిగింది – “అలా అని ఎవరు చెప్పారు?”


“ఇంకెవరు? మా చెల్లి చంద్రికే – ఇప్పుడు గాని తమిళనాడులో ఉన్న మీ ఊరెళ్ళితే మళ్ళీ ఎప్పుడు వస్తావో – నా కోసం ఓ పాట పాడవూ!” పుష్పవల్లి కూడా తలూపింది కోడలు వైపు చూసి – పాడమని ప్రోత్సహిస్తూ. ఇక తప్పదన్నట్టు తేల్చుకున్న శివగామి మెల్లగా లయాన్వితంగా పాడనారంభించింది – “అలై పాయుదే కణ్ణా – అలైపాయుదే.” సుస్వరంతో పాడిన ఆ పాటకు అందరూ మైమరిచారు. మెచ్చుకోలుగా తప్పట్లు కొట్టారు. మాధవి చెంగున లేచి వెళ్లి వదినెను కౌగలించుకుంది. మధుమురళి చిన్నగ నవ్వి సుతారంగా లేచి నిల్చుని తన గది వైపు నడిచాడు. మురళిలో కనిపించిన ముఖ భావాన్ని గమనించిన శివగామి కూడా సౌమ్యంగా లేచి “ఇప్పుడొస్తాను” అని అతణ్ణి అనుసరించింది. గదిలో అతణ్ణి అందుకుంటూ అంది – “నా పాట నచ్చలేదా!” అతడు నిదానంగా తిరిగి చూసి అన్నాడు షర్టు మార్చుకుంటూ – “బాగుంది గాని – నువ్విలా చేస్తావనుకోలేదు శివగామీ!”


“నేనేమి చేసాను? చెప్తే కదా తెలిసేది.”


“చెప్తాను. చెప్పకుండా వెళ్ళిపోనుగా! సరే – ఇప్పుడు విషయానికి వస్తున్నాను. సావధానంగా విని బదులియ్యి. హాలులో కూర్చున్న అంత మందిలో నువ్వు తప్ప మరెవ్వరైనా తమిళ వ్యక్తి ఉన్నారా అక్కడ?” లేరని బదులిచ్చిందామె. “అలాంటప్పుడు తమిళ పాట పాడటం ఏమిటి? విద్యావంతురాలివి. తోటి వారి మనోభావాలను అర్థం చేసుకోగలగాలి. ఒకటో రెండో తెలుగు పాటలు నేర్చుకున్నావు కదా – వాటిలో ఒకటి పాడవచ్చు కదా! ఇందులో భాషాభిమానం చూపించాల్సిన అవసరమేమొచ్చింది?” శివగామి బదులివ్వలేదు. మధు మురళి ముఖంలోకి రవంత సేపు విస్ఫారిత నేత్రాలతో చూసి “నేనిప్పుడు నా తరపున మాట్లాడవచ్చా నా ప్రియ సఖా!” అందామె అనునయంగా. “ఉఁ” అన్నాడతను. అప్పుడామె చెప్పసాగింది – “తొలి అంశం – అది పాట కాదు. క్లాసికల్ టచ్‌తో కూడుకున్న కీర్తన. శ్రీ కృష్ణుడి పై భక్తితో తంజావూరుకి చెందిన ఊతుక్కాడు సుబ్బయ్యర్ రాసిన సుందర కీర్తన. ఇక రెండవది – నాకున్న తమిళ భాషాభిమానం గురించి ప్రస్తావించారు. అది కూడా చెప్తాను. సంగీత కళ భాషలకూ, జాతులకూ అతీతమైన జీవస్రవంతి. ఒక తమిళ కీర్తన పాడానని అలాగనుకున్నారే – మరి మా కాంచీపురం సంగీత సభలలో – ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మద్రాసు మ్యూజిక్ అకాడమీలో, వివిధ చెన్నై గాన సభలలో అన్నిచోట్లా నలుదిశలా తెలుగు కీర్తనలే వినపిస్తాయి. ఎంతటి గొప్ప వాగ్గేయకారుడైనా త్యాగయ్య వారి తెలుగు కీర్తనను తను వినిపించే కచ్చేరీలో మేజర్ కీర్తనగా పాడి వినిపించకపోతే అది రక్తి కట్టదు. వాళ్లు పాడే ప్రతి కీర్తనలోనూ భక్తి భావం పొంగి పొర్లుతుంది. అంతెందుకు – కొందరు గొప్ప తమిళ వాగ్గేయకారులు తెలుగు నేర్చుకుని స్వయంగా తెలుగులో కీర్తనలు రాసారు. పాడి వినిపించారు. ఉదాహరణకి – శ్యామా శాస్త్రి గారు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, మైసూరు వాసుదేవా చారి – వీళ్ళను సంగీతాభిమానులు మరచిపోగలరా? మీరే చెప్పండి సార్! ఇక్కడ మరొకటి కూడా చెప్పాలి. స్వాతంత్ర్య పోరాట విప్లవ కవి సుబ్రహ్మణ్య భారతి మూడు భాషలు నేర్చుకున్నాడు. ఒకటి – తన మాతృభాష తమిళం. రెండు – తన కుటుంబ సంప్రదాయ భాష సంస్కృతం. మూడవ భాష కూడా నేర్చుకున్నాడు. అదేమిటో తెలుసా మురళీ సార్?” తెలియదన్నట్టు తల అడ్డంగా ఆడించాడతను. అప్పుడామె తన వాక్యాన్ని పూర్తి చేసింది – “తెలుగు” అని ఒత్తి పలుకుతూ. దానికతడేమీ అనలేదు. షర్టు మోచేతులకు బటన్లు వేసుకుంటూ బయటకు నడిచాడు. అప్పుడామె అతణ్ణి ఆపింది – “మీ అసహనం ఇంకా తగ్గలేదా?” అతడు నోరు విప్పకుండా ముందుకు కదలబోయాడు. ఆమె అతణ్ణి మళ్ళీ ఆపింది. ఆపుతూ అడిగింది – “ఏమీ చెప్పరా!”


“నథింగ్.”


“నథింగ్ అంటే –”


“యు ఆర్ రైట్ – ఫుల్లీ రైట్! కీర్తన ఏ భాషలో ఉన్నా అందులో ఉండాల్సింది భక్తి భావన. అదే ప్రధాన అంశం. ఇజిటేట్ నాట్.” ఆ మాట విన్నంతనే ఆమె పట్టరాని సంతోషంతో అతణ్ణి పరుగున వెళ్లి కౌగలించుకుంది – “థాంక్యూ – థాంక్స్ ఎ లాట్” అంటూ.

===============================================

                                                ఇంకా వుంది

                                    ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 త్వరలో

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page