ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 19
- Pandranki Subramani

- 6 days ago
- 6 min read
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Udayaraga Udvegalu - Part 19 - Telugu Web Series | Pandranki Subramani | ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 19 - తెలుగు ధారావాహిక |ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత పాండ్రంకి సుబ్రమణి
Published in manatelugukathalu.com on 15/03/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.
సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది. కమలవాణి డిప్యూటీ ఎమ్.డి.గా ఉన్న ఆఫీసులో ఇంద్ర కిరణ్‌కు ఉద్యోగం వస్తుంది. కష్టాల్లో ఉన్న శిష్యుడు రమణకు సహాయం చేస్తుంది శివగామి.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 19 చదవండి.
శివగామి, ఆరోజు సాయంత్రం మధుమురళి ఇల్లు చేరి మలి స్నానం చేసి పూజాగదిలోకి వెళ్ళి వచ్చిన తరువాత అడిగింది- “మనమిద్దరమూ అలా బయటకు వెళ్ళి వద్దామండీ!”
“ఎందుకూ? మరొక రమణ వంటి వాళ్ళింటికి వెళ్ళడానికా? నేను ముందే చెప్పాగా—ఇంటిని సత్రంలా మార్చకూడదని—కాంచీపురంలో చేసినవన్నీ ఇక్కడ చేయకూడదని. ఇంట్లో మనతో బాటు ఇంకా చాలామందే ఉన్నారని—ఇక ఇప్పుడు ఇంట్లో వాళ్లు నాగురించి ఏమనుకుంటున్నారో తెలుసా!” (శివగామి ప్రశ్నార్థకంగా చూసింది.) “నేను ప్రతిదానికీ పెళ్లాం మాటకు తలూపుతున్నానంట!”
“రమణ విషయంలో నేను చూపించిన చొరవ వల్ల మీకు మాటలు పడ్డాయని సారీ చెప్పాను కదండీ! ఐ ప్రామిస్. అలాంటి విషయానికి మిమ్మల్ని తీసుకెళ్లను. మీతో మాట్లాడాలి. అందుకే...”
మురళి ఆమె ముఖంలోకి లోతుగా చూశాడు. శివగామి హ్యాపీ మూడ్ లో ఉంది. జాగు చేస్తే అటువంటి మూడ్ ఆమెకు మళ్ళీ రాదు. ఈ వయసులో బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసరు పోస్టుని అందుకోవడం అంటే మాటలా? ఇటువంటి ఉత్తేజకరమైన సమయంలో ఆహ్లాదకరమైన ఆమె మూడ్ పాడవటానికి తను కారకుడు కాకూడదనుకుంటూ శివగామి అందించిన టీ కప్పు అందుకుని ఆ తరువాత దుస్తులు వేసుకుని వచ్చాడు.
ఇద్దరూ కొద్ది దూరం నడచి వచ్చిన తరువాత, ఎర్ర పూలతో విరబూసిన బాడిగ చెట్ల వరసకు వచ్చిన తరువాత శివగామి అంది- “సారీ!” అని.
ఎందుకన్నట్టు ఆమె కళ్ళలోకి చూశాడు.
“నాకు తెలుసు మీరెందుకంత కోపంగా ఉన్నారో. నేను మేటర్ ఫాలో చేస్తూనే ఉన్నాను. ఇద్దరు ముగ్గురు పురోహితుల్ని సంప్రదించారట. నక్షత్రాలు, రాశులూ మన జాతకం ప్రకారం కుదరడం లేదట. అలా కుదురకుండా చేరితే మన ఇద్దరి భవిష్యత్తు శోభ కోల్పోతుందట. కీడు...”
అతడు ఆమె మాటను పూర్తి చేయనివ్వలేదు. “నోర్మూస్తావా శివగామి! ఏమీ తెలియనట్టు నటించడం మీవాళ్ళకు అలవాటులా ఉంది. మొత్తానికి మీరందరూ కలసి నన్ను సన్యాసం పుచ్చుకునేలా చేసేటట్టున్నారు. మీకు వత్తాసుగా మా వైపు ఒకరు. కానీ అసలు విషయం అది కాదని నాకు తెలుసు. నువ్వెక్కడ మాతో ఇమడ లేకపోతావోనని మీ వాళ్ళకు శంక. అలా గాని నువ్వు మాతో ఇమడ లేకపోతే—వాళ్ళ ముందు కన్నీరు మున్నీరుగా వాపోతే— అక్కణ్ణించి అందరూ పొలోమని వచ్చి నిన్నిక్కణ్ణించి తీసుకుపోవడానికి...” అనేంతలో శివగామి అతడి నోటిని చేతితో మూసింది.
“ప్లీజ్! అంతటి మాట అనకండి. ఒప్పుకుంటాను మా వాళ్ళకు అంతటి ఛాదస్తం ఉండకూడదు. అన్నిటికీ సింగినాదం జీలకర్ర పాటించకూడదు. నా జీవితంలో మీరే నాకు సర్వస్వం. నేను మీ దానిని. మీకు ఆనందాన్ని ఇవ్వలేని ఈ యవ్వనం ఎందుకు?” అని అంటూనే రోడ్డు ఓరన ఉన్న పూలమ్మి వద్ద ఆగిపోయిందామె.
“శివపూజలో ఎలుగు ప్రవేశించినట్టు మన మధ్య వాళ్ళెందుకు దూరాలి? మల్లెలు, కనకాంబరాలు ఇక్కడ కొనండి. మనతోటలో గులాబీలు, మరువాలున్నాయి. రాత్రికి వాటిని తెచ్చుకుంటాను. అంకుల్ గారు గాని విషయం తెలిసి అడిగితే నేను చెప్పుకుంటాను, అంతా నా తరపునే జరిగిందని. సరేనా!”
“ఇట్స్ ఓకే! ఆవేశపడకు. మీ కాంచీపురం వాళ్ళ ఛాందస్తానికి హద్దంటూ ఉండకూడదా అన్న యావతో అలా అన్నాను. నాకు మా అత్తామామలపై గౌరవం లేక కాదు. ఇక పాయింటెడ్ క్వశ్చన్ కి వస్తే—నాకు మాత్రం తెలవదా హైందవ ధర్మం ప్రకారం వివాహ బంధం దానికోసమే జరిపించేది కాదని—ఇంకా దాంట్లో ఉన్నతమైన ఉద్దేశ్యాలే ఉన్నాయని. సరే, ఇక మనమెక్కడకు వెళదాం?” అని ముందుకు కదిలాడు అతను.
చెప్తానంటూ, ఆమె రెండు మూరల మల్లెలు తలలో తురుముకుని మరో నాలుగు మూరల పూలు అరిటాకులో చుట్టివ్వమని చెప్పి మురళి వాటికి చిల్లర చెల్లించిన తరువాత తను కూడా ముందుకు కదులుతూ అంది- “నిర్మలాదేవి గారింటికి వెళుతున్నాం”
కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అడిగాడు- “ఎందుకూ? బ్రహ్మకమల మొక్కలెలా నాటాలని అడగడానికా? రుద్రాక్ష వృక్షాన్ని పెరట్లో ఎలా నాటాలో తెలుసుకోవడానికా?”
“నో! ఆ విషయం తరువాత చూసుకుందాం. ఇప్పుడు మనం నిర్మలాదేవిగారి చెల్లెలిని చూడటానికి వెళుతున్నాం”
“ఆమెను చూడటానికా! ఎందుకో చెప్పవా?”
“ఎందుకు చెప్పను! వైదేహి నాతో బాటు బ్యాంకు సర్వీసు ఎగ్జామ్ రాసింది. కానీ, సక్సెస్ కాలేకపోయింది”
“దానికి నువ్వేం చేస్తావోయ్? ఇప్పుడు గాని సక్సెస్ అయిన నిన్ను చూస్తే మరింత డిస్టర్బ్ అవుతుందేమో!”
“ఆమె ఇలాగైనా అనుకోవచ్చు. కానీ, ఆమె నిస్పృహలో కుంగిపోతున్నప్పుడు చూసి ఓమాట చెప్పి రావడం మన కర్తవ్యం కాదా?” అతడేమీ అనకుండా నిశ్శబ్దంగా నడవసాగాడు. “ఆమెకు ధైర్యం చెప్పడం మాత్రమే కాదు- ఆమె వద్దకు వెళ్ళడానికి మరొక కారణం కూడా ఉంది”
అదేమిటన్నట్టు ఆమె కళ్ళలోకి చూశాడతను.
“ఎస్.బి.ఐ.లో సుమారు ఎనిమిది వేల అప్రెంటిస్ పోస్టులు ఫిలప్ చేయబోతున్నారట. గుర్తింపు పొందిన ఏ సంస్థనుంచైనా డిగ్రీ ఉత్తీర్ణత చాలు. ఆన్ లైన్ పరీక్ష. స్థానిక భాషలోని నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మూడు సంవత్సరాల అప్రెంటిస్ షిప్. మూడు సంవత్సరాలూ స్టయిఫెండ్ ఇస్తారు. దీనిని వైదేహి భవిష్యత్తుకు పునాదిగా మలచుకోవచ్చు కదా!”
“రియల్లీ ఫైన్! ఇప్పట్నించే స్టడీ ఆరంభిస్తే ప్రిపరేషన్ బలంగా ఉంటుంది” అని ఆగిపోయి శివగామి వేపు చూసి అడిగాడు- “మరి ఈ పువ్వులెందుకు? మన మధ్య ఆ మేటర్ సెటిల్ అయిపోయిందిగా?”
“ఇప్పుడీ పువ్వులు మన కోసం కాదు. వైదేహికి ధైర్యం చెప్పి రావడానికి.”
ఆమె నోట ఆ మాట విని- “ఫైన్!” అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు పోనిచ్చాడు. ఎదుటివారి దు:ఖాన్ని తన దు:ఖంగా స్వీకరించగలగడం ఉత్తమ మానవీయ లక్షణమే కదా! అది తన భార్యలో చూడగలగడం తనకేర్పడ్డ సకారాత్మకమైన అంశమే కదా! తను సెంట్రల్ ఎగ్జాముకి తయారవుతున్నప్పుడు తన స్పెషల్ క్లాసుకి వచ్చిన మోటివేటర్ చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి- “అసలైన విజేతలు అసలైన సంపన్నులు వీరే—దృఢమైన దేహం కలిగి ఉన్నవారు. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోగలిగిన వారు. చేసే పనిని పరిపూర్ణంగా ఆస్వాదించేవారు. డబ్బుకీ, సౌఖ్యాలకీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. కష్టాలలో ఉన్నవారిని కరుణపూరిత నయనాలతో పలకరించేవారు. అలారం అవసరం లేకుండా నిద్రలేచేవారు. తమకు స్ఫూర్తినిచ్చే పరిసరాలలో నివసించేవారు”
***
నగరం నలుమూలలా ఉన్న ఆలయాలలో కార్తిక శోభ వెల్లి విరుస్తోంది. ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి.
భక్తులకు ముఖ్యంగా కుటుంబస్థులకు నదీ స్నానం ఉత్తమం. ఫలప్రదం. కానీ, ఇంట్లో వాళ్లకు బయటికెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కడా నది గాని, సముద్రం గాని దగ్గరదాపున లేదు. ఎలాగో—పరమేశ్వరుడి ప్రీతి పాత్రను పొందాలి. అందుచేత సత్యానందం భార్యతో కలసి, సోమశేఖరం మధులికతో కలసి- “దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళ తరంగే! శంకరమౌళి విహారిని విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే!” అని గంగాదేవిని స్మరిస్తూ ఇంట్లోనే మంగళ స్నానాలు ఆచరించారు. నర్సమ్మ, ఇంద్రకిరణ్ కూడా అలానే చేసి ముగించారు. పనిలో పనిగా సమీపంలో ఉన్న అమ్మవారి గుడికి కూడా వెళ్ళి వచ్చి హాలులో గుంపుగా కూర్చుని కాంతమ్మ అందించిన టీ కప్పులను అందుకుని సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు—వాళ్ళ నందర్నీ ఆశ్చర్యంతో అదరగొట్టేలా ఇంటి ముందు తెల్లటి వ్యాను ఆగింది. ఇంద్రకిరణ్ నేను చూసొస్తానంటూ వెళ్ళి క్షణాలలో తిరిగొచ్చి- “అమ్మా! చినబాబూ, చిన్నమ్మా వచ్చారే!” అని కబురందించిన వెంటనే ఇంటాళ్ళిపాదీ వసారా వేపు జలప్రవాహంలా దూసుకు వెళ్ళారు. నిజమే! రామకృష్ణాపురం నుండి కుటుంబమంతా పెండ్లి ఊరేగింపులా దిగారు. మధుమురళి, శివగామి, మాధవి వేగంగా నడచుకుంటూ వచ్చి పెద్దలందరి పాదాలకూ నమస్కరించారు. నర్సమ్మ శివగామి తలపైన చేతి నుంచి, “ఎట్టకేలకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చామన్నమాట! నేనెప్పుడు రమ్మన్నాను- నువ్వెప్పుడొస్తున్నావు తల్లీ! పెద్దల పట్ల మీ కాంచీపురం వాళ్ళు చూపించే మన్నన ఇదేనన్నమాట!” అని నవ్వుతూనే ఎత్తి పొడించింది. అప్పుడు శివగామి సారీ చెప్పడానికి నోరు తెరిచే లోపల పుష్పవల్లి అడ్డువచ్చి అత్తగారికి సంజాయిషీ చెప్పుకుంది. “విషయం అది కాదత్తయ్యా! మీ చిన్నబ్బాయే మమ్మల్నందర్నీ ఉన్నపాటున లాక్కొచ్చాడు. ఎందుకూ అని అడగబోకండి. వింటే నవ్విపోతారు.” “ఎందుకూ—” అన్నట్టు నర్సమ్మ చిన్న కోడలు వేపు తదేకంగా చూసింది. “మీరు మాటిమాటికీ మీ చిన్నబ్బాయి కలలోకి వస్తున్నారట.
వాళ్ళన్నయ్య, వదనెలు కూడా అదే రీతిన గుర్తుకి వస్తున్నారట. ఆ రీతిన చిన్నప్పటి కాలేజీ రోజులు కూడా జ్ఞప్తికి వస్తున్నాయట. ఈ మధ్య మాటలు బొత్తిగా తగ్గించడం వల్ల వదినెకి తన మీద కోపం పూర్తిగా తగ్గలేదేమోనని మీ చిన్నబ్బాయి ఫీలైపోతున్నాడత్తయ్యా! చదువుకునే రోజుల్లో వదినె తనను ఎంతో మాలిమితో చూసుకునేదని చెప్పుకుంటూ మురళి పెళ్ళి సంబంధం విషయంలో వదినెను ఇబ్బందిపాలు చేసానని తెగ ఇదైపోతున్నాడంటే నమ్మండి!” అని చెప్పడం ముగించింది పుష్పవల్లి. దానితో నర్సమ్మ తల్లి గుండె చెరువయింది. గుంపుకి ఎడంగా నిల్చున్న త్యాగరాజు వద్దకు వెళ్ళి అతణ్ణి అక్కున చేర్చుకుంది. “గతం గత: కదరా! నువ్వేంటి అదంతా కావాలనా చేసావు? ఏదో గ్రహపాటున అదలా జరిగిపోయింది. అయినా, నీ గురించి నాకాపాటిది తెలియదా ఏమిటి? నీ పైన చేయి చేసుకున్నానని మీ అన్నయ్య ఇంటికొచ్చి ఎంత రాద్ధాంతం చేసాడని—” అని సత్యానందం వేపు చూపు సారించిందామె. ఆ చూపులోని సంకేతాన్ని అందుకున్న సత్యానందం వేగంగా వచ్చి తమ్ముణ్ణి వాటేసుకున్నాడు. వాటేసుకుంటూ శివగామి వేపు చూపు తిప్పి- “కంగ్రాట్స్ శివగామి! బ్యాంకు ఎగ్జామ్ లో మంచి ర్యాంకుతో సెలెక్ట్ అయ్యావట!” శివగామి థేంక్స్ అంటూ అతడి కాళ్ళకు నమస్కరించింది. తడిసిన కళ్ళతో పుష్పవల్లి బావగారి కాళ్ళకు నమస్కరిస్తూ అంది- “మురళి పెళ్ళి విషయంలో మీకు ఇబ్బంది కలిగుంటుంది. క్షమించండి!” అదేమీ లేదంటూ మరదలు తలపైన కుడి చేతినుంచాడు సత్యానందం. వాతావరణం ఉన్నపాటున తేటపడింది, తేలిక పడింది. తోటలోకి వసంత కోకిల వచ్చినట్లుంది. వసంత రాగం అందుకున్నట్లుంది.
మధ్యాహ్న భోజనాలప్పుడు కాంతమ్మతో పుష్పవల్లి, శివగామి చేతులు కలిపారు. మధులిక కూడా వాళ్ళతో కలవటానికి రాబోతుంటే శివగామి ఆమెను వారించి నడిపించుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి బుజ్జగింపుగా అంది- “మేం ఇక్కడ
ఉన్నన్నాళ్ళూ నువ్వేమీ చేయకక్కయ్యా! ఈ ఒక్కసారి నీ పెద్దరికాన్ని నాకప్పగించు- సరేనా!” ఆ రీతిన మరి కాసేపట్లో తోడుకోడళ్ళిద్దరూ కలసిపోయారు. ఆప్యాయతలు నింపుకున్నారు. కళ్ళూ కళ్ళూ కలిపి మనసులు విప్పి కబుర్లు చెప్పుకో సాగారు. ఆ కోవన కాంచిపుర కామాక్షమ్మ గుడి గురించి, శంకర మఠం గురించి పెక్కు విషయాలు అడిగి తెలుసుకుంది మధులిక. ముఖ్యంగా ఆలయ అర్చకుడిగా జీవించిన కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు- ముమ్మూర్తుల్లో ఒకరైన శ్యామాశాస్త్రి గురించి తెలుసుకోవడమే కాక, కొన్ని ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకుంది.
మధులిక అంతసేపు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తనతో మాటలు కలుపుతూన్న శివగామి తమిళ అమ్మాయి అన్నది ఒక్కసారి కూడా ఆమెకు తోచలేదు.
===============================================
ఇంకా వుంది
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 20 త్వరలో
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments