విజయదశమి 2024 కథల పోటీలు
- Mana Telugu Kathalu - Admin
- Jan 15, 2024
- 3 min read
Updated: Apr 13, 2024

Vijayadasami Telugu Story Competition By manatelugukathalu.com
విజయదశమి 2024 కథల పోటీలు
నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్
విషయ సూచిక
1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )
2. విజయదశమి 2024 కథల పోటీలు
3. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు
4. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) డిసెంబర్ 2023 ఫలితాలు
గమనిక:
కొత్త రచయితల సమాచారం కోసం...
కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.
మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.
అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.
ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.
కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.
మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.
మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com
మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.
1 .బహుమతులకు సహకరిస్తున్న వారు
వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.
రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు.
వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.
ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.
*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
2. విజయదశమి 2024 కథల పోటీలు
సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022, విజయదశమి 2022, ఉగాది 2023 మరియు విజయదశమి 2023 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము
ఇప్పుడు విజయదశమి 2024 కథల పోటీని ప్రకటిస్తున్నాము.
పోటీల కోసం ప్రత్యేకంగా కథలు పంపాల్సిన అవసరం లేదు.
23 /10 /2023 నుండి 15 /09 /2024 వరకు ప్రచురితమయ్యే కథల నుండి విజయదశమి 2023 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.
ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.
విజయదశమి 2024 కథల పోటీ బహుమతుల వివరాలు :
ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-
ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-
మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.
నిబంధనలు :
*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.
*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.
*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.
*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.
మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.
*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.
* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.
*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 15/09/2024
*ఫలితాలు 15/10/2024 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.
*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.
*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.
*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.
3. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు
ఉగాది 2024 నవలల పోటీ గడువు 15 /01 /2024 (ఈరోజుతో) ముగుస్తుంది తదుపరి పొడిగింపు లేదు. కొన్ని నవలల ప్రచురణ పూర్తి అయింది. మరికొన్ని సీరియల్ నవలల ప్రచురణ జరుగుతోంది.
ఫలితాలు ముందుగా ప్రకటించినట్లుగానే 15 /04 /2024 న వెలువడుతాయి.
బహుమతులు 22 /04 /2023 లోగా అందజేయబడతాయి.
4. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ): డిసెంబర్ 2023 ఫలితాలు
అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2024 వరకు పొడిగిస్తున్నాము.
రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.
బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.
విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.
వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.
డిసెంబర్ 2023 ఫలితాలు
( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి .
విజేతలకు మా అభినందనలు.
వారికి వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు ప్రశంసాపత్రం పంపడం జరిగింది.
బహుమతి మొత్తం 22/01/2024 లోగా పంపడం జరుగుతుంది.
పాఠకులకు, రచయితలకు మరొకమారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.




Có những website chỉ tập trung giới thiệu địa điểm, còn mình lại thích những nơi mở rộng thêm nhiều góc nhìn khác và Đà Nẵng Digital làm khá tốt điều đó. Khi xem các bài về biển Mỹ Khê, mình cũng dễ dàng tìm thấy thêm những nội dung liên quan đến cafe chữa lành hay các hoạt động ngoài trời. Cách bố trí này khiến mình không phải tìm kiếm rời rạc từng thông tin. Theo mình, việc tham khảo một nguồn dữ liệu có sự kết nối như vậy sẽ giúp hành trình khám phá Đà Nẵng trở nên linh hoạt và đầy đủ hơn.