top of page

ప్రేమికుడు - పార్ట్ 12


He's an ex

'Premikudu (He's an ex) - Part 12' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 18/08/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 12' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో  చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.


జాతర కోసం రికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. తనను బాధ పెట్టేలా ప్రవర్తించే వాడని చెప్పింది.



ఇక ప్రేమికుడు పార్ట్ 12 చదవండి.   



 "రేపటివైనా మిమ్మల్ని కలుపుకు చెప్పుతోందో.. లేక.. నాతోనే చెప్పాలంటుందో. చూడాలి." అంది గిరిజ.


 "అలా ఐతే.. తెలిసి తనని ఇబ్బంది పర్చడమెందుకు.. నేను పాపను ఇక్కడే ఉంచి ఆడిస్తాను. నాన్నా ఉంటాడు. పాప ఆడుకోగలదు. నువ్వు వెళ్లి మాట్లాడతావా." అన్నాడు శేషగిరి.


 "అలా అంటారా." నానుస్తోంది గిరిజ.


 "అలానే బాగుంటుంది. తర్వాత నువ్వు నాకు ఎలానూ చెప్తావుగా." అనేసాడు శేషగిరి.


 "సరే." అనేసింది గిరిజ.


 ఆ వెంబడే..

 "పార్వతిది దారుణం." అంది.


 శేషగిరి ఏమీ అడగలేక పోయాడు.

 అర నిముషం తర్వాత..

 "గుడ్నైట్." చెప్పింది గిరిజ.


 "గుడ్నైట్." అనేసాడు శేషగిరి.

***

 మర్నాడు..

 టిఫిన్ చేసేక..

 గిరిజ.. పార్వతికి ఫోన్ చేసింది.

 "నేను ఇప్పుడు కలవొచ్చా." అడిగింది.


 ఆ వెంబడే..

 "మేము రేపే వెళ్లిపోవాలి." చెప్పింది.


 పార్వతి సానుకూలంగా స్పందించగా..

 "నేను వెళ్లి వస్తాను." గిరిజ చెప్పింది భర్తతో. అప్పటికే ఫోన్ కాల్ కట్ చేసేసింది.


 "దారి తెలిసిందిగా. లేదా నేనొచ్చి దిగపెట్టనా." అడిగాడు శేషగిరి.


 "లేదు లేదు. నేను వెళ్లగలను." చెప్పింది గిరిజ.


 "సరే." అనేసాడు శేషగిరి.


 గిరిజ.. పార్వతిని కలవడానికి బయలుదేరింది.

 అక్కడే ఉన్న అనసూయతో పాటు అప్పలస్వామి ప్రేక్షకుల మాదిరిగా ఉండిపోయారు.


 రాగిణి.. తండ్రి చేరువన ఆడుకుంటుంది.

***

 కొబ్బరి చెట్ల నీడన చల్లగా ఉందని..

 పెరటిలోని బావి చప్టాన కూర్చున్నారు గిరిజ.. పార్వతిలు.


 "వంటయ్యిందా." అడిగింది గిరిజ.


 "ఆఁ. చేసేసాను." చెప్పింది పార్వతి.


 "మీ అమ్మగారిని అలా మంచం మీద ఉంచేయక.. ఇలా ఈ నీడ పట్టున కూర్చో పెట్టవచ్చుగా." అంది గిరిజ.


 "నేను అలానే చేస్తుంటాను. ఈ సమయంలో గడపలో కూర్చుండ పెడతాను. మీరు వస్తున్నారనే మంచం మీద పడుకో పెట్టాను. లేదంటే మిమ్మల్ని చూస్తే ఏదేదో గుణుస్తోంది." చెప్పింది గిరిజ.


 "మా రాక పోకలు ఆవిడకు తెలుసా." అడిగింది గిరిజ.


 "ఆఁ. మన మాటలు విని.. ఎవరని అడిగింది. నేను చెప్పేక.. సొద మొదలెట్టింది. ఈ పెద్దలకి చాదస్తాలు ఎక్కువ. వదిలేయండి." అనేసింది పార్వతి.


 "మీ గురించి చెప్పండి." అడిగింది గిరిజ.


 ఆ వెంబడే..

 "మీరు ఫ్రీగా మాట్లాడగలరని నేను ఒక్కతెనే వచ్చాను." చెప్పింది.


 "వరసగా చెప్పలేను. అక్కడక్కడవిగా.. అప్పుడప్పుడువిగా కొన్నింటిని చెప్తాను. ఆయన ఏమిటో తెలిసి పోతోంది." చెప్పింది పార్వతి.


 ఆ వెంబడే..

 "నా స్థితి మీకు బోధవుతోంది." అంది.


 "సరే." అనేసింది గిరిజ.


 పార్వతి సర్దుకుంది. చెప్పనారంభించింది.

***

 పార్వతి చెప్పుతున్న..

 ప్లాష్బాక్ 3..


 కుమార్ ఇల్లు..

 గదిలో..

 భోజనం చేసి మంచం ఎక్కి ఉన్నాడు కుమార్.


 అంతకు ముందే వీథి గుమ్మం తలుపు మూసేసి.. గడియ పెట్టేసాడు.


 అన్నీ సర్దుకొని గదిలోకి వచ్చింది పార్వతి.

 లైట్ ఆఫ్ చేయబోయింది.


 "లైట్ ఉంచు. నాకు నిద్ర రావడం లేదు. ఇలా రా." 

అన్నాడు కుమార్.


 'మళ్లీ ఈ రోజు ఏం తంతో.' అనుకుంది పార్వతి.


 బెరుకు బెరుకుగా అటు కదిలింది.

 "ఈ రోజు నా గుండె నిండాలంటే నువ్వు ఒక పని చేయ్." చెప్పాడు కుమార్.


 బేలై ఉంది పార్వతి.

 "ఈ రోజు.. నా లుంగీ నువ్వు కట్టుకో. నీ నైటీ విప్పి నాకు ఇవ్వు. దాన్ని నేను వేసుకుంటాను." నవ్వేడు కుమార్.


 పార్వతికి మళ్లీ చిత్రెత్తింది. అలానే ఎప్పటిలాగే రాయిలా ఉండిపోయింది.


 "నేను చెప్పేది నువ్వు చేయక తప్పదు. నేను మొండోడ్ని. ఇప్పటికే నీకు తెలుసు. మరి ఆలస్యం చేయక. చెప్పింది చేయ్." కుమార్ హుంకరించాడు.


 లేచాడు. మంచం దిగాడు. తన లుంగీని విప్పేసాడు. తనిప్పుడు నగ్నమయ్యాడు. కానీ పిసరంత బిడియపడలేదు.

 పార్వతి గిర్రున మరో వైపుకు తిరిగిపోయింది.


 "హేయ్. ఉన్నది మనమేగా. పైగా మనం మొగుడు పెళ్లాం. ఇటు తిరిగి నీ నైటీ విప్పి ఇవ్వు." జోరుగా అన్నాడు కుమార్.


 పార్పతి ఇటు తిరగలేక పోతోంది.

 అంతే.. సర్రున కుమార్ కదిలాడు.

 పార్వతి భుజాల్ని పట్టుకొని తన వైపుకు తిప్పేసుకున్నాడు.

 "నైటీ తీయ్." గట్టిగా అన్నాడు.


 పార్వతి కళ్లు మూసుకుంది.

 "హేయ్. కళ్లు వివ్పు. చూడు." కుమార్ అరిచాడు.


 ఆ వెంబడే..

 "నా గుండె నిండాలి.." మళ్లీ అరిచాడు.


 పార్వతి తప్పక.. మెల్లిగా కళ్లు విప్పింది.

 "నైటీ తీయ్." మళ్లీ కుమార్ అరిచాడు.


 వణుకుతున్న చేతులతో నైటీని వదులు చేసి.. విప్పేసి.. తీసి కుమార్ పై విసిరేసింది పార్వతి. తను పూర్తి నగ్న..

***

 "చాలు. ఆపేసి." గట్టిగానే అనేసింది గిరిజ.


 పార్వతి చెప్పడం ఆపేసింది.

 గిరిజ.. పార్వతినే చూస్తోంది.

 పార్వతి తల దించుకొని ఏడుస్తోంది.

 గిరిజ మనసు జావైపోయింది.


 "సారీ పార్వతిగారూ. కోరి మిమ్మల్ని కెలికేస్తున్నానేమో." బాధపడుతోంది గిరిజ.


 పార్వతి ఏమీ అనలేక పోతోంది.


 "మీ మనసులోది బయట పడిపోతే.. మీకు ఉపశాంతి దొరుకుతోంది అనుకున్నాను." మెల్లిగా చెప్పింది గిరిజ.


 "నేనూ ఎవరికి చెప్పుకోలేక దిగులు అవుతున్నాను. శేషగిరి కనిపించేక అతడితో చెప్పుకోవాలని.. నీచమైన నా భర్తని నిలదీయించాలని అనుకున్నాను." చెప్పింది పార్వతి.


 కొద్ది సేపు వాళ్ల మధ్య మాటలు లేవు.

 ముందుగా..

 గిరిజే తేరుకుంది.

 "ఒకటి చెప్పండి. మీ మధ్య ఇలాంటి తంతులే కొనసాగేవా." అడిగింది.


 "ఆఁ. రోజూ రాత్రులు ఇంలాటివే ఏదో ఒకటి చేసేవాడు." చెప్పింది పార్పతి.


 "అయ్యో. అంటే.. భార్యాభర్తలుగా శారీరక కలయిక మీ మధ్య కాలేదా." అడిగేసింది గిరిజ.


 "లేదు." చెప్పింది పార్వతి.


 ఆగి.. "మరోలా కాదు. మీ భర్త నపుంసకుడా." టక్కున అడిగేసింది గిరిజ.


 ఆ వెంబడే..

 "వివరాలు తెలిస్తేనే ఏమైనా చేయగలం." అంది.


 "లేదు. ఆ ఆనవాలు నాకు అగుపించలేదు. పూర్తి మగాడే అనిపిస్తాడు." పార్వతి చెప్పగలిగింది.


 "హు. అతడిదో శాడిజం. మిమ్మల్ని బాధించి ఆనందించే మనస్తత్వం అతడిది. అర్ధమవుతోంది. అందుకే నా గుండె నింపు.. నా గుండె నిండింది.. అంటున్నాడుగా. ప్చ్." గిరిజ గింజుకుంటుంది.


 పార్వతి అస్తవ్యస్తంలోనే ఉంది.

 "అన్నట్టు.. ఈ తంతంగాలు మీ తల్లిదండ్రులతో.. ముఖ్యంగా.. మీ తల్లితో.. షేర్ చేసుకోలేదా." అడిగింది గిరిజ.


 "మొదట్లో చెప్పలేక పోయినా.. తర్వాత.. తొలుతగా ఊరిలోనే కనుక.. అమ్మమ్మతో చెప్పుకోవాలనుకున్నాను. కానీ నేను ఆవిడింటికి వెళ్లగానే.. తను నన్ను తిరిగి పంపించేది.. భర్తను వదిలి పెట్టి రాకూడదని అరిచేది. అమ్మతో రెండు మూడు మార్లు చెప్పాను. 


ప్రతి మారు అమ్మ.. కొంత మంది మగవాళ్లు అంతే. వాళ్లలో కామం జాస్తీ. సర్దుకో. అనేసేది. దాంతో అమ్మకు చెప్పేది మానేసాను. నాన్నకి ఎలా చెప్పాలో తెలియక పోయేది." పార్వతి దీర్ఘంగా నిట్టూర్చింది.


 "అతడికి టైలరింగ్ షాప్ ఉందిగా. అక్కడి వాళ్లతో కానీ, మిగతా వాళ్లతో కానీ, ముఖ్యంగా మీ వాళ్లతో కానీ ఎలా తిరిగేవాడు మీ భర్త." అడిగింది గిరిజ.


 "అబ్బో. అంతటా అతి వినయుడు. నా దగ్గరే రాక్షసుడు. అందుకే నేను అతని గురించి ఎవరికీ చెప్పుకోలేక పోయేదాన్ని. చివరికి అమ్మే అతని గురించి నేను చెప్పేది మరోలా అర్థం చేసుకుంది." పార్వతి విసవిసలాడిపోతోంది.


 గిరిజ మరేం మాట్లాడలేదు.

 పార్వతినే చూస్తోంది.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










130 views0 comments

Comments


bottom of page