top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 22


“అతను వెళ్లిపోయాడు… కానీ ఎందుకు? సమాధానం ఒక ఉత్తరంలో ఉంది…”

Udayaraga Udvegalu - Part 22 - Telugu Web Series | Pandranki Subramani | ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 22 - తెలుగు ధారావాహిక |ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత పాండ్రంకి సుబ్రమణి

Published in manatelugukathalu.com on 05/04/2026

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:

తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్. సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. శివగామి బ్యాంకు జాబ్ కు సెలెక్ట్ అవుతుంది. మధులికతో పాటు కమలవాణికికూడా వెన్నెల భోజనాలు ఏర్పాటు చేస్తారు. మధుమురళికి ఢిల్లీకి ట్రాన్ఫర్ అవుతుంది.

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 22 చదవండి.


జీవితమంటే అదుపులోకి రాని నిరంతర మహా సంగ్రామమేగా!

జీవిత ప్రయాణమంటే సులువుగా, సరళంగా రాజమార్గాన సాగిపోతూనే -

ఉన్నట్టుండి ఇదిగో! అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని భరోసా ఇవ్వడమేగా!


అప్పుడలా సాగిపోతూనే నడిరోడ్డున చప్పున అయోమయంగా చూస్తూ ఆగిపోవడమేగా!

ఆగిపోయి, విస్తుపోయి కన్నార్పక మరొక మలుపున తిరిగి మరొక దారిన పోతుండడమేగా!


అప్పుడప్పుడు సోమశేఖరం ఇరుగు పొరుగు ప్రాంతాలకు బిజినెస్ మీటింగ్స్ కని, కంపెనీ లావాదేవీల విషయమని వెళ్ళడం రివాజే! అయితే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకు, ముఖ్యంగా తన ఇద్దరు ప్రియురాళ్ళకు చెప్పి వెళ్ళడం అలవాటు. కానీ ఈసారి అలా చెప్పడం మరచిపోయినట్టున్నాడు. అసలు తానెక్కడికి బయల్దేరాడో, ఏ పని పైన బయల్దేరాడో తన పర్సనల్ స్టాఫ్ కి సహితం చెప్పడం విస్మరించినట్టున్నాడు. ఏక మొత్తంగా అన్నీ త్యజించి, అన్నిటినీ విదల్చి సాగిపోయినట్టు వెళ్ళిపోయాడు; 'టు గో అండ్ నెవర్ టు రిటర్న్' అన్న ధోరణిలో --


సోమశేఖరం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి నాలుగు రోజులవుతుంది. ఖంగుతిన్న ఇంటిల్లపాదీ చాలా చోట్లకి, ముఖ్యంగా దగ్గరి బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశారు. ఎక్కణ్ణించి నమ్మకం కలిగించేలా వార్త రాలేదు. తన మొదటి జీవన సహచరి కమలవాణి ఇంట్లో మకాం పెట్టేశాడా! లేక ఆమెతో కలిసి ఎక్కడికైనా దూర దేశాలకు సాగిపోయాడా! అందరిలో వణకు పుట్టనారంభించింది. ఏమి జరిగుంటుంది? ఎందుకలా జరిగింది? 


ఒకవేళ బిజినెస్ రైవల్రీ వల్ల, ప్రత్యర్థుల తాకిడి వల్ల ముప్పు సంభవించి ఉంటుందా! ఇక ఆఖరి ఆలోచనగా పోలీసుల వద్దకు వెళ్ళి ఫ్యామిలీ లాయర్ ద్వారా రిపోర్టు ఇవ్వడానికి సంసిద్ధులవుతున్నప్పుడు, పోస్ట్‌మ్యాన్ డోర్ బెల్ నొక్కి గుమ్మం వద్ద నిల్చున్నాడు. ఇంద్రకిరణ్ వేగంగా దూసుకు వెళ్ళి అడిగాడు - ఎవరికని. రిజిస్టర్డ్ కవరు సత్యానందంగారికని చెప్పాడతను. సత్యానందం ఉన్నపాటున లేచి వెళ్ళి సంతకం చేసి కవరు అందుకున్నాడు. హాల్లోకి నడుస్తూనే చెక్ చేశాడు. అది తన పెద్ద కొడుకు సోమశేఖరం నుండే వచ్చిందని గ్రహించాడతను. 


కవరు చించి ఉత్తరం మడత విప్పబోతున్నప్పుడు గుమ్మం వద్ద - "మామగారూ!" అన్న గొంతు వినిపించి తలెత్తి చూశాడు. 


కమలవాణి కంగారుగా బొంగురు పోయిన గొంతుతో నడచి వస్తుంది. నర్సమ్మ, ఉమాదేవి ఇద్దరూ ఏమీ అనలేదు. అంటే శేఖరం పోక కమలవాణికి కూడా తెలిసుండదన్నమాట. మధులిక వైపు ఓసారి చూసి ఊరకుండిపోయారు. అప్పుడు ఇంద్రకిరణ్ మాత్రం కదలి వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని "ఉత్తరం అన్నయ్య వద్ద నుండి వచ్చినట్లుంది వదినగారూ! ఇప్పుడిప్పుడే వచ్చింది. రండి వచ్చి కూర్చోండి. నథింగ్ టు వర్రీ - ధైర్యంగా ఉండండి" అని నడిపించుకు వచ్చి అందరికీ దగ్గరగా, ఒకరి ముఖం మరొకరు చూసుకునేలా కూర్చుండబెట్టాడు. 


ఆమె టీ-పాయ్ పైనున్న వాటర్ బాటిల్ నుండి నీళ్ళు తాగి బరువుగా ఊపిరి పీలుస్తూ అడిగింది - "శేఖర్ ఏమి రాశారు మామగారూ?". 


"మడత విప్పి చదవబోతున్నప్పుడు నువ్వొచ్చావమ్మా! ఇద్దరూ విషయం తెలుసుకోకుండా కంగారు పడిపోయి బ్లడ్ ప్రెజర్ పెంచుకోకండి. ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరిద్దరూ ఉత్తి మనుషులు కారు - గుర్తు పెట్టుకోండి" అని మధులిక వైపు చూశాడతను. 


ఆమె నిశ్శబ్దంగా లేచి వచ్చి కమలవాణి పక్కన కూర్చుంది.


"నేనిప్పుడు చదవబోతున్నాను. ఎవరూ ఎమోషనల్ గా ఫీలయిపోకుండా సావధానంగా విని ఆ తర్వాత ముందుకు సాగుదాం. సరేనా!" అని ముందుకు సాగేలోపల కమలవాణి అమ్మానాన్నలిద్దరూ అక్కడికి చేరుకున్నారు. 


ఇంద్రకిరణ్ ఎదురు వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ అందించి ఎదురు సోఫాలో కూర్చుండ బెట్టాడు. సత్యానందం అదేమీ గమనించకుండా చెప్పసాగాడు. "వాడేదో చెప్పాలని వేగిరపాటుకి లోనయినట్టున్నాడు. ఎదురుగా వచ్చి చెప్పలేక ముఖం చెల్లక ఇలా ఎక్కణ్ణించో ఉత్తరం రాసి పంపించి ఉంటాడు. చెప్పాచెయ్యకుండా కనుమరుగయి ఉంటాడు. అర్థమైందా!" 


ఉమాదేవితో పాటు ఇద్దరు కోడళ్ళూ తలలూపారు. 


సత్యానందం చదవసాగాడు - "బామ్మ పాదాలకూ, మీ పాదాలకూ నమస్కరించి వ్రాయునది సోమశేఖరం. ఈ మధ్య అంతులేని, అంతుబట్టని అయోమయానికి లోనవుతున్నాను. ఎటు చూసినా నాకు ప్రతిబంధకమే ఎదురవుతుంది. ఎప్పుడో ఒక కవిగారన్నట్టు - కొందరు తన మధ్య నుంచి వెళ్ళిపోతే, త్వరగా వెళ్ళిపోతే బాగుంటుందనిపిస్తుందట. మరికొందరు చిరకాలం తన వద్ద తనతోనే ఉండిపోతే బాగుంటుందనిపిస్తుందట. 


నేను ఏ తరహాకి చెందినవాడినో నాకు తెలియటం లేదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా కలగటం లేదు. ఒకటి మాత్రం నాకు ఎల్లవేళలా అనిపిస్తుంది. ఇప్పటికి నేను ఇక్కడ లేకుండాపోతే కొన్ని సమస్యలు మంచు ముక్కల్లా వాటికవే కరిగిపోతాయని, పరిష్కారానికి దారి చూపిస్తాయని. మొత్తానికి ఎక్కడో ఏదో దుష్టగ్రహం ప్రవేశించింది. 


అది నా వల్లనే ప్రవేశించినట్లు తోస్తుంది. నా వల్ల కాకపోతే మరెవరి వల్ల? కచ్చితంగా నన్ను ప్రాణప్రదంగా ప్రేమించే కమలవాణి వల్ల అయిఉండదు. ఇకపోతే - నన్ను ప్రాణప్రదంగా అభిమానించి ఆరాధించే మధులిక వల్ల కూడా కానేరదు. 


అందుకే తీర్మానించాను గూడు విడిచి వెళ్ళిపోవాలని, సత్య మార్గం వెతుక్కుంటూ పోవాలని -- నిజానికి నా ప్రయాణం ఆత్మ ఔన్నత్యం కోసం కాదు, ఆత్మోద్ధరణ కోసమూ కాదు; నేను ప్రయాణించేది ఆత్మశుద్ధి కోసం. ఇదే నా అన్వేషణ, నిరంతర అన్వేషణ. నాలోకి నేను తరచి చూసుకుంటే నాకొకటి అనిపిస్తుంది; నేను పొందవలసిన జీవితానందాన్ని మీదు మిక్కిలి అనుభవించేశానని - ఇప్పుడు దీనిని సరిదిద్దుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. 


మన పుణ్య భారత భూమిలో నలువైపులా ఉన్న అన్ని తీర్థ స్థలాలను దర్శించి, పరిపూర్ణ ఆత్మానందాన్ని పొంది చిట్టచివరన ఋషికేశ్ వైపు సాగి, అక్కడున్న శివాశ్రమంలో చేరిపోతాను. మునివరుల నుండి, ఋషి పుంగవుల నుండి ఆత్మబోధన పొంది ధన్యుడినవుతాను. తిరిగి రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది - ఎన్ని సంవత్సరాలు పడుతుందన్నది నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే అది నాకు తెలియదు. చివరి మాట, చివరి కోరిక - మీ ఇద్దరు కోడళ్ళూ బామ్మ మాట ప్రకారం నడుచుకుంటారు. నాకు తెలుసు - ఇద్దరికీ వాళ్ళ మరది ఇంద్రకిరణ్ తోడుగా ఉంటాడని. 


ఒకవేళ కాల ప్రవాహంలో ఇద్దరూ వాళ్ళ జీవన మార్గాన్ని వాళ్ళు వెతుక్కోవాలని తీర్మానిస్తే దయచేసి వాళ్ళకు అడ్డంగా నిలవకండి. ఎందుకంటే ఒకరి జీవితాన్ని శాసించే అధికారం మరొకరికి ఉండదుగా!

నన్ను క్షమించండి బాబూ! నన్ను క్షమించండి అమ్మా!

బామ్మ పాదాలకు నమస్కరిస్తూ--

                                                                                                                     సోమశేఖరం.


===============================================

ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక ముగిసింది. ఆదరించిన పాఠకులకు రచయిత శ్రీ పాండ్రంకి సుబ్రమణి గారి తరఫున, మనతెలుగుకథలు.కామ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



telugu serial story, ఉదయరాగ ఉద్వేగాలు, Udayaraga Udvegalu, పాండ్రంకి సుబ్రమణి

 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page