top of page

ప్రేమికుడు - పార్ట్ 11


He's an ex

'Premikudu (He's an ex) - Part 11' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 13/08/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 11' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఇంటికి వెళ్ళాక భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తెస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు.


శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి.



ఇక ప్రేమికుడు పార్ట్ 11 చదవండి. 


 సడన్ గా చెప్పడం ఆపేసింది పార్వతి.

 అప్పటికే తలకిందులు అవుతున్నారు శేషగిరి.. గిరిజలు.

 ఏమీ మాట్లాడలేక పోతున్నారు.

 పార్వతి ఏడుపు మొదలెట్టేసింది.


 "అయ్యో. పార్వతిగారూ.. తమాయించుకోండి. ప్లీజ్. ఏడవకండి." అనగలిగింది గిరిజ.


 పార్వతి వైపు నుండి రాగిణి వైపుకు తల తిప్పుకున్నాడు శేషగిరి.

 రాగిణి బొమ్మలతో ఆడుకుంటుంది.

 శేషగిరి ఏం చెయ్యాలో తేల్చుకోలేక పోతున్నాడు.

 పార్వతి బెక్కుతోంది.


 "ముందు మీరు వెళ్లి.. నీళ్లు తాగి రండి." చెప్పింది గిరిజ.


 పార్వతి చీర కొంగుతో కళ్లొత్తుకుంటూ.. లేచి కదిలింది.

 "అరె. ఏంటీ పార్వతి స్ట్రగుల్స్. తొలుత నుండే.. పాపం." జాలి పడుతోంది గిరిజ.


 "ఇప్పటికి మనం వెళ్దామా. తర్వాత వచ్చి కలుద్దాం." చెప్పాడు శేషగిరి.


 "పూర్తిగా తెలియందే ఏ కొలిక్కి వచ్చేయలేం." చెప్పుతోంది గిరిజ.


 అంతలోనే పార్వతి నీళ్లు తాగి వచ్చింది.

 తిరిగి కూర్చుంది.

 "చెప్పలేక పోతున్నాను." మెల్లిగా చెప్పింది.


 "అలా అనుకోకు. చెప్పు. నీ భర్త జాడ్యం ఇంకా తెలియాలి." చెప్పాడు శేషగిరి.


 అర నిముషం తర్వాత..

 శేషగిరితో..

 "ఏమీ అనుకోకు. నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి నువ్వు పాపతో ఇక్కడ ఉండవా. నేను నీ భార్యకి పెరటిలో చెప్తాను." పార్వతి వేడుకోలుగా అంది.


 శేషగిరి భార్యని చూసాడు.

 "మీరు ఇబ్బంది పడొద్దు." లేచింది గిరిజ.


 పార్వతి లేచి.. గిరిజను తీసుకొని పెరటి వైపు కదిలింది.

 అటు ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్న పార్వతి తల్లిని చూడగలిగింది గిరిజ.

 పెరటిలో..

 బావి చప్టా మీద పార్వతి.. గిరిజ కూర్చున్నారు.

 పార్వతి తిరిగి చెప్పనారంభించింది.

***

 ప్లాష్బాక్ 2 కొనసాగుతోంది..

 "ఆలస్యం భరించలేను. చెప్పింది చేసి పెట్టు." కుమార్ తొందరవుతున్నాడు.


 పార్వతి తెములుకోలేక పోతోంది.

 "అన్నట్టు మరోటి. నీ నోట్లో పాలు.. నా నోట్లోకి నువ్వు పోస్తున్నప్పుడు నీ నోరు నా నోటికి తగల కూడదు. ఆఁ." జల్సాగా చెప్పాడు కుమార్.


 పార్వతి మరింత బిగుసుకుపోతోంది.

 "హే. చెప్పింది చెయ్యి." ఈ సారి కాస్తా మోటుగానే చెప్పాడు కుమార్.


 పార్వతి ఒళ్లు జలదరించింది.

 భర్తని చూడలేక పోతోంది.

 మరి ఆగక.. 

 "హే చెయ్యవే." అన్నాడు. 


 అంతలోనే పార్వతి పిఱుదులను తన అర చేతులతో పట్టి అమాంతంగా తన వైపుకు ఆమెను లాగేసుకున్నాడు కుమార్.


 పార్వతి చేతిలోని పాలు కొద్దిగా ఒలిగాయి.

 "హేయ్. పాలు నేల పాలు ఐతే ఊరుకోలేను." రోషమయ్యాడు కుమార్.


 భర్తని అటకాయించలేక పోతోంది పార్వతి. 

 అలా అని.. అతడు చెప్పింది చేయలేకపోతోంది.

 అంతలోనే కుమార్.. పార్వతి చేతిలోని పాలు గ్లాస్ ని.. ఆమె చేతితోనే.. ఆమె నోటి వైపుకు తోసాడు. ఆమె మూతి కేసి ఆ గ్లాస్ ని నొక్కాడు.


 మరి తప్పదన్నట్టు.. పాలును నోటిలోకి పీల్చుకుంటుంది.

 "హే. నువ్వు మింగ కూడదు. అన్నీ పాలు నావే." కుమార్ చెప్పాడు.


 పార్వతి కళ్లల్లో నీళ్లు కమ్మేస్తున్నాయి.

 ఐనా.. కుమార్ చెప్పినట్టే.. తడవ తడవగా.. ఆ గ్లాస్ పాలును కుమార్ చే తాగించింది. 

 'పార్వతే తాగించింది' అనే కంటే.. 'కుమారే అలా తాగించుకున్నాడు' అనడం సబబు.

 పాలు తాగేక..

 "హమ్మయ్య. నా గుండె నిండి పోయింది. ఇక పడుకుంటాను. నువ్వు ఈ నేలన పడుకో. మంచం మీదికి రాకూడదు." చెప్పాడు కుమార్.


 పార్వతి గతుక్కుమంది.

 "నువ్వు పడుకొనే ముందు లైట్ ఆర్పేసి. నాకు లైటుంటే నిద్ర పట్టదు." చెప్పి..

 కుమార్ మంచం మధ్యన కాళ్లు పంగ చాచుకొని పడుకున్నాడు.


 అలానే నిల్చుండి పోయింది పార్వతి.

 "పడుకోకపోతే తగలడు. ఆ లైటార్పు. నిద్ర పట్టడం లేదు." కుమార్ విసుక్కున్నాడు.


 పార్వతి కదిలి.. గోడన ఉన్న లైట్ స్విచ్ ని ఆఫ్ చేసింది.

 ఒక్క మారు చీకటి కావడంతో.. అలానే ఉండిపోయింది.

 చిన్న వెలుతురు కావడంతో.. అక్కడ నుండి కదిలింది.


 నేల మీదన తన ఒళ్లును పడేసింది.. ఆ మంచం పక్కనే.

 తనకు నిద్ర పట్టడం లేదు. కన్నీళ్లు ఆగడం లేదు.

 దానికి తోడు.. కుమార్ గురక మెల్లి మెల్లిగా పెరుగుతోంది.

***

 పార్వతికి వెక్కిళ్లు మొదలయ్యాయి.

 దాంతో చెప్పడం ఆపేసింది.

 తను గిరిజని చూడలేకపోతోంది.

 పార్వతి అవస్తని గిరిజ గుర్తించింది.


 "కూలవ్వండి. తర్వాత మాట్లాడుకుందాం." చెప్పింది.


 లేచింది.

 పార్వతి లేస్తూ..

 "శేషగిరిని ఏమనుకోవద్దనండి. అతడికి ఇలాంటివి ఎలా చెప్పుకోగలను." లజ్జగా అంది.


 "నేను అర్ధం చేసుకున్నాను." చెప్పింది గిరిజ.


 ఆ వెంబడే..

 "తెలియడం కోసం నేను అతనితో చెప్పాలి. ఐనా వివరంగా చెప్పనులే." చెప్పింది.


 "మీ ఇష్టం." అనేసింది పార్వతి.


 ఆ ఇద్దరూ.. శేషగిరి.. రాగిణి వైపుకు వచ్చారు.

 "మనం వెళ్దాం. డప్పులు శబ్దం వినబడుతున్నాయి. అటు వెళ్లాలిగా." శేషగిరితో చెప్పింది గిరిజ.

 శేషగిరి లేచాడు. 


 రాగిణిని ఎత్తుకున్నాడు.

 గిరిజ బొమ్మల్ని తీసుకుంది.

 "మళ్లీ కలుద్దాం." చెప్పాడు పార్వతితో శేషగిరి.


 పార్వతి మెల్లిగా తలాడించింది.

 వాళ్లు వీథిలోకి వెళ్లేక.. వీథి గుమ్మం తలుపు మూసేసి.. ఇంట్లోకి వచ్చింది.

 "ఏంటే.. మళ్లీ వాళ్లేనా." అడుగుతోంది పార్వతి తల్లి. తను అప్పటికే మంచం మీద గోడకు చేరపడి కూర్చుని ఉంది.


 "ఆఁ. వాళ్లే." ముభావంగా అనేసింది పార్వతి.


 "మళ్లీ ఏదీ కొంప మీదకి తేబోకు." హెచ్చరికలా అంది పార్వతి తల్లి.


 అది పట్టించుకోనట్టు.. 

 "ఊరేగింపు వస్తోంది. నిన్ను గడపలో కూర్చుండబెడతాను. లే." అంటూ తల్లిని లేవనెత్తుతోంది పార్వతి.

 ***

 తమ ఇంటి వైపుకి వెళ్తూ..

 దార్లో..

 "ఉఫ్. పార్వతి.. పార్వతి ఈజ్ అన్లక్కీ. వాట్ ఎల్స్ డిడ్ షి ఎక్స్పీరియన్స్." గిరిజ గింజుకుంటుంది.


 "ఏం ఐంది. ఏం చెప్పింది." శేషగిరి అతృత పడతాడు.


 "చెప్తాను. మనం తర్వాత మాట్లాడదాం." అనేసింది గిరిజ.


 శేషగిరి మరేమీ అనలేదు.

 అతడి చంకన రాగిణి హుషారుగా ఉంది.

 వాళ్లు నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటిని చేరుకున్నారు.

 ఆ తర్వాత..

 వీథి వెంబడి వచ్చిన ఊరేగింపుని తిలకించారు.

 రాగిణి తెగ సంబర పడిపోతోంది.


 అమ్మోరు పూనినావిడ తమ ఇంటి ముందుకు రాగానే..

 అనసూయతో పాటు గిరిజ..

 వెళ్లి.. 

 ఆవిడ కాళ్లు కడిగింది.

 ఆవిడ నుదుటన పసుపు రాసి.. కుంకుమ బొట్టు పెట్టింది.

 ఆవిడ కాళ్లకు నమస్కరించింది.


 అటు కదిలి వచ్చిన ఆ వేడుక క్రమేపీ మరో వీథి మలుపు తీసుకోగా..

 అప్పలస్వామి వాళ్లంతా ఇంటిలోకి వెళ్లారు.

 భోజనాలకు సిద్ధమయ్యారు. 

***

 పడక్కోసం గదిలోకి వచ్చి.. ఆ గది తలుపు మూసి.. మంచం మీద కెక్కింది గిరిజ.

 శేషగిరి నిద్రపోలేదు.

 రాగిణి నిద్రపోతోంది.

 "పార్వతి సంగతులు ఏంటి." శేషగిరి కదిపాడు.


 "ఇక్కడ కాదు. మనం ఇంటికి వెళ్లాక చెప్తాను." చెప్పింది గిరిజ.


 ఆ వెంబడే..

 "మనం రేపు ఉంటాంగా." అడిగింది.


 "ఆఁ. రేపటికి నేను సెలవు పెట్టాను. ఎల్లుండి ఉదయం ప్రయాణమవ్వాలి." చెప్పాడు శేషగిరి.


 "రేపు మనం పార్వతితో చాలా సేపు ఉండగలగాలి. ఇంకా తెలుసుకోవాలి." చెప్పింది గిరిజ.


 శేషగిరి ఏమీ అనలేదు.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










144 views1 comment

1 Comment


Like
bottom of page