top of page
Writer's pictureYasoda Gottiparthi

ఫస్ట్ క్రష్



'First Crush' - New Telugu Story Written By Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 13/08/2024

'ఫస్ట్ క్రష్' తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


సుమన్ తండ్రి కావూరి నియోజకవర్గ M L A.. బాగా పలుకుబడి, మంచి పేరున్న వ్యక్తి. తండ్రి వైభవం తో గొప్పలు చెప్పు కుంటూ స్నేహితులతో తిరుగుతూ పబ్బుల్లో, పార్టీలతో కాలక్షేపం చేస్తుంటాడు సుమన్. పెద్ద యూనివర్సిటీలో MBA చేస్తూ చదువు మీద శ్రద్ధ లేకున్నా, కాలేజీకి రావడం, తోటి విద్యార్థులతో సబ్జెక్టు లెక్చరర్ చెప్పిన విషయాలను తెలుసుకుని అందరి ముందు పెద్ద బిల్డప్ ఇస్తుంటాడు. చూడడానికి అందంగా ఎత్తుగా చామన ఛాయలో స్టయిలిష్ ప్యాంటు షర్టు ల్లో చలాకీగా తిరుగు తుంటాడు. 


 అదే యూనివర్సిటీలో గవర్నమెంట్ టీచర్ కూతురు, ఇంటెలిజెంట్, సామాజిక స్పృహ, రాంక్ తెచ్చే అమ్మాయి వల్లీ పై కన్ను పడింది. 


 నిన్న చరిత్ర అంశాల్లో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అక్బర్, రాజ్యం లో ప్రజలకు చేసిన సేవలు, బీదలకు వస్త్రదాన, అన్నదానం, బాటసారులకు నీడనిచ్చే చెట్లు నాటించడం మొదలైన కార్యక్రమాలు గురించి అటుగా వస్తున్న వల్లీ వినేట్లుగా చర్చిస్తుంటాడు. 


 అక్కడికి వెళ్లి విన్న వల్లీ ఒక రాజకీయ నాయకుడి కొడుకు ఇలాంటి సంఘోద్ధరణ విషయాలను చర్చించడం ఆసక్తి కరంగా, అభిమాన పరంగా తోచి దగ్గర కావడం ప్రారంభమైంది. 


“హాయ్ ! వల్లీ నువ్వూ వాలంటీరుగా నాతో జాయిన్ కావొచ్చు. ఈరోజు అనాధాశ్రమం వెళ్లి వాళ్లకు బట్టలు పండ్లు వగైరా పంచుకొందామను కుంటున్నాము”. 


“అలాగా! నేను కూడా వస్తాను” అన్నది వల్లీ. 


ఆశ్రమం లో ఇద్దరు వృధ్దులను అమ్మమ్మ, తాతా అని ప్రేమగా, ఆత్మీయంగా పలుకరిస్తూ పండ్లు చేతికిచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటూ ఫోటోలు దిగడం, ఆశ్రమం పెద్దలంతా వారికి ధన్యవాదములు చెప్పడం, రిపోర్టర్స్, tv వాళ్ళు వచ్చి వారిని అభినందిస్తూ ఫోటోలు తీసి వారి సేవలను పెద్ద అక్షరాలతో వార్తా పేపర్ లో ముద్రించారు. 


మరునాడు పేపర్ చదువు తున్న ఎమ్మెల్యే రామ్ చందర్ మొదటి పేజీ లోని కొడుకు పక్కన ఉన్న అమ్మాయి ఫోటోలు, వారు చేసిన సేవలకు అభినందిస్తూ వ్రాసిన వ్రాతలు చదివి జులాయిగా తిరిగే వీడికి ఇంత మంచి బుద్ధి రావడం ఆశ్చర్య మనిపించింది. ఆ అమ్మాయి ద్వారా నైనా బాగుపడితే చాలు అని సంతోషించాడు. నా వారసత్వాన్ని పుచ్చుకుని నాకంటే పై ఎత్తులో ఎదగాలని ఆశించాడు. 


 సుమన్, వల్లీ కాలేజీ ప్రాంగణంలో ఒక ప్రక్కగా కూర్చున్నారు. 

“నీ నా అభ్యుదయ భావాలు, ఆశయాలు పెనవేసుకున్నాయి. అవన్నీ నీ చెంపల్లో కెంపులయి దోచుకోవాలని పిస్తుంది. అధరాల మధురిమలు అందుకోవాలనిపిస్తుంది”


గల గల నవ్వేసింది వల్లీ. 


“నీ నవ్వుల్లో నవ రత్నాలను మూట గట్టుకుని దాచుకోవా లనిపిస్తుంది” అని బుగ్గలపై చిటికెలు వేసాడు. 


తియ్యని మాటలు వింటూ తన్మయత్వంతో నవ్వుతుంది. అటు పక్కగా వెళుతున్న ప్రిన్సిపాల్ చూసి చూడనట్లుగా చూస్తూ పెద్ద వాళ్ళ, రాజకీయ నాయకుల వ్యవహారం అని వెళ్ళిపోయాడు. 


అలా కాలేజీలో ప్రేమికులుగా అందరి దృష్టిలో పడ్డారు. వాలెం టైన్స్ డే దగ్గరిలో ఉందిగా ఆరోజు ప్రపోస్ చేసుకుంటారేమో అని ఆసక్తి తో వున్నారందరు. 


 ఆరోజు రానే వచ్చింది. ఇద్దరూ సాధారణ, స్వచ్ఛమైన ప్రేమికులుగా కలుసుకుందామన్నారు. 


“వల్లీ! నువ్వు ఎప్పుడూ వేసే ఛుడి దార్ లో కాకుండా ఫారిన్ డ్రెస్సు వేసుకుని రా. నేను జీన్స్, షర్ట్ వేసుకుని వస్తాను. లిల్లీ ఫ్లవర్ తోటలో కలుసుకుందాము. ప్రేమికులు పరవశించే లవర్స్ పార్క్ లో కలుద్దాం” అన్నాడు. సరే అన్నది వల్లీ. 


 ఉదయాన్నే తల స్నానం చేసి స్టైల్ గ పోనీ టైల్ వేసుకుని బ్లూ కలర్ స్కర్టు, లైట్ పింక్ పువ్వులున్న టాప్ వేసుకుని, కళ్ళు వేసే ప్రేమ బాణాలను కంట్రోల్ చేస్తూ, మనసు పాడే మధుర రాగాలు ఆలపిస్తూ ఆమని కోయిలలా ఎదురు చూస్తోంది. 


గేట్ దూరంగా కార్ పార్క్ చేసి హుషారుగా పార్కు లోకి వస్తున్న సుమన్ బ్లూ జీన్స్, క్రీం కలర్ టీ షర్ట్ లో హ్యాండ్సమ్ గ చేతిలో ఎర్ర గులాబీలున్న చిన్న కొమ్మ తో, ఈల వేసుకుంటూ వచ్చి వల్లీ వెనుకనుండి కళ్ళు మూసాడు చేతులతో. 


“హాయ్  సుమన్! ఇంత లేటా? ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు” అన్నది. 


“మనం కూడా ఎంజాయ్” అని గులాబీలు బుగ్గలకు తాకిస్తూ  ‘లవ్ యు’ అని చేతికి ముద్దిచ్చి కౌగిలిలో ఒదిగాడు. 


దూరం నుండి కావలి కాస్తూ చూస్తున్న ఒక సంస్థ కార్య కర్తలు చేతిలో పసుపు కొమ్మున్న పసుపు తాడు తెచ్చి సుమన్ చేతికిచ్చి “మీరు నిజమైన ప్రేమికులైతే మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడండీ. పాస్చాత్య పోకడలకు స్వస్తి చెప్పండీ” అని అంటుండగానే సుమన్ కోపంతో “మీరెవరు చెప్పడానికి? మా ఇష్టం” అన్నాడు. 


‘నేనేదో ఒకసారి పటాయించి వదిలేద్దామని ప్లాన్ వేస్తే..’ అని మనసులో అనుకుంటూ “ఎమ్మెల్యే కుమారుణ్ణి. నన్నెవరూ ఏమి చెయ్యలేరు. మా యిద్దరి పెళ్ళికి చాలా సమయముంది. పేరెంట్స్ కోడలిని చూడాలి, కోడలిని మెచ్చాలి. ఆస్తి అంతస్థు నచ్చాలి” అంటుంటే “ఇక ఆపు సుమన్! ఏo మాట్లాడుతున్నావ్ ? మన మనసులు, ఆశయాలు కలిసాయి. ఎవరి ఇష్టాయిష్టాలు అవసరం లేదు. నా మెడలో పసుపు తాడు కట్టేసేయ్. మనస్సాక్షిగా ఒక్కటవుదాము” అంది వల్లీ.


ఆమాటలు విన్న సుమన్ “నేనొప్పుకోను అని పారిపోతుంటే, వల్లీకి అతని అసలు రూపం కళ్ళ ముందు కనపడింది. తన అమాయకత్వం తో ఆడుకోవాలని చూసాడు అని అర్ధమైంది. భూమి బద్దలైనట్లుగా తోచింది. 


వెళ్లి పోతున్న సుమన్ ని తీసుకవచ్చి “వాలెంటైన్స్ డే పేరుతో మోసం చేస్తున్న ప్రేమికుల అసలు స్వరూపం బయట పెట్టడానికే ఎమ్మెల్యే గారు ఇలా చేయమన్నారు. తన పర భేదం చూడొద్దన్నారు. వల్లీ గారిని తమకోడలిగా చేసుకుంటారట. మిమ్ములను మంచి దారిలో నడిపించటం వారికి బాగా నచ్చిందట. మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు. పసుపు తాడు కట్టుతూ ఒక ఫోజు ఇస్తే చాలు” అన్నారు ఆ సంస్థ వాళ్ళు


మరునాడు లాన్ లో కూర్చుని పేపర్ చదువుతున్న ఎమ్మెల్యే మొదటి పేజీ లో కొడుకు, కోడలు ఫోటో చూస్తుండగా న్యూస్ పేపర్ విలేఖర్లు, tv రిపోర్టర్స్ వచ్చి అభినందించడం చూచిన సుమన్, వల్లీ “మన ఫస్ట్ క్రష్ అద్భుతం” అని గంతులు వేయసాగారు. 


శుభం. 


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం


50 views0 comments

Comments


bottom of page