top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 21



Udayaraga Udvegalu - Part 21 - Telugu Web Series | Pandranki Subramani | ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 21 - తెలుగు ధారావాహిక |ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత పాండ్రంకి సుబ్రమణి

Published in manatelugukathalu.com on 29/03/2026

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:

తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్. సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. శివగామి బ్యాంకు జాబ్ కు సెలెక్ట్ అవుతుంది. మధులికతో పాటు కమలవాణికికూడా వెన్నెల భోజనాలు ఏర్పాటు చేస్తారు.

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 21 చదవండి.

“ఒక ఉత్తరం… వారి జీవితాన్ని మార్చబోతోంది!”


కాంచీపురం నుండి ఎట్టకేలకు బంధుగణం రామకృష్ణాపురం వచ్చి చేరారు. దీనదయాళన్ - భార్య ధనమ్మాళ్ - వాళ్ళిద్దరి కూతుళ్ళు వేదనాయగి - షణ్ముగవల్లి కూడా అమ్మానాన్నలకు తోడుగా వచ్చారు. మొత్తానికి పకడ్బందీగానే సర్వ సన్నద్ధులై వచ్చారు చిన్నకూతురు శివగామి శుభకార్యం ముగించి వెళ్ళడానికి. 


త్యాగరాజు పుష్పవల్లితో వెళ్ళి మిత్రుడి కుటుంబానికి ప్రత్యుత్థానం చేశాడు. విషయం తెలుసుకున్న మురళి పెద్దమ్మ కూడా కూతురు చంద్రికతో పరుగున వచ్చి వాలింది. అదంతా తన గది నుండి గమనిస్తున్న మధుమురళి అసహనానికి లోనయ్యాడు. ఎంతటి కాంచీపురం సంప్రదాయ కుటుంబానికి చెందినవారైతే మాత్రం ఛాందసానికంటూ ఒక లక్ష్మణ రేఖ ఉండొద్దూ! 


ఎప్పుడో ఎక్కడో పెళ్ళయి — ఇన్నాళ్ళ తర్వాత అత్తామామల ఆధ్వర్యంలో ఇక్కడ శోభనం జరగబోతుందని ఇరుగు పొరుగులకు తెలిస్తే ఊరూ వాడా నవ్విపోరూ! అంతటితో కథ సమాప్తమవుతుందా — లేదు - తనకి ఇద్దరు చెల్లెళ్ళున్నారు. అసలే వాళ్ళిద్దరూ కొంటెకోణంగిలు. తననూ శివగామినీ గుచ్చి గుచ్చి చూడరూ! ఆట పట్టించరూ! 


ఇది చాలదన్నట్టు అక్కడి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా సాగవలసిన శృంగార పర్వాన్ని శాంతి ముహూర్తం అని శాస్త్రోపయుక్తంగా పిలుస్తారు; అదేదో పదిమంది మధ్య ఆర్భాటంగా చేసుకునే పండగలా - సంబరంలా --- నృత్య వేడుకలా --


అనుకున్న శాంతి ముహూర్తం అనుకున్న ఘడియకు పుణ్య ముహూర్త సమయాన శివగామికీ మధుమురళికీ మధ్య కిటికీ గుండా గిలిగింతలు పెట్టే చందమామ కొంటె నవ్వుల మధ్య మలయ మారుత కూనిరాగాల మధ్య హాయిగా హోరుగానే జరిగింది. ముందే వాళ్ళ మధ్య ఏర్పడ్డ పరస్పరాకర్షణ వల్ల మధురిమలు చిందే మొదటి రాత్రి జోరుగానే కాక - హోరుగా మదనోత్సవంలా మన్మథ నాట్య విన్యాసంలా జరిగింది. 


అయితే — మధుమురళి అత్తింటి వారనుకున్నట్టు, ఇంటిల్లపాదీ సందడి చేసినట్టు సర్వమూ సవ్యంగా సాగలేదు. ఎదురు గాలి తగిలింది. ఆ మాటకు వస్తే, మానవ జన్మలో అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడు జరిగిందని! ఎక్కడ సంపూర్ణత సంతరించుకుని జరిగిందని --- 


శోభనం జరిగిన మరునాడు - అందరూ మంగళ స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు వేసుకుని భవానీ దేవి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఇంటి గుమ్మం వద్ద డిపార్టుమెంటల్ కవరుతో కొరియర్ సిద్ధంగా నిల్చున్నాడు. అప్పుడు - “ఎవరికయ్యా ఆ ఉత్తరం?” అంటూ దానిని అందుకోవడానికి చేయి చాచబోయాడు త్యాగరాజు. 


కొరియర్ వెనక్కి అడుగులు వేశాడు. ”సారీ సార్! ఇది అర్జెంటు గవర్నమెంటు వారి ఉత్తరం. మధు మురళి గారి పేర వచ్చింది” అంటూ మధుమురళికి అందించి సంతకం తీసుకుని రివ్వున వెళ్ళిపోయాడు. 


అందరూ నిర్ఘాంతపోతూ చూడసాగారు. ఇదెక్కడి అపశకునం శివ పూజలో ఎలుగు దూరినట్లు — అప్పుడు త్యాగరాజు గొంతునిచ్చాడు - “కవరు విప్పకుండా అవేం చూపుల్రా మురళీ! మీ మామగారు కంగారు పడుతున్నట్టున్నారు అందులో చార్జీ షీటో ఇంక్వయిరీ నోటీసో ఇంకేదో ఉండవచ్చని —“ 


మామగారి మాటల్ని విన్న శివగామి నిదానంగా నడుచుకుంటూ దగ్గరకు వచ్చి భర్త చేతిపైన చేతినుంచింది సాంత్వనగా -- అప్పుడు మధు మురళి పుంజుకున్నాడు -.. “మీరెందుకు బాబూ అలా కంగారు పడుతున్నారు? చుట్టూ ఆడవాళ్ళున్నారు. బెంబేలు పడరూ! కవరుని తమాషాగా చూస్తున్నాను ఇది ఇక్కడి ఆఫీసు నుండి వచ్చిన కవరులా లేదేనని —” అని సర్రున కవరు చించి లోపలి ఉత్తరాన్ని తీసి చకచకా చదివి పట్టున నవ్వాడు. 


ఈసారి దీనదయాళన్ ముందుకు వచ్చి అన్నాడు - “మాప్పిళే! మీరు తర్వాత నవ్వుదురు గాని — ముందు మేటర్ చెప్పండి మాప్పిళే —” 


అతడు మళ్ళీ అదే నవ్వు ముఖంతో అన్నాడు - “సీరియస్ అయిన వ్యవహారమేదీ కాదు మామగారూ! సగం దిగులు పుట్టించేది - మరొక సగం సంతోషకరమైనదీ --” 

ఈసారి పుష్పవల్లి ఉగ్గబట్టలేక పోయింది - “నీకింకా కుర్రబుద్ధి పోలేదురా మురళీ! కట్టుకున్న పెళ్ళాం పక్కనుంది. ఇక ఆటలు మాని విషయానికి రా! మీ పెద్దమ్మ ఎలా చూస్తుందో గమనించావా”


“చెప్పకుండా ఎక్కడికి వెళ్తానమ్మా! నన్ను వెంటనే బయల్దేరి ఢిల్లీ హెడ్డాఫీసులో రిపోర్ట్ చేయమన్నారు. రిపోర్టు చేసిన తర్వాత డిప్యూటీ కమిషనర్ పోస్ట్ ప్రమోషన్ ఆర్డర్ అందుకోమన్నారు. అంటే — నేను ఢిల్లీకి వెళితే గాని నాకు ప్రమోషన్ ఆర్డర్ ఇవ్వరన్నమాట ---“ 


ఆ మాటతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు “వెంటనే అంటే — ఎప్పుడు డ్యూటీలో జాయినవ్వాలి మాప్పిళే!”


 “రేపే వెళ్ళాలనుకుంటున్నాను మామగారూ!“ అని పక్కకు తిరిగి అడిగాడు - “నువ్వేమంటావు శివగామీ!” 


ఆమె ఇబ్బందికరంగా ముఖం పెట్టి అంది - “మూడు నాలుగు రోజులు ఉండి వెళదామండీ!”


“ఎందుకూ — నీకిక్కడేమి పని? బ్యాంకింగ్ సర్వీసు ఇంటర్వ్యూ ఇక్కడ ఎలాగూ జరగపోయేది లేదు. ఢిల్లీకే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కుదురుగా జరిగేటట్టు చూసుకోవచ్చు కదా!“


 “లేదండీ నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. నిర్మలాదేవిగారు బ్రహ్మకమలం మొక్క తీసుకువచ్చి మన పెరట్లో నాటుతానన్నారు. దానిని ఎలా సాకాలో చెప్పి వెళ్తానన్నారు!” 


ఈసారి ధనమ్మాళ్ గట్టిగా అంది - “అప్పురం — (తర్వాత?)“ అని.


 “సొల్రేం అమ్మా! (చెప్తానమ్మా!)” అని బదులిచ్చి మురళి వైపు తిరిగింది - “చంద్రికకూ మాధవికీ ముఖ్యమైన ఇమ్యూనిటీ యోగా నేర్పుతున్నానండీ. ముఖ్యంగా నౌకాసనం. అది రేపటితో ముగుస్తుంది. సగంలో వెళ్ళిపోవడం బాగుండదు. ఇక ఆఖరి అసైన్మెంటు - కొందరు అబ్బాయిలు ఐటీఐ లో పాసైన వారికి రిటన్ ఎగ్జామ్ ఎలా వ్రాయాలి - ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎలా దేహ భాషను చూపించాలి - ఎలా ఆచితూచి జవాబులివ్వాలి అన్నదానిపై మాక్ పరీక్ష పెట్టబోతున్నాను. 


మూడు పోస్టులకు రిటన్ టెస్టే లేదు. ముఖ్యంగా అకాడమిక్ మెరిట్ ఆధారంగానే ఎంపిక జరగబోతుంది. కచ్చితంగా ఓరల్ ఇంటర్వ్యూ కఠినంగా ఉంటుంది. వీళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇవ్వాలి. పలుకులో చూపులో సెలెక్టర్స్ ముందు చిన్నపాటి తడబాటు కూడా దుష్ఫలితాన్ని సృష్టిస్తుంది. ఇంతవరకూ వచ్చి వాళ్ళను సగంలో విడిచి వెళ్ళిపోతే బాగుండదు కదండీ!” 


మధుమురళి ఇంకేమీ అనకుండా అలాగే అన్నట్టు తలూపుతూ అడిగాడు - “ ఏదో పొద్దు పుచ్చడానికి అనుకున్నాను గాని, కోచింగ్ క్లాసుల్ని ఇంత సీరియస్ గా తీసుకుంటావనుకోలేదోయ్. సరే — అదలా ఉంచు. నాలుగో రోజు ప్లేన్ టిక్కెట్టు బుక్ చేసేదా? ” 


ఆమె తలూపింది. అప్పుడు చంద్రిక రివ్వున వచ్చి ఏదో అంది. దానికి శివగామి నవ్వుతూనే చిరాకు చూపించి ఏదో అని పంపించేసింది. మధుమురళి అయోమయంగా చూశాడు సంగతేమిటన్నట్టు — ఈసారి ధనమ్మాళ్ తో ఏదో మాట్లాడి దీనదయాళన్ కలుగజేసుకున్నాడు. 


”మేమిక్కడకు వచ్చే ముందు ఒక వారం రోజులుండి వెళ్దామనే వచ్చాం. ఇక మేమిక్కడ ఏం చేస్తాం త్యాగరాజు! మేం కూడా నాలుగవ రోజు బయల్దేరుతాం. ఈలోపల ఇక్కడేమేమి చూడాలో అన్నీ చూపించు నన్బా — (మిత్రమా)” 


త్యాగరాజు నవ్వుతూ అలాగే అన్నట్టు తలూపుతూ మిత్రుణ్ణి కౌగిలించుకున్నాడు. పుష్పవల్లి కూడా నవ్వు ముఖంతో ముందుకు వెళ్ళి ధనమ్మాళ్ చేతుల్ని తన చేతుల్లోకి అందుకుంది. అంత వరకూ దూరాన గమనిస్తూ నిల్చున్న సరోజమ్మ కూడా దగ్గరకు వచ్చి వాళ్ళ చేతులపైన చేతులుంచింది.


శివగామి అక్కణ్ణించి కదలి వెళ్ళబోతున్న మాధవిని పిలిచి అందరికీ టీలు చేసి పెట్టమని పురమాయించి లోపలకు వెళ్ళబోయింది. అదే అదనుగా మధుమురళి ఆమె భుజంపైన చేతినుంచి ఆపాడు. ’ఏమిటోయ్! నీ ఆడపడుచులిద్దరూ రెండు మూడు సార్లు వచ్చి నీ చెవిలో గుసగుసలాడారు. నిర్మలాదేవిగారిలా అయితే ఏం చేస్తావని అడుగుతున్నట్టు వినిపించింది, నువ్వెందుకు నిర్మలాదేవిగారిలా తయారవ్వాలి? నీ క్వాలిఫికేషన్ వేరు. నీకున్న నేపథ్యం వేరు. ఇది కూడా తెలవద్దా వాళ్ళకి?”


“ అబ్బ! విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏదేదో అనేయకండి. నన్ను నిర్మలాదేవిగారితో పోల్చడం లేదు మీ చెల్లెళ్ళిద్దరూ -” 


మరి - అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. 


“నిర్మలాదేవిగారికి నాలుగు నెలలు. ఆ విధంగా నీకైతే ఢిల్లీలో నువ్వు ఎలా ఎదుర్కుంటావని నర్మగర్భంగా చెవిలో ఊదుతున్నారు.”


 ఆ మాట విని మురళి నవ్వకుండా ఉండలేకపోయాడు. ”ఇద్దరూ ఆకతాయితనం పోనిచ్చుకున్నారు కాదు. అంత దిగులు వాళ్ళకెందుకూ! నేను లేనూ —”


“నేనలా అనలేదు. నాకు ఇద్దరత్తయ్యలున్నారు. అవసరమే గాని కలిగితే నాకోసం రెక్కలు కట్టుకుని వాలుతారన్నాను”


“ఏం — నువ్వన్నట్టు అదే రీతిన అవసరమే గాని కలిగితే కాంచీపురం నుండి మీ అమ్మా అక్కయ్యలిద్దరూ రారూ!” 


ఆ మాటకామె ఉఁ హూ - అని తల అడ్డంగా ఆడిస్తూ అంది - “మొదట వాళ్ళు కాదు. మా అత్తయ్యలే పిలుపందుకుని ఆగమేఘాలపైన వస్తారు. అవసరం కలగాలే గాని మాధవపురం నుండి మా ఉమాదేవత్తయ్య కూడా వస్తారు. ఎనీ డౌట్?” 


లేదన్నట్టు తల అడ్డంగా ఆడిస్తూ మనసున మౌనంగా అనుకున్నాడు - “ఈ కాంచీపురం తమిళమ్మాయి తెలుగు కుటుంబంతో బాగానే కలిసిపోయింది సుమా!”


===============================================

                                                ఇంకా వుంది

                                    ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 22 ( చివరి  భాగం) త్వరలో

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



telugu serial story, ఉదయరాగ ఉద్వేగాలు, Udayaraga Udvegalu, పాండ్రంకి సుబ్రమణి

 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page